అనుకూలం

08:13 - August 10, 2018

హైదరాబాద్ : ఇన్నాళ్లూ బీజేపీకి దూరంగా ఉన్నామని కలరింగ్‌ ఇచ్చిన గులాబీ పార్టీ.... ఇప్పుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగానే ఉన్నామన్న సంకేతాలు ఇస్తోంది. గతంలో జరిగిన విషయాలు ఎలా ఉన్నా.... తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేంద్రంతో తమకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని గులాబీపార్టీ చెప్పకనే చెబుతోంది. రాజకీయంగా కూడా బీజేపీతో ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది.
బీజేపీకి అనుకూలంగా టీఆర్ ఎస్ 
కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్‌ దోస్తీ కడుతుందా అంటే... అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రప్రయోజనాల కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఇప్పటికే కేసీఆర్‌ పలు సందర్భాల్లో సమర్ధించారు.  ఇప్పుడు రాజకీయంగా కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినా... ఫ్రంట్‌ కార్యకలాపాలు పెద్దగా కనిపించలేదు. కానీ అదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి  కేసీఆర్‌ పరోక్షంగా మద్దతిస్తూ .. తమకు ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో మరింత ఇరకాటంలో పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో ఉన్న నేతకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతునిచ్చింది. ఎన్నికల్లో పాల్గొని ఆయనకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఓటేశారు.  అయితే ఇందుకు కొత్త కథ చెబుతోంది. బీజేపీ అభ్యర్థి బరిలో లేకపోవడంతోనే తాము మద్దతు ఇచ్చామన్న వాదనను అధికారపార్టీ నేతలు ముందుకు తీసుకొస్తున్నారు. ఎన్డీయే తరపున అభ్యర్థియే కదాని ప్రశ్నిస్తే మాత్రం వారి దగ్గర సమాధానం లేదు.
కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన టీఆర్‌ఎస్‌
ఒకవైపు బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసింది.  అంతేకాదు... తెలంగాణలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ టూర్‌ను అడ్డుకునేందుకు గులాబీపార్టీ అనుబంధ విభాగాలు సిద్ధమవుతున్నాయి. రాహుల్‌ తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించనున్నారు. అక్కడి విద్యార్థుల సమస్యలను తెలుసుకోనున్నారు. అయితే ఓయూలో రాహుల్‌ గాంధీని అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌వీ నేతలు హెచ్చరిస్తున్నారు. రాజకీయాలు చేసేందుకు యూనివర్సిటీలు వేదికలు కాబోవని టీఆర్‌ఎస్‌వి నేతలు అంటున్నారు.  శనివారం ఓయూలోని కొన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌వీ నిర్ణయించింది. మొత్తానికి  జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీతో  టీఆర్‌ఎస్‌ విభేదిస్తూనే... బీజేపీకి దగ్గరవుతుందన్న సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వరాదన్న యోచనలో ఉంది.

 

