ఆర్డీవో

17:45 - July 11, 2018

సంగారెడ్డి : జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దళితులు పాదయాత్ర చేపట్టారు. నాలుగు దశాబ్ధాల క్రితం దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం.. వేరే నిర్మాణాలకు కేటాయించడంతో దళితులు ఆందోళన చేపట్టారు. మొగుడంపల్లి మండల కేంద్రం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటామని దళితులంటున్నారు. వారి ఆందోళనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:21 - February 27, 2017

కృష్ణా : జిల్లాలోని గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టిడించేందుకు దళితులు, పేదలు యత్నించడం..పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇలపర్రు లో పేదల భూములను ఆన్యాక్రాంతం చేశారని, భూములను అప్పగించాలని దళితులు, పేదలు కోరారు. కానీ ఆన్యాక్రాంతమైన భూముల విషయంలో అధికారులు..ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై దళితులు...పేదలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ నేతలు మద్దతు పలికారు. ఆరో తేదీ నుండి పోరాటం చేస్తున్నా ప్రభుత్వాధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో గుడివాడ ఆర్డీవో కార్యాలయాన్ని సోమవారం ముట్టడించేందుకు నిర్ణయించారు. ముట్టడిలో భాగంగా వస్తున్న నేతలను మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. తమ భూములను తమకు అప్పగించాలని ఆందోళన చేయడం జరుగుతోందని దళితులు పేర్కొన్నారు. కానీ పోలీసులు ఏమాత్రం వినిపించుకోలేదు. ముందుకు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మహిళలని చూడకుండా లాగిపడేశారు. పోలీసుల తీరుపై దళితులు నిరసన వ్యక్తం చేశారు.

12:34 - February 27, 2017

కృష్ణా : ఆన్యాక్రాంతమై పోయిన భూములను తమకు అప్పచెప్పాలని దళితులు నినదిస్తున్నారు. జిల్లాలో నందిగామ మండలంలో ఉన్న వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి. దీనిపై అధికారులు సర్వే చేశారు. దళితులు..భూములు ఆన్యాక్రాంతమయ్యాయని వారు గుర్తించారు. కానీ భూములను మాత్రం దళితులకు అప్పగించలేదు. దీనితో దళితులు ఆందోళన బాటపట్టారు. వీరి ఆందోళనకు సీపీఎం, వ్యవసాయ రైతు కార్మిక సంఘం, కేవీపీఎస్ మద్దతు పలికాయి. సోమవారం గుడివాడ ఆర్డీవో కార్యాలయం ముట్టడించాలని యోచించారు. అనంతరం పేదలు..దళితులు కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. అక్కడనే ఉన్న పోలీసులు వీరిని అడ్డుకొనే యత్నం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. చివరకు పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. దీనితో పలువురు మహిళలు సొమ్మసిల్లిపడిపోయారు. దళితుల భూములు దళితులకే అప్పగించాలని..ప్రతి గ్రామానికి రక్షిత మంచినీరు ఉచితంగా అందచేయాలని..పంట పొలాలను చేపల చెరువులుగా మార్చడంపై విచారణ చేయాలని..సీల్డ్ కో ఆపరేటివ్ సొసైటీ భూములు లబ్దిదారులకు అప్పగించి కొల్లేరు భూములపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

13:40 - September 3, 2016

నల్లగొండ : భువనగిరి ఆర్డీవో కార్యాలయానికి గ్యాంగ్‌స్టర్‌ నయీం బాధితులు క్యూ కడుతున్నారు. భువనగిరి మండలం బొమ్మాయిపల్లి శివారులోని సర్వే నెంబర్‌ 722 నుండి 733 వరకు ఉన్న 170 ఎకరాల భూమిని నయీం కబ్జా చేశాడని బాధితులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి ఆర్డీవో గోపాల్‌రెడ్డి..నయీం ఆక్రమించిన ఎస్ఎల్ఎన్ఎస్ భూములపై విచారణ మొదలుపెట్టారు. 

Don't Miss

Subscribe to RSS - ఆర్డీవో