ఆధార్ కార్డ్

16:43 - December 6, 2018

ఢిల్లీ  : ఆధార్ కార్డుతో దేశంలో పలు మార్పులొచ్చాయి. ఏ గుర్తింపుకైనా ఆధార్ కార్డే ఆధారం. ఇప్పుడు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటు వేయాలంటే ఆధార్ వుండాల్సిందే. ఇక ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధారే ఆధారంగా వుంది. కాగా విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ వర్తించాలంటే ఈ ఆధార్ కార్డే ఆధారం. 
ఇటీవ‌ల ఆధార్‌ చట్టబద్దతపై సెప్టెంబరులో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువరించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. ఆధార్ చ‌ట్టంలోని 57వ సెక్ష‌న్‌ను రాజ్యాంగ ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. పౌరుల ఆధార్ డేటా వివరాలను ప్రైవేటు సంస్థ‌లు వినియోగించుకోరాద‌ని త‌న ఆదేశంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డుల‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని కూడా ధ‌ర్మాస‌నం వ్య‌తిరేకించింది. 
కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు..
దీంతో ఆధార్ చ‌ట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. చ‌ట్టంలో కొత్త ప్ర‌తిపాద‌న‌లు తుది ద‌శ‌కు చేరుకున్నాయి కూడా. దీంతో దేశ పౌరులు త‌మ ఆధార్ నెంబ‌ర్‌ను విత్‌డ్రా చేసుకునే అవ‌కాశం క‌ల్పించ‌నుంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు బ‌యోమెట్రిక్స్‌తోపాటు డేటాను కూడా వెన‌క్కి తీసుకునే వెసులుబాటును క‌ల్పించాల‌ని కేంద్రం భావిస్తోంది. 
18 ఏళ్లు పూర్తయిన వ్య‌క్తులు ఆధార్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం..
దీంతో ఆధార్ విత్‌డ్రా చేసుకునే విషయమై యూడీఏఐ కొత్త ప్ర‌తిపాద‌నలు చేసింది. 18 ఏళ్లు పూర్తయిన వ్య‌క్తులు ఎవ‌రైనా త‌మ ఆధార్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు ఆరు నెల‌ల స‌మ‌యాన్ని కేటాయించ‌నున్న‌ట్లు ఓ అధికారి వెల్ల‌డించారు. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలించిన న్యాయ‌శాఖ‌.. దీన్ని ప్ర‌తి పౌరుడికి వ‌ర్తించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. 
పాన్ కార్డు లేని వారికి కొత్త నిబంధ‌న ఉప‌యోగం..
అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పాన్ కార్డు లేని వారికి మాత్రం ఈ కొత్త నిబంధ‌న ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపనున్నారు. దేశవ్యాప్తంగా 2018 మార్చి 12 వరకు 37.50 కోట్లు పాన్ కార్డులు జారీచేయగా, వీటిలో వ్యక్తిగత కార్డలు 36.54 కోట్లు. ఇప్పటి వరకు 16.84 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆధార్ విషయంలో ఒక న్యాయనిర్ణేత అధికారిని నియమించాలని కేంద్రం భావించింది. జాతీయ భద్రత దృష్ట్యా పౌరుల వివరాలను బహిర్గతం చేసే ఆధార్ చట్టంలోని సెక్షన్ 33(2)ను సైతం సుప్రీంకోర్టు రద్దుచేసింది. 

14:02 - October 17, 2017

జార్ఖండ్‌ : ఓ పాప ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. సిమ్‌డెగాకు 
చెందిన ఓ పేద కుటుంబానికి రేషన్‌ షాపులో నిత్యావసర వస్తువులు నిరాకరించడంతో రెండు రోజులుగా పస్తులున్న 11 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఆధార్‌ కార్డును అనుసంధానం చేయలేదన్న కారణంతో నెల రోజుల క్రితం స్థానిక రేషన్‌ డీలర్‌ ఆ కుటుంబం రేషన్‌ కార్డును రద్దు చేశాడు. దీంతో ఆ కుటుంబానికి గోధుమలు తదితర నిత్యావసర వస్తువులు ఇవ్వడం మానేశాడు. 4-5 రోజులుగా తమ కుటుంబం పస్తులుగానే ఉందని చనిపోయిన పాప తల్లి కోయలాదేవి పేర్కొంది. పాప స్కూలుకు వెళ్తుందని, స్కూలుకు సెలవులుండడంతో మిడ్‌ డే మీల్‌ కూడా లభించలేదని తెలిపింది. స్థానిక నేతలెవ్వరూ తమ గోడును వినిపించుకులేదని కోయలా దేవి చెప్పింది. అడవిలో దొరికే ఆకులు అలములు తిని రోజులు వెళ్లదీస్తున్నామని తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని పౌరసరఫరాల శాఖా మంత్రి పేర్కొన్నారు.

