ఉగ్రదాడి

12:04 - March 22, 2018

ఆఫ్గనిస్తాన్‌ : కాబూల్‌లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. కాబూల్‌లోని అలీబాద్‌ హాస్పిటల్‌ ఎదురుగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయని టోలో న్యూస్‌ పేర్కొంది. ఉగ్రవాది నడచుకుంటూ వచ్చి తనని తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు హోంశాఖ వెల్లడించింది. కాబూల్‌ యూనివర్సిటి సమీపంలోనే ఆత్మాహుతి దాడి జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.

 

21:10 - February 12, 2018

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని సంజ్వాన్‌లో ఆర్మీ ఆపరేషన్‌ ముగిసిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్మీ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని మంత్రి వెల్లడించారు. ఉగ్రవాద దాడుల వెనక పాకిస్తాన్‌కు చెందిన జైష్‌ -ఎ-మహ్మద్‌ హస్తం ఉందని మంత్రి పేర్కొన్నారు. పాకిస్తాన్‌ ప్రోత్సాహంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని... ఉగ్రవాద నేత మసూద్‌ అజహర్‌ కశ్మీర్‌కు టెర్రరిస్టులను స్పాన్సర్‌ చేస్తున్నారని సీతారామన్‌ స్పష్టం చేశారు. త్వరలో ఎన్‌ఐఏ ఆధారాలను సేకరిస్తోందని మంత్రి చెప్పారు. ఉగ్రవాదుల దాడులను భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాయన్నారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో రక్షణమంత్రి జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. 

12:33 - January 6, 2018

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లోని గోల్‌ మార్కెట్‌ ప్రాంతంలో శక్తివంతమైన ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు పోలీసులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పేలుడు దాటికి దుకాణాలు ధ్వంసమయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

21:33 - November 24, 2017

ఈజిప్టు : దేశంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మసీదును లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. ఈజిప్టులోని సినాయ్‌ ద్వీపకల్పంలోని మసీదులో జరిగిన దాడిలో 182 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను 30 అంబులెన్స్‌ల సాయంతో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భక్తులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు బాంబులు విసిరారు. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడి నేపథ్యంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా అల్‌ సీసీ భద్రతాధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రవాద దాడిని ప్రభుత్వం ఖండించింది. ఈజిప్టులో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. 

19:49 - November 1, 2017

న్యూయార్క్ : అమెరికాను ఉగ్రవాదం వణికిస్తోంది. న్యూయార్క్‌లోని లోయర్‌ మాన్‌హటన్‌లో ఓ దుండగుడు ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడ్డాడు.డబ్ల్యూటీసీ స్మారక చిహ్నం ప్రాంతంలో ట్రక్కును వేగంగా నడుపుతూ ఒక్కసారిగా పాదాచారులు, సైకిళ్లు వెళ్లే మార్గంలోకి మళ్లించాడు. పాదాచారులను, సైకిల్‌పై వెళ్లేవారిని ట్రక్కుతో ఢీకొని బీభత్సం సృష్టించాడు.

ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న భ‌ద్రతా సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు అర్జెంటీనాకు చెందినవారు కాగా...మరొకరిని బెల్జియం దేశస్థుడిగా గుర్తించారు. ఇది ఉగ్రవాద దాడేనని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డి బ్లసియో తెలిపారు. ట్రక్కులో ఐసిస్‌కు సంబంధించిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సైపోవ్‌పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడికి ప్రమాదమేమి లేదన్నారు.

ట్రక్కుతో ఉగ్రదాడి
ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడ్డ వ్యక్తిని 29 ఏళ్ల సైఫులో సైపోవ్‌గా పోలీసులు గుర్తించారు. సైఫులో ఐసిస్‌ సభ్యుడై ఉంటారని భావిస్తున్నారు. సైపోవ్‌ ఘటనకు ముందురోజు ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. అతను జనాలపైకి ట్రక్కును తోలుతూ 'అల్లా హు అక్బర్‌' అంటూ నినాదాలు చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సైఫులో సైపోవ్‌ 2010లో అమెరికాకు వలస వచ్చాడు. అతడికి గ్రీన్‌కార్డు కూడా ఉంది. సైపోవ్‌ ఉబర్‌ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించాకే ఉద్యోగంలోకి తీసుకున్నట్లు ఉబర్‌ సంస్థ పేర్కొంది. ఈ ఘటనపై ఎఫ్‌బిఐ దర్యాప్తు చేపట్టింది. 

