అభివృద్ధి

18:19 - September 7, 2018

సిద్ధిపేట : అసెంబ్లీ రద్దు చేసిన అనతరం తొలిసారిగా హుస్నాబాద్ సభలో పాల్గొన్న తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఒకపక్క ప్రజలకు తెలియజేస్తునే..మరోపక్క కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విమర్శలు సంధించారు.

తెలంగాణను మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ తెలిపారు. కోటి ఎకరాలకు సాగు నీటిని అందించడమే తన లక్ష్యమని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తన ఆకాంక్ష అని తెలిపారు. టీఆర్ఎస్ పాలనతో ప్రజలకు భరోసా కలిగిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు అధికారంలో వున్న సమయంలో చేవలేక..చేతకాక అభివృద్ధిలో తెలంగాణకు వెనుకబాటుకు గురిచేశారన్నారు. అభివృద్ధి దిశగా పయనించేందుకు దేశంలో ఎక్కడా లేని సంక్షేమపథాకాలను, రైతన్నలకు 24గంటల ఉచిత విద్యుత్ ను అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని..ఇంత అభివృద్ధి సాధిస్తున్నా కాంగ్రెస్ నేతల మాపై ఎన్నో ఆరోపణలు చేసిన వాజమ్మలు కాంగ్రెస్ నేతలేని ఎద్దేవా చేశారు. కానీ, ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయిందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఘన విజయాన్ని కట్టబెట్టాలని హుస్నాబాద్ సభలో తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు. 

20:04 - August 19, 2018

విజయవాడ : అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది విజయవాడ రైల్వేస్టేషన్‌. ట్రాఫిక్‌ ఇబ్బందుల వల్ల బస్సులు ఆలస్యమవుతుండడం మనం ఎక్కువగా చూస్తుంటాం. కాని ఇక్కడ రైళ్లే ఆలస్యంగా వస్తుంటాయి. దీంతో ప్రయాణికుల విలువైన సమయం వృధా అవుతోంది. ఈ తీరు మారకపోతే మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్వయంగా కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. 
రైల్వేస్టేషన్‌ తీరుపై నివేదిక సిద్ధం చేసిన కాగ్‌
దేశంలోనే రైల్వేలకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న విజయవాడ రైల్వే జంక్షన్‌ అభివృద్ధిలో మాత్రం పట్టాలెక్కడంలేదు. స్టేషన్‌ అభివృద్ధి ఎలా ఉన్నా రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడం ప్రయాణికులను విస్మయానికి గురి చేస్తుంది. ఈ తీరు మారకపోతే ఇబ్బందులు తప్పవని కాగ్‌ తన నివేదికలో పేర్కొనడం రైల్వేశాఖలో హాట్‌ టాపిక్‌గా మారింది. 
స్టేషన్‌లో నిత్యం 750కి పైగా రైళ్ల రాకపోకలు
స్టేషన్‌లో నిత్యం 750కి పైగా రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ రోజుల్లో లక్ష మంది, పండగ సమయాల్లో 1.50 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ఇంత మంది ప్రయాణికులకు అనుగుణంగా మౌలిక వసతులు, రైల్వే సమాచారం చేరివేయడం, రైళ్ల రాకపోకల సమయాల్లో ఉన్న పూర్తి వైఫల్యాలను కాగ్‌ ఎండగట్టింది. ప్రతి రోజూ గంటల కొద్దీ ఆసల్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లు కాగ్‌ పరిశీలనలో తేలింది. సగటున 18 నిమిషాల చొప్పున ప్రయాణికుల టైమ్‌ వేస్ట్‌ అవుతున్నట్లు కాగ్‌ లెక్కలతో సహా నివేదికల్లో పొందుపర్చింది. 
రైల్వే ఇంటర్‌ లింకింగ్‌ సిగ్నల్‌ వ్యవస్థ ఆధునికీకరణ
ఇటేవలే రైల్వే రూట్‌ ఇంటర్‌ లింకింగ్‌ సిగ్నల్‌ వ్యవస్థను ఆధునీకరించారు. వారం రోజుల పాటు 241 రైళ్లను రద్దు చేయగా 361 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 215 రైళ్లను దారి మళ్లించారు. 50 కోట్ల వ్యయంతో లాకింగ్‌ సిగ్నల్‌ వ్యవస్థను ఆధునీకరించినా ప్రయోజనం లేదు. కేవలం సిగ్నల్‌ వ్యవస్థ ఆధునికీకరణ సరిగా లేకపోవడం, ప్లాట్‌ ఫారంల సంఖ్యను పెంచకపోవడం, యార్డు ఆధునికీకరణ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. తక్షణం ప్లాట్‌ ఫామ్‌ల విస్తరణ పెంచి, యార్డు పునరుద్ధరించి, ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను త్వరితగతిన పూర్తి చేయాలని కాగ్‌ అధికారులకు తెలిపింది. ఇక రైల్వే స్టేషన్‌ పరిస్థితిపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రయాణికుల సమస్య తలెత్తకుండా చూడాలని, త్వరిత గతిన సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. 
లోపాలను సరిదిద్దుకునేందుకు దృష్టిసారించిన అధికారులు  
కాగ్‌ ఎత్తి చూపిన లోపాలను సరిదిద్దుకునేందుకు రైల్వేశాఖ అధికారులు దృష్టిసారించారు. స్టేషన్‌లో నెలకొన్న ఇబ్బందులను తొలగించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ప్రయాణికులకు కావాల్సిన రైల్వే సమాచారాన్ని తెలిపేందుకు 450 పేజీలతో దక్షిణ జోన్‌ రైళ్ల వివరాలతో పుస్తకాన్ని విడుదల చేశారు. స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌ బయట రైళ్లు ఎక్కువసేపు నిలిచిపోకుండా ప్లాన్‌ చేస్తున్నారు. 

 

16:49 - August 2, 2018

ఆదిలాబాద్ : ఇంటింటికి తాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 25  కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మరో 17.50 కోట్ల రూపాయలు బ్రిడ్జీల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:08 - August 1, 2018

హైదరాబాద్‌ : పాత బస్తీని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాత బస్తీలో ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత బస్తీకి ప్రభుత్వం పదివేల కోట్లు కేటాయించి, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని తమ్మినేని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పాత బస్తీలోని అన్ని స్థానాల్లో బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌ పాత బస్తీలో బీఎల్‌ఎఫ్‌ ఒకరోజు పర్యటన చేపట్టింది. 

 

20:55 - June 9, 2018

పశ్చిమగోదావరి : కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఒడ్డుకు చేర్చాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని అందుకే టీడీపీలో చేరానన్ని రఘురామకృష్ణం రాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు తగ్గకుండా టీడీపీ సాధిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాఘురామకృష్ణం రాజు టీడీపీలో చేరిన సందర్భంగా 250కార్లతో ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాతం వద్ద పార్టీ కార్యకర్తలు రఘురామ కృష్ణంరాజుకు ఘన స్వాగతం పలికారు.  

 

07:58 - June 6, 2018

హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు హైద్రాబాద్ నగరానికి మణిహారం లాంటిది అన్నారు మంత్రి కేటీఆర్‌. హెచ్‌ఎండీకే పరిధిలోని ప్రాజెక్టులు, కార్యకలాపాలపైన మంగళవారం బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలిక వసతుల కల్పనపైన ప్రధానంగా దృష్టి సారించాలని అదేశించారు.

ఓఆర్‌ఆర్‌ చుట్టూ మౌలిక సౌకర్యాల అభివృద్ధి
అవుటర్ రింగ్ రోడ్డు నగరానికి మణిహారం లాంటిదని దీని చుట్టు సాధ్యమైనన్ని ఎక్కువ సౌకర్యాలను కల్పించాలని పురపాలక శాఖ మంత్రి కెటిఅర్ పురపాలక శాఖాధికారులను అదేశించారు. అవుటర్ చుట్టూ పెద్ద ఎత్తున గ్రీనరీ పెంచాలన్నారు. ఇంటర్ చేంజ్ ల వద్ద వే సైడ్ అమెనిటీస్ ఎర్పాటు చేయాలన్నారు. ప్రతి పది కీలోమీటర్లకు ఒక అంబులెన్సు ఉండేలా వాటి సంఖ్యను పెంచాలన్నారు. ఓఆర్‌ఆర్‌పై పూర్తి స్ధాయిలో ఏల్ ఈ డీ దీపాల ఎర్పాటు చేయాలన్నారు. అలాగే నగరానికి నలువైపులా బస్ టర్మినళ్లకు నిర్మాణానికి భూముల గుర్తించాలని అధికారులను అదేశించారు.

