ఆవిష్కరణ

06:41 - March 27, 2017

హైదరాబాద్: బ్రహ్మశ్రీ బావగర్ల శ్రీనివాసశర్మ రచించిన శ్రీహేవిళంబి నామ సంవత్సర గంటల పంచాగం ఆవిష్కరణ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పంచాగాన్ని మెట్రో ఇండియా దినపత్రిక చైర్మన్‌ సి. లక్ష్మిరాజ్యం, చల్లభవస రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మీరాజ్యం... పంచాంగం అంటే కరదీపిక లాంటిదని చెప్పారు. జీవితం అనే ప్రయాణంలో కరదీపికను ఉపయోగించుకుని ముందుకు సాగాలని సూచించారు. తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

19:50 - February 19, 2017

హైదరాబాద్ : పసుపురంగు నుదుటి మీద పొద్దుటి సూర్యుడిని దిద్ది తెలంగాణ ఆడపడుచును దేదీప్యమానంగా ఆవిష్కరించిన అరుదైన చిత్రకారుడు తోట వైకుంఠం. కరీంనగర్ జిల్లా బూరుగుపల్లిలో పుట్టిన ఈ కళాకారుడు తెలంగాణ బతుకుపోరు మూలాలను తన రంగులతో ఆవిష్కరించారు. చిత్రకారుడిగా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న తోట వైకుంఠం చిత్రకళాయాత్ర "భావనాతరంగం- ఎ రెట్రాస్పెక్టివ్" పేరుతో హైదరాబాద్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో కొలువుదీరింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ శనివారం నాడు ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
ఊరి బతుకుల వైచిత్రిని బొగ్గు గీతలతో ఆవిష్కరణ
ఉగ్గుపాలతో ఒంటపట్టించుకున్న ఊరి బతుకుల వైచిత్రిని బొగ్గు గీతలతో ఆవిష్కరించిన కళాకారుడు. అమ్మ ముఖంలో అద్భుతమైన తెలంగాణ అస్తిత్వాన్ని దర్శించిన భావుకుడు . నలుపు తెలుపుల గీతల్లో తెలంగాణ మూలాలను తవ్వి తీసిన చరిత్రకారుడు. మూల వర్ణాలతో నదురూ బెదురూ లేకుండా వెలుగులు విరజిమ్మే బొమ్మలను ప్రస్ఫుటంగా ప్రతిష్ఠిస్తున్న 
అద్భుత ఘట్టాలు
అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న తోట వైకుంఠం చిత్ర కళాయాత్రలోని అద్భుతమైన ఘట్టాలను పటం కట్ట ఆవిష్కరించింది హైదరాబాద్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ పైన్ ఆర్ట్స్. శనివారం నాడు రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ చేతుల మీదుగా ప్రారంభమైన భావనాతరంగం-ఎ రెట్రాస్పెక్టివ్ ప్రదర్శన చిత్రకళాభిమానులకు చిరస్మరణీయ అనుభవాన్ని ప్రసాదించింది. దశాబ్దాల నాటి బొమ్మలతో పాటు తాజాగా విశాలమైన కేన్వాసుల మీద అక్రిలిక్ మెరుపులతో పలకరించే బతుక చిత్రాల నడుమ.. తోట వైకుంఠంతో.. అసిస్టెంట్ ఎడిటర్ పసునూరు శ్రీధర్ బాబు సంభాషించారు.
200 పెయింటింగ్స్ తో ప్రదర్శన
ఈ ప్రదర్శన హైదరాబాద్ కు రావడానికి ముందు ముంబయ్ లోని ప్రఖ్యాత జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో వారం రోజుల పాటు ఘనంగా సాగింది. దాదాపు 200 పెయింటింగ్స్ తో ఆ ప్రదర్శనను నిర్వహించిన ఇండియా ఫైన్ ఆర్ట్ యజమాని మన్విందర్ దావర్ వాటికి మరికొన్ని పెయింటింగ్స్ కలిపి.. మరింత ఘనంగా హైదరాబాద్ లో ఈ షో.. ఏర్పాటు చేశారు. ఊరి బతుకులోని సొగసులు, సౌందర్యాలు, మూలాలు, లోతులను చూడడానికి... పచ్చని నుదుటి మీద ఎర్రని పొద్దుపొడుపుతో వెచ్చగా నిమిరే తెలంగాణ తల్లుల పలకరింపులను వినడానికి ఈ ప్రదర్శనకు వెళ్ళాల్సిందే. తోట వైకుంఠం సృష్టించిన ఈ రంగుల లోకం తలుపులు ఫిబ్రవరి 27 దాకా తెరిచే ఉంటాయి.

