అభిమానులు

19:15 - October 7, 2017

హైదరాబాద్ : జనసేన పార్టీపైకానీ, తనపై కానీ ఇతర పార్టీల నేతలు చేసే విమర్శలపై కార్యకర్తలెవరూ స్పందించవద్దని పవన్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న జనసేన దృష్టి మరల్చడానికో, లేక ప్రచారం కోసమో కొంతమంది విమర్శలు చేస్తుంటారని అన్నారు. తనకు అపకీర్తి వచ్చేలా మాట్లాడినా మనం హుందాగా ప్రవర్తిద్దాని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు ఉన్నాయన్న విషయాన్ని పవన్‌ తన ప్రకటనలో గుర్తు చేశారు. భావి తరాల భవిష్యత్‌, దేశ శ్రేయస్సు కోసం విశాల దృక్పథం కలిగిన రాజకీయాలు అవసరమనేది జనసేన ప్రాథమిక సూత్రమని గుర్తు చేశారు. అందుకే కార్యకర్తలెవరూ ఆవేశపడవద్దని సూచించారు. కార్యకర్తలంతా ప్రజాసేవే పరమావధిగా ముందుకెళ్లాలని లేఖలో పవన్‌ పిలుపునిచ్చారు. ప్రస్తత రాజకీయ వ్యవస్థకు భిన్నంగా, బాధ్యతాయుత రాజకీయాలు పరిఢవిల్లేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు.

16:07 - September 2, 2017

పశ్చిమగోదావరి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో చిరు, పవన్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మత్తు పదార్ధాలు వాడకండి.. వాడనీయకండి అనే నినాదంతో భారీ ర్యాలీ తీశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మహిళలకు కుట్టుమిషన్లు.. పేదలకు దుప్పట్లు పంచారు. 

12:56 - July 30, 2017

పూరి జగన్నాధ్ తన పైసా వసూల్ సినిమా ట్రైలర్ ని వదిలాడు. అదే పూరి మార్కు సినిమా, పూరి మార్కు డైలాగ్స్ తో బాలకృష్ణ స్టైల్ కొత్తగా అనిపించింది కనిపించింది. బాలయ్య బాబు మూవీ అంటే ఆల్రెడీ ఎక్సపెక్టషన్స్ తో ఉంటుంది అదే ఎక్సపెక్టషన్స్ అందుకున్నాడు పూరి... ఆ వివరాలను చూద్దాం...
బాలయ్య మార్కెట్ పెంచిన గౌతమి పుత్ర శాతకర్ణి 
గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా బాలయ్య మార్కెట్ ని పెంచింది. ఆల్రెడీ తన సినిమాల్లో మాస్ ఎలెమెంట్స్ గట్టిగ పెట్టి బిజినెస్ చేసుకునే టాలెంట్ ఉన్న నటుడు బాలయ్య .క్రిష్ డైరెక్షన్ లో రాబోతున్నాడు అంటేనే ఒక డిఫరెంట్ కాంబినేషన్ అని అందరూ ఫీల్ అయ్యారు ..శాతకర్ణి హిట్ తో అటు బాలయ్య ఫాన్స్ లో ఇటు ఆడియన్స్ లో బాలయ్య మీద పాజిటివ్ హోప్ వచ్చింది .హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా లు చేసే బాలయ్య  డెడికేషన్ ఉన్న నటుడు అని నేమ్ తెచ్చుకున్నాడు.
ఆడియన్స్ ని రీచ్ అయిన ట్రైలర్ 
పూరి డైరెక్షన్ లో తయారవుతున్న బాలయ్య సినిమా పైసవసుల్. ఇద్దరు యువ సూపర్‌స్టార్ల చిత్రాలతో ఢీకొంటోన్న బాలకృష్ణ చిత్రం 'పైసా వసూల్‌' ఫాన్స్‌కి ఇజ్జత్‌ కా సవాల్‌గా మారింది. అద్దిరిపోయే డైలాగ్స్ తో వచ్చిన ఈ పైసవసుల్ సినిమా ట్రైలర్ ఆడియన్స్ ని రీచ్ అయింది. ఈ డైలాగులు కూడా అభిమానుల్ని అలరించేవే. ఈ స్టంపర్ చూస్తే కథేంటన్నది అర్థం కావడం లేదు కానీ.. ఇది పక్కా యాక్షన్ మూవీ అన్నది మాత్రం తెలుస్తోంది. రిచ్ ఫారిన్ లొకేషన్లలో.. భారీగానే సినిమాను తెరకెక్కించినట్లున్నారు. మొత్తానికి ‘పైసా వసూల్’లో బాలయ్యను పూరి తనదైన స్టయిల్లో ప్రెజెంట్ చేసేలా కనిపిస్తున్నాడు ఈ స్టంపర్ చూస్తుంటే.

 

13:13 - July 28, 2017

హైదరాబాద్ : హీరో రవితేజకు మద్దతుగా ఆయన అభిమానులు సిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. రవితేజకు మద్దతుగా నినాదాలు చేశారు. తమ హీరోకు డ్రగ్స్‌ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని వారు గట్టిగా చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు వీడియోలో చూద్దాం..

