ఆక్సిజన్

14:31 - September 25, 2017

ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మన సొంతమవుతుంది. ముల్లంగిలో శరీరాన్ని డిటాక్సిఫైచేయడానికి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడి మరియు యాంతోసినిన్ వల్ల యాంటిక్యాన్సర్ ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఉపయోగాలు..

ముల్లంగిని తినడం వల్ల లివర్ మరియు కడుపును మంచి కండీషన్ లో పెడుతుంది. అంతే కాదు, శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను సప్లై చేస్తుంది. ముల్లంగి ఆకులను మరియు బ్లాక్ రాడిష్ ను జాండిస్ నివారణకు ఉపయోగిస్తారు.

పైల్స్ నివారణకు బాగా సహాయపడుతుంది. పైల్స్ అధికంగా కాకుండా అడ్డుకుంటుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి మరియు యూరినేటింగ్ సమయంలో ఏర్పడే బర్నింగ్ సెన్షేషన్ వంటి వాటికి నివారిణిగా పనిచేస్తుంది.

ముల్లంగిన మన డైలీ డయట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ (కోలన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, కిడ్నీ కాన్సర్, మరియు ఓరల్ క్యాన్సర్ )లను రాకుండా కాపాడుతుంది.

ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్, జింక్ మరియు విటమిన్ బి కాప్లెక్స్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

తేనెటీగలు, కందిరీగలు మొదలగునవి కుట్టినప్పుడు నొప్పి మరియు వాపు ఉన్న ప్రదేశంలో ముల్లంగి రసాన్ని అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

ముల్లంగి బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది. అందుకు కారణం అయ్యే వాటిని నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముల్లంగి రసంలో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కలిపి త్రాగడం వల్ల జ్వరానికి కారణం అయ్యే లక్షణాలతో పోరాడి, జ్వరాన్ని తగ్గిస్తుంది.

ముఖ్యంగా ముక్కు, గొంతు, శ్వాసనాళం మరియు ఊపిరితిత్తు సంబంధించిన సమస్యలు, దగ్గు, అలెర్జీ మరియు కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను నివారిస్తుంది. శ్వాసనాలం బాగా పనిచేసేలా చేస్తుంది.

10:39 - August 31, 2017

భారతదేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మౌనం వహిస్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర వాటిపై స్పందిస్తున్నారు కానీ..జరుగుతున్న ఘోరాలపై మాత్రం స్పదించడం లేదని సోషల్ మీడియాలో కేంద్ర పాలనపై నెటిజన్లు వ్యంగ్యాస్రాలు సంధిస్తున్నారు. గతంలో ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ ను మౌన మునిగా కాషాయ దళాలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

దేశంలో ప్రస్తుతం దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో దళితులపై దాడులు..వివక్ష కొనసాగుతోంది. గోరక్షక్ పేరిట కొంతమంది గూండాలు విచక్షణారహితంగా దాడులకు తెగబడుతూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఈ ఘటనలపై ప్రధాన మంత్రి మోడీ హెచ్చరించినా దాడుల ఘటనలు మాత్రం ఆగకపోవడం విచారకరమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో బిఆర్‌డి ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఎలా పాలన కొనసాగుతోందో అక్కడ జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అర్థమౌతుంది. గత మూడు రోజుల్లో 63 మంది పిల్లలు మృత్యు ఒడికి చేరుకున్నా ప్రధాన మంత్రి మోడీ స్పందించకపోవడంపై పలువురు మండి పడుతున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 290 పసిపిల్లలు కన్నుమూయడం విచారకరం.  మృతి చెందిన చిన్నారులో ఏడుగురు మెదడువాపు వ్యాధి, మిగిలినవారు రకారకాల వైద్య కారణాలతో చనిపోయారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆక్సిజన్‌ కొరత వల్లే పిల్లలు మృతి చెందినట్లు ఈ ఘటనపై విచారణ జరిపిన నివేదికలో స్పష్టమైంది. ఘటనపై సీఎం స్పందించి ఓ అధికారిని సస్పెండ్ చేశారు.

మొన్న నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏకంగా అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రతి చిన్నదానికీ అలవోకగా చాయ్ పే బాత్‌, మన్‌ కీ బాత్‌లు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గోరఖ్‌పూర్‌ దురంతంపై ఎందుకు మౌనం దాల్చినట్టు ? ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నోరు లేని ఆవుల రక్షణకు ప్రత్యేక దళాలను నెలకొల్పి నడిపిస్తున్న సీఎం యోగికి ఆవుల కంటే పసికందుల ప్రాణాలు లెక్కలేదని సోషల్ మీడియాలో పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. వెంటనే రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సీఎం యోగి రాజీనామా చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. 

