అమీర్ ఖాన్

17:41 - November 8, 2018

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించగా, ధూమ్ 3 ఫేమ్, విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో, యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన చిత్రం, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్.
భారీ అంచనాల మధ్య, హిందీతో పాటు, తెలుగులోనూ ఈరోజు రిలీజైన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్  సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ : 


దాదాపు రెండు దశాబ్దాల క్రితం వ్యాపారం నిమిత్తం ఇండియాకు వచ్చిన బ్రిటీష్ వాళ్ళు, ఇక్కడి సంస్థానాలనీ, రాజ్యాలనీ తమ ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటుంటారు.
ఆ నేపథ్యంలో, రోనక్‌పూర్ అనబడే స్వతంత్ర్య రాజ్యంపై కన్నేసిన బ్రిటీష్ పాలకుడు జాన్ క్లైవ్, రోనక్‌పూర్ రాజుని, అతని కొడుకుని అంతమొందించి, రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. అప్పుడు యువరాణి జఫీరా, రాజ్య సంరక్షకుడు ఖుదా బక్ష్ సాయంతో రాజ్యం నుండి తప్పించుకుంటుంది. మరోపక్క థగ్స్‌గా పిలవబడే ఒక ముఠా, దారి దోపిడీలతో బ్రిటీష్ వారిపై విరుచుకు పడుతుంటుంది. తన అవసరాల కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, తన తెలివితో ఎంతటివారినైనా బురిడీ కొట్టించే ఫిరంగి మల్లయ్యను, థగ్స్  నాయకుడైన ఖుదా బక్ష్‌ను పట్టుకోవడానికి నియమిస్తాడు జాన్ క్లైవ్. మరి ఫిరంగి మల్లయ్య, ఖుదా బక్ష్‌ని బ్రిటీష్ వారికి అప్పజెప్పాడా, లేదా అనేదే ఈ థగ్స్ కథ.

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 


అమితాబ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను చాలా వరకూ డూప్ సాయంతో లాగించేసారు. నటన పరంగా ఓకే అనిపిస్తారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ నవ్వించే ప్రయత్నం చేసాడు కానీ, తెలుగులో ఆయనకి వాయిస్ సూట్ కాలేదు. తెరపై అమీర్‌ని చూస్తున్నంత సేపు..  పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్‌లో జాక్ స్పారో పాత్రే గుర్తొస్తుంది. కత్రినా సురైయ్యాగా తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఫాతిమా సనా షేక్ పాత్ర అలరిస్తుంది.
అజయ్ - అతుల్ కంపోజ్ చేసిన పాటలు తెలుగులో పెద్దగా ఆకట్టుకోవు కానీ, జాన్ స్టివార్ట్ బ్యాగ్రౌండా స్కోర్ సినిమాకి ప్లస్ అయింది.  మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.
మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే సామెత ఈ సినిమాకి చక్కగా సూటవుతుంది. 1839లో వచ్చిన కన్‌ఫెషన్స్ ఆఫ్ ది థగ్ నవల ఆధారంగా, రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మక యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తుంది, పైగా, అమితాబ్, అమీర్ కాంబో  అనగానే ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ఆ అంచనాలకు ఆమడ దూరంలో నిలిచిపోయింది. దర్శకుడు సెట్స్ మీదా, కాస్ట్యూమ్స్ మీదా, యాక్షన్ ఘట్టాల పైనా పెట్టిన శ్రద్థ, కొంచెమైనా స్ర్కీన్‌ప్లే పై కూడా పెట్టుంటే థగ్స్ ఇంకోలా ఉండేది. 


థగ్స్.. పైన పటారం, లోన లొటారం. 

తారాగణం :  అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్

        కెమెరా    :            మనుష్ నందన్ 

       సంగీతం   :         అజయ్ - అతుల్ 

నేపథ్య సంగీతం  :         జాన్ స్టివార్ట్ 

         నిర్మాత   :         ఆదిత్య చోప్రా

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం :     విజయ్ కృష్ణ ఆచార్య

రేటింగ్  : 2/5

 