 

15:40 - January 12, 2017

వనపర్తి : సంక్రాంతి పండగ పేరింటేనే.. నోట్లో బెల్లంముక్క వేసుకున్నట్టు తియ్యగా నవ్వుతారందరు. పండగపూట బెల్లంతోచేసిన పాయసం , అరిసెల్ని కమ్మగా లాగిస్తూ.. చుట్టపక్కాలతో సరదాకా గడిపేస్తుంటారు. కాని ..ఈసారి పండగపూట తేనెలరుచులు పంచే బెల్లం చేదెక్కింది. అధికారుల ఆంక్షలతో తీయ్యందనాల సంక్రాంతి కాస్తా.. చప్పగా మారుతోంది.

పండగ రోజుల్లో బెల్లంకష్టాలు ....

కొత్తజిల్లా వనపర్తిలో జనానికి బెల్లం కష్టాలు వచ్చిపడ్డాయి. అధికారుల ఆంక్షలతో పిండివటలు తీపిరుచులను కోల్పేయేపరిస్థితి వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఏరులైపారుతున్న గుడుంబాను అడ్డకుకేనేందుకు ఎక్సైజ్‌ శాఖ బెల్లం అమ్మకాలపై ఆంక్షలు పెట్టింది. ఈ ఆంక్షలు ఇపుడు ప్రజలందరికీ ఇబ్బందిగా మారాయి. పండగపేరుతో అమ్ముతున్న బెల్లం మళ్లీ సారాతయారీకి వెళ్లుతుందని ఎక్సైజ్‌ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే బెల్లం కొనుగోళ్లపై నజర్‌ పెట్టారు. ఒకటి రెండు కిలోలు కొనుక్కోవాలన్నా ఆధార్‌కార్డు తప్పని సరి చేశారు. అధికారుల ఆదేశాలతోనే ఆధార్‌ కార్డు నకలు కాపీ ఇస్తేనే బెల్లం అందిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

ఒక్కో ఆధార్‌ కార్డుపై 1కేజీ బెల్లం మాత్రమే....

ఒక్కో ఆధార్‌ కార్డుపై 1కేజీ మాత్రమే ఇస్తుండంతో బెల్లం షాపుల ముందు జనం బారులు తీరుతున్నారు. మరోవైపు ధరను కూడా ఆకాశానికెత్తేశారు వ్యాపారులు. కేజీ 60రూపాయలు చేసి అమ్ముతున్నారు. దీంతో పండగపూట బెల్లాన్ని చూస్తే బంగారం ధరలే గుర్తుకువస్తున్నాయని ఆదేవన చెందుతున్నారు ప్రజలు.

కేజీ బెల్లంతో పండగ ఎట్లా చేసుకోవాలి..?

పండక్కి కూతురు- అల్లుడు వచ్చారు.. రేషన్‌ ప్రకారం ఇస్తున్న ఒక కేజీ బెల్లాన్ని ఏం జేసుకోవాల అంటున్నారు వనపర్తి జిల్లా ప్రజలు. కిలో బెల్లంతో ఎన్నిరకాల పిండివంటలు చేసుకోవొచ్చో కూడా చెబితే బాగుంటుందని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ తీరుపై జనం మండిపడుతున్నారు. నాటుసారా తయారీదారులను కంట్రోల్‌ చేయలేక ఇలా పండక్కికూడా బెల్లం అందకుండా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. కావాల్సినంత బెల్లం అందించాలని..వనపర్తి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Don't Miss

Subscribe to RSS - ఆధార్ కార్డ్