12:39 - August 12, 2017

హైదరాబాద్: యూపీలో చిన్నారుల మృత్యుఘోష ఆగడంలేదు. ఘోరక్‌పూర్‌లోని బాబా రాందాస్‌ ఆస్పత్రిలో ఆరు రోజుల్లో 63 మంది చిన్నారులు మృతిచెందారు. చిన్నారుల మృతిపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సీరియస్‌ అయ్యారు. అధికారులతో అత్యవసరభేటీ నిర్వహించారు. మిరికొద్ద సేపట్లో ఆర్యోగ్యశాఖా మంత్రితో కలిసి సీఎం ఆదిత్యనాథ్‌ ఆస్పత్రిని సందర్శిస్తారు. అటు కాంగ్రెస్‌ నేతలు కూడా ఆస్పత్రిని సందర్శించారు. చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మందులు సమయానికి అందక పోవడంతోనే పిల్లలు చనిపోతున్నట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసే కంపెనీకి బాకీలు చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్లే స‌దురు కంపెనీ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను నిలిపివేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. బాబా రాఘ‌వ దాస్ మెడిక‌ల్ కాలేజీకి పుష్పా కంపెనీ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తోంది. అయితే బాకీలు చెల్లించ‌కుంటే స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తామ‌ని గ‌తంలో ఆ కంపెనీ హాస్ప‌ట‌ల్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆగ‌స్టు ఒక‌ట‌వ తేదీన ఆ కంపెనీ ఈ అంశంపై లేఖ కూడా రాసింది. పాత బిల్లులు చెల్లించ‌ని కార‌ణంగానే హాస్ప‌ట‌ల్‌కు ఆక్సిజ‌న్ అంద‌లేదా అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. బిల్లుల గురించి తెలిసిన ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఢిల్లీకి వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదిత్య‌నాథ్ ఆరోగ్య శాఖ అధికారుల‌కు ఆదేశించారు. 

11:32 - August 12, 2017

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో మృత్యుఘోష వినిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రి మృత్యుకుహారాలుగా మారాయి. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఏకంగా 32 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. శుక్రవారం 30 మంది పిల్లలు కన్నుమూయగా శనివారం మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. సీఎం సొంత నియోజకవర్గమైన గోరఖ్ పూర్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. రూ. 70 లక్షలు ఆసుపత్రి బకాయి పడిందనే కారణంతో సిలిండర్ల సరఫరాను కాంట్రాక్టర్ నిలిపివేశారు. ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. మెదడు వాపు వ్యాధితోనే చిన్నారులు మృతి చెందుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

09:33 - August 12, 2017

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్ అందక చిన్నారులు మృతి చెందుతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఆక్సిజన్ అందక 40 గంటల్లోనే 30 మంది చిన్నారులు మృత్యుముఖంలోకి వెళ్లిపోయారు. వీరంతా మెదడు వాపు వ్యాధితో బాధ పడుతున్నట్లు సమాచారం. గోరఖ్ పూర్ లోని బీఆర్ డీ మెడికల్ ఆసుపత్రిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో మొత్తం 54 మంది చిన్నారులున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రెండు రోజుల కిందటే సీఎం యోగి ఆసుపత్రిని తనిఖీ చేసి వెళ్లారు. ఈసందర్భంగా ఆయనకు అక్కడి వారంతా సమస్యలు ఏకరవు పెట్టగా తగిన చర్యలు తీసుకుంటానని సీఎం హామీనిచ్చినట్లు తెలుస్తోంది. 

10:21 - February 8, 2017
11:33 - January 31, 2017

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. న్యూరో సర్జికల్ వార్డు ఎన్ ఎస్ ఈ ల115లో చికిత్స పొందుతూ... మూడు గంటలుగా అక్సిజన్ అందక నలుగురు రోగులు మృతి చెందారు. ఇంత జరుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది వివరాలు వెల్లడించకపోవడం దారుణం.

ఆక్సిజన్ అందక చనిపోలేదు: ఆర్ ఎంఓ

సీరియస్ హెడ్ ఇంజూరి అవడం వల్ల వారు చనిపోయారని ఆర్ ఎంఓ తెలిపారు. సెంట్రల్ పైప్ ద్వారా బాధ్యుతలకు అక్సిజన్ అందిస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రికి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించామని చెప్తున్నా... అరకొర సౌకర్యాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

08:49 - December 8, 2016

2016లో ఒక్క మూవీ కూడా రిలీజ్ చేయలేదు హీరో 'గోపీచంద్'. 'సౌఖ్యం' ఫ్లాప్ నుంచి వీలైనంత త్వరగా బయటపడి ట్రాక్ లోకి వచ్చేయాలని 'గోపీచంద్' ప్లాన్స్ అన్నీ రివర్స్ అయిపోయాయ్. దీంతో ఈ ఏడాది వస్తాయనుకున్న సినిమాలన్నీ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయిపోయాయ్. నిజానికి 'గోపీచంద్' 'ఆక్సిజన్' మూవీ దీపావళికే రావాలి. అయితే చిత్ర దర్శకుడు ఏఎం జ్యోతిక్రిష్ణతో డిఫరెన్సెస్ రావడంతో షూటింగ్ డీలే అయింది. ఫైనల్ గా 'గోపీచంద్', 'జ్యోతిక్రిష్ణ' మధ్య రాజీ కుదరడంతో మళ్లీ 'ఆక్సిజన్' మూవీ పట్టాలెక్కింది. 

