ఇసుక మాఫియా

09:25 - August 1, 2018

కర్నూలు : ఏపీ రాష్ట్రంలో ఇసుక మాఫియా లేదని..కేవలం తప్పుడు ఆరోపణలు చేయవద్దని ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ ఉచిత ఇసుక పాలసీ పక్కదారి పడుతోంది. మాఫియా తమకు అనుకూలంగా మార్చుకొంటోంది. నిత్యం ట్రక్కులు..లారీల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన పోలీసులు, ఇతర అధికారులు మాఫియాతో కుమ్మక్కయ్యారు.

పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఉచిత ఇసుక పాలసీని మాఫియా అనుకూలంగా మార్చుకుంది. అక్రమంగా ఇసుకను మాఫియా తోడేస్తోంది. కర్నూలు నుండి హైదరాబాద్, బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియాతో పోలీసు, రెవెన్యూ గనులు, భూగర్బ శాఖ ములాఖత్ కావడంతో వీరి వ్యాపారం మూడు ట్రాక్టర్లు...ఆరు లారీల చందంగా నడుస్తోంది. 

22:10 - July 19, 2018

హైదరాబాద్ : ఇసుక మాఫియా వెనుక మంత్రి కేటీఆర్‌ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు నేరెళ్ళ బాధితులు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు బాధితులు.  తమకు న్యాయం చేయాలంటూ బాధితులు  వేడుకున్నారు. కేసీఆర్‌ ఆయన కుటుంబం ఇసుక మాఫియా ద్వారా వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. జులై చివరి రోజు వరకు నేరెళ్ల బాధితులకు న్యాయం చేయకపోతే దళిత గిరిజన ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతామన్నారు ఉత్తమ్‌. 
 

 

10:52 - June 3, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. నిన్నటి వరకు గోదావరి నుంచి ఇసుకను అక్రమంగా తరలించిన టీడీపీ నేతలు... తాజాగా కాలువలపై దృష్టి సారించారు. పోలవరం కుడి కాలువ నుంచి భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిపూట భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికారుల అండతో ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది. 

 

19:31 - April 25, 2018

పెద్దపల్లి : టీఆర్ఎస్‌ ప్రభుత్వం ఇసుక మాఫియాకు అండగా ఉంటోందని మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. సర్కార్ అండతో... తెలంగాణలో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్నారు. అతివేగంతో నడిచే ఇసుక లారీలు ఢీకొన్న ఘటనలో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా.. ప్రభుత్వానికి పట్టనట్లు ఉందని ఆయన ఆరోపించారు. ఇసుకమాఫియాను అడ్డుకునేందుకు ప్రజలతో కలిసి.. పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. 

 

09:41 - March 31, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికార పార్టీ అండతోనే ఈ మాఫియా బరితెగిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు కుతెగబ డుతున్నారు.. ఈ నేపథ్యంలో జగన్నాధపురం నవాబుపాలెం రహదారి మధ్యలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. సమాచారం ఇచ్చినా స్పందించని పోలీసులు చివరినిమిషంలో వచ్చారు. లారీలతోపాటు రికార్డులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.

 

07:14 - March 31, 2018

కరీంనగర్ : జిల్లాలో ఇసుక వ్యాపారం మూడు లారీలు...ఆరు ట్రాక్టర్లుగా సాగుతోంది. ఓ వైపు గోదావరి,మరోవైపు మానేరు, ఇంకో వైపు వాగులు ఇవన్ని అక్రమ ఇసుక వ్యాపారానికి అడ్డాగా మారాయి. అక్రమ రవాణాలను అరికట్టాల్సిన అధికారులు మొక్కుబడిగా కేసులు పెట్టి అందిన కాడికి దండుకునే పనిలో పడ్డారనే ఆరోపణలొస్తున్నాయి.ఖద్దరు చొక్కాలు, ఖాకీడ్రెస్‌లు కుమ్మక్కై ఇసుక మాఫియాను జోరుగా సాగిస్తున్నట్టు కరీంగనర్‌ జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు.

జిల్లాలోని ఖాజీపూర్, బొమ్మకల్‌ తోపాటు తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి,రేణుకుంట,నేదునూర్,గొల్లపల్లి, సుస్తులాపూర్ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. అటు మానకోండుర్ మండలం పరిధిలోని శ్రీనివాస నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, వెల్ది, వేగురుపల్లి, ఊటూరు గ్రామాల నుంచి వందల లారీల్లో ఇసుక తరలి పోతునే ఉంది. ఒక్కో లారీలోడ్ కు 25 వేల ధర పలుకుతుందంటే కరీంనగర్ జిల్లాలో లభించే ఇసుకకు ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇసుకను పరిమితికి మించి ఎక్కువ లోతుకు తీయడంతో భూ గర్బ జలాలు అడుగంటి పోతున్నయని జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. మానేరు,గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధిక లోతులో ఇసుక లోడేస్తుండడంతో బావుల్లో నీరు లేకుండా పోతోంది. కరీంనగర్ -హైదరాబాద్ మార్గంలో నిర్మించిన కొత్తపల్లి వంతేన వద్ద ఇసుకను ట్రాక్టర్లలో తరలింలిస్తుండడంతో వంతెన పిల్లర్ల వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకోంటున్నాయి.

