ఆస్ట్రేలియా

18:20 - August 1, 2018

ఆస్ట్రేలియాలో ఉన్నత విధ్య అభ్యసించడానికి సులభమైన మార్గాలేమిటి??? ఆస్ట్రేలియాలో ఏ కోర్స్‌ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియా యూనివర్శిటీల్లో సులువైన వీసా ప్రోసెస్‌, స్కాలర్‌ షిప్‌ ఎలా పొందాలో, ఆస్ట్రేలియా అడ్మిషన్‌ డే వివరాలను ఏఈసీసీ గ్లోబల్‌ హెడ్‌ ఇంతియాజ్‌ మనతో ఉన్నారు.... అడిగి తెలుసుకుందాం..ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

18:47 - April 15, 2018

ఆస్ట్రేలియా : సిడ్నీ నగరం శివార్లలోని అడవుల్లో మంటలు అంటుకున్నాయి. ఇప్పటివరకు వేయి హెక్టార్లు అగ్నికి ఆహుతైంది. ఎండవేడికి తోడు... ఉధృతంగా వీస్తున్న గాలులతో మంటలు భారీగా వ్యాపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న హోల్స్‌వర్తీ మిలిటరీ స్థావరం కూడా మంటల్లో చిక్కుకుంది. సుమారు 500మంది ఫైర్ ఫైటర్లు.. మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. అధికారులు ఇప్పటికే సిడ్నీ శివార్లలో ఎమర్జెన్సీ ప్రకటించారు. స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఆస్తినష్టం జరిగనా.. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు. 

 

20:47 - April 14, 2018

ఆస్ట్రేలియా : గోల్డ్‌కోస్ట్‌ వేదికగా జరుగుతున్న 21వ కామన్వెల్త్‌ పోటీల్లో ఇవాళ భారత్‌కు ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది. శనివారం ఒక్కరోజే ఇప్పటివరకు భారత క్రీడాకారులు ఆరు బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. భారత మహిళా బాక్సింగ్ సంచలనం మేరీకోమ్‌, బాక్సర్ గౌరవ్ సోలంకి స్వర్ణ పతకాలతో శుభోదయం పలకగా... తర్వాతి వంతు సంజయ్ రాజ్‌పుత్‌కి వచ్చింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో రాజ్‌పుత్ బంగారు పతకం సాధించాడు. అదే పంథాలో పయనించిన భారత జావెలిన్ సంచలనం నీరజ్ చోప్రా సైతం చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ జావెలిన్ త్రో పోటీల్లో భారత్‌కు స్వర్ణపతకం అందించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వీరితో పాటు రెజ్లర్లు సైతం అద్భుత ప్రదర్శన కనబర్చారు. మహిళల విభాగంలో వినేశ్ ఫోగాట్ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా... పురుషుల విభాగంలో సుమిత్ మాలిక్ బంగారు పతకం దక్కించుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 23 బంగారు పతకాలు వచ్చి చేరాయి. ఇక బాక్సర్లు మనీష్ కౌశిక్, అమిత్ ఫాంగల్ రజత పతకాలతో మెరిశారు. దీంతో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య ఇప్పటివరకు 52కు చేరాయి. 

07:57 - March 30, 2018

హైదరాబాద్ : బాల్ టాంపరింగ్‌ చేయడం తన జీవితంలో పెద్ద తప్పు అని అన్నాడు కంగారూ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌.ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డ్‌ నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో స్మిత్ తప్పు ఒప్పుకుని కన్నీటి పర్యంతమయ్యాడు.

బాల్‌ టాంపరింగ్‌కు పూర్తి బాధ్యత వహిస్తున్నానని ఒప్పుకున్న స్మిత్‌...
బాల్‌ టాంపరింగ్‌కు పూర్తి బాధ్యత వహిస్తున్నానని ఒప్పుకున్న స్మిత్‌....భవిష్యత్‌లో ఇటువంటి పొరపాటు చేయనంటూ అపరాద భావంతో ఉద్వేగానికి లోనయ్యాడు.ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్‌,ఫ్యాన్స్‌ తన క్షమించాలని చెబుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశాడు.