 

18:25 - February 5, 2017

ఖమ్మం : సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తెలంగాణలో చేపట్టిన సీపీఎం మహాజన పాదయాత్ర 112 రోజులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పర్యటిస్తున్న యాత్ర ఈ రోజు 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. మూడు వేల కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా తల్లాడలో సీపీఎం ఫైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు 10టివితో మాట్లాడారు. వారి మాటలను వీడియోలో చూద్దాం...

11:28 - January 26, 2017

ఢిల్లీ : హస్తినలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ పథ్ లో జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా అబుదాబి యువరాజు మహ్మద్ జహేద్ హాజరయ్యారు. తేజస్ యుద్ధ విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ ఆయుధ సత్తా ప్రదర్శిస్తున్నాయి. తొలిసారిగా కవాతులో యూఏఈ జావాన్లు పాల్గొన్నారు. అమర జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. 
వివిధ రాష్ట్రాల శకటాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

11:11 - January 26, 2017

విజయవాడ : అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కృషి చేద్దామని గవర్నర్ నరసింహన్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో సమస్యలున్నా..డబుల్ డిజిటల్ గ్రోత్ సాధించామని తెలిపారు. మున్సిపల్ స్టేడియంలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. జాతీయ పతాకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించామని తెలిపారు. 12.23 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పారు. డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. పట్టిసీమను రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. పట్టిసీమతో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. సంక్షేమ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. 2018 జూన్ లోగా వంశధార ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. సాంకేతికతతో రాష్ట్ర ముందుకెళ్తోందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:34 - January 26, 2017

విజయవాడ : మున్సిపల్ స్టేడియంలో 68 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. జాతీయ పతకాన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ శకటాలను ప్రదర్శించారు. 

 

 

13:25 - January 24, 2017

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో 10 టీవీ 2017 క్యాలెండర్‌ను ప్రముఖ సామాజిక వేత్త పాకల దుర్గప్రసాద్ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ భద్రాచలం శ్రీ సీతారాముల సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకుల మంత్రోఛ్చారణల మధ్య జరిగింది. క్యాలెండర్ చిన్నారుల స్వచ్ఛమైన నవ్వులతో అందంగా ఉందని దుర్గప్రసాద్ అన్నారు.  

 

19:30 - January 21, 2017

సంగారెడ్డి : కలెక్టర్‌ కార్యాలయంలో 10టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. సంగారెడ్డి జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీపీఆర్‌వో వై.యామిని ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 10టీవీ ప్రజాగొంతుకగా పనిచేస్తోందని.. ప్రజా సమస్యలను వెలికితీయడంలో ముందుందని వారు ప్రశంసించారు. భవిష్యత్‌లోనూ ప్రజాసమస్యలే అజెండాగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ఆకాంక్షించారు.

 

19:16 - January 20, 2017

కృష్ణా : 10టీవీ 2017క్యాలెండర్‌ ఆవిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. ఆంధ్రరత్న భవన్‌లో ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.  ప్రజలకు వాస్తవాలను అందించడంలో 10టీవీ ఎప్పుడూ ముందుంటుందని పద్మశ్రీ అన్నారు. ప్రజాపోరాటాకు 10టీవీ అండగా నిలుస్తోందన్నారు.  10టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజా హక్కుల కోసం నిలబడుతోన్న 10టీవీ అందరూ ఆదరించాలని ఆమె కోరారు.

 

20:05 - January 19, 2017

తూర్పుగోదావరి : రాజమండ్రిలో 10టివి క్యాలెండర్‌ను మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు ఆవిష్కరించారు. ప్రజల పక్షాన పనిచేస్తున్న10టివికి ఒక ప్రత్యేక స్థానం ఉందని ఆయన అన్నారు. ప్రజలకు మరింత చేరువలో ఉంటూ మరిన్ని మంచి వార్తలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఆవిష్కరణ