ఆత్మహత్యాయత్నం

17:01 - September 6, 2018

హైదరాబాద్ : అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించారు. దీంతో రాష్ట్రంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేయకుండా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారంటు ప్రశ్నిస్తు.. ఓ యువకుడు రాజ్ భవన్ బయట ఆత్మహత్యకు యత్నించాడు. కాగా రాజ్ భవన్ భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సంద్భంగా అతను మాట్లాడుతూ, నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి నుంచి వచ్చానని, తన పేరు ఈశ్వర్ అని, నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థినని తెలిపాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అమరులైన వారికి,ఉద్యమకారులకు, నిరుద్యోగులకు,కళాకారులకు న్యాయం చేయకుండా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఈశ్వర్ ప్రశ్నించాడు.

14:44 - September 4, 2018

హైదరాబాద్ : సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ముందే ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఒంటిపై కిరోసిన పోసుకుని బోయిన్ పల్లి పీఎస్ ముందుకు ఆత్మహత్యకు యత్నించింది. దీంతో షాక్ కు గురైన పోలీసులు, స్థానికులు వెంటనే తేరుకుని మంటలు ఆర్పి మహిళను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. బేగంపేట అన్నానగర్ కు చెందిన సబిత అనే యువతి కుటుంబ కలహాలతో ఆత్మహతకు యత్నించినట్లుగా తెలుస్తోంది. కాగా సబిత పీఎస్ ముందు ఆత్మహత్యకు యత్నించటానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సబిత శరీరం దాదాపు 70 శాతం కాలిపోవటంతో ఆమె పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. 

13:46 - August 22, 2018

కృష్ణా : జిల్లాలోని కబడ్డీ మాజీ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. ఏపీ కబడ్డీ ప్రెసిడెంట్‌ వీర్ల లంకయ్య కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. తనపై కక్షతో తన టీం సభ్యులను కబడ్డీ క్రీడకు దూరం చేస్తున్నారని మనస్థాపం చెందిన శ్రీకాంత్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 

 

14:36 - August 15, 2018

హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని వ్యక్తి నిప్పంటించుకున్నాడు. పోలీసులు మంటలను ఆర్పి అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

13:48 - August 11, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అనంతపురంలో సెల్‌ టవర్‌ ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భాస్కర్‌ను కిందికి దింపేందుకు అనంతపురం ఎమ్మెల్యేలు సెల్‌ టవర్‌ వద్దకు చేరుకున్నారు. భాస్కర్‌తో ఫోన్‌ మాట్లాడిన ఎమ్మెల్యేలు యువకుడిని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయం కేంద్రం పరిధిలో ఉందని.... కావాలంటే భాస్కర్‌ను సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:17 - August 11, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలో  పెనుబోలు విజయ్‌ భాస్కర్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ధర్మవరం రూరల్‌ పీఎస్‌ వద్ద సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం చనిపోతున్నానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:15 - July 18, 2018

హైదరాబాద్‌ : బాలానగర్ ఐడిపిఎల్‌లోని శ్రీచైతన్య కళాశాలలో ఓ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఫస్టియర్‌ చదువుతున్న విద్యార్ధిని మూడంతస్తుల భవనం పైనుండి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రగాయాలైన విద్యార్ధినిని ఆస్పత్రికి తరలించారు.

 

22:01 - July 6, 2018

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ లో కాల్పులు కలకలం రేపాయి. ప్రశాసన్‌నగర్‌లో కానిస్టేబుల్‌ కిషోర్‌ ఏకే 47తో కాల్పుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.  వెంటనే తేరుకున్న పోలీసులు కిషోర్‌ను  ఆస్పత్రికి తరలించారు. కిషోర్‌కు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రిటైర్డ్‌ డీజీ ఆర్‌.పి.మీనా వద్ద పనిచేస్తున్న కానిస్టేబుల్‌ కిషోర్‌.. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యా యత్నం చేశారని పోలీసులు తెలిపారు.  

 

15:29 - July 6, 2018

మేడ్చల్ : జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసు స్టేషన్ లో సూర్యప్రకాశ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితమే షామీర్ పేట పోలీస్ స్టేషన్ నుంచి మేడ్చల్ పీఎస్ కు ప్రకాశ్ బదిలీ అయ్యారు. ఈనేపథ్యంలో షామీర్ పేటలోని తన ఇంట్లో ప్రశాక్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సుచిత్రలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

16:43 - July 4, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఆర్టీసీ డ్రైవర్‌ వీరేశం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బర్కత్‌ పురా ఆర్టీసీ డిపో మేనేజర్‌ శంకర్‌ నాయక్‌ వేధింపులు భరించలేక డ్రైవర్‌ ఆత్మహత్యా యత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో.. సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిపో మేనేజర్‌ తీరుకు నిరసనగా.. బర్కత్‌పురా డిపోలో కార్మికులు విధులు బహిష్కరించారు. నిరసనగా 80 బస్సులను నిలిపేశారు. డిపో మేనేజర్‌ను సస్పెండ్‌ చేయకుంటే రాష్ర్ట వ్యాప్తంగా ఆందోన చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఆత్మహత్యాయత్నం