వచ్చే ఏడాది మూడు సినిమాలు..
మిగిలిన ఇంకో పావుశాతం షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి 'ఆక్సిజన్' ని ఫిబ్రవరి లేదా మార్చిలో రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. 'ఆక్సిజన్' మూవీతో పాటు సీనియర్ దర్శకుడు బి.గోపాల్ డైరెక్షన్ లో రెండేళ్ల కిందట మొదలై ఆగిపోయిన సినిమాను కూడా మళ్లీ పట్టాలెక్కించాలని 'గోపీచంద్' సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఎడాది స్టార్టింగ్ లోనే రిలీజ్ చేసేలా చూస్తున్నారు. ఇక ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో చేస్తున్న కొత్త మూవీ ఫాస్ట్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాను కూడా మే లేదా ఆగస్ట్ లో రిలీజ్ కానుంది. ఇలా వచ్చే ఎడాది 'గోపీచంద్' వరుసగా మూడు సినిమాలు రిలీజ్ చేసేలా స్కెచ్ వేశాడు. 2017 లో ఖాళీ లేకుండా ఈ హీరో బాగానే ప్లాన్ చేసుకున్నాడు.

13:44 - July 16, 2016

దేశముదురు, కంత్రి, పవర్, దేనికైనా రెడీ, సింగం వంటి పలు తెలుగు సినిమాల్లో నటించిన హన్సిక.. తన నటనతో అందరిని ఆకర్షించింది. ప్రస్తుతం మరో తెలుగు సినిమాలో నటించనుంది. హీరో గోపిచంద్ తో మొదటిసారి కలిసి నటించనుంది. సంపత్‌ నంది, గోపీచంద్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'ఆక్సిజన్' చిత్రంలో హన్సిక నటించనుంది. గోపిచంద్ తో కలిసి అమ్మడు స్టెప్పులేయనుంది. రెండేండ్ల తర్వాత హన్సిక తెలుగులో నటించబోతుంది. మరి మునుపటి సినిమాల్లాగా ఈ చిత్రం కూడా హిట్ అవుతుందో, హన్సికకు మంచి పేరు తెస్తుందో లేదో చూడాలి మరి. గోపిచంద్ కు మరో హిట్ ఇస్తుందో వేచిచూడాల్సిందే. గోపిచంద్, హన్సిక కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి. ఈ జంట ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తారో.. వేచి చూడాల్సిందే. ఈ సినిమాకి సంపద్‌ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

 

 

10:03 - June 3, 2016

సైకిల్‌ ఒకనాటి రవాణా అవసరం. ఇప్పుడది వ్యాయామ సాధనం... అవును! శారీరక వ్యాయామానికే కాదు ఎంతో మానసిక ప్రశాంతతనీ ఇస్తుంది. మీరే చదవండి...
సైకిల్‌ తొక్కడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు కావాల్సిన వ్యాయామం దొరుకుతుంది. ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. రోజుకి కనీసం ఐదు నిమిషాలపాటు సైకిల్‌ తొక్కినా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. బరువూ తగ్గుతారు.
నడుము చుట్టుకొలత ఎక్కువగా ఉన్న వాళ్లకి సైకిల్‌ తొక్కడం ఔషధంలా ఉపయోగపడుతుంది. సైకిల్‌ తొక్కేప్పుడు మనసు ఉల్లాసంగా మారి... రక్త పోటు స్థాయిని అదుపులో ఉంచుతుంది. చెమట ఎక్కువగా రావడం వల్ల శరీరంలోని టాక్సిన్‌లు బయటకెళతాయి.
మధుమేహం రోగులకి ఇది మంచి చికిత్స కూడా... సైకిల్‌ తొక్కడం వల్ల రాత్రిపూట నిద్ర సక్రమంగా పడుతుంది. పొద్దుటిపూట సైకిల్‌ తొక్కడం వల్ల మనలో శక్తిస్థాయిలు పెరుగుతాయి. ఎండ నుంచి వచ్చే రేడియోషన్‌ కిరణాల ధాటిని తట్టుకోగలం కూడా.గుండెకి రక్తప్రసరణ స్థాయిని పెంచడంలో సాయపడుతుంది. తద్వారా ఆక్సిజన్‌ మెదడుకు సరిగ్గా అందుతుంది. మతిమరుపు సమస్యలు, పరధ్యానం వంటివి తగ్గుతాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - ఆక్సిజన్