స్వదేశానికి పయనమైన స్టీవ్‌ స్మిత్‌కు సెక్యూరిటీగా ప్రవర్తన..
కంగారూ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ను దక్షిణాఫ్రికా పోలీసులు చేయకూడని అపరాదం చేసిన దోషిగా చూడటం, అసభ్యంగా ప్రవర్తించడం వివాదస్పదంగా మారింది. స్వదేశానికి పయనమైన స్టీవ్‌ స్మిత్‌కు సెక్యూరిటీగా వ్యవహరించిన దక్షిణాఫ్రికా పోలీసులు దురుసుగా ప్రయత్నించడంపై క్రికెట్‌ స్టార్స్‌, క్రికెట్‌ ఫ్యాన్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

08:38 - March 29, 2018

హైదరాబాద్ : బాల్ టాంపరింగ్‌ గేట్‌ వివాదాన్ని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ లైట్‌ తీసుకున్నా....ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డ్‌ మాత్రం సీరియస్‌గా తీసుకుంది.కేప్‌టౌన్‌ టెస్ట్‌లో బాల్‌ టాంపరింగ్‌కు కారకులైన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌,వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌..బాల్ టాంపరింగ్‌ చేసిన బాంక్రాఫ్ట్‌పై కంగారూ క్రికెట్ బోర్డ్‌ కఠిన చర్యలు తీసుకుంది. స్టీవ్‌ స్మిత్‌,డేవిడ్‌ వార్నర్‌ యేడాది పాటు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ఆడకుండా సస్పెండ్ చేసిన ....బాంక్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది.

9 నెలల నిషేధం..
నిబంధనలు అతిక్రమించారు,క్రికెట్‌ క్రీడా స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించారు,కెమెరాకు చిక్కడంతో తప్పు ఒప్పుకున్నారు, కేప్‌టౌన్‌ టెస్ట్‌లో బాల్‌ టాంపరింగ్‌లో భాగమైన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌,వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌,బాంక్రాఫ్ట్‌పై ...కంగారూ క్రికెట్ బోర్డ్‌ కఠిన చర్యలు తీసుకుంది. 4వ టెస్ట్‌కు ముందే స్టీవ్‌ స్మిత్‌,డేవిడ్‌ వార్నర్‌, బాంక్రాఫ్ట్‌లను స్వదేశానికి పిలిపించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డ్‌....విచారణ తర్వాత సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా స్టీవ్‌ స్మిత్‌,డేవిడ్‌ వార్నర్‌లపై యేడాది పాటు నిషేదం విధించిన కంగారూ క్రికెట్‌ బోర్డ్‌....బాల్‌ టాంపరింగ్‌ చేసిన బాంక్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది.

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సస్పెన్షన్..
కోచ్‌ డారెన్‌ లీమన్‌కు క్లీన్‌ చిట్ ఇచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా....బాల్‌ టాంపరింగ్‌లో భాగమైన ముగ్గురు క్రికెటర్లను అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సస్పెండ్‌ చేసింది.3 ఫార్మాట్లలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ,వైస్‌ కెప్టెన్‌గా ఉన్న స్మిత్‌,వార్నర్‌లపై ఏ మాత్రం కనికరం చూపలేదు. స్మిత్‌,వార్నర్‌ల ఆదేశాల మేరకే బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడటంతో బాంక్రాఫ్ట్‌ను 9 నెలలు మాత్రమే నిషేధించింది.

