ఆదేశం

11:14 - September 19, 2017
10:51 - September 19, 2017

హైదరాబాద్ : సామాజికవేత్త కంచె ఐలయ్యపై కేసు నమోదుకు ఏపీ డీజీపీ ఆదేశించారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాశారంటూ ఆర్యవైశ్యు సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఐలయ్యపై కేసు నమోదు చేయాలని సీఐడీ అధికారులను డీజీపీ ఆదేశించారు. సీఎం చంద్రబాబుతో చర్చించిన తరువాత డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:59 - September 13, 2017

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు ప్రయోగాలకు నిలయాలుగా మారుతున్నాయి. తరగతి గదిలో విద్యార్థులు హాజరు పలికేటపుడు 'యస్‌ సార్‌, ప్రజెంట్‌ సార్‌' అని చెప్పడం సాధారణం. ఇక మీదట దీనికి బదులు 'జై హింద్‌ సర్‌' అని పలకాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్‌ షా ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మకంగా సత్నా జిల్లాలోని అన్ని పాఠాశాలలో ఈ విధానం అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి రానుంది. దీనివల్ల విద్యార్థుల్లో దేశభక్తి పెరుగుతుందని మంత్రి సెలవిచ్చారు. త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వ స్కూళ్లకు పెద్దమొత్తంలో విరాళాలిచ్చే కంపెనీలు, వ్యక్తుల పేర్లు పెడతామని విద్యామంత్రి చెప్పారు. 

19:04 - August 17, 2017

చెన్నై : జయలలిత మృతిపై విచారణకు తమిళనాడు సీఎం పళని స్వామి ఆదేశించారు. ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని తెలిపారు. అంతే కాదు.. పోయెస్ గార్డెన్‌ను స్మారక కేంద్రంగా మార్చాలని కూడా నిర్ణయించారు. 

 

21:58 - August 16, 2017

ఢిల్లీ : కేరళలో హిందూ మహిళను ఇస్లాంలోకి మార్చి ముస్లిం యువకుడు వివాహం చేసుకున్న 'లవ్‌ జిహాదీ' కేసు వ్యవహారంలో విచారణ చేపట్టాలని జాతీయ దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విచారణను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ వి రవీంద్రన్ పర్యవేక్షిస్తారని కోర్టు పేర్కొంది. పెద్దవాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా హిందూ బాలికలను ఇస్లాంలోకి మార్చిన పలు సందర్భాలున్నాయని ఎన్‌ఐఏ కోర్టుకు విన్నవించింది.ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అమ్మాయి అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు కోర్టు ముందు హాజరుపరచాలని సూచించింది. 2016లో కేరళకు చెందిన ఓ హిందూ యువతి ముస్లిం వ్యక్తిని ప్రేమించి ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత అతడిని పెళ్లి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఈ వివాహం చెల్లదంటూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సదరు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనరు తరపున ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదిస్తున్నారు. వీరి వివాహాన్ని రద్దు చేయడంతో పాటు సదరు మహిళను తన భర్తతో కలిసేందుకు అనుమతించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. 

 

17:33 - April 6, 2017

హైదరాబాద్: మంథని మధుకర్‌ అనుమానాస్పద మృతి కేసులో రీపోస్ట్‌మార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా మెడికల్‌ కాలేజి మరియు కాకతీయ మెడికల్‌ కాలేజి ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్ట్‌మార్టం చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రీ-పోస్ట్‌మార్టంను వీడియో తీయాలని.. చీఫ్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌, మధుకర్‌ తల్లిదండ్రుల సమక్షంలో రీపోస్ట్‌మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రీపోస్ట్‌మార్టం నివేదికను సీల్డ్‌కవరులో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

12:43 - March 1, 2017

హైదరాబాద్ : వనస్థలిపురం వాసవి కాలేజీ నిర్వాకంపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇంటర్‌ బోర్డు స్పందించింది. కాలేజీ యాజమాన్యంపై చర్యలకు ఆదేశించింది. మరోవైపు విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మరియు ఎంసెట్‌ రాసేందుకు అనుమతి ఇస్తామని కడియం శ్రీహరి భరోసా ఇచ్చారు. ఇదిలావుంటే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన కాలేజీ యాజమాన్యం బోర్డుకు ఫీజు చెల్లించలేదని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. ఇప్పటికే కాలేజీ యాజమాన్యంపై చర్యలకు ఆదేశించామన్నారు. 

15:42 - February 9, 2017

హైదరాబాద్: జీహెచ్ఎంసీ లో సెల్‌టవర్లపై కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు.. విచారణ అధికారిగా టౌన్‌ప్లానింగ్‌ చీఫ్ ఆఫీసర్‌ దేవేందర్‌ రెడ్డిని నియమించారు.. అలాగే రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌ విభాగాలతో రెండు యాక్షన్‌టీంలు ఏర్పాటు చేశారు... గ్రౌండ్‌లెవల్లో పరిస్థితిని విచారించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.. అవసరమైతే అనధికారికంగాఉన్న సెల్‌ టవర్లను తొలగించాలని ఆదేశించారు..

18:16 - October 27, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ కాల్ సెంటర్ నిర్వహణపై 10 టివి కథనానికి స్పందన లభించింది. జీహెచ్ ఎంసీ కాల్ సెంటర్ నిర్వహణపై విచారణకు ఆదేశించారు. కాల్ సెంటన్ తనిఖీ చేసి టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్ రావు వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

20:40 - September 28, 2016

ఢిల్లీ : కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని కర్ణాటక మళ్లీ ధిక్కరించింది. తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయరాదని బెంగళూరులో జరిగిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. కావేరి జలాలను కర్ణాటకలో తాగు నీటి అవసరాలకు వాడాలని, తమిళనాడుకు విడుదల చేయరాదని అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. మరోవైపు కావేరి జలాలపై కేంద్రం రేపు రాష్ట్రాలతో సమావేశం జరపనుంది. భవిష్యత్ లో కావేరి జలాలను రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. నీటిని వదలకూడదని కర్ణాటక ఉభయసభలు తీర్మానం చేసినా.. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ.. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని అన్ని పార్టీల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఆదేశం