అనుపమ పరమేశ్వరన్

15:37 - October 20, 2018

ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, త్రినాధరావు నక్కిన డైరెక్షన్‌లో, దిల్ రాజు సమర్పణలో, శిరీష్, లక్షణ్ నిర్మించిన  హలో గురు ప్రేమకోసమే... దసరా కానుకగా రిలీజైన సంగతి తెలిసిందే.. రీసెంట్‌గా తెలంగాణా ఐ.టీ. మంత్రి కేటీఆర్.. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూసారు.. ఇన్ని రోజలు ఎలక్షన్‌ల హడావిడితో బిజీగా ఉన్నా, దసరా పండగ వల్ల కొంచెం విరామం దొరికింది.. పిల్లలతో కలిసి హలో గురు ప్రేమకోసమే సినిమా చూసాను.. వినోదాత్మకమైన కుటుంబ కథా చిత్రమిది.. రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ చాలా బాగా నటించారు అంటూ కేటీఆర్ ట్వీట్ చేసారు.. వెంటనే థ్యాంక్స్‌అండీ, మీరు మీ ఫ్యామిలీతో కలిసి సినిమాని ఎంజాయ్ చెయ్యడం మాకు సంతోషంగా ఉంది అని రామ్, థ్యాంక్యూ సర్ అని అనుపమ పోస్ట్ చేసారు..

14:42 - October 18, 2018

ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, త్రినాధరావు నక్కిన డైరెక్షన్‌లో, దిల్ రాజు సమర్పణలో, శిరీష్, లక్షణ్ నిర్మించిన చిత్రం.. హలో గురు ప్రేమకోసమే... దసరా కానుకగా ఈ రోజు  ప్రేక్షకులముందుకు వచ్చిన హలో గురు ప్రేమకోసమే ఎలా ఉందో చూద్దాం..
కథ :
కాకినాడలో అమ్మ,నాన్నతో ఉంటూ, హాయిగా బతికేసే ఈ జనరేషన్ కుర్రాడు సంజు(రామ్), జాబ్ గురించి హైదరాబాద్ వస్తూ, ట్రైన్‌లో కనబడ్డ అను(అనుపమ పరమేశ్వరన్)తో ప్రేమలో పడతాడు.. హైదరాబాద్‌లో వాళ్ళఫ్యామిలీ ఫ్రెండ్ విశ్వనాధం(ప్రకాష్ రాజ్ ) ఇంట్లో ఉంటూ, ట్రైనర్‌గా ఐటీ‌లో జాయిన్ అవుతాడు.. ఆఫీస్‌లో..(రీతు)ప్రణీతని లవ్ చేస్తాడు.. అనుని లవ్ చెయ్యడానికి విశ్వనాధం సలహాలు తీసుకుంటుంటాడు సంజు.. సడెన్‌గా అనుకి వాళ్ళనాన్న అమెరికా సంబంధం ఖాయం చేస్తాడు.. అలాంటప్పుడు సంజు తన ప్రేమకోసం ఏం చేసాడు అనేది హలో గురు కథ..
నటీనటులు & సాంకేతిక నిపుణులు :
పేరుకి తగ్గట్టే రామ్ ఎనర్జిటిక్ గా పెర్ఫార్మ్‌ చేసాడు.. కామెడీ, ఎమోషన్ సీన్స్‌లో బాగా నటించాడు.. అనుపమ పర్వాలేదనిపంస్తుంది.. ప్రణీత కూడా అంతే.. ప్రకాష్ రాజ్ తండ్రిగా తనదైన శైలి నటనతో అలరించాడు.. రామ్, ప్రకాష్ రాజ్‌ల మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి.. సితార, పోసాని తదితరులు ఉన్నంతలో ఓకే అనిపించారు..
విజయ్ కె చక్రవర్తి కెమెరా వర్క్ బాగానే ఉంది.. దేవిశ్రీ సంగీతం యావరేజ్‌గా ఉంది.. దిల్‌రాజు  ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. దర్శకుడు పాతకథని కొత్తగా చెప్పే ప్రయత్నం చేసాడు.. కామెడీ తోడవడంతో పాస్ మార్కులతో గట్టెక్కేసాడని చెప్పాలి.. ఈ దసరాకి కుర్రకారు టైమ్ పాస్ చేసే సినిమా..  హలో గురు ప్రేమకోసమే..