11:30 - November 1, 2017

అమెరికా : న్యూయార్క్‌ లో ఉగ్ర దాడి జరిగింది. ముష్కురుడు ట్రక్కుతో బీభత్సం సృష్టించాడు. డబ్ల్యుటీసీ వద్ద ట్రక్కు జనంపైకి దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్‌పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని సేపుల్లో సైపోవ్‌గా గుర్తించారు. 2010లో అమెరికా వచ్చి, ఫ్లోరిడాలో నివసిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.  ప్రమాదం ఉగ్రవాద దాడేనని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డీ బ్లాసియో  ప్రకటించారు. ఈ ఘటన తర్వాత న్యూయార్క్‌లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి రెండు హ్యాండ్‌ గన్లు, పెల్లెట్‌ గన్‌, బాల్‌ గన్‌  స్వాధీనం చేసుకున్నారు. బీభత్సం సృష్టించిన ట్రక్కు నుంచి  ఐసీస్‌ లేఖ స్వాధీనం చేసుకున్నారు.  న్యూయార్క్‌ ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. దేశం మీ వెంటే ఉంటుందని ట్రంప్‌ ట్వీట్ చేశారు. ఉగ్రవాది దాడిన ప్రధాని మోదీ ఖండించారు. 

09:17 - November 1, 2017

అమెరికా : న్యూయార్క్ లో ఉగ్రదాడి జరిగింది. ట్రక్కుతో ముష్కరుడు బీభత్సం సృష్టించాడు. డబ్ల్యూటీసీ వద్ద జనంపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 11 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పెల్లెట్ గన్, రెండు హ్యాండ్ గన్లు, బాల్ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీభత్సం సృష్టించిన ట్రక్ నుంచి ఐసీస్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని సేపుల్లో సైపోవ్ గా పోలీసులు గుర్తించారు. సేపుల్లో సైపోవ్ 2010లో అమెరికా వచ్చి ఫ్లోరిడాలో నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇది ఉగ్రవాద దాడే అని న్యూయార్క్ బిల్ డీ బ్లాసియో వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ ఉగ్రదాడిని ఖండించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....
 

19:01 - October 16, 2017

సోమాలియా : సోమాలియా రాజధాని మోగదిశులో ఆదివారం జరిగిన ఉగ్రవాద దాడిలో మృతుల సంఖ్య 276కు చేరింది. మరో 250 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు ఓ ట్రక్కు ద్వారా భారీ విస్ఫోటానికి పాల్పడ్డారు. బాంబు పేలుడు ధాటికి ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. మృతులను గుర్తించలేని విధంగా ఘటనా స్థలంలో శవాలు తునక తునకలుగా చెల్లాచెదురుగా పడిపోయాయి. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని చూస్తుంటే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మొగదిశులోని విదేశీ మంత్రిత్వ శాఖ సమీపంలో సఫారి హోటల్‌ గేటును ట్రక్కు ఢీకొనడం ద్వారా ఉగ్రవాదులు పేలుడుకు పాల్పడ్డారు. ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదాకు చెందిన అల్‌-శబాబ్‌ పేలుళ్లకు పాల్పడిందని ప్రభుత్వం తెలిపింది. సోమాలియా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఉగ్రవాద దాడి. గాయపడ్డవారికి రక్తం దానం చేసేందుకు ప్రజలు ఆసుపత్రుల ముందు బారులు తీరారు. సోమాలియా అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్దుల్లాహీ దేశంలో 3 రోజుల సంతాపాన్ని ప్రకటించారు.

 

08:23 - August 18, 2017

స్పెయిన్ : పోర్ట్ ఆఫ్ కామ్ బ్రిల్స్ రెండో ఉగ్రదాడిని పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు పర్యటక కేంద్రం బార్సిలోనా సిటీలో పాదచారులపై ఉగ్రవాదుల దాడి చేశారు. వ్యాన్ తో పాదచారులను ఢీకొట్టిన ఉగ్రవాది తర్వాత దాడికి దిగాడు. ఈ ఉగ్రదాడిలో 13 మంది మృతి చెందారు. 100పైగా గాయాలయ్యాయి. ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. బార్సిలోనా దాడిపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పోలీసుల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:25 - August 18, 2017

స్పెయిన్ : ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బార్సిలోనా పట్టణంలో వ్యాన్‌తో బీభత్సం సృష్టించారు. వాహనంతో పాదచారులను ఢీకొట్టారు. ఈ ఘటనలో 13 మంది స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం ఓ ఉగ్రవాది సమీపంలో ఉన్న రెస్టారెంట్లోలోకి దూరడంతో ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు రెస్టారెంట్‌ను చుట్టుముట్టి.. ఉగ్రవాదిని బంధించాయి. మరోవైపు ఉగ్రదాడి ఘటనలో యూరప్‌ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. తమ భద్రతా దళాలను అప్రమత్తం చేశాయి. ఈ ఏడాది లండన్‌ బ్రిడ్జి వద్ద, ఏడాది క్రితం ఫ్రాన్స్‌లోని నీస్‌లోనూ ఇదే తరహాలో దాడికి పల్పడిన ఉగ్రవాదులు బీభత్స సృష్టించారు. బార్సిలోనా ఘటనపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో భారతీయులెవరూ లేరని ఆమె ట్వీట్‌ చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో స్పెయిన్‌కు దౌత్యపరమైన సా యం అందించేందుకు సిద్ధమేనని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ ప్రకటించారు. అమెరికా మిత్రదేశాలపై ఉగ్రదాడులను సహించబోమని ఆయన తెలిపారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ఉగ్రదాడి