మరో విషయం ఎంటంటే.. ఇసుక దందా కొనసాగే ప్రాంతాల్లో పోస్టింగ్‌ల కోసం పోలీస్‌, రెవెన్యూ అధికారులు పోటీపడుతున్నారు. లక్షల్లో చేతులు తడిపి ఇక్కడే పోస్టింగ్‌ వేయించుకుంన్నారనే ఆరోపణలొస్తున్నాయి. మానకోండుర్,తిమ్మాపూర్,ఎల్ ఎండి, కొత్త పల్లి పోలీస్ స్టేషన్ల పోస్టింగ్ లు పోందాలంటే దాదాపు 10లక్షల పైనే ఖర్చు చేయాల్సి వస్తుందనేది పోలీస్ శాఖలో ఉన్న ప్రచారం. గతంలో మంత్రి కెటిఆర్ ఇసుక అక్రమ రవాణా పై కఠినంగా వ్యవహరించాల్సిందిగా అధికారును ఆధేశించిన ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే ఇసుక దందా వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న వాళ్లంతా అధికార పార్టీకి చెందిన నేతలే కావడంతో ఇసుక రవాణకు అడ్డు లేకుండా పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక దందా బహిరంగంగానే జరుగుతున్నా.. రెవెన్యు, మైనింగ్, విజిలెన్స్ శాఖలతో పాటు పోలీస్ శాఖ సైతం చూసి చూడనట్లు ఉంటున్నారు. అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే అక్రమ ఇసుకవ్యాపారం జరగుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. ప్రభుత్వ ఖజానాకు, పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

21:02 - March 24, 2018

అవిశ్వాసం అనే ఆటల పోటీలు ఏమన్న వెట్టిండ్రా...సూశిండ్రా ప్రధాన ప్రతిపక్షాలు లేకుంట అసెంబ్లీలు ఎంత అద్భుతంగ నడుస్తున్నయో..ఈ ప్రత్యేక హోదా కోసం పార్టీలతోని పోటీవడి పరేషాన్ అయితున్నరుగదా పబ్లీకు..ఇంక ఎన్ని పీన్గెలు లేవాలే సారో ఓ మంత్రి కేటీఆర్ సారు.. దొంగలకు గూడ బాగనే ఎర్కైనట్టుంది.. అసెంబ్లీల పశుల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ సారు ఏమంటున్నడంటే.. పబ్లీకు కొంతమంది ఎంత ఎడ్డోళ్లున్నరేమయ్యా..?ఈ దేవుండ్లు సల్లగుండ.. గిసొంటి ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ చేయండి..

