ఆరోగ్యం

16:59 - May 26, 2017

ఆడవారు..మగవారికి జుట్టు ఉంటేనే అందం. కొంతమందికి జుట్టు రాలిపోతుండడంతో పలు సమస్యలను ఎదుర్కొంటుంటారు. మొదట్లో జట్టు అందంగా..ఒత్తుగా ఉండేందుకు...కుంకుడు కాయలను ఉపయోగించే వారు. ప్రస్తుతం షాంపూలు అందుబాటులోకి రావడంతో కుంకుడుకాయలను మరిచిపోతున్నారు. కానీ కుంకుడుకాయలు ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు దాగున్నాయి.
రెండు టీ స్పూన్స్‌ చొప్పున కుంకుడుకాయ, ఉసిరి పొడులు..మరో రెండు స్పూన్స్‌ తేనెతో కలిపి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయండి.
తొలుత నూనెను జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. అనంతరం గంట అనంతరం సహజంగా దొరికే కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయడం వల్ల జుట్టు ఊడే సమస్య తీరుతుంది.
కుంకుడుకాయ రసంలో కొద్దిగా వెనిగర్ కలపాలి. అందులో కొంచెం నీరు పోసి ఒక బాటిల్ లో భద్ర పరచుకోండి. ఈ మిశ్రమంతో కిటికీలు..తలుపులు..గాజు వస్తువులను శుభ్రపరచుకోవచ్చు.
తేలు కుట్టిన చోట కుంకడు గింజను అరగదీసి రాస్తే నొప్పి తగ్గుతుంది.

13:22 - May 22, 2017

జీలకర్ర..వంటల్లో వాడుతుంటారు..పోపు పెట్టే సమయంలో ఆవాలతో పాటు జీలకర్రను ఉపయోగిస్తుంటారు. రుచిని..వాసన అందించే ఈ జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర్రతో తయారు చేసిన నీటిని ఉదయాన్నే సేవించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. పరగడుపున తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. పాత్రలో గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి మరికొంత సేపు మరిగించాలి. అనంతరం ఈ నీటిని వడగట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఉదయాన్నే పరగడుపున తాగేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు నయం అవుతాయి. జీర్ణక్రియ ప్రక్రియ మెరుగవుతుంది. కడుపులో ఉన్న పరుగులు చనిపోతాయి. డయాబెటిక్ పేషెంట్లకు జీలకర్ర నీరు మంచి ఔషధం. రోజు తాగితే రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఆకలి సరిగ్గా లేని వారు ఈ నీటిని తాగే ఫలితం ఉంటుంది.

13:17 - May 22, 2017

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కంపల్సరీగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కొంతమంది టిఫిన్ అంటే ఉప్మా..పూరీ..దోస..ఇడ్లీ..ఇలాంటి తింటుంటారు. మరికొంతమంది టిపిన్ తినరు. కానీ చద్దన్నం తినే వారు తక్కువయ్యారు. ఒకప్పుడు చద్దన్నం ఎంతో ఇష్టంగా తినేవారు. రాత్రి మిగిలిన అన్నం దాచుకుని పొద్దున తినేదే 'చద్దన్నం'. పోషక విలువలు కూడా ఎక్కువగానే ఉంటాయి. రాత్రి వండిన అన్నాన్ని తెల్లారి ఆవకాయ..పెరుగు కలుపుకుని పచ్చిమిరప..ఉల్లిగడ్డ నంజుకుని ఒకప్పుడు తినేవారు. రోజంతా ఉత్తేజంగా..శక్తివంతంగా ఉండేవారని పెద్దలు చెబుతుంటారు. ఐరన్, పోటాషియం, క్యాల్షియం, విటమిన్లు దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఉంటాయి. పెరుగు..ఉల్లిపాయ..పచ్చిమిరప కాయలతో చద్దన్నం తింటే వేడితత్వం తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తి ఇస్తుంది. కడుపులో ఉండే అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి. హై పటర్ టెన్షన్ ను గణనీయంగా తగ్గిస్తుంది. చద్దన్నం తింటే మంచిదే కదా అని తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలా ఉంచేస్తే పాచిపోయి వాసన వస్తుంది. అలాంటి అన్నం తినడంవల్ల ఆరోగ్యానికి కొత్త సమస్యలు వస్తాయి, అందువల్ల చద్దన్నాన్ని ఉదయాన్నే తినేయాలి.

