అరెస్ట్

15:20 - June 19, 2018

విజయవాడ : కుటుంబ కలహాలతో ఓ టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెజవాడలో కలకలం రేపిన విషయం తెలిసిందే. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లుకు చెందిన తేజస్విని అనుమానస్పద స్థితిలో కొన్ని రోజుల క్రితం మృతి చెందింది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కాగా ఇప్పుడు తాజాగా తేజస్విని సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తేజస్విని అత్తమామల వేధింపులే తేజస్విని మృతికి కారణమని తల్లిదండ్రులు కంకిపాడు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో తేజస్విని భర్త పవన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్న తేజస్విని..
రెండేళ్ల క్రితం ఆమె ప్రేమ వివాహం చేసుకోగా, తేజస్విని భర్త పవన్ కుమార్ కుటుంబీకులకు ఈ వివాహం ఇష్టం లేని నేపథ్యంలో తేజస్వినిపై పలు వేధింపులకు పాల్పడినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భర్త కుటుంబీకులతో తేజస్వినికి ఘర్షణ చోటుచేసుకోవటంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తేజస్విని సూసైడ్ లేఖ బైటపడటం..దానికి పోలీసులు స్వాధీనం చేసుకోవటం..తేజస్విని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటం వంటి పరిస్థితుల్లో తేజస్విని భర్త పవర్ కుమార్ ను అరెస్ట్ చేశారు. కాగా సూసైడ్ నోట్ లో పలు కీలక విషయాలు బైటపడే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పోలీసుల దర్యాప్తుకు ఈ నోట్ ఉపయోగపడే అవకాశాలున్నాయి. 

16:32 - June 18, 2018

విజయనగరం : మద్యం కుటుంబాలలో చిచ్చులు రేపుతోంది. ప్రాణాలు తీసేంత దారుణాలకు పురిగొలుపుతోంది. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసయిన భర్తను భార్య మందలిస్తోందనే కారణంతో భార్య దారుణంగా చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విజయనగరం జిల్లాలోని మక్కువ మండలం వేంకంపేటలో నివాసముంటున్నారు. నరసయ్య మద్యానికి బానిసవటంతో భార్య రమణమ్మను నరసయ్య హత్య చేసిన బాత్రూమ్ గోడలో పూడ్చిపెట్టేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరువాత పరారయ్యాడు. ఫిర్యాదు అనంతరం నరసయ్య కనిపించకుండా పోవటంతో అనుమానించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇంటిని పరిశీలించగా అనుమానంతో గోడను తవ్వి చూడగా..బాత్రూమ్ కోసం నిర్మించిన స్థలంలో రమణమ్మ మృతదేహం బైటపడింది. ఈ ఘటన జరిగిన సంవత్సరానికి ఇటీవల హాస్టల్ వున్న కుమారుడి వద్దకు నరసయ్య రావటంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

15:22 - June 18, 2018

హైదరాబాద్‌ : వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను SR నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల బంగారం, ఓ స్కార్పియో వాహనం సీజ్‌ చేశారు. 

14:50 - June 18, 2018

హైదరాబాద్‌ : వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను SR నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల బంగారం, ఓ స్కార్పియో వాహనం సీజ్‌ చేశారు. 

12:16 - June 13, 2018

కొందరు హీరోలు కేవలం రీల్ లో మాత్రమే హీరోలు..రియల్ లైఫ్ లో వారు జీరోలే కాదు..విలన్ ల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. సినిమా డైలాగుల్లో సూక్తులు చెబుతుంటారు. నిజజీవితంలో రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు అనే దానికి ఈ హీరోనే నిదర్శనం.

ఆర్మాన్ కోహ్లీ అరెస్ట్..
తన భార్య, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను దారుణంగా హింసించిన కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో నీరూ ఫిర్యాదు మేరకు అర్మాన్ పై కేసును రిజిస్టర్ చేసిన శాంతాక్రజ్ పోలీసులు, అప్పటి నుంచి ఆయన కోసం గాలిస్తున్నారు.

