అన్నాడిఎంకె

14:36 - July 17, 2017

బెంగళూరు : సెంట్రల్‌ జైలులో అన్నాడిఎంకె ప్రముఖ నేత శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నారని నివేదిక ఇచ్చినందుకు జైళ్ల డిఐజి రూపను కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేసింది. ఓ అధికారి రెండు కోట్లు లంచం తీసుకుని శశికళకు ప్రత్యేక వంటగది, స్పెషల్‌ బెడ్‌, స్వేచ్ఛగా తిరగడానికి సౌకర్యాలు కల్పించారని రూప ఆరోపించారు. పరప్పన జైలులో జరుగుతున్న అక్రమాలపై ఆమె ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. డిఐజి రూప జైలులో అక్రమాలను బయటపెట్టినందుకు ప్రభుత్వం బదిలీ వేటు వేసిందని విపక్షాలు విమర్శించాయి. సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న నేరస్థులను సిద్ధరామయ్య ప్రభుత్వం కాపాడుతోందని జెడిఎస్‌ విమర్శించింది.

13:48 - July 13, 2017

చెన్నై : అక్రమ ఆస్తుల కేసులో పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడిఎంకె నేత శశికళ జైలులో రాజ భోగాలు అనుభవిస్తున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక జైళ్ల శాఖ డిఐజి రూపా మౌద్గిల్‌ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. జైళ్లశాఖలోని ఓ సీనియర్‌ అధికారి శశికళ నుంచి 2 కోట్ల నగదు తీసుకుని జైలులో వివిఐపి ట్రీట్‌మెంట్‌ కల్పించారని లేఖలో డిఐజి ఆరోపించారు. ప్రత్యేక వంటగది, గదిలో పరుపు, స్వేచ్ఛగా తిరిగేందుకు వసతులు కల్పించారని కర్ణాటక పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ రూప్‌ కుమార్‌ దత్తకు ఫిర్యాదు చేశారు. శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని డిజిపి తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

16:15 - October 13, 2016

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్వహిస్తున్న శాఖలను ఆర్థికమంత్రి పన్నీర్‌ సెల్వంకు అప్పగించడంపై వస్తున్న విమర్శలను అన్నాడిఎంకె తిప్పికొట్టింది. ఆమె మౌఖిక అనుమతితోనే పన్నీర్‌ సెల్వంకు అప్పగించడం జరిగిందని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సరస్వతి స్పష్టం చేశారు. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా జయలలిత వద్దకు డాక్టర్లు తప్ప ఇతరులెవరు వెళ్లడానికి వీలు లేదని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి సలహా లేకుండా అన్నాడిఎంకె ఏ నిర్ణయం తీసుకోదని పేర్కొన్నారు. జయలలిత ఆరోగ్యం మెరుగవుతోందని ఆమె పత్రికలు కూడా చదువుతున్నారని వెద్యులు చెప్పినట్లు అన్నాడిఎంకె వెల్లడించింది. జయలలిత సూచన మేరకే ఆమె వద్ద ఉన్న పోర్టుఫోలియోలను పన్నీర్‌సెల్వానికి కేటాయించినట్లు గవర్నర్ పేర్కొనడంపై డీఎంకే అధినేత ఎంకే కరుణానిధి ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగం ప్రకారమే గవర్నర్ నిర్ణయం తీసుకున్నారా? అంటూ ప్రశ్నించారు. 

 

Don't Miss

Subscribe to RSS - అన్నాడిఎంకె