అనుష్క

13:17 - April 26, 2017
10:32 - April 26, 2017

బాహుబలి -2 జ్వరం పట్టుకుంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతంది. ప్రపంచ వ్యాప్తంగా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కాకముందే రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందోనన్న చర్చ ఫిల్మ్ వర్గాల్లో జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా 'బాహుబలి -2’ చిత్రాన్ని రూపొందించారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..తదితర సస్పెన్ష్ విషయాలను ఈ చిత్రంతో తొలగిపోనున్నాయి. ఈ చిత్రానికి నటుడు 'ప్రభాస్' ఐదేళ్లు కష్టపడి పనిచేశారు. షూటింగ్ జరిగే సమయంలో ఏ చిత్రానికి 'ప్రభాస్' సంతకం చేయలేదు. ఒక హీరో ఒక ప్రాజెక్టు కోసం ఇన్ని ఏళ్లు కేటాయించడం అరుదుగా చూస్తుంటామని రాజమౌళి పేర్కొన్నారు. అందుకని ప్రభాస్ కు రాజమౌళి ఒక విలువైన బహుమతిని అందచేశారని టాక్. ‘బాహుబలి' చిత్రంలో అమరేంద్ర బాహుబలి ధరించిన విలువైన కవచాన్ని బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో 'ప్రభాస్', ‘రానా', ‘అనుష్క', ‘తమన్నా'లు కీలక పాత్రల్లో నటించారు.

11:07 - April 21, 2017

ఒక సినిమా కోసం హీరో..హీరోయిన్లు ఎంతో కష్టపడుతుంటారు. పాత్రలో లీనమై పోవాలని వారు భావిస్తుంటారు. అందుకనుగుణంగా శిక్షణలను సైతం తీసుకుంటుంటారు. అందులో హీరోయిన్లు కూడా శిక్షణలను పొందుతుండడం గమనార్హం. ఇటీవలే వచ్చిన 'బాహుబలి', ‘రుద్రమదేవి' చిత్రాల్లో 'అనుష్క' యుద్ధ విద్యలలో శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. తరువాత 'సంఘమిత్ర' కోసం 'శృతి హాసన్' ఏకంగా కత్తి విన్యాసాలు నేర్చుకొంటోంది. తాజాగా 'సమంత' ఇందులో చేరింది. ఈమె కర్రసాము నేర్చుకొంటోంది. ‘సమంత' చేస్తున్న కర్రసాము వీడియో సోషల్ మీడియాలో వైరల అవుతోంది. ప్రస్తుతం 'రాజు గారి గది -2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా 'రామ్ చరణ్' - ‘సుకుమార్' కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలో కూడా 'సమంత' నటిస్తోంది. కర్రసాము ఏ చిత్రంలో ఉండనుందో తెలియరావడం లేదు. ‘నాకు సవాళ్లంటే ఇష్టం..కర్రసాము నేర్చుకోవడం ఓ సవాల్ గా తీసుకున్నా..ఇప్పుడు దీనితోనే నా సహవాసం' అంటూ సమంత పేర్కొంది. మరి ఆమె సమంత కర్రసాము ఎలా చేసిందో..ఏ చిత్రంలో చేసిందో చూడాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.

09:23 - April 21, 2017

మహానటి..తెలుగు వెండి తెరపై మహానటిగా గుర్తింపు పొందారు. ఆమెనే 'సావిత్రి'. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘సావిత్రిగా' కీర్తి సురేష్..మహిళా పాత్రికేయురాలిగా 'సమంత'లు నటిస్తున్నారు. తాజాగా 'అనుష్క' కూడా ఈ చిత్రంలో నటిస్తోందని తెలుస్తోంది. ఓ కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించారని సమాచారం. చిత్రంలో నటించడానికి 'అనుష్క' సుముఖతను వ్యక్తం చేశారని సమాచారం. 'సావిత్రి' జీవితంలోని పలు కోణాలను, మాయాబజార్, మిస్సమ్మ చిత్రాలకు సంబంధించిన విశేషాల్ని ఈ చిత్రంలో చూపించనున్నట్లు సమాచారం. మరి 'అనుష్క' నటిస్తుందా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

12:31 - April 10, 2017

బాలీవుడ్ హీరోయిన్ 'అనుష్క శర్మకు' బీఎంసీ నోటీసులు జారీ చేసింది. అక్రమంగా నిర్మాణంపై ఈ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అనుష్క ముంబై లోని వర్సోవా ప్రాంతంలోని బద్రినాథ్ టవర్స్ నివాసం ఉంటోంది. ఈ టవర్ లోని 20 అంతస్తులో 'అనుష్క' కు మూడు ప్లాట్లున్నాయి. ఎవరి అనుమతి లేకుండానే ఎలక్ట్రిక్ జంక్షన్ బాక్స్ పెట్టించుకున్నారంటూ టవర్ నివాసం ఉంటున్న ఓ వ్యక్తి బీఎంసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన బీఎంసీ వెంటనే జంక్షన్ బాక్స్ తొలగించి వివరణ ఇవ్వాలంటూ 'అనుష్క'కు నోటీసులు జారీ చేసింది. అన్ని అనుమతులు తీసుకున్నాకే జంక్షన్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని 'అనుష్క' మేనేజర్ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.