10:20 - May 22, 2017

అరటి పండు..పండ్లలో సంవత్సరం పాటు దొరికే పండు. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు లభిస్తాయి. టిఫిన్ లో ఏదో ఒక ఆహారంతో పాటు అరటిపండును తీసుకొంటే బెటర్ అని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే ఈ అరిటపండు ముక్కలను ఉదయం మార్నింగ్ డైట్ లో తీసుకుంటే చాలా మంచిది. తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అంతేగాకుండా మంచి యాంటీ ఆక్సిడెంట్. పోటాషియం..విటమిన్ బి ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి పండును ప్రతిరోజు డైట్ ను తీసుకుంటే బాగుంటుందని పేర్కొంటున్నారు. అరటి పండ్లను ఎప్పటికప్పుడు తాజాగా కట్ చేసుకుని తినాలి. లేదా కట్ చేసుకున్న వెంటనే ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే అరటి ముక్కలను బ్యాగ్ లో పెట్టి ఫ్రిజర్ లో పెడితే పోషకాలు కోల్పోకుండా ఉంటాయి.

09:23 - May 22, 2017

సౌందర్యాన్ని ఇనుమడింప చేసుకోవాలని పలువురు మహిళలు బ్యూటీషియన్లను ఆశ్రయిస్తుంటారు. పలు మాస్క్ లు వేసుకుని అందాన్ని ద్విగుణీకృతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. పండ్లు..కూరగాయాలతో మాస్క్ లు తయారు చేస్తుండడం తెలిసిందే. పచ్చి కొబ్బరితో కూడా మాస్క్ లు తయారు చేస్తుంటారు. ఈ మాస్క్ ను వేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా..తాజాగా కనిపిస్తుంది.
ఎండకాలంలో వేడిమి నుండి తప్పించుకోవడానికి కొబ్బరి మాస్క్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. పచ్చి కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముఖానికి పది నిమిషాలు పట్టించిన అనంతరం కడుక్కోవాలి.
ఒక కప్పు కొబ్బరి నీళ్లలో ఒక చెంచా కొబ్బరి పాలు, దోసకాయ జ్యూస్, రెండు లేదా మూడు చుక్కల కలబంద రసంతో ప్యాక్ తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి కాటన్ క్లాత్ తో ముఖానికి పెట్టుకోవాలి. పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి.
టమాట గుజ్జులో రెండు చెంచాల కొబ్బరి పాలు..సగం కప్పు కొబ్బరి నూనెను వేసి బాగా కలుపుకోవాలి. ముఖానికి..మెడకు పది నిమిషాలు పట్టించిన అనంతరం చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఫలితం కనబడుతుంది. ట్రై చేసి చూడండి.

08:45 - May 22, 2017

అధిక బరువుతో చాలా మంది బాధ పడుతుంటారు. బరువు తగ్గడం కోసం వ్యాయామాలు..హెల్త్ ఇనిస్టిట్యూట్స్ దగ్గరకు పరుగెడుతుంటారు. కానీ తినే ఆహారంలో మార్పులు చేసుకోరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే కాకుండా కొన్ని రకాల పండ్లు తింటే బరువు అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

క్యారెట్ : బీటా కెరోటిన్స్..ఫైబర్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోకి ఫ్రీ రాడికల్స్ ను విడుదల చేస్తాయి.
పాలకూర : ఇందులో న్యూట్రిన్లు సమృద్ధిగా లభిస్తాయనే సంగతి తెలిసిందే. విటమిన్స్..ఐరన్ లు పుష్కలంగా లభిస్తుండడంతో శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
ఆపిల్ : ఈ పండును రోజు తీసుకుంటే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సినవసరం ఉండదు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
స్టాబెర్రీ : ఎక్కువ శాతం న్యూట్రీన్లు ఉంటాయి. మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
క్యాప్సికం : విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీర బరువును అదుపులో ఉంచుతుంది. ఇది వ్యాధి నిరోధకతను పెంచడంతో పాటు శరీర బరువును అదుపులో ఉంచుతుంది.

15:06 - May 19, 2017

పలు రకాల కూరగాయల్లో వివిధ పోషకాలు లభ్యమౌతుంటాయన్న సంగతి తెలిసిందే. అందులో బీన్స్ కూడా ఒకటి. బీన్స్ తినడం ఎంతో మంచిదని..ఎముకలు ధృడంగా ఉండేందుకు దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. బీన్స్ లో విటమిన్ బీ 6, థయామిన్‌, విటమిన్‌ సి లభిస్తాయి. దీనితో బీన్స్ తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలకు బలం చేకూరుతుంది. రక్త ప్రసరణను మెరుగు పరుసాతయి..మధుమేహం దరిచేరదు..రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది..జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..వాయు సంబంధిత రోగాలను దూరం చేస్తుంది..ఇలా ఎన్నో లాభాలున్నాయి. బీన్స్‌లో పీచు, విటమిన్‌ ఎ, బి, కె, ఫోలేట్‌, మెగ్నీషియం వంటివి ఉంటాయి. మధుమేహ సమస్య ఉన్నవారు రోజుకు ఒక కప్పు బీన్స్‌ తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చు.