తారాగణం : రామ్,  అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, ప్రకాష్ రాజ్, సితార, పోసాని, వి.జయప్రకాష్. 
కెమెరా     : విజయ్ కె చక్రవర్తి 
సంగీతం   :  దేవిశ్రీ ప్రసాద్ 
ఎడిటింగ్  :  కార్తీక శ్రీనివాస్

సమర్పణ  :   దిల్‌రాజు 
నిర్మాత    :  శిరీష్, లక్షణ్ 

దర్శకత్వం :  త్రినాధరావు నక్కిన  


రేటింగ్      :  2/5

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...

3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

19:47 - July 6, 2018

హ్యట్రిక్స్ హిట్స్ తో కెరీర్ మొదలు పెట్టి, ఆ తరువాత దారితప్పి డబుల్ హ్యాట్రిక్ ప్లాప్ అంచున నిలిచిన మెగా మేనల్లుడు తేజ్ ఎలాగైనా హిట్ అందుకోవాలని, రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా చేసిన సినిమా తేజ్ ఐ లవ్ యు. మాస్ మూస నుండి బయట పడటానికి లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ అయిన కరుణాకరణ్ డైరక్షన్ లో ఈ సినిమా చేశాడు.. సీనియర్ అండ్ గుడ్ జడ్జిమెంట్ ఉన్న కె.ఎస్ రామారావు ఈ సినిమా నిర్మించడం.. ప్రొమోస్ అండ్ సాంగ్ టీజర్స్ గ్రాండీయర్ గా కనిపించడంతో తేజ్ ఐలవ్ యు పై ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి.. ప్రస్తుతానికి హిట్ అత్యవసరంగా మారిన టీంకు వాళ్ళు  అందరూ కలిసి చేసిన తేజ్ ఐ లవ్ యు ప్రేక్షకుల చేత ఐ లవ్ యు అనిపించుకుందా.లేక ఐ హేట్ యు అని రిజక్ట్ చేయబడిందా అనేది ఇప్పుడు చూద్దాం.. 
కథ.. 
 కథ విషయానికి వస్తే.. లండన్ నుండి ఇండియాకు వచ్చిన నందినిని చూసిన వెంటనే ఇష్టపడతాడు తేజ్.. అయితే ముందు తేజ్ ను ఆటపట్టించిన నందిని, అతని కేరింగ్ ను, సిన్ సియారిటీని చూసి లవ్ చేస్తుంది...  ఆ విషయం తేజ్ కి చెప్పడానికి వెళ్ళిన టైంలో.. యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోతుంది.. అసలు నందిని ఎవరు, ఆమె ఇండియాకు ఎందుకు వచ్చింది, మళ్ళీ ఆమెకు గతం గుర్తుకు వచ్చిందా లేదా.. తేజ్ లవ్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది మిగతా కథ.
నటీనటులు.. 
నటీనటుల విషయానికి వస్తే.. మొదటి నుండి మాస్ అని పరిగెత్తిన తేజుకు.. దానివల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురౌతాయి అని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది.. అందుకే మార్పు అనివార్యం అని గ్రహించి, ఇమేజ్ చేంజ్ ఓవర్ కోసం ఫ్యూర్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడు.. అతని క్యారక్టర్ వరకు బాడీలాంగ్వేజ్ నుండి యాక్టింగ్ వరకు బాగానే డిజైన్ చేశాడు డైరక్టర్. తేజూ కూడా ఆ పాత్రను పండించడానికి సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు.. అయితే సినిమా మొత్తాన్ని టేకోవర్ చేసి నటిపించింది అనుపమా పరమేశ్వరన్.. క్యాట్ లుక్స్ కి తోడు, కాస్త బబ్లీ యాక్టింగ్ తో స్క్రీన్ పై మెరిసింది.. తేజ్ ఐ లవ్ యు కి మేజర్ ప్లస్ పాయింట్ అనుపమా పరమేశ్వరన్. లవ్ ఫీల్ ను కూడా 100% ఎక్స్ ప్రెసీవ్ గా పండించింది ఇన్నాళ్ళు ఉన్న ట్రెడిషన్ లుక్స్ కి.. కాస్త గ్లామర్ టచ్ కూడా ఇచ్చింది. ఇక హీరో ఫ్రెండ్ గ్యాంగ్ తమ ఇంట్లో లేడీస్ గ్యాంగ్ కాస్త కామెడీ పండించగలిగారు.. హీరోయిన్ తండ్రిగా అనీష్ కురువెళ్ళ, హీరో పెదనాన్నగా జయప్రకాశ్, సాదా సీదా పాత్రల్లో కనిపించారు.. హీరో బాబాయి పాత్రలో  పృథ్వీ, అతని భార్య పాత్రలో సురేఖావాణి.. ఎంటర్ టైన్మెంట్ తో  కాస్త నవ్వులు పూయించారు.. మిగతా వాళ్లు అంతా పాత్రల పరిది మేర అలా అలా నటించారు.. 
టెక్నీషియన్స్..  
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. తొలిప్రేమ, డార్లింగ్ అనే రెండు హిట్స్ తో వరుసగా సినిమాలు చేస్తున్న కరుణాకరణ్ ఆ రెండు సినిమాల్లో ఉన్న ఫీల్ లో పదోవంతుకూడా ఈ సినిమాలో పండించలేకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. కథ లేని లవ్ ట్రాక్స్ ని కూడా అరెస్టింగ్ గా చెప్పగల కరుణాకరణ్ ఈ సినిమాలో మాత్రం మొదటి నుండి అవుట్ అవ్ ట్రాక్ లో నడిచాడు.. హీరో హీరోయిన్ కలిస్తే బావుండు అని ఆడియన్స్ ఫీలయ్యేలా ఒక్క సీన్ కూడా రాసుకోలేకపోయాడు.. అతి పలుచని కథ, కరుణాకరణ్ స్క్రీన్ ప్లేతో ఇంకా వీక్ గా తయారయ్యింది.. డార్లింగ్ స్వామి మాటలు కూడా, కథకు తగ్గట్టే సొ.. సోగా ఉన్నాయి.. ఈ సినిమాకు సంగీతం అందించిన గోపీ సుందర్ కాస్త మనసు పెట్టి ఆర్ ఆర్ ఇచ్చాడు అనిపిస్తుంది. పాటలు కూడా మెస్మరైజింగ్ గా లేకపోయిన. పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. ఆండ్రూ సినిమాటోగ్రాఫీ  సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.. లిమిటెడ్ బడ్జెట్ లో కూడా క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. 
ఓవర్ ఆల్ గా.. 
ఓవర్ ఆల్ గా చెప్పాలిఅంటే కరుణాకరణ్ కసిగా, కెఎస్ రామారావు పకట్బందీగా, తేజ్ సిన్సియర్ గా చేసినా.. ఈ సినిమాలో ఉండాల్సిన ఫీల్ మిస్ అయ్యింది.. మిగిలిన అంశాలు.. హైలెట్ అయ్యాయి.. అసలే అయిదు ప్లాప్ లతో చాలా డల్ గా ఉన్న తేజు మార్కెట్ ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర సేవ్ చేయడం కాస్త కష్టమే. .. అటు యూత్ కి, ఇటు మల్టీప్లక్స్ ఆడియన్స్ కి మరో వైపు మాస్ ఆడియన్స్ కి ఎవరికీ కనెక్ట్ అయ్యే అంశాలు లేకుండా వచ్చిన తేజ్ ఐ లవ్ యు ఫైనల్ గా బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు నిలబడుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.. 
 