వేగంగా రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్ల నిర్మాణం
హెచ్ యండిఏ పరిధిలోని జన సమ్మర్ధ ప్రాంతాలను గుర్తించి రేడియల్ రోడ్లు, గ్రిడ్ రోడ్ల అభివృద్ది మరింత వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. బాటసింగారం, మంగల్‌పల్లి ప్రాంతాల్లో లాజిస్టిక్స్ పార్కుల పురోగతిని మంత్రి సమీక్షించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో చెపట్టిన చెరువుల అభివృద్ది కార్యక్రమంలో భాగంగా త్వరలోనే 40 చెరువుల్లో పనుల కోసం టెండర్లను పూర్తి చేస్తామన్నారు. అటు ఉప్పల్ ప్రాంతంలో చేపడుతున్న శిల్పరామం పనులు దసరా నాటికి పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు.

బాలనగర్‌ ఫ్లైఓవర్‌ పై రివ్యూ..జీహెచ్‌ఎంసీతో కలిసి ఫుట్ ఒవర్‌బ్రిడ్జిల నిర్మాణం
అటు బాలనగర్లో నిర్మాణం జరుగుతున్న ఫ్లై ఒవర్ పురోగతి పైన ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు. నగరంలో నిర్మిస్తున్న పుట్ ఒవర్ బ్రిడ్జిల నిర్మాణాలను జియచ్ యంసితో కలిసి పూర్తి చేస్తున్నామన్నారు. హెచ్ యండిఏ పనీతీరు, ప్రాజెక్టుల అమలుపైన అధికారులను మంత్రి అభినందించారు. విధుల్లో మంచి నైపుణ్య ప్రదర్శించిన ఉద్యోగులను గుర్తించి వారికి ప్రొత్సాహాకాలు ఇవ్వాలని హెచ్‌ఎండీఏ కమీషనర్‌కు సూచించారు. 

08:20 - June 2, 2018

టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టీఆర్ ఎస్ నేత రాజమోహన్, కాంగ్రెస్ నేత రామ్మోహన్ పాల్గొని, మాట్లాడారు. నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ సాధించిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వాల విధానాలకు, టీఆర్ ఎస్ ప్రభుత్వ విధానాలు, పాలనలో తేడా లేదని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

22:09 - May 10, 2018

ఢిల్లీ : మార్క్సిజం అంటే అభివృద్ధికి మూలసూత్రం... మార్క్సిజం అంటే పోరాట ఆలోచనా విధానం.. మార్క్సిజం అంటే  క్యాపిటలిజం వెనుక ఉన్న అసత్యాన్ని నిలదీస్తుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. 'ఆసియాఖండం- భారత్‌లో మార్క్సిజం అవసరం ' అనే అంశంపై ఢిల్లీలో జరిగిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. అస్ట్రో ఫిజిక్స్‌ నుంచి నానో టెక్నాలజీ వరకు ప్రపంచం సాధిస్తున్న అభివృద్ధి వెనుక మార్క్సిజం ఇమిడి ఉందన్నారు.  ఒకప్పుడు ఆసియా జబ్బుమనిషిగా పేరుపడి.. అత్యంత వెనుకబడిన దేశంగా ఉన్న చైనా.. మార్క్సిజం బాటలో నడిచి నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధించిందన్నారు.

 

11:04 - May 9, 2018

విజయవాడ : ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈ నాలుగేళ్లలో జరిగిందని, సమిష్టి కృషి..అందరి కృషి భాగస్వామ్యంతోనే ఇది జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు. సంక్షోభంంలోనూ సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి సాధించడం జరిగిందని, ఇదే స్పూర్తిని కొనసాగించాలని బాబు సూచించారు. 

08:19 - April 24, 2018

కర్నూలు : రాష్ట్ర బీజేపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం కర్నూలులో సైకిల్‌ ర్యాలీ నిర్వహించిన మోహన్‌రెడ్డి... బీజేపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకుల వైఖరిని ఎస్వీ మోహన్‌రెడ్డి తప్పుపట్టారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - అభివృద్ధి