ఆదిలాబాద్

18:24 - August 18, 2018

ఆదిలాబాద్ : జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద మెడికోలు ధర్నాకు దిగారు. రిమ్స్ కళాశాలలో రెగ్యులర్ సిబ్బంది నియమించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది లేక చాలా ఇబ్బందులకు గురువుతన్నామని..ప్రభుత్వం వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ పై దృష్టి పెట్టాలని మెడికోలు కోరుతున్నారు. 

 

13:42 - August 12, 2018

ఆదిలాబాద్ : జిల్లాలోని ఇచ్చోడ మండలం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై అడగామ్ వాగు పొంగిపొర్లుతోంది. సమీపంలోని పోలీసు స్టేషన్, కాలనీలోకి ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 

14:19 - August 10, 2018

ఆదిలాబాద్ : జిల్లాలో 'రిమ్స్' ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఎన్నో లోటుపాట్లు ఉన్నాయనే విమర్శలున్నాయి. కీలకమైన వైద్య శాలకు భారతీయ వైద్య మండలి షాక్ ఇచ్చింది. గుర్తింపు కొనసాగించడానికి నిరాకరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 22 అంశాల్లో లోపాలను ఎత్తి చూపింది. రెగ్యులర్ డీన్ లేరని..డీన్ ఉన్నా..ఆయన సరిగ్గా రాలేరని...ఉన్న ఫ్యాకల్టీ 35 శాతమేనని...దీనితో లోపాలతో గుర్తింపు కొనసాగించలేమని స్పష్టం చేసింది.

ఎంసీఐ గుర్తింపు కొనసాగించడానికి నిరాకరించడం విద్యార్ధులను కలవరపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిమ్స్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరుతున్నారు. 

18:42 - August 2, 2018

ఆదిలాబాద్ : గత ప్రభుత్వాల తప్పిదం వల్ల, మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పేపర్‌ మిల్లు మూతపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాగజ్‌నగర్‌-చింతగూడ మధ్యలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం పేపర్‌ మిల్లులో ప్రత్యేక పూజలు చేసి బహిరంగసభలో పాల్గొన్నారు. పేపర్‌ మిల్లు పునః ప్రారంభానికి ప్రభుత్వం కృషి చేస్తుందని.. జేకే పేపర్స్‌ అనే సంస్థ పేపర్‌ మిల్లు ప్రారంభానికి ముందుకు వచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో మిల్లులో పనులు ప్రారంభమవుతాయని కేటీఆర్‌ అన్నారు. 

16:53 - August 2, 2018

ఆదిలాబాద్ : మంత్రి కేటీఆర్ సిర్పూర్ కాగజ్ నగర్ లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం తప్పు లేకుండానే పేపర్‌ మిల్లు ముతపడిందని అన్నారు మంత్రి కేటీఆర్‌. మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పేపర్‌ మిల్లు మూతపడిందని తెలిపారు. 

 

16:49 - August 2, 2018

ఆదిలాబాద్ : ఇంటింటికి తాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 25  కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మరో 17.50 కోట్ల రూపాయలు బ్రిడ్జీల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:25 - July 30, 2018

ఆదిలాబాద్ : ఆగస్టా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రారంభానికి వచ్చిన మంత్రి జోగు రామన్నకు ప్రమాదం తప్పింది. మంత్రి జోగు రామన్న, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రారంభోత్సవానికి పార్టీ నేతలు..ఆసుపత్రి సిబ్బంది తాకిడి ఎక్కువగా ఉంది. వీరిలో కొంతమంది లిఫ్ట్ లో ఎక్కారు. ఒక్కసారిగా కేబుల్ తెగిపోయింది. కింది ఎత్తులోనే లిఫ్ట్ కుప్పకూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓవర్ లోడ్ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. 

11:09 - July 10, 2018

ఆదిలాబాద్‌ : రిమ్స్‌ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్‌ మిస్టరీ వీడింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి శిశువు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రిలో ఉన్న సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితురాలని గుర్తించారు. ఇచ్చోడకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తనకు పిల్లలు లేనందునే శుశువును తీసుకెళ్లినట్టు మహిళ చెబుతోందని పోలీసులు తెలిపారు.   

 

12:09 - July 8, 2018

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పెనుగంగా, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీనితో ఆ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో సిర్పూర్ (టి) వెంకట్రావు పేట వద్దనున్న వంతెనపైకి నీరు చేరింది. పెన్ గంగా 30 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మొత్తం సామర్థ్యం 700 అడుగులుగా ప్రస్తుతం 697.450 అడుగులకు చేరుకుంది. దీనితో ప్రాజెక్టు 17వ నెంబర్ గేటు ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. నిర్మల్ జిల్లాలోని వెంకట్రావు పేట సమీపంలోని పలు గ్రామాల్లోకి బ్యాక్ వాటర్ చేరుతోంది. దీనితో పలు రాకపోకలకు నిలిచిపోయాయి. భారీగా వరద నీరు వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

17:14 - July 5, 2018

ఆదిలాబాద్ : జిల్లాలోని తాంసి మండలం అత్నంగూడలో విషజ్వరాలు ప్రభలాయి. విషజ్వరాలతో ఇద్దరు మృతి చెందారు. రిమ్స్ లో 16 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వైద్య సిబ్బంది అతిసారంగా భావిస్తోంది. హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి...బాధితులకు సిబ్బంది వైద్యం అందిస్తోంది. గ్రామంలో జిల్లా కలెక్టర్ దివ్య పర్యటించారు. హెల్త్ క్యాంపు ఏర్పాటును కలెక్టర్ పరిశీలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Pages

Don't Miss

Subscribe to RSS - ఆదిలాబాద్