అమెరికా

08:33 - December 10, 2017

అమెరికా : అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం నెలకొంది. చికాగోపార్కింగ్‌ ప్రాంతంలో కొంతమంది దుండగులు .. హైదరాబాద్‌కు చెందిన అక్బర్‌పై కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన అక్బర్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్బర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్బర్‌ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అక్బర్‌ కుటుంబ సభ్యులు మల్లాపూర్‌లో ఉంటున్నారు. కాల్పుల సంఘటన తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమెరికా వెళ్లేందుకు తమకు వీసా ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

22:06 - December 9, 2017

ఢిల్లీ : జెరుసలేం అంశంలో ఐక్యరాజ్యసమితిలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్ రాజధానిగా జెరుసలేంను ప్రకటించడాన్ని తిరస్కరించింది. ట్రంప్‌ నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం జరిపింది.  15 సభ్య దేశాలకు గాను 8 దేశాలు ప్రపంచ శాంతి, భద్రతకే ప్రాధాన్యత నిచ్చాయి. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. జెరూసలేం ఇజ్రాయిల్, పాలస్తీనాలకు రాజధానిగా పేర్కొంటూ... దీనిపై చర్చల ద్వారానే ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని యురోపియన్ యూనియన్‌కు చెందిన అయిదు దేశాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. దీంతో అమెరికా ఈ అంశంలో ఒంటరిగా మారింది. అమెరికా దౌత్యవేత్త నిఖ్కీ హేలీ మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయం ఇజ్రాయిల్ పట్ల తమ శత్రుత్వాన్ని చూపుతన్నదని ఆరోపించారు.

 

06:46 - December 8, 2017
21:35 - November 26, 2017

వాషింగ్టన్ : ముంబై టెర్రర్ మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ విడుదలపై అమెరికా భగ్గుమంది. తీవ్రవాదానికి ఊతం ఇవ్వబోమని చెబుతూనే.. ఇప్పుడు హఫీజ్‌ను ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. వెంటనే అతడిని అరెస్ట్ చేయాలని అమెరికా పాక్‌కు లేఖ రాసింది. రెండురోజుల క్రితం విడుదలైన హఫీజ్... కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతానని ప్రకటించాడు. ముంబయి ఉగ్రదాడి‌లో కీలక సూత్రధారిగా ఉన్న హఫీజ్ సయీద్.. ప్రస్తుతం జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ ఛీఫ్ గా వ్యవహరిస్తున్నాడు.

10:52 - November 26, 2017

కృష్ణా : అనాథలను 'హీల్' అనే సంస్థ అక్కున చేర్చుకొంటోంది. ఉచిత విద్యతో పాటు..ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తోంది. దేశంలో ఎక్కడి నుండి వచ్చినా సంస్థలో చేరే అవకాశం కల్పిస్తున్నారు. పదో తరగతి తరువాత పిల్లలకు తమ కాళ్లపై నలబడేలా పలు కోర్సుల్లో శిక్షణ కల్పిస్తున్నారు. పిల్లలకు ఇష్టం ఉన్న రంగంలో శిక్షణ కూడా ఇస్తారు. ప్రస్తుతానికి సంస్థలో వెయ్యి మంది పిల్లలున్నారు. పిల్లల కోసం స్వచ్చందంగా వాలంటీర్లు సేవలందిస్తున్నారు. వికలాంగులకు కృత్రిమ అవయవావలను ఈ సంస్థ అందిస్తోంది. భవిష్యత్ లో ఇంకా సేవలందిస్తామని సంస్థ నిర్వాహకులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

07:27 - November 24, 2017

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ కొద్ది రోజుల్లో నగరానికి రానున్నారు. నగరంలో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనేందుకు ఈమె ఇక్కడకు రానున్నారు. ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయల ధరలు..ఇతర సరుకులు ధరలు పైకి ఎగబాగుతుండడంతో పేద..సామాన్య..మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (నవ తెలంగాణ ఎడిటర్, విశ్లేషకులు), పాశం సత్యనారాయణ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:19 - November 22, 2017

హైదరాబాద్ : ఓ వైపు ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు..మరోవైపు మెట్రోరైలు ప్రారంభోత్సవ వేడుక.. రెండు ప్రతిష్టాత్మక ఈవెంట్లకు చారిత్రక భాగ్యనగరం అతిథ్యమివ్వనుంది. ప్రధాని మోదీ సహా, ఇవాంక ట్రంప్‌, దేశ విదేశీ కార్పొరేట్‌ దిగ్గజాలు నగరానికి వస్తుంటడంతో రాష్ట్ర పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రెండు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్‌ 28...హైదరాబాద్‌ చరిత్రలో నిలిచిపోనున్న రోజు. నగర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానున్న రోజు. మెట్రోరైలు హైదరాబాద్‌ సిగలో చేరనున్న రోజు. నవంబర్‌ 28న భారత ప్రధాని నరేంద్ర మోదీ మెట్రోరైలును జాతికి అంకితం చేయనున్నారు.