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

15:47 - September 27, 2018

హైదరాబాద్ : బాలీవుడ్‌లో మోస్ట్ హ్యపెనింగ్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అమిర్‌ఖాన్, కత్రీనా కైఫ్‌లు నటిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచరస్‌గా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎవరు చేయని ప్రయోగాన్ని విజయ్ కృష్ణ ఆచార్య చేస్తున్నారు.  యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తున్నది. 1839నాటి ఫిలిప్ మిడోస్ టేలర్ అనే రచయిత రాసిన 1839నాటి ఓ నవల ఆధారంగా ఈ సినిమా వస్తోంది. సినిమా బడ్జెట్ రూ.210కోట్లుగా అంచనా. ఇక ట్రైలర్ విడుదలకి సినిమా యూనిట్ అంతా హాజరవగా రెస్పాన్స్ అద్భుతం అంటున్నారు. ఇందులో అమితాబ్ బందిపోటు దొంగగా నటిస్తున్నారు. ట్రైలర్ విజువల్ వండర్ గా రూపొందింది. స్వాతంత్య్రానికి పూర్వం బందిపోట్లకు, బ్రిటిష్ సైనికులకు మధ్య జరిగే పోరాటమే ఈ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. ఆ వయసులో కూడా అమితాబ్ ఎంతో చక్కగా నటించారు.  

08:40 - September 26, 2018
ఇప్పుడు బయోపిక్‌ల హవా నడుస్తోంది. విఖ్యాత ఆధ్యాత్మిక బోధకుడు రజనీష్ అలియాస్‌ ఓషో జీవిత చరిత్ర.. త్వరలోనే తెరకెక్కబోతోంది. ఓషోపై "వైల్డ్ వైల్డ్ కంట్రీ" పేరుతో ఒరిజినల్ డాక్యుమెంటరీ అందించిన నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. ఇప్పుడు ఆయన జీవిత కథతోనే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోంది. వైల్డ్ వైల్డ్ కంట్రీ సిరీస్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది మార్చి 16న ఆరు ఎపిసోడ్స్‌ను అందించింది. ఆరున్నర గంటల నిడివితో ఉన్న ఈ  డాక్యుమెంటరీని సూడాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించారు.

నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించబోయే తాజా వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఓషోగా నటిస్తున్నారు. ఆయన పర్సనల్ సెక్రటరీ మాతా ఆనంద్ షీలా పాత్రలో అలియాభట్ నటించనున్నారు. అమిర్ ఖాన్.. తన సొంత బ్యానర్‌ అమీర్‌ ప్రొడక్షన్స్‌పై ఈ వెబ్‌సిరీస్‌ను నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించనున్నారు. సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన సేక్రెడ్ గేమ్స్... భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు మంచి గుర్తింపును తెచ్చింది. దీంతో, తమ పరిధిని పెంచుకోడానికి నెట్‌ఫ్లిక్స్‌... ఈసారి అమిర్ ఖాన్, అలియా భట్‌తో ఓషో జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. వైల్డ్ వైల్డ్‌ కంట్రీ సిరీస్‌ను రజనీష్ ఒరిజినల్ ఫుటేజీతో రూపొందించారు. అయితే.. ఇప్పుడు ఆ పాత్రను అమీర్‌ ఎంతవరకు రక్తి కట్టిస్తారు..? ప్రజలపై ఓషో ప్రభావం గురించి, ఆధ్యాత్మికత, సస్పెన్స్, శృంగార అంశాలను ఇందులో చూపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
11:18 - January 5, 2018

అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ దంగల్ చైనాలో రికార్డు సృష్టంచింది. చైనీస్ ఐఎండీబీలో దంగల్ చిత్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఐఎండీబీ నిర్వహించిన వెబ్ సైట్ సర్వేలో దంగల్ మూవీకే ఎక్కువ మంది మద్దతు తెలిపారు. దంగల్ దేశీయంగా కూడా రికార్డు స్థాయిలో వసూల్ చేసింది. లేడీ బాక్సర్ కథ అంశంగా చిత్ర తెరకెక్కింది. దంగల్ ప్రపంచ వ్యాప్తంగా 2000వేల కోట్లను వసూల్ చేసింది. 