ప్లస్ పాయింట్స్
అనుపమ లుక్స్, నటన
మ్యూజిక్
సినిమాటోగ్రఫి
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్
వీక్ కథ
రొటీన్ స్ర్కీన్ ప్లే
ఫీల్ లేని లవ్ ట్రాక్
డ్రమటిక్ క్లైమాక్స్

రేటింగ్
1. 2.5 /  5

11:58 - February 28, 2018

ఇంతకు ముందు టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ కోసం ముంబై వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మన సౌత్ నుండే హీరోయిన్స్ ఫ్లో పెరిగింది. హీరోయిన్స్ గా వస్తున్న వారిలో కేరళ గర్ల్స్ ఎక్కువ గా ఉండడం చూస్తూనే ఉంటాం. మరి మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చి తెలుగు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న హీరోయిన్స్ ఎవరు ? తన అందంతో అభినయంతో తెలుగు ఆడియన్స్ ని కట్టి పడేస్తున్న హీరోయిన్స్ చాల మంది ఉన్నారు. కానీ మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చి తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. మలయాళం సినిమా ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి అదే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తే అందులో కూడా అందమైన పాత్రలో నటించి మెప్పించింది అనుపమ పరమేశ్వరన్. అనుపమ దశ తిరిగింది. తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. తాను చేసిన శతమానం భవతి సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. గ్రామీణ నేపధ్యంలో సాగే కథతో వచ్చిన ఈ సినిమా అనుపమ పరమేశ్వరన్ కి మంచి స్కోప్ ఉన్న పాత్ర పడేలా చేసింది. అలాగే యంగ్ హీరో రామ్ పోతినేని తో ఉన్నదీ ఒకటే జిందగీ సినిమాలో యాక్ట్ చేసి క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైంది.