07:40 - January 12, 2018

హైదరాబాద్ : భర్త ఇంటి ముందు దీక్ష చేస్తున్న సంగీతకు తొలి విజయం లభించింది. మియాపూర్‌ కోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో సంగీత భర్త ఇంటి తాళాలను పగులగొట్టి .. లోపలికి ప్రవేశించింది. ఈ సందర్భంగా.. ఆమె న్యాయస్థానానికి, సహకరించిన మహిళా సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేసింది. 
మియాపూర్‌ కోర్టులో సంగీతకు అనుకూలంగా తీర్పు 
బోడుప్పల్లో  భర్త ఇంటిముందు.. న్యాయం కోసం పోరాడుతున్నసంగీతకు కోర్టులో ఊరట లభించింది. దీంతో సంగీత.. భర్త ఇంట్లోకి ప్రవేశించింది.  మియాపూర్‌ ఫ్యామిలీ కోర్టులో గురువారం సంగీత కేసు విచారణకు వచ్చింది. సంగీతకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. సంగీతకు నెలవారీ ఖర్చు కింద ఆమె భర్త శ్రీనివాస్‌రెడ్డి 20 వేల రూపాయలు ఇవ్వాలని  మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇప్పటివరకు శ్రీనివాస్‌రెడ్డితో ఉన్న ఇంట్లోనే సంగీత ఉండాలని తేల్చి చెప్పింది.  భర్త, అత్త, మామలు ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలింగిచరాదని కోర్టు స్పష్టం చేసింది. 
కోర్టు తీర్పుపై కౌంటర్‌ దాఖలు చేసిన భర్త శ్రీనివాస్‌రెడ్డి
అయితే కోర్టు తీర్పుపై  సంగీత భర్త శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్‌ దాఖలు చేశాడు. ఇంట్లోకి అనుమతించిన తర్వాత సంగీతకు డబ్బులు ఇవ్వడం దేనికంటూ శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడున్న ఇల్లు తనది కాదని.. వేరే ఇంట్లోకి మారడానికి అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో కోరాడు. అయితే శ్రీనివాస్‌రెడ్డి వేసిన కౌంటర్‌ పిటిషన్‌ను కొట్టి వేయడం జరిగింది. 
ఇంట్లోకి ప్రవేశించిన సంగీత  
కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సంగీత..  భర్త శ్రీనివాస్‌రెడ్డి.. ఇంటి తాళాలను పగులగొట్టి.. లోపలికి ప్రవేశించింది.  ఈ సందర్భంగా సంగీత న్యాయ స్థానానికి కృతజ్ఞతలు తెలిపింది. అయితే భర్త శ్రీనివాస్‌రెడ్డిపై పెట్టిన  కేసులు ఎత్తివేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.  భర్తపై పూర్తి నమ్మకం కలిగిన రోజున కేసులు ఎత్తివేస్తారని ఆమె అన్నారు. అలాగే తన పోరాటానికి మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనా తన భర్తలోమార్పు వచ్చేంత వరకూ.. తన హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని..సంగీత స్పష్టం చేశారు.  
 

 

08:30 - December 30, 2017

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ పేరు చెప్పగానే మనకు ఆదివాసీలు గుర్తుకు వస్తారు. ఇప్పుడైతే రికార్డ్‌ స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. ఇదే చలి కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుండగా మరికొంతమందికి జీవితాన్ని ఇవ్వబోతుంది. కాశ్మీర్‌లో ఉంటున్నట్లు చలి ఉండడమే కాదు.. అక్కడే పండే యాపిల్స్‌ ఇక్కడ పండబోతున్నాయి. త్వరలోనే మార్కెట్‌లోకి ఆదిలాబాద్‌ ఆపిల్స్‌ రాబోతున్నాయి. 
ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కాశ్మీర్‌ అందాలు 
ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలు కాశ్మీర్‌ అందాలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడమే దీనికి నిదర్శనం. అయితే... ఓ వైపు చలి తీవ్రత రోజురోజుకు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా... అదే వాతావరణం కొంతమందికి అనుకూలంగా మారుతోంది. కాశ్మీర్‌లో ఉండే చలి మాత్రమే కాదు... అలాంటి ఆపిల్స్‌ ఇక్కడ పండుతున్నాయి. 
యాపిల్స్‌ సాగుకు అనుకూలంగా దనోరా ప్రాంతం 
ఆసిఫాబాద్‌ జిల్లాలోని దనోరా ప్రాంతం యాపిల్స్‌ సాగుకు అనుకూలంగా మారింది. గత కొంతకాలంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో... యాపిల్‌ సాగుకు అనుకూలంగా ఉంటుందని భావించిన బాలాజీ అనే రైతు... కాశ్మీర్‌లో ఉన్న తన బంధువుల వద్ద నుంచి యాపిల్‌ మొక్కలు తెప్పించాడు. వాటిని జాగ్రత్తగా సాగు చేయడంతో అవి చెట్లుగా మారాయి. గత రెండేళ్లుగా కొద్దికొద్దిగా కాపు కాస్తున్నాయి. అయితే.. ఈ విషయం తెలుసుకున్న సీసీఎంబీ శాస్త్రవేత్తలు... ధనోరా ప్రాంతంలో అనేక ప్రయోగాలు చేశారు. ఇక్కడ వాతావరణం యాపిల్‌ సాగుకు అనుకూలంగా ఉందని నిర్దారించారు. దీంతో... ఉద్యానవన శాఖ రంగంలోకి రైతులకు యాపిల్‌ మొక్కలు పంపిణీ చేయడం జరుగుతోంది. 
రైతులకు శాస్త్రవేత్తలు సూచనలు  
ఇక్కడకు విచ్చేసి పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు పంటల సాగుకు కావాల్సిన సూచనలు రైతులకు అందిస్తున్నారు. మొక్కలు నాటే ముందు గుంతలు తవ్వి, పోలీడాన్‌, గోబర్‌ ఎరువును వేయాలని... నాటిన తర్వాత ఫోరెట్‌ క్రిమి సంహారక మందులు వేయాలని రైతులకు సూచిస్తున్నారు. మూడేళ్ల తర్వాత పంట రానున్న నేపథ్యంలో అప్పటివరకు పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నారు. తాను సేంద్రీయ ఎరువులు వాడుతూ ఆపిల్‌ చెట్లను కాపాడుకుంటున్నట్లు రైతు చెబుతున్నారు. త్వరలోనే పూర్తి స్థాయి దిగుబడి వస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. యాపిల్‌ దిగుబడులు పెరిగితే ఇకపై మార్కెట్‌లో ఆదిలాబాద్‌ యాపిల్స్‌ కూడా దర్శనమివ్వనున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్‌లో లభిస్తున్న కాశ్మీర్‌, హిమాచల్‌ ఆపిల్స్‌కు గట్టి పోటీ ఇస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