నీరు తలను నేలకేసి బాదిన కోహ్లీ..
ఈ నెల 3వ తేదీన ఆర్థిక వివాదంలో అర్మాన్, నీరూల మధ్య వాగ్వాదం జరుగగా, నీరూ తలను అర్మాన్ నేలకేసి బలంగా కొట్టాడన్నది ప్రధాన ఆరోపణ. ఈ ఘటనలో నీరూ రంధావాకు బలమైన గాయాలు కాగా, కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేశారు. తన తలకు 15 కుట్లు పడ్డాయని, తలపై మచ్చ జీవితాంతం ఉంటుందని డాక్టర్ చెప్పిన మాటలు విని తానెంతో ఆందోళన చెందుతున్నానని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం నీరూ వ్యాఖ్యానించారు. కాగా, నిందితుడు అర్మాన్ ను న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్టు శాంతాక్రజ్ పోలీసులు తెలిపారు.

16:51 - May 31, 2018

ఖమ్మం : రాపర్తిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతాంగ సమస్యలపై తెలంగాణలో వివిధ రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఇందులో భాగంగా ఖమ్మం నుండి కరీంనగర్ వరకు సడక్ బంద్‌ చేపట్టారు. కరీంనగర్‌ జిల్లా ఎల్కతుర్తి వద్ద టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరామ్‌, టీజేఎస్‌ నేతలు ఈ బంద్‌లో పాల్గొన్నారు. బంద్‌లో పాల్గొన్న పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి హసన్‌పర్తి జైలుకు తరలించారు. 

18:10 - May 10, 2018

ఢిల్లీ : అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సమీప బంధువును ఏసిబి అరెస్ట్‌ చేసింది. 10 కోట్ల పిడబ్య్లూడీ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్‌ మేనల్లుడు వినయ్‌కుమార్‌ బన్సాల్‌ను గురువారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. బన్సాల్‌ ఇంటిపై ఏసిబి జరిపిన దాడుల్లో అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ బావ సురేందర్‌ బన్సాల్‌ గత ఏడాది మృతి చెందాడు. 2015-16లో ఢిల్లీలో రోడ్లు, పైప్‌లైన్ల నిర్మాణ కాంట్రాక్టు మంజూరులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నకిలీ బిల్లులతో 10 కోట్ల నిధులు పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో పిడబ్ల్యూడీకి చెందిన ఆరుగురు ఇంజనీర్లను మే 13న ఏసీబి ప్రశ్నించింది. రోడ్స్‌ యాంటీ కరప్షన్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకులు రాహుల్‌ శర్మ ఫిర్యాదు మేరకు  ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

 

17:28 - March 29, 2018

ఆదిలాబాద్ : సీపీఎం అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ... ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించిన సీపీఎం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడంపై సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

18:37 - March 9, 2018

ఢిల్లీ : జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న కె.టి నవీన్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నవీన్‌ కుమార్‌ను ప్రశ్నించేందుకు సిట్‌ 5 రోజుల కస్టడీకి తీసుకుంది. గతవారం కూడా నవీన్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నవీన్‌ కుమార్‌కు హిందుత్వ సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం హిందూ యువతను టార్గెట్‌ చేస్తోందని బిజెపి ఆరోపించింది. 2017 సెప్టెంబర్‌ 5న బెంగళూరులోని తన ఇంటి సమీపంలో 55 ఏళ్ల గౌరీ లంకేష్‌ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు.

13:09 - March 7, 2018

ఢిల్లీ : ఏపీ విభజన హామీలు నెరవేర్చాలనే డిమాండ్ తో వామపక్ష నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలను దారితీసింది. విభజన నేపథ్యంలో అన్యాయానికి గురైన ఏపీకి న్యాయం చేయాలనే డిమాండ్ తో చేస్తున్న వామపక్ష నేతల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై నేతలు బైఠాయించటంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - అరెస్ట్