11:44 - October 20, 2017

ఎపుడూ వివాదాల్లో వుంటూ హీరోలను విమర్శిస్తూ తరువాత అభిమానులతో చివాట్లు పెట్టించుకోవడం బాలీవుడ్ సెలబ్రెటీ కమల్ ఖాన్ కు అలవాటు. వివాదాలను ఇంటి చూట్టు తిప్పుకుంటా నేను ఇంతే అనే రేంజ్‌లో ఫీల్‌ అవుతారు. కానీ ఆ సెలబ్రిటీకి కూడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమీర్‌ఖాన్‌ అభిమానుల దెబ్బకు ఖంగుతున్నాడు. తమ అభిమాన నటుడిపై విమర్శలు చేసినందుకు ఏకంగా కమల్‌ఖాన్‌ ట్వట్టర్‌ అకౌంట్‌నే బ్లాక్‌ చేశారు. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ రివ్యూ రాశాడు. సినిమా విడుదలకి ముందుగానే క్లైమాక్స్ కి సంబంధించి ఓ సమీక్ష రాసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఫైర్ అయిన అమీర్ అభిమానులు కమల్ ఖాన్ పై ఫిర్యాదు చేసి ట్విట్టర్ ఎకౌంట్ నిలిపివేశేలా చేశారు. దీంతో కమాల్ ఆర్ ఖాన్ మీడియాకి ఓ లేఖ రాశాడు. తాను ఎంతో వెచ్చించి 6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నట్టు చెప్పాడు. నాలుగేళ్ళల్లో దీని కోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టానని కూడా అన్నాడు. దీనిపై కోర్టుకి వెళ్లి నేను ఖర్చు పెట్టిన డబ్బు నాకు తిరిగి వచ్చేలా చేయమని కోరతానని లేఖలో రాశాడు. తాను సినిమాలకు వ్యతిరేఖంగా సినిమా రివ్యూ రాయడం వలనే తన ట్విట్టర్ ఖాతా కోల్పోయానని చెబుతూ .. అమీర్ తనని ట్విట్టర్ లో ఉండనీయాలని అనుకోవడం లేదు అని చెప్పాడు. అమీర్ ఖాన్ రియల్ ట్విట్టర్ ఓనర్ .. జాక్ డోర్సీ కాదు అని అన్నాడు. ఇక తాను మరో ఖాతా తెరవాలని అనుకోవడం లేదని చెబుతూ.. చివరిగా ట్విట్టర్ కి , అమీర్ ఖాన్ కి బెస్ట్ ఆఫ్ లక్ తెలిపాడు. ఇక నెటిజన్స్ .. కే ఆర్కే ట్విట్టర్ ఎకౌంట్ సస్పెండ్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ దీపావళికి మంచి గిఫ్ట్ ఇచ్చిందని ట్వీట్ చేశారు. అవడానికి బాలీవుడ్ రివ్యూ రైటరే అయినా తెలుగు సినిమాలను కూడా వదలరు. జాతీయ స్థాయిలో ఎందరో మెప్పు పొందిన బాహుబలి సినిమానూ విమర్శించారు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్‌ను కూడా వదల్లేదు.

 

11:13 - September 25, 2017

రాజకీయ, సినీ, ఇతర రంగాల్లోని ప్రముఖులు వారి కుమార్తెలు..కుమారులు వెండితెరపై తమ ప్రతిభను చూపించుకోవాలని అనుకుంటుంటారు. అందులో భాగంగా వారు చిత్ర సీమకు పరిచయమవుతుంటారు. అందులో కొందరిని ప్రేక్షకులు అభిమానిస్తుంటారు. తమ అభిమాన హీరో కుమార్తె..కుమారుడు ఎలా నటించాడోనని తెలుసుకొనేందుకు అభిమానులు ఉత్సుహత చూపుతారు. తాజాగా క్రికెట్ గాడ్ గా పేరొందిన 'సచిన్ టెండూల్కర్' కుమార్తెపై సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

సచిన్ టెండూల్కర్...క్రికెట్ గాడ్..మాస్టర్ బ్లాస్టర్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఆయన క్రికెట్ లో ఎలాంటి రికార్డులు..విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె సారా టెండూల్కర్ ప్రస్తుతం వెండితెరకు పరిచయమౌతుందని టాక్. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్‌ 'సారా'ను బాలీవుడ్‌కు పరిచయం చేస్తారని ప్రచారం జరుగుతోంది. సినిమాల్లోకి రావాలని 'సారా' కు కూడా కోరిక ఉందని, అందుకే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. ధీరూబాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 'సారా' విద్యనభ్యసించిన సంగతి తెలిసిందే. ‘సారా' బాలీవుడ్ ఎంట్రీపై వస్తున్న కథనాలపై 'సచిన్' ఎలా స్పందిస్తారో చూడాలి. 

14:29 - September 19, 2017

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరొందిన నటుడు 'అమీర్ ఖాన్' వైవిధ్య పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అంతేగాకుండా ఆయా పాత్రలకు జీవం పోసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆయన ఏ సినిమా చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ఇటీవలే వచ్చిన సినిమాలే అందుకు నిదర్శనం. తాజాగా 'సీక్రెట్‌ ఆఫ్‌ సక్సెస్‌', 'థగ్స్ ఆఫ్‌ హిందుస్థాన్‌' సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిల్లో 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రానికి సంబంధించిన ఓ లుక్ బయటకు వచ్చింది.