 

10:18 - June 13, 2017

హైదరాబాద్ : సోమవారం ఉదయం గుండె పోటుతో మరణించిన సి. నారాయణరెడ్డిని చివరి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేయాలేరని ఆయన శిష్యులు బాధ పడుతున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ రానున్నారు.  పూర్తి వివరాలు వీడియో చూడండి. 

14:43 - June 9, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' మరోసారి అభిమానులతో భేటీ కానున్నారు. ఇటీవలే ఆయన అభిమానులతో వరుస భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 'రజనీ' రాజకీయ ప్రవేశం గ్యారంటీ అని పుకార్లు షికారు చేశాయి. దీనంతటికీ 'రజనీ' తెరదించారు. దేవుడు ఏది శాసిస్తే అదే..చేస్తానని కుంబద్ధలు కొట్టాడు. అనంతరం పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'కాలా' సినిమాలో 'రజనీ' నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమైంది. అంతేగాకుండా శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' లో కూడా 'రజనీ' నటిస్తున్నాడు. ముంబైలో 'కాలా' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ చెన్నైకి తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి అభిమానులతో 'రజనీ' భేటీ అవుతారని తెలుస్తోంది. రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. కానీ భేటీకి సంబంధించిన తేదీలు ఖరారు కాలేదు. 

07:59 - May 20, 2017

చెన్నై : చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమంటపంలో అభిమానులతో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ భేటి చివరి రోజున కూడా కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మంచి నేతలున్నా వ్యవస్థలో మార్పు రావడంలేదని మండిపడ్డారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని... ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే దేశం సరైన మార్గంలో పయనిస్తుందని రజనీకాంత్‌ చెప్పారు. యుద్ధం ఆరంభమయ్యేనాటికి మనమంతా సిద్ధంగా ఉందామని అభిమానులకు పిలుపునివ్వడం ద్వారా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పకనే చెప్పారు.

పక్కా తమిళుణ్ణే...
తన స్థానికతపై వస్తున్న విమర్శలను రజనీకాంత్‌ తిప్పికొట్టారు. తాను పక్కా తమిళుణ్ణేనని స్పష్టతనిచ్చారు. ఇరవైమూడేళ్లపాటు కర్నాటకలో ఉన్నా, 43 ఏళ్లుగా తమిళనాడులో నివసిస్తున్న విషయాన్ని రజనీకాంత్‌ గుర్తు చేశారు. కర్నాటక నుంచి వచ్చిన తనను తమిళుడిగానే ప్రజలు ఆదరించారని చెప్పారు. తాను ఉంటే మంచిమనసులున్న తమిళనాడులో ఉంటానని, లేకుంటే రుషులు సంచరించే హిమాలయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారాయన. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అభిమానులతో రజనీకాంత్‌ భేటీ అయ్యారు. చెన్నైలో గత ఐదురోజులుగా అభిమానులను కలుసుకున్నారు. తనతో కలిసి ఫోటోలు దిగేందుకు అభిమానులకు అవకాశం ఇచ్చారు. 

16:44 - May 19, 2017
11:27 - May 19, 2017

చెన్నై : నేడు రజనీ అభిమానులతో చివరి సమావేశం నర్వహించనున్నారు. చివరి రోజు భేటీకి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సంద్భరంగా రజనీకాంత్ తమిళనాడు రాజకీయాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మంచి నేతలు ఉన్నా వ్యవస్థలో మార్పు రాలేదని, ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని అన్నారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని ఆయన ఆకాక్షించారు. కర్ణాటకలో 23 ఏళ్లు ఉన్నా, తమిళనాడులో 43ఏళ్ల నుంచి ఉంటున్నానని తెలిపారు. కర్ణాటక వాడినైనా తమిళనాడు ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

12:09 - May 17, 2017

ప్రస్తుతం సినిమా ప్రపంచంలో కొత్త ట్రెండ్ మొదలైంది. తమ అభిమాను నటులకు అభిమానులకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖులు బతికి ఉండగానే విగ్రహాలు ఏర్పాటు చేసే ట్రెండ్ కొనసాగుతోంది. మొన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ విగ్రహాన్ని..నిన్న లారెన్స్ తన అమ్మ కోసం ఓ గుడిని కట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా కలకత్తాలో బిగ్ బి 'అమితాబ్ బచ్చన్' విగ్రహం ఏర్పాటు కావడం చర్చనీయాశంమైంది. అభిమానులు ఓ గుడి కట్టి అందులో 'సర్కార్' విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 'సర్కార్ -3' చిత్రంలో అమితాబ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేసిన సుభాష్ నగ్రే పాత్రలో ఆయన ఎలా ఉన్నారో అలాంటి ప్రతిమనే ఏర్పాటు చేశారు. ఆ పాత్ర వేషధారణలో అభిమానులంతా మాల ధరించి విగ్రహాన్ని ఇటీవలే ఆవిష్కరించారు. ఆరు అడుగుల రెండు అంగుల పొడవు గల ఈ విగ్రహాన్ని ఫైబర్‌ గ్లాస్‌లతో తయారు చేశారు. ఈ ఏడాది అక్టోబర్‌ 11వ తేదీతో అమితాబ్‌ 75 వసంతాలు పూర్తి చేసుకుంటారని ఆ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెబుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - అభిమానులు