అప్రమత్తం

14:51 - June 20, 2017

ఢిల్లీ: నిఘా వర్గాల సూచనల మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్‌ పోలీసులు.. హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ ఎన్సిఆర్‌ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఉగ్రదాడులు జరగవచ్చనే కోణంలో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. రైల్వే స్టేషన్‌లు, బస్‌స్టాప్‌లు, మెట్రో స్టేషన్‌లు తదితర రద్దీ ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్ర పోలీసులను ఢిల్లీ పోలీసులు అప్రమత్తం చేశారు. యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో 3 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. యూపీ, హర్యానా సరిహద్దులలో అనుమానితులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.

21:29 - May 21, 2017

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో లోకమాన్య తిలక్‌ రైలు పట్టాలు తప్పింది.. 11బోగీలు పట్టాలనుంచి పక్కకువెళ్లాయి.. ఉన్నవ్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది.. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.. రైలు పట్టాలు తప్పడం వెనక కారణాల్ని ఆరాతీసేందుకు ఉత్తర్‌ ప్రదేశ్ యాంటి టెర్రరిజం స్క్వాడ్‌ ఘటనాస్థలానికి వెళ్లింది. పూర్తి వివరాలు సేకరిస్తోంది..

16:34 - May 19, 2017

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు భారీగా ఉండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా తిరువూరులో అత్యధికంగా 47.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక తెలంగాణలోని మంచిర్యాలలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. కొత్తగూడెంలో 46 డిగ్రీలు, ఖమ్మంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లోనూ ఎండలు ఇదేవిధంగా మండుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎండలు భారీగా ఉండడంతో ప్రజలెవరూ మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. 

09:42 - April 10, 2017

హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. హైదరాబాద్‌,రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు అధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణానికి భిన్నంగా వైరస్‌ విజృంభిస్తోంది. 3 నెలల్లో హైదరాబాద్‌లో 488 కేసులు నమోదు కాగా.. 12 మంది మృతిచెందారు. అటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఈఏడాది ఇప్పటివరకు 466 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌ పరిధిలో వారం రోజుల వ్యవధిలో 12 కేసులు రికార్డయ్యాయి.  

21:12 - April 6, 2017

విజయవాడ: సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రిప్ షెడ్ వద్ద పట్టా పక్కకు ఒరిగింది. ప్రయాణీకులను దించి యార్డుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సకాలంలో అధికారులు స్పందించి మరమ్మత్తులు చేశారు.

12:52 - January 31, 2017
18:01 - December 12, 2016

చిత్తూరు : వర్దా తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు చిత్తూరు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. తుపాను ప్రభావంపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చిత్తూరు కలెక్టరేట్‌లో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలను సురక్షింత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ముప్పుకు ఎక్కువగా ఆస్కారం ఉన్న శ్రీకాళహస్తి, నగరి, తంబళ్లపల్లి, సత్యవేడు, చిత్తూరు, కుప్పం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చినరాజప్ప అధికారులను ఆదేశించారు. 

 

21:51 - December 11, 2016
20:47 - December 11, 2016
13:06 - December 11, 2016

ప్రకాశం : వార్ధా తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తరుముకొస్తుండడంతో కొత్తపట్నం తీరం వద్ద అనుహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సముద్రంలో 3 నుంచి 5 మీటర్ల మేర అలలు ఎగసిపడుతున్నాయి. దీనికితోడు 30 నుంచి 40 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. దీంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మరోవైపు వార్దా తుపాను నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. తీరప్రాంతాల్లో ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ పర్యటిస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - అప్రమత్తం