ఆకుకూర

14:53 - May 2, 2018

రోజు తినే కూరగాయాలు,ఆకుకూరలు, పండ్లు వంటివాటిలో అత్యంత తక్కువ ధరకు దొరికేది ఏమన్నా వుంది అంటే అది ఖచ్చితంగా ఆకుకూరలే. బలవర్ధకమమైనవి కూడా ఆకుకూరలే. రక్తహీనత వున్నవారికి వైద్యులు చెప్పే సూచన కూడా ఆకుకూరలు తినమనే. అటువంటి ఆకుకూరలు సామాన్యులకు, పేదలకు అందుబాటులో వండేవి ఆకుకూరలు. కానీ ఓ రకం ఆకుకూర మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. దాని ధర వింటే సామాన్యులే కాదు ఓ మాదికి సంపన్నులు కూడా నోరెళ్లబెట్టాల్సిందే. మరి అంత ఖరీదు ఆ ఆకుకూర ఖరీదు!!!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆకుకూర ‘హాప్ సూట్స్
ఎక్కడైనా సరే ఆకుకూరలు అత్యంత చవగ్గా దొరుకుతాయనేది నిత్య సత్యం. వీటి ధరలు కూడా ఎప్పుడూ కాస్త నిలకడగానే కనిపిస్తుంటాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆకుకూర ‘హాప్ సూట్స్’. ఈ ఆకుకూర ధర కిలో వెయ్యి యూరోలు. అంటే మన కరెన్సీలో రూ. 76,000. తీగజాతి మాదిరిగా కనిపించే ఈ హాప్ సూట్స్‌ను వసంత రుతువులో పండిస్తారు. కాగా పంట వేసిన అతి తక్కువ వ్యవధిలోనే ఈ పంటను కోయాల్సివుంటుంది. లేనిపక్షంలో ఇది తినేందుకు పనికిరాకుండా పోతుందట. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ ఆకుకూరకు అత్యంత డిమాండ్ ఉంటుంది. ఈ పంటను మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో పండిస్తారు. తేలికపాటి తడివాతావరణంలో ఈ పంట చక్కగా పండుతుంది.

12:25 - May 17, 2017

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పలు రకాల ఆకు కూరల్లో వివిధ పోషకాలు లభ్యమౌతుంటాయి. అలాంటి ఆకు కూరల్లో పొన్నంగంటి కూడా ఒకటి. ఇందులో విటమిన్ ఏ, బి 6, సి, ఫొలేట్, రైబో ఫ్లెవిన్, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఆహారంలో దీనిని భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కంటి చూపుకు ఎంతో దోహదం చేస్తుంటుంది. గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే. పొన్నగంటి ఆకులను ఓ
గ్లాస్‌ నీటిలో ఉడికించి, మిరియాల పొడిని కలుపుకొని తాగితే ఆ సమస్య నుండి దూరం కావచ్చు.
శరీరానికి మేలు చేయడంతో పాటు పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు.
పొన్నగంటి కూరలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ..ఆస్టియో పోరోసిస్ ను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులో లభించే నూనె పదార్థాలు రక్తపోటును తగ్గించి, గుండె సమస్యలను అదుపులో ఉంచుతాయి.
బరువు పెరగాలనుకునే వారు కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.

Don't Miss

Subscribe to RSS - ఆకుకూర