ఉత్తరప్రదేశ్

11:24 - July 21, 2018

ఉత్తరప్రదేశ్ :  బాంబులు వేసుకోవటం..ఆయుధాలతో దాడిచేసుకోవటం..ఒకరిపై ఒకరు ఆరోపించుకోవటం..ఆగ్రహించుకోవటం అనేది మనిషుల్లో వుండే లక్షణాలు.కానీ జంతువులు వాటి వాటి ధర్మాలను అనుసరిస్తు సమూహాలుగా నివసిస్తుంటాయి. వాటి వాటి నియమనిబంధనలను ఉల్లంఘించవు. వాటి జీవనం కోసం..ఆహారం కోసం పోరాడటమే తప్ప ఒక జంతువుపై మరో జంతువులు దాడికి దిగదు. జంతువుల్లో కోతులనుతీసుకుంటే మనుషులకు కోతులకు చాలా దగ్గరి సంబంధాలుంటాయి. కానీ అవి మనుషుల మాదిరిగా అరాచకాలకు పాల్పడవు..మనుషులకు అతి దగ్గరగా వుండే జంతువుల్లో కోతులు కూడా ఒకటి. కుక్క, పిల్లి వలెనే కోతులు కూడా మనుషులుకు దగ్గరగా వుంటాయి. ఇంకా చెప్పాలంటే కోతులు మనుషులకు జీవనాధారంగా కూడా ఉపయోగపడుతుంటాయి. కోతులను ఆడించి జీవనం కొనసాగించేవారిని మనం తరచు చూస్తుంటాం కదా!..సర్కస్ ల్లోను, గారడీ చేసేవారి వద్ద ఇలా కోతులు మనుషులకు దగ్గరగా వుండటమే కాక వారికి జీవనాధారంగా కూడా ఉపయోగపడుతుంటాయి. వాటి సహజ లక్షణమైన చిలిపితనంతోను..అల్లరి చేష్టలతోను మనుషులను అలరిస్తుంటాయి. కానీ అరాచకాలకు మాత్రం పాల్పడవు. కానీ ఓ విచిత్ర పరిస్థితుల్లో కోతులు మనుషులపై బాంబులు వేసి సందర్భాన్ని మనం ఊహించగలమా? కానీ జరిగింది. నిజమండీ..ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
తాతా మనవళ్లపై బాంబులేసిన కోతులు..
అవును! కోతి బాంబులు విసరడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ గ్రామానికి చెందిన గులాబ్ గుప్తా అనే 60 ఏళ్ల వ్యక్తి తన మనవడుని స్కూలు నుండి తీసుకువచ్చేందుకు వచ్చే సయమం కావటంతో ఐదేళ్ల తన మరో మనవడితో కలిసి ఇంటి బయట ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలోనే అటుగా వెళ్తున్న కోతులు వేసిన నోట కరచుకున్న ఓ సంచిని తాతా మనుమడు నిల్చున్న ప్రాంతంలో జార విడిచాయి. అంతే!! పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో తాతామనవళ్లు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

పాలిథిన్ కవర్ లో బాంబులు..
దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పరిశీలించారు. బహుశా కోతులు బహుశా చెత్త డంపింగ్ యార్డ్ నుంచి ఆ సంచిని తీసుకొచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సంచితో ఇంటిపైన ఆడుకుంటుండగా నోటితో పట్టుకున్న పాలిథిన్ కవర్ పొరపాటున కిందపడి పేలుడు సంభవించి ఉండొచ్చని పేర్కొన్నారు. బాధితులకు ప్రాణాపాయం లేదని, కోలుకోవడానికి మరికొన్ని రోజులు పడుతుందని పోలీసులు తెలిపారు. 

08:46 - July 18, 2018

ఉత్తరప్రదేశ్ : నోయిడాలో రెండు భవనాలు కుప్పకూలిపోయాయి. నిర్మాణంలో వున్న ఆరంతంస్థుల భవనం పక్కనున్న మరో నాలుగంతస్థుల భవనంపై కూలిపోవటంతో రెండు భవనాలు కూలిపోయాయి. బ్రిసాక్ పీఎస్ పరిధిలోని షాటెరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఘజియాబాద్ నుండి వచ్చి సహాయక చర్యల్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఇద్దరు మృతదేహాలను వెలికి తీసారు. ఈ ఘటనలో శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లుగా సమాచారం. ఆ భవనంలో 18 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీయగా, శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

 