ఈనెల 28న, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనతో వస్తారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర ప్రముఖులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. 3.25 నిమిషాలకు వీరంతా మియాపూర్‌ మెట్రోరైల్‌ స్టేషన్‌కు చేరుకుంటారు. మోదీ మెట్రో రైలును ప్రారంభించి, మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లికి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అక్కడి నుంచి మళ్లీ మెట్రోలోనే మియాపూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి చేరుకుని, ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

ప్రధానితో పాటు అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్‌, సహా దేశ విదేశీ కార్పొరేట్‌ దిగ్గజాలు ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు. ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌ను అమెరికా ప్రభుత్వంతో పాటు నీతి అయోగ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.. మూడు రోజులపాటు జరిగే సదస్సును మొత్తం 53 సెషన్లుగా విభజించారు. హెల్త్ కేర్ అండ్ లైఫ్‌ సైన్సెస్,మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ ఎకానమీ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణలపై సదస్సులో ప్రధానంగా చర్చ సాగనుంది. సదస్సులో మొదటి రోజు ప్రారంభోత్సవ వేదికపై సీఎం కేసీఆర్‌ ఆహ్వాన ప్రసంగం చేస్తారు. తరువాత ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు.

హైదరాబాద్‌లో ప్రముఖుల పర్యటన సందర్భంగా ఐబీ హెచ్చరికల నేపథ్యంలో.. పోలీసులు నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైటెక్స్‌ వద్ద భద్రతను అమెరికా భద్రతావిభాగం, ఎస్పీజీ బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. రెండు కార్యక్రమాల కోసం సుమారు 4 వేల మంది పోలీసుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఆక్టోపస్, గ్రేహౌండ్స్, బాంబ్, డాగ్‌స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి.

మరోవైపు మియాపూర్ మెట్రోస్టేషన్, డిపో, పరిసర ప్రాంతాలు ఎస్పీజీ భద్రతా వలయంలోకి చేరాయి. ఎస్పీజీ ఐజీ సెవాంగ్ నంగ్యల్ మియాపూర్ మెట్రోను సందర్శించారు. మొత్తంగా రెండు ప్రతిష్టాత్మక ఈవెంట్లను సక్సెస్‌ చేసేందుకు అటు అధికారులు, ఇటు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

20:04 - November 22, 2017

అంబేద్కర్ అంటె.. కాళ్లు గడ్గి నెత్తిల సల్లుకుంటం అన్నంత యాక్టింగ్ జేస్తరు మన బాతాల పోశెట్టి ఇంటి బ్యాచ్.. దేవుండ్లకు సమర్పించుకున్న మొక్కులు సంగతి అట్లుండంగ.. జనగామా ఎమ్మెల్యే చెర్వు భూమిని కబ్జావెడ్తె ఆయన మీద చర్యలు దీస్కోలేదు.. ఏడనన్న శాంతి చర్చలుంటే.. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డినే వంపాలే..చంద్రబాబు ఏక్ నంబర్ మోసగాడు.. అని చెప్పెతందుకు పెద్ద కష్టపడవల్సిన పనేం ఉండది.. లంచం ఇయ్యలేదని ఒక డ్రైవర్ను గొట్టిండ్రట ఆబిడ్సు కాడ ఇద్దరు కానిస్టేబుళ్లు.. అన్న అమ్ముకున్న భూములను పేదోళ్లు కొన్కున్నరు రిజిస్ట్రేషన్ జేస్కున్నరు వాళ్లంతల వాళ్లున్నరు.. గుడుల కాడ గుప్త నిధులు ఉంటయని ఎవ్వలు జెప్తరో ఏమో సోడిగాళ్లకు.. గీ ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి....

17:20 - November 21, 2017

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ నగరానికి రానున్నారు. నవంబర్ 28-30 తేదీల్లో ప్రపంచ వాణిజ్య సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇవాంక ట్రంప్, తదితర ప్రముఖులు హైదరాబాద్ కు రానున్నారు. ఇవాంక ట్రంప్ ఫలక్ నుమా ప్యాలెస్ జరిగే విందులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నగరానికి చేరుకున్న అమెరికా సీక్రెట్ ఏజెన్సీ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 36 ఎకరాల్లో ఉన్న ఫలక్ నుమాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లలో ఉంటున్న 3500 మంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి...

14:32 - November 21, 2017

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక హైదరాబాద్ కు రానున్నారు. ఈనెల 28-30వ తేదీల్లో జరిగే ప్రపంచ వాణిజ్య సమ్మిట్‌ లు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక నగరానికి రానున్నారు. దీనితో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమెరికా సీక్రెట్ ఏజెన్సీస్ రంగంలోకి దిగి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అమెరికా సీక్రెట్ సర్వీస్, కేంద్ర హోం శాఖ సూచనలతో పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సౌత్ జోన్ డీప్యూటి కమిషనర్ టెన్ టివికి తెలిపారు. పాతబస్తీలో కూడా ఇవాంక పర్యటన ఉండడడంతో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - అమెరికా