 

18:45 - June 24, 2016

హైదరాబాద్ : పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉందని అసోచాం జనరల్‌ సెక్రటరీ రావత్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మౌలిక వసతులు, పెట్టుబడులు వంటి అంశాలపై సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సర్వేలో విద్యుత్‌, ట్రాన్స్‌ పోర్ట్‌ వంటి కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత తక్కువ సమయంలోనే అనుమతులు ఇస్తోందని చెప్పారు. 

 

19:44 - June 6, 2016

విశాఖ : విశాఖపట్పం జిల్లా పరిశ్రమలు పెట్టడానికి అనుకూలం అన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటులో ఉన్న ఇబ్బందులను తొలగిస్తామని తెలిపారు. రాష్ర్ట అభివృద్ధికి అందరూ సహకరించాలని మంత్రి కోరారు. ఇండస్ట్రియల్‌ పరంగానూ..ఇటు పర్యాటక రంగంలోనూ పరంగానూ పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందన్నారు. 

08:46 - November 23, 2015

వాకింగ్‌, జాగింగ్‌ చేసే అలవాటు లేదా?! ఒకప్పుడు ఉన్నా.. ఈమధ్య తీరుబడిలేక మానేశారా?! చాలా రోజులుగా మళ్ళీ ఉదయంపూట నడక ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ''మంచి కాలం ఇదేనండోయ్'' అంటున్నారు ఆరోగ్యనిఫుణులు. బాగా వేడిగా ఉండే ఎండాకాలం, జోరుగా వానలు పడే వర్షాకాలంలో వాకింగ్‌, జాగింగ్‌లకు కాస్త అంతరాయం కలగొచ్చు. కానీ చలిచలిగా ఉండే శీతాకాలంలో మాత్రం ఎలాంటి ఆటంకాలూ ఉండవు. నడక అయినా, కాస్త వ్యాయామమైనా శీతాకాలం అందరికీ అనువైనకాలం. ఈ సీజన్లో చల్లగా ఉండే వాతావరణ పరిస్థితులు కూడా ఓపిక చేసుకుని నడవడానికి అనుకూలిస్తాయి అన్నది నిఫుణుల మాట. దీనికి కావాల్సిందల్లా.. బద్ధకం పక్కనపెట్టి, దుప్పటి ముసుగును తీసేసి హుషారుగా ట్రాక్‌ సూట్‌తో రెడీ అయితే చాలు. జోరుగా హుషారుగా నడక సాగినట్టే. అందుకు ఈరోజే ముందడుగు వేసే ప్రయత్నం చేయండి.! మీ ఆరోగ్యం మీచేతుల్లోనే.!!

Don't Miss

Subscribe to RSS - అనుకూలం