ఆసిస్ క్రికెట్ బోర్ట్ సంచలనాత్మక నిర్ణయం

ఐసీసీ స్మిత్‌పై ఒక టెస్ట్‌, బాంక్రాఫ్ట్‌కు మాత్రమే ఇవ్వగా...క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డ్‌ నియమ,నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో పాటు, మరోసారి ఇటువంటి తప్పు చేయకుండా సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. స్మిత్ ,వార్నర్‌,బాంక్రాఫ్ట్‌లను దేశవాళీ క్రికెట్‌లో గ్రేడ్‌ లెవల్‌ టోర్నీలకు అనుమతినిచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా...ఐపీఎల్‌ 11వ సీజన్‌లో ఆడేందుకు అనుమతినిచ్చింది. నిషేధం ఎత్తివేయాలని ఈ ముగ్గురు క్రికెటర్లు ఐసీసీకి చాలెంజ్‌ చేసుకునే అవకాశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కల్పించింది.

జెంటిల్మెన్‌ గేమ్‌గా పిలుచుకునే క్రికెట్‌లో వివాదం..
కంగారూ క్రికెట్ బోర్డ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడేందుకు అనుమతిచ్చినా....ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా మాత్రం స్మిత్‌, వార్నర్‌లు 11వ సీజన్‌ ఆడేందుకు అనర్హులని ప్రకటించాడు. నిషేధం కారణంగా స్టీవ్‌ స్మిత్‌ వంటి టాప్ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌, కెప్టెన్‌ లేకుండానే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఐపీఎల్ 11వ సీజన్‌లో బరిలోకి దిగబోతుండగా.... కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణించి ఐపీఎల్‌ 9వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన డేవిడ్‌ వార్నర్‌ సైతం ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌కు దూరయ్యాడు. జెంటిల్మెన్‌ గేమ్‌గా పిలుచుకునే క్రికెట్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా ఇకపై ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకున్న ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డ్‌ నిర్ణయాన్ని మెచ్చుకోవాల్సిందే.   

15:19 - March 25, 2018

సౌత్ ఆఫ్రికా : ఆసిస్ క్రికెట్ లో బాల్ ట్యాంపరింగ్ వివాదం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ వివాదం కారణంగా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బాధ్యతల నుండి తప్పుకున్నారు. మూడవ టెస్ట్ చివరి రెండు రోజులకు పైన్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. వివాదానికి సంబంధించి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్ట్రులియా స్పోర్ట్స్ కమిషన్ పేర్కొంది. కాగా దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌ కొనసాగుతుండగా మిగిన ఉన్న రెండు రోజులకు ఆసీస్‌ జట్టు మరో ఆటగాడు టిమ్‌ పైన్‌ సారథ్య బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో స్మిత్‌, వార్నర్‌ యథావిధిగా జట్టులోనే కొనసాగుతారు. 

17:32 - February 15, 2018
19:06 - December 25, 2017

నల్లగొండ : ఆస్ట్రేలియా సిడ్నీలోని ఆపార్ట్ మెంట్ లో మిర్యాలగూడ వాసి ఆదినారాయణ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 6 నెలల క్రితమే ఆదినారాయణ రెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్లారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:50 - December 25, 2017

యాదాద్రి : క్రిస్మస్‌ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా... చౌటుప్పల్లో తెలంగాణ రాష్ట్ర బాలికల గురుకుల పాఠశాలలో మిస్ వరల్డ్ ఎస్మా వోలోడెర్ సందడి చేశారు. కేక్‌ కట్‌ చేసి.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గురుకుల విద్యార్థులతో కలిసి.. నృత్యం చేసి.. అందరినీ అలరించారు. భారతీయుల సంస్కృతి సంప్రదాయాలు తనకు నచ్చాయని ఆమె అన్నారు. బాలికలు ఆత్మా విశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.

21:54 - October 12, 2017

హైదరాబాద్ : ఉప్పల్‌లో జరిగే భారత్‌, ఆస్ట్రేలియా టీ ట్వంటీ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. 18 వందల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామన్నారు. 56 అధునాతన సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని విజిలెన్స్, అక్టోపస్‌, షీ టీమ్స్‌, మఫ్టీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. స్టేడియంలో ప్రేక్షకులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హెచ్‌సీఎ కార్యదర్శి శంకర్‌ నారాయణ తెలిపారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఆస్ట్రేలియా