తన ఫస్ట్ సినిమాతోనే యూత్ ని ఆకట్టుకున్న మరో సౌత్ ఇండియన్ బ్యూటీ సాయిపల్లవి. ఈ మధ్య తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ కీలకం అయిపోయారు. ఫస్ట్ సినిమాతో నే క్రేజ్ తెచ్చుకొని యూత్ ని ఫాన్స్ గా మార్చుకుంటున్నారు. చిన్న సినిమాలను పక్కన పెట్టి పెద్ద సినిమాలకు ఒకే చెప్తున్నారు ఇదే కోవలో ఫిదా సినిమాతో వచ్చిన సాయిపల్లవి ఆ తరువాత బిజీ అయిపోయింది. దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన ప్రీవియస్ సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ సినిమా లో హీరో నాని తో పాటు సాయి పల్లవి నటించింది. నాని యాక్టింగ్ ని కూడా డామినేట్ చేసింది సాయి పల్లవి అనే టాక్ వచ్చిందట. ఎం సి ఏ సినిమాలో నాచురల్ స్టార్ యాక్టింగ్ కి పోటీ ఇచ్చి నటించింది సాయి పల్లవి. ప్రెసెంట్ నాగశౌర్యతో కణం అనే సినిమా రెడీ చేసింది సాయిపల్లవి.

12:08 - January 17, 2017

అనుకున్నట్లుగానే మల్లు బేబి 'అనుపమ పరమేశ్వరన్' బిగ్ ఛాన్స్ అందుకుంది. రెండే రెండు చిన్న సినిమాలు చేసిన ఈ బ్యూటీ లేటేస్ట్ గా క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా చాన్స్ పట్టేసింది. తెలుగులో 'అనుపమ పరమేశ్వరన్' హవా సాగేలా కనిపిస్తోంది. 'అ ఆ' సినిమాలో చేసింది చిన్న పాత్రే అయిన ఈ కేరళ బ్యూటీ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ వెంటనే 'నాగచైతన్య' తో ప్రేమమ్ రీమేక్ లో నటించి తెలుగు యూత్ కి మరింత దగ్గరైంది. ఇక 'శర్వానంద్' తో నటించిన 'శతమానం భవతి' మూవీ సంక్రాంతికి రిలీజైంది. అయితే లేటేస్ట్ గా బ్యూటీ భారీ అవకాశం అందిపుచ్చుకున్నట్లు సమాచారం. 'అనుపమ పరమేశ్వరన్' 'రామ్ చరణ్' తో జోడికట్టే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. దర్శకుడు సుకుమార్, చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో కథానాయికగా ఈ కేరళ బ్యూటీని ఎంపిక చేశారు. కొన్ని రోజులుగా ఈ మూవీలో 'అనుపమ'నే హీరోయిన్ గా తీసుకుంటారనే వార్తాలు షికారు చేశాయి. అయితే ఫైనల్ గా సుక్కు, చెర్రీ ఈ బ్యూటీ వైపే మొగ్గు చూపారు. 'చెర్రీ'తో జోడి కట్టుతున్న మాట వాస్తవమేనని 'అనుపమ పరమేశ్వరన్' ట్వీట్ తో మరీ తన సంతోషాన్ని తెలుపడం విశేషం. చూస్తుంటే తెలుగులో నెమ్మదిగా 'అనుపమ పరమేశ్వరన్' గా గాలి వీచేలా కనిపిస్తోంది. 'చెర్రీ' సినిమాతో పాటు ఈ బ్యూటీ బాబీ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటిస్తోంది. అదే విధంగా మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్లు సమాచారం. చరణ్, ఎన్టీఆర్ తో చేస్తున్న మూవీస్ కనుక హిట్టు అయితే అనుపమ స్టార్ హీరోయిన్స్ లీగ్ లోకి ఎంటర్ అయినట్లే. 