15:54 - March 15, 2017

తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా 'బాహుబలి'. ఈ చిత్రాన్ని తెరకెకిక్కించిన 'రాజమౌళి' ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. 'కట్టప్ప' బాహుబలిని ఎందుకు చంపాడా ? అని అందరీలోనూ మెదలుతున్న ప్రశ్న. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సినిమా ట్రైలర్ ను 16వ తేదీన విడుదల చేస్తామని స్వయంగా 'రాజమౌళి' చెప్పడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉదయం తెలుగు రాష్ట్రాలు..ఇతర ప్రాంతాల్లో ఎంపిక చేసిన థియేటర్ లలో చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నామని, సాయంత్రం 5 గంటలకు సోషల్ మాధ్యమాల్లో విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించారు. ఇప్పటికే తొలి భాగంతో ఇండస్ట్రీ రికార్డ్లను 'బాహుబలి' తిరగారాసిన సంగతి తెలిసిందే. మరోసారి రికార్డులు సృష్టించాలని 'బాహుబలి 2' చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మరి చిత్ర ట్రైలర్ ఎలా ఉంటుందో ? ఎలాంటి రికార్డులు సృష్టించనుందో కొద్ది గంటల్లో తేలనుంది.

13:02 - March 11, 2017

ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా 'బాహుబలి-2’ ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే విడుదలవుతోంది అంటూ చిత్ర యూనిట్ పేర్కొంటుండడంతో ఉత్కంఠ నెలకొంది. తాజాగా దీనిపై నటుడు 'ప్రభాస్' క్లారిటీ ఇచ్చేశాడు. కాసేపటి క్రితం ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ట్రైలర్ కోసం తాను ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని పోస్టులో పేర్కొన్నారు. మార్చి 16వ తేదీన సెలక్ట్ చూసిన థియేటర్ లలో ట్రైలర్ విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సోషల్ మాధ్యమాల్లో సాయంత్రం 5గంటలకు విడుదలవుతుందని తెలిపారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లో 'బాహుబలి 2’ ట్రైలర్ పై వర్క్ జరిగాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 'బాహుబలి 2’ ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ట్రైలర్ నిడివి సుమారు రెండున్నర నిమిషాలున్నట్లు, అన్ని భాషాల్లోనూ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుష్క, రానా, తమన్నా కీలక పాత్రలు పోషించారు. ఇక చిత్ర పాటలు ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.

12:57 - February 24, 2017

టాలీవుడ్ రేంజ్ ఏంటిదో ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'..ఈ చిత్రాన్ని రూపొందించిన 'రాజమౌళి' ఈ సినిమాతో తన సత్తా చాటాడు. దీనికి సీక్వెల్ గా 'బాహుబలి 2' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయ్యింది. కానీ చిత్రానికి సంబంధించిన టీజర్..ఇతరత్రా విడుదల కాకపోవడం పట్ల అభిమానులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. కానీ అడపదడపా సోషల్ మాధ్యమాల్లో చిత్ర యూనిట్ పోస్టర్స్ విడుదల చేస్తూ అభిమానులను కొంత సంతోషపెడుతోంది. తాజాగా శివరాత్రి కానుకగా చిత్ర యూనిట్ ఒక న్యూ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో యుద్ధ రంగంలో తొండం పైకి ఎత్తి ఘజరాజు ఘీంకారం చేస్తుంటే నటుడు 'ప్రభాస్' తొండంపైకి ఎక్కి ఒక కాలు ముందుకు పెట్టి ఏనుగును అధిరోహించే వ్యక్తిలా ఉన్నాడు. 'ప్రభాస్' లుక్ పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే దానికి సమాధానం లభిస్తుందంట.

18:58 - February 1, 2017

తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదని ప్రముఖ సినీ నటుడు నాగార్జున పేర్కొన్నారు. మోడ్రన్..కామెడీ..రోమాన్స్, యాక్షన్, ఎమోషనల్ సినిమాలు చేశానని, చిన్న వయస్సులో అక్కినేని, ఎన్టీఆర్ నటించిన పౌరాణిక సినిమాలు చూడడం జరిగిందన్నారు. ఆయన నటించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం త్వరలో విడుదల కానుంది. రాఘవేంద్రర రావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సందర్భంగా టెన్ టివి 'నాగార్జున' తో ముచ్చటించింది. చిత్ర విశేషాలతో పాటు పలు విషయాలను ఆయన వెల్లడించారు. మరి ఆయన ఎలాంటి అభిప్రాయాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి.

13:25 - January 20, 2017

ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి 2' సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా షూటింగ్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టిన 'రాజమౌళి' ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 'బాహుబలి' తొలి భాగం బిజినెస్ పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు సెకెండ్ పార్ట్ 'బాహుబలి2' అంతకు మించిన సంచనాలను సృష్టించేలా కనిపిస్తోంది. మొదటి పార్ట్ ఊహాలకు కందని స్థాయిలో సక్సెస్ కావడంతో, ఈ ద్వితీయ భాగానికి విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది. సినిమాకు సంబంధించిన విశేషాలను 'రాజమౌళి' ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి కూడా రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో తనదైన స్టైల్లో ఒక్కొక్కటిగా ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కౌంట్ డౌన్ ప్రారంభమైందని ట్వీట్ చేశారు. 100డేస్ టు బాహుబలి 2 అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జైపూర్‌లో జరగబోయే ఓ లిటరేచర్ ఫెస్టివల్లో తమ నవలని తొలిసారి రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్ లు ప్రధాన పాత్రలు పోషించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - అనుష్క