17:00 - July 16, 2018

ఉగ్రవాదం అనే పదం ఉగ్రము అనే పదం నుండి పుట్టింది. ఉగ్రము - భయం నుండి పుట్టినది. భయాన్నికలుగజేసే, భయపెటికట, లేదా ప్రమాదాన్ని కలుగజేసే విషయాల పట్ల 'మానసిక ప్రతిచర్య'. ఆత్మన్యూనతాభావనలకు, ఉద్రేకాలకు లోనై, ఇతరులకు భయపెట్టి తమ పంతాలను నెగ్గించుకొనువారు, తమ భావాలను, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించేవారు, తమ స్వీయవిషయాల రక్షణకొరకు, సమాజవ్యతిరేక మార్గాలను ఎంచుకొనువారు - 'ఉగ్రవాదులు'. మానసికంగా చూస్తే ఇదో రుగ్మత. సామాజికంగా చూస్తే ఇదో పైశాచికత్వం, మతపరంగా చూస్తే ఇది నిషిద్ధం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా ఎంతో మంది అమాయకులైన ప్రజలు బలవుతున్నారు. కానీ పాత్ హోల్స్ అంతకంటే భయంకరంగా మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి.

గుంతల్లో కలిసిపోతున్న ప్రాణాలు..
పాత్‌హోల్స్ అంటే రోడ్లపై ఏర్పడ్డ గుంతలు. దేశంలో ఉగ్రవాదుల కంటే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఉగ్రవాదుల కంటే వీటి వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని లెక్కలు తెలియజేస్తున్నాయి. 2017 దేశవ్యాప్తంగా 803 మంది ఉగ్రదాడుల వల్ల ప్రాణాలు కోల్పోతే, పాత్‌హోల్స్ వల్ల ఏకంగా 3,597 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే రోజుకు సగటున పదిమంది ప్రాణాలు 'గుంతల్లో' కలిసిపోతున్నాయి.

పెరుగుతున్న గుంతల వల్ల పోతున్న ప్రాణాల సంఖ్య..
2016తో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. మహారాష్ట్రలో మరణాల సంఖ్య ఏకంగా రెండింతలు అయింది. 2017లో నక్సల్స్, ఉగ్రవాదుల దాడుల వల్ల టెర్రరిస్టులు, భద్రతా సిబ్బంది, పౌరులు కలిసి మొత్తం 803 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో గుంతల్లో పడి 3,597 మంది మృతి చెందడం విషాదకరం.

అగ్రస్థానంలో వున్న ఉత్తరప్రదేశ్..
రోడ్డు గుంతల్లో పడి మరణిస్తున్న వారి సంఖ్యలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 2017లో యూపీలో ఏకంగా 987 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 726 మంది, హరియాణాలో 522 మంది, గుజరాత్‌లో 228 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంతకుముందు ఏడాది ఆయా రాష్ట్రాల్లో సంభవించిన మరణాల కంటే ఇవి ఎక్కవ కావడం గమనార్హం. ఇక 2016లో ఆంధ్రప్రదేశ్‌లో 131 మంది గుంతల్లో పడి చనిపోయారు.

15:48 - July 16, 2018

ఉత్తరప్రదేశ్ : దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న నేరాల్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ సగటులో కేవలం యూపీలోనే సుమారు 9.5 శాతం నేరాలు నమోదు అవుతున్నట్లు సాక్షాత్తు జాతీయ నేర రికార్డుల సంస్థ నివేదిక వెల్లడించింది. 2016లో మహిళల పట్ల నేరాలు అధికమైనట్లు నివేదిక వెల్లడించింది. మహిళలను భర్తలు, బందువులు హింసిస్తున్న ఘటనలే 32.6 శాతం ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. మహిళల కిడ్నాప్ 19 శాతం ఉన్నట్లు తేల్చారు. రేప్‌లు 11 శాతం జరుగుతున్నాయి. అయితే రేప్ కేసులు పెరిగినట్లు క్రైమ్ బ్యూరో తన నివేదికలో వెల్లడించింది. 2015లో 34, 651 కేసులు నమోదు కాగా, 2016లో 38947 కేసులు నమోదు అయినట్లు తెలుస్తున్నది. ఎస్‌సీ, ఎస్టీల పట్ల కూడా అట్రాసిటీ కేసులు పెరిగినట్లు తేలింది. అట్రాసిటీ కేసుల్లో యూపీ టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత బీహార్, రాజస్థాన్ రాష్ర్టాలు నిలిచాయి. సైబర్ క్రైమ్ కూడా 6.3 శాతంతో పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. వెస్ట్‌బెంగాల్‌లో అత్యధికంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా ఉన్నావ్ లో గ్యాంగ్ రేప్ ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇలా చెప్పుకుంటు పోతే యూపీలో నేరాలు సంఖ్యలు కోకొల్లలుగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మహిళలకు మరింత భద్రత కల్పించాలన్న తలంపుతో గత సంవత్సరం సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన 'యాంటీ రోమియో స్క్వాడ్' 2017లో ఏర్పాటు చేసింది.
15 లక్షల మందికి కౌన్