12:55 - January 10, 2018

కామారెడ్డి : జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. అడ్డొచ్చిన వారిపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా మట్టుబెడుతున్నారు. మొన్న పిట్లం మండలం కారేగాం శివారులో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న వీఆర్‌ఏ సాయిలుపై అదే వాహానం ఎక్కించి చంపేశారు. ఇసుక మాఫియాకు అధికార పార్టీ అండదండలతో పోలీసులు కూడా కేసును తప్పు దోవ పట్టిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.  
చెలరేగిపోతున్న ఇసుక మాఫియా
అనుమతుల ముసుగులో అక్రమ రవాణా
కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. మంజీర నదిని చిద్రం చేస్తూ.. అనుమతుల ముసుగులో కొంతమంది అనుమతులు లేకుండా మరికొంత మంది అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రభుత్వానికి భారీగా గండి కొడుతూ... కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల ముసుగులో వే బిల్లుపై కనీసం మూడు నుండి నాలుగు ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపొవటంతో వీరి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది.
అడ్డొస్తే హతమారుస్తున్న ఇసుక మాఫియా
ఉమ్మడి జిల్లాల్లో ట్రాక్టర్లు, ట్రిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నారు. రాత్రికి రాత్రే అక్రమంగా ఇసుకను తరలిస్తూ... అడ్డు వచ్చిన వారిని అదే ట్రాక్టర్‌, టిప్పర్లను ఎక్కించి హతమారుస్తున్నారు. తాజాగా పిట్లం మండలం కారేగావ్‌ శివారులో ఇసుక ట్రాక్టరును అడ్డుకున్న వీఆర్ఏ సాయిలును గుద్దటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలకం సృష్టించింది. ఇసుక ట్రాక్టర్‌ స్థానిక అధికార పార్టీ నేతలు కావటంతో కేసును తప్పు దొవ పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు సైతం వీఆర్ఏ ను ఢీకొట్టింది ఇసుక ట్రాక్టర్ కాదని ఇటుక ట్రాక్టరంటూ కేసును తప్పు దొవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని.. మృతుని కుటుంబీకులు ఆరోపిస్తూన్నారు.
ఇసుక మాఫియాకు బలైన అభాగ్యులు
ఇసుక మాఫియా తాకిడికి కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో చాలా మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఇసుక మాఫియా తమ దందాకు ఎవరు అడ్డొచ్చిన.. వారిని ట్రాక్టర్లతో టిప్పర్లతో  ఢీకొట్టించి చంపేస్తూ.. సెటిల్‌మెంట్‌కు తెరతీస్తున్నారు. వీఆర్‌ఏ సాయిలు తలకు కూడా వారు వెలకట్టారని తెలుస్తోంది. మృతుని కుటుంబానికి రెండున్నర లక్షలు ఇస్తామని.. మృతుని కుటుంబాన్ని మచ్చిక చేసుకొని.. ఏలాగైనా ఈ కేసు నుండి బయట పడాలని చూస్తున్నారని స్థానికులు ఆరొపిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో  2016-17లో 119 కేసులు నమోదు కాగా 12లక్షల 98వేలకు పైగా జరిమానాలు విధించారు. 2017లో 148 కేసుల్లో రూ.25లక్షలకు పైగా జరిమానాలు విధించారు.
ఇసుకాసురుల వెనుక అధికార పార్టీ నేతలు
నిజామాబాద్‌ జిల్లాలొని కొన్ని ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు రంగంలోకి దిగి... ఇసుక అక్రమ రవాణా దారుల నుండి ట్రిప్పుకు 100 నుండి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో క్వారీలకు అనుమతులు ఇవ్వకున్నా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వీరిని అడ్డుకునే వారు లేకపోవడంతో రెవెన్యూ అధికారులు వెళ్లగా ఇసుక మాఫియాపై దాడులకు పాల్పడుతున్నారు. వీరికి అధికార పార్టీ నేతలు కొందరు కొమ్ముకాస్తుండటంతో.. వీరిని అడ్డుకునే వారు కరువయ్యారు. 
150 ట్రిప్పులు అక్రమంగా తరలింపు
నాళేశ్వర్‌ వాగు నుండి నిజామాబాద్‌ అర్బన్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి..నిజాంసాగర్‌ కాలువల ఆధునీకీకరణ పనులకు రోజు 60 టిప్పర్ల ఇసుక కేటాయించగా.. అక్రమంగా 150 ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. మోర్తాడ్‌ మండలం సుంకెట్‌ దర్మొరా సమీపంలో కొందరు ముఠాగా ఏర్పడి ట్రాక్టర్‌కి వెయ్యి రూపాయలను వసూలు చేస్తున్నారు. దర్పలల్లి మైలారం వాగు నుండి అనధికారికంగా 20 ట్రిప్పులు తరలిపోతోంది. ఒక్కో ట్రిప్పుకు 600 చొప్పున గ్రామానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ఇప్పటి వరకు సుమారుగా 40 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది కామారెడ్డి నిజామాబాద్ జిల్లలొ జరుగుతున్న ఇసుక మాఫియా తీరు. మొత్తానికి అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుక మాఫియా కామారెడ్డి, నిజామాద్‌ జిల్లాలో చెలరేగిపోతున్నారు. అడ్డొచ్చిన వారిని హతమారుస్తూ.. దందా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందా లేదా అనేది వేచి చూడాలి..

07:34 - January 5, 2018

ఇసుక తరలింపును అడ్డుకున్నందుకు ఓ వీఆర్ఏను కిరాతకంగా హతమార్చారు. పిట్లం మండలం కంబాపూర్ శివారులోని కాకివాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వీఆర్ఏ సాయిలు రాత్రి సమయంలో అక్కడకు చేరుకున్నాడు. సాయిలు అక్కడే నిలబడి ఇసుక మాఫియా ముఠాని అడ్డుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సాయిలుపై కోపంతో ఊగిపోయిన మాఫియా అతడిని ట్రాకర్ట్‌తో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీఆర్‌ఏ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ అంశంపై టెన్ టివి చర్చలో వీరయ్య (విశ్లేషకులు), సత్యనారాయణగుప్త (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:48 - December 16, 2017

అనంతపురం : జిల్లాలోని పుట్టపర్తి చిత్రావతి నదిలో ఇసుక మాఫియాపై 10టీవీలో ప్రసారమైన కథనాలపై అధికారులు స్పందించారు. ఇంచార్జ్ కలెక్టర్‌ రమామణి ఆర్డీవోతో విచారణకు ఆదేశించారు. రూ.4 కోట్లు విలువ చేసే ఇసుకను రికవరి చేస్తామని రమామణి చెప్పారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఇసుక మాఫియా