12:25 - May 17, 2017

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పలు రకాల ఆకు కూరల్లో వివిధ పోషకాలు లభ్యమౌతుంటాయి. అలాంటి ఆకు కూరల్లో పొన్నంగంటి కూడా ఒకటి. ఇందులో విటమిన్ ఏ, బి 6, సి, ఫొలేట్, రైబో ఫ్లెవిన్, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఆహారంలో దీనిని భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కంటి చూపుకు ఎంతో దోహదం చేస్తుంటుంది. గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే. పొన్నగంటి ఆకులను ఓ
గ్లాస్‌ నీటిలో ఉడికించి, మిరియాల పొడిని కలుపుకొని తాగితే ఆ సమస్య నుండి దూరం కావచ్చు.
శరీరానికి మేలు చేయడంతో పాటు పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు.
పొన్నగంటి కూరలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ..ఆస్టియో పోరోసిస్ ను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకులో లభించే నూనె పదార్థాలు రక్తపోటును తగ్గించి, గుండె సమస్యలను అదుపులో ఉంచుతాయి.
బరువు పెరగాలనుకునే వారు కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.

11:33 - May 17, 2017

మంచినీరు..ఆరోగ్యానికి మంచిది. చాలా మంది నీరు ఎక్కువ సేవించకపోవడం వల్ల పలు అనారోగ్యాలకు గురవుతుంటారు. ముఖ్యంగా వేసవికాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. చెమట రూపంలో నీరు బయటకు వెళ్లే సరికి డీ హైడ్రేషన్ తో బాధ పడుతుంటారు. కొంతమంది నీళ్ల తాగే విషయంలో జాగ్రత్తలు పాటించరు. మరి నీళ్లు ఎప్పుడెప్పుడు తాగాలి..
పగటి వేళ రెండున్నర లీటర్ల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
నీరు సేవించే సమయంలో ఒక పద్ధతి ప్రకారం తాగాల్సి ఉంటుంది.
ఉదయం నీరు తాగిన అనంతరం 25..30 నిమిషాల గ్యాప్ ఇచ్చి ఏదనా టిఫిన్ తినాల్సి ఉంటుంది.
ఇక టిఫిన్ తినే సమయంలో నీరు తీసుకపోవడమే మంచిది. తిన్న రెండు గంటల తరువాత నీటిని ఒకేసారి తాగకుండా మెల్లి మెల్లిగా తాగాలి.
ఇక మధ్యాహ్న భోజనం చేసే అరగంట ముందు వరకు నీరు తాగవద్దు. ఇక భోజన సమయంలో మంచినీరు తాగవద్దు.
మాత్రలు మింగడానికి గానీ, గొంతు బాగా పట్టినపుడు గానీ ఒక గుక్కెడు నీరు తాగితే బెటర్.

12:54 - May 16, 2017

ఉరుకుల పరుగుల జీవితంలో ఇక వ్యాయామానికి టైం ఎక్కడిది అని చాలా మంది అంటుంటారు. కానీ కొద్ది సమయంలోనైనా వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం కొద్దిగానైనా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా టైం కేటాయించకుండానే

సులభమైన వ్యాయామాలు చేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. మరి ఆ సులభమైన వ్యాయామాలు ఏంటీ ? ఎలా చేయాలి .
ముఖ్యమైన పని నడవాలి. ఇందుకు ప్రత్యేకంగా టైం కేటాయించాల్సినవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. మీ ఆఫీసు దగ్గరలోనే ఉంటే నడుచుకుంటూ వెళ్లండి. లిఫ్ట్ ఎక్కువ శాతం ఉపయోగించకండి. మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్లండి. ఇలా చేయడం వల్ల క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది. కొవ్వు కూడా కరిగిపోయే అవకాశం ఉంది.
కేవలం వంట స్త్రీలే చేయాలా ? మగవారు చేయవద్దా ? ట్రై చేయండి. వంట చేయడం వల్ల 105 క్యాలరీల ఖర్చు అవుతుంది. కూరగాయాలు తీసుకోవడం..కట్ చేయడం..వంటివి చిన్న చిన్న పనులు చేయండి. ఒక రకంగా ఇది ఒక వ్యాయామం లాంటిదే.
మీరు ఉండే గదిని పని వారు..ఇతరులు క్లీన్ చేయడం కంటే మీరే చేసుకోండి. గదిలో ఉండే పుస్తకాలు..బట్టలు..అలంకరణ వస్తువులు శుభ్రంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల 100 క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది.
పని చేసే సమయంలో ప్రతి 15 నిమిషాలకు ఓ సారి కూర్చొన్న చోటనే 108 డీగ్రిల కోణంలో అటూఇటూ కదిలితే సరిపోతుంది. దీని వల్ల శరీరంలో క్యాలరీలు ఖర్చవటంతో పాటు మానసికంగా ఒత్తిడికి దూరం అవుతారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ఆరోగ్యం