13:00 - December 21, 2016

కేరళ కుట్టి 'అనుపమ పరమేశ్వరన్' మరో గోల్డెన్ ఛాన్స్ పట్టేసినట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. ఇప్పటికే యంగ్ టైగర్ నటించే అవకాశం కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో బిగ్ చాన్స్ అందిపుచ్చుకున్నట్లు సమాచారం. కేరళ కుట్టి 'అనుపమ పరమేశ్వరన్' 'అ..ఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన విషయం తెలిసిందే . ఈ మూవీలో గయ్యాళి పిల్లగా నటించిన తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది. ఈ సినిమా సక్సెస్ తో 'అనుపమ'కు వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి. 'ప్రేమమ్' ఒరిజినల్ లో నటించిన ఈ బ్యూటీ తెలుగులో 'ప్రేమమ్'లో కూడా సేమ్ క్యారెక్టర్ లో నటించింది. ప్రస్తుతం 'శర్వానంద్' కి జోడిగా 'శతమానం భవతి'లో నటిస్తున్న ఈ చిన్నది త్వరలోనే 'ఎన్టీఆర్' తో పాటు మరో బిగ్ స్టార్ తో నటించే బంఫర్ ఆఫర్ పట్టేసింది.

చరణ్ సినిమాలో..
అనుపమ పరమేశ్వరన్ ఎన్టీఆర్, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో రూపొందే సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించబోతుంది. ఇప్పుడు ఈ బ్యూటీ మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. మెగా హీరో నటించే ఛాన్స్ పట్టేసినట్లు సమాచారం. మెగా హీరోతో నటించనున్న సినిమా హిట్టు అయితే కనుక హీరోయిన్ గా ఈ బ్యూటీ గ్రాఫ్ మారినట్లే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.'చరణ్' తదుపరి సినిమా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో కొనసాగుతుంది. ఇందులో 'అనుపమ పరమేశ్వరన్' ని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు వినిపిస్తుంది. దాదాపు ఆమె ఎంపిక ఖరారైనట్టేనని చెబుతున్నారు. అయితే ఈ బ్యూటీనే హీరోయిన్ నా లేక మరో హీరోయిన్ ఉంటుందా అనేది తెలియాల్సింది.

12:38 - August 10, 2016

శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న 'శతమానం భవతి' చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. శర్వానంద్... గమ్యం, రన్ రాజ రన్ వంటి పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అ... ఆ సినిమాలో ప్రత్యేకపాత్రలో నటించిన కేరళ నటి అనుపమపరమేశ్వరన్ తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఈ సినిమాకు వేగేశ్న సతీష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, జయసుధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. 

08:40 - March 11, 2016

నితిన్‌, సమంత, అనుపమ పర్వమేశ్వరన్‌ హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారికా హసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ(చిన్న బాబు) నిర్మిస్తున్న చిత్రం 'అ..ఆ'. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. త్వరలో చిత్ర ఫస్ట్ లుక్‌, టీజర్‌ను విడుదల చేయనున్నాం. షూటింగ్‌ కంప్లీట్‌ చేసి మే 6న వేసవి ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్‌ సంగీతమందిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నారు. ఆయన డైలాగ్స్ లు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. తొలిసారి నితిన్‌, సమంతలు జోడీగా, అలాగే నితిన్‌, త్రివిక్రమ్‌ తొలిసారి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా కూడా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాం' అని చెప్పారు.

08:59 - September 20, 2015

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ కు తెలుగులో వరుసగా బంపర్ ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. ఇటీవల మాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా హండ్రెడ్‌ డేస్‌ పూర్తి చేసుకున్న 'ప్రేమమ్‌'లో అనుపమ నటించింది. అక్కడ మంచి మార్కులు రావడంతో అలాగే తెలుగు 'ప్రేమమ్‌'లో కూడా ఈ అమ్మడే నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభించుకోకుండానే.. నితిన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న 'అ ఆ' సినిమాలో సైతం హీరోయిన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. అంతటితో ఆగకుండా తాజాగా రవితేజ సరసన కూడా నటించే లక్కీఛాన్స్‌ని దక్కించుకుందక్కించుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించబోయే చిత్రంలో ఒక హీరోయిన్‌గా అనుపమను తీసుకున్నారని సమాచారం. ఛాన్సుల మీద ఛాన్సులు వచ్చి పడుతుండటంతో ఉబ్బితబ్బిబ్బయిపోతోందట ఈ మలయాళ భామ. 

Don't Miss

Subscribe to RSS - అనుపమ పరమేశ్వరన్