అరేబియా

19:46 - April 24, 2018
14:11 - December 12, 2016

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద' పేరు పెట్టారు. వర్ద అంటే ఏమిటీ ? వర్ద అంటే అరబిక్, ఉర్దూ భాషల్లో గులాబీ అని అర్ధం. ఈ పేరును పాకిస్తాన్ సూచించింది.
గాలి వేగం గంటకు 39 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే పేర్లు పెట్టేవారు. కరేబియన్ దీవుల్లోని ప్రజలు రోమన్ కేథలిక్ క్యాలెండర్ ప్రకారం ఏ రోజు హరికేన్ లేదా తుపాను ప్రారంభమవుతుందో ఆ రోజు పేరును ఆ తుపానుకు పెట్టేవారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని తుపాన్లకు పేరు పెట్టడం 2000లో ప్రారంభమై 2004లో ఆచరణలోకి వచ్చింది. 
బంగాళాఖాతం, అరేబియా సముద్రం పరిధిలోని దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయ్ లాండ్ లు తుపాన్లకు పేరు నిర్ణయిస్తాయి. ఈ ఎనిమిది దేశాలు కలసి 64 పేర్లతో ఒక జాబితాను రూపొందించింది. ఈ జాబితా ప్రకారం న్యూఢిల్లీలోని ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం తుపానుకు పేరు నిర్ణయిస్తుంది.
హిందూ మహా సముద్రంలో వచ్చే తుపానులకు భారత దేశం అగ్ని, ఆకాశ్‌, బిజిలి, లాల్‌, లహర్‌, మేఘ్‌, సాగర్‌, వాయు అనే పేర్లు ఇచ్చింది. లైలా పేరును పాకిస్థాన్‌ పెట్టింది. థానే పేరును మయన్మార్‌ పెట్టింది. ఆయా దేశాల సామాన్యులు సులువుగా గుర్తు పెట్టుకునేందుకు, తుపానుల ప్రభావాన్ని చారిత్రకంగా నమోదు చేయడానికి తుపానులకు పేర్లు పెడతారు.1953లో అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫానులు వచ్చినపుడు హరికేన్స్, ట్రోపికల్ పేరుతో పిలిచారు. మనదగ్గర నీలం, హెలిన్, లెహెర్, ఫైలిన్, హూద్ హుద్, రౌనా వంటి తుపాన్ లు అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే.
 

తుఫానులకు పేర్లు పెట్టటం ద్వారా ప్రజలను అప్రమత్తం చేయటం తేలిక అవుతుందని నిపుణుల అంచనా. అందుకే పేర్లు పెడతారు. ఇప్పుడు వర్ద తుపాన్ ఎం చేస్తుందో చూడాలి. 

13:43 - November 2, 2015

విశాఖపట్టణం : హుదూద్ తుఫాన్ ఎవరు మరిచిపోరు. విశాఖ జిల్లాను అతలాకుతలం చేసిన తుఫాన్ కు కొంతమంది మృతి చెందగా మరెంతో మంది రోడ్డున పడ్డారు. తాజాగా మరో తుఫాన్ బారి నుండి విశాఖ బయటపడిందని వాతావరణ నిపుణులు రామకృష్ణ టెన్ టివికి తెలిపారు. ఇందుకు పలు కారణాలున్నాయన్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన చపల తుఫాన్ కూడా ఒక కారణమని, తుఫాన్ గా మారకముందే బలహీన పడి దిశ మార్చుకుందని వివరించారు. ఆ సమయంలో మోస్తారు వర్షాలు..ఈదురుగాలులు వీయడం జరిగిందని గుర్తు చేశారు. మరిని వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:27 - October 11, 2015

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జంటనగరాలను జడివాన ముంచెత్తింది. భారీ వర్షం ధాటికి... భాగ్యనగర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. విద్యానగర్‌, ఉప్పల్‌, తార్నాక, బాగ్‌లింగంపల్లి, నారాయణగూడ, ఖైరతాబాద్‌, అమీర్‌ పేట్‌, నాంపల్లి, బేగం బజార్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. రోడ్లను డ్రైనేజీ వ్యవస్థ కప్పేసింది. ప్రధాన కూడళ్లలో వర్షపు నీరు నిలిచిపోయింది. మెట్రో పనుల కోసం తవ్విన భారీ గుంతల్లో నీరు చేరింది. ఇటు వరద, అటు డ్రైనేజీ నీరు రోడ్ల మీదకు రావటంతో వాహనదారులు, పాదాచారులు నానా కష్టాలు పడ్డారు. ప్రధాన కూడళ్లయిన లిబర్టీ, అబిడ్స్‌, ఖైరతాబాద్‌, పంజగుట్ట, అమీర్‌పేట్‌లో ట్రాఫిక్‌ స్తంభించటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మరింత బలపడిన వాయుగుండం..
మరోవైపు బంగాళాఖాతం నుంచి బంగ్లాదేశ్‌ వైపు అల్పపీడనం వెళ్లిపోయింది. అలాగే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న... వాయుగుండం మరింత బలపడనుంది. ఇది వాయివ్య దిశగా పయణిస్తూ... ఆదివారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉంది. అయితే ఈ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక బీహార్‌ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉపరితల ద్రోణి, ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నాయి. దీంతో వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

Don't Miss

Subscribe to RSS - అరేబియా