ఆరోగ్య శాఖ

07:35 - April 30, 2018

తెలంగాణలో త్వరలో వైద్య, ఆరోగ్యశాఖలో సమ్మె సైరన్‌ మోగనుంది. తమ సమస్యలు పరిష్కరించాలని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి.. జేఏసీగా ఏర్పడి ఉద్యమానికి సిద్ధమయ్యాయి. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ పర్మినెంట్‌ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని.. తమ వేతనాలు పెంచాలని.. ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మే 1 నుంచి దశల వారీగా ఆందోళన చేయనున్నట్టు.. తమ సమస్యలపట్ల ప్రభుత్వ వైఖరిని బట్టి సమ్మెకు కూడా సిద్ధంగా ఉన్నట్టు వారు చెబుతున్నారు. వారి ఆందోళనకు గల కారణమేమిటి? ఎందుకు రెందుకు ఆందోళనబాట పట్టారు? వారి ప్రధాన డిమాండ్స్‌ ఏమిటి? వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న అన్ని విభాగాలు ఏకతాటిపైకి రావలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ సమ్మెలో ఎన్ని విభాగాలు ఆందోళనలో పాల్గొంటున్నాయి? వంటి పలు అంశాలపై ఈరోజు జనపథంలో..వివరాలను తెలిపేందుకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ జేఏసీ కో-చైర్మన్‌ అశోక్‌ ఏమంటున్నారో తెలుసుకుందాం..

12:39 - August 12, 2017

హైదరాబాద్: యూపీలో చిన్నారుల మృత్యుఘోష ఆగడంలేదు. ఘోరక్‌పూర్‌లోని బాబా రాందాస్‌ ఆస్పత్రిలో ఆరు రోజుల్లో 63 మంది చిన్నారులు మృతిచెందారు. చిన్నారుల మృతిపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సీరియస్‌ అయ్యారు. అధికారులతో అత్యవసరభేటీ నిర్వహించారు. మిరికొద్ద సేపట్లో ఆర్యోగ్యశాఖా మంత్రితో కలిసి సీఎం ఆదిత్యనాథ్‌ ఆస్పత్రిని సందర్శిస్తారు. అటు కాంగ్రెస్‌ నేతలు కూడా ఆస్పత్రిని సందర్శించారు. చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మందులు సమయానికి అందక పోవడంతోనే పిల్లలు చనిపోతున్నట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసే కంపెనీకి బాకీలు చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్లే స‌దురు కంపెనీ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను నిలిపివేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. బాబా రాఘ‌వ దాస్ మెడిక‌ల్ కాలేజీకి పుష్పా కంపెనీ ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తోంది. అయితే బాకీలు చెల్లించ‌కుంటే స‌ర‌ఫ‌రాను నిలిపివేస్తామ‌ని గ‌తంలో ఆ కంపెనీ హాస్ప‌ట‌ల్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆగ‌స్టు ఒక‌ట‌వ తేదీన ఆ కంపెనీ ఈ అంశంపై లేఖ కూడా రాసింది. పాత బిల్లులు చెల్లించ‌ని కార‌ణంగానే హాస్ప‌ట‌ల్‌కు ఆక్సిజ‌న్ అంద‌లేదా అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. బిల్లుల గురించి తెలిసిన ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఢిల్లీకి వెళ్లిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ ఘ‌ట‌న ప‌ట్ల స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదిత్య‌నాథ్ ఆరోగ్య శాఖ అధికారుల‌కు ఆదేశించారు. 

17:07 - September 14, 2015

హైదరాబాద్ : తెలంగాణలో స్వైన్‌ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. నేడు ఇద్దరు మహిళలు స్వైన్‌ఫ్లూతో చనిపోయారు. మహబూబ్‌నగర్‌కు చెందిన 55 ఏళ్ల స్వరూప గాంధీ ఆస్పత్రిలో చనిపోగా.. మరొకరు ఎల్బీనగర్‌ యశోదాలో చికిత్స పొందుతూ మరణించారు. మారుతున్న వాతావరణ పరిస్ధితుల్లో స్వైన్‌ఫ్లూ మళ్లీ చెలరేగుతోంది. 

Don't Miss

Subscribe to RSS - ఆరోగ్య శాఖ