ఈ లుక్ చూసిన వారందరూ అసలు అమీర్ ఖాన్ యేనా అంటూ ఆశ్చర్యపోయారు. చింపిరి జుట్టు... చినిగిపోయిన బట్టలు... మాసిపోయిన శరీరంతో కనిపించాడు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం ముంబయిలోని ఓ స్టూడియోలో ప్రారంభమైంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. యస్‌రాజ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటిస్తున్నట్లు టాక్. అమీర్ ఖాన్ గెటపే ఇలా ఉంటే బిగ్ బి గెటప్ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. కత్రినా కైఫ్‌, 'దంగల్‌' ఫేమ్‌ ఫాతిమ సన్‌ షైక్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

10:33 - August 7, 2017

పూణె: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కు స్వైన్ ఫ్లూ సోకింది. ఈ అంశాలన్ని అమీర్ తెలిపారు. ఈ రోజు పూణె లో జ‌రుగుతున్న పాని ఫౌండేష‌న్ కు చెందిన స‌త్య‌మేవ్ జ‌య‌తే వాట‌ర్ క‌ప్ అవార్డ్స్ ఫంక్షన్ లో పాల్గొనవలసి వుంది. ఈ సందర్భంగా ఆయన ఇంట్లో నుంచి లైవ్ వీడియో ద్వారా అమీర్ ఖాన్ మాట్లాడారు. స్వైన్ ఫ్లూ సోకినందు వ‌ల్ల ఈవెంట్ కు రాలేక‌పోయాన‌ని... వేరే వాళ్ల‌కు సోక కూడ‌ద‌నే అవార్డ్స్ ఈవెంట్ ను స్కిప్ చేశాన‌ని ఆయ‌న అన్నారు.

14:11 - July 3, 2017

బాలీవుడ్ నటి ‘కత్రినా కైఫ్’..’మల్లీశ్వరీ’ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయస్తురాలు. బాలీవుడ్ లోని పలు హిట్ చిత్రాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకుంది. వరుస ఆఫర్లతో టాప్ పోజిషన్లలో నిలిచిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘అమీర్ ఖాన్’ తో ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’..’ సల్మాన్ ఖాన్’ తో ’టైగర్ జిందా హై' చిత్రాల్లో నటిస్తోంది. ‘జగ్గా జాసూస్' చిత్ర ప్రమోషన్ లో భాగంగా తోటి నటుడు 'రణ్ బీర్ కపూర్'తో అబుదాబీలో జరిగిన సైమా వేడుకల్లో 'కత్రీనా' పాల్గొంది. ఈ సందర్భంగా మీడియా పలు ప్రశ్నలు వేసింది. దక్షిణాదిలో నటించాల్సి వస్తే ఏ హీరోలతో నటిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు 'తెలుగులో ప్రభాస్ తో..తమిళంలో 'విక్రమ్' తో నటిస్తా' అని ఠక్కున చెప్పేసింది. 'బాహుబలి' మూవీ చూశానని..ప్రభాస్ ఎంతో చక్కగా నటించారని కితాబిచ్చింది. 'చియాన్' విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని ఆయన అద్భుతమైన నటుడని 'కత్రినా కైఫ్' అభిప్రాయపడింది. మరి 'కత్రినా' మాటలు దర్శకుల చెవిలో పడ్డాయో లేదో...

09:24 - June 28, 2017

బాలీవుడ్ మిస్టర్ ఫర్ పెక్ట్ 'అమీర్ ఖాన్' సాహసాలు చేయడంలో ముందుంటాడు. ఆయన నటించే పాత్ర కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడని ఆయన చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. తాజాగా మరొక సాహసం చేశాడు. ఆయన ఫొటో చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ‘అమీర్' ఇటీవలే నటించిన 'దంగల్' సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలోని పాత్రల కోసం సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చాడు..మరో పాత్ర కోసం ఏకంగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెప్పినా 'అమీర్' వినకుండా సాహసం చేసి భళీరా అనిపించాడు. తాజాగా ఆయన 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ లు కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం ఆయన ఏకంగా ముక్కు..చెవులు కుట్టించేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చెవులు కుట్టించుకోవడంతో 'అమీర్' నొప్పి భరించలేకపోయాడని టాక్. మరి ఆయన పాత్ర ఎలా ఉండనుందో సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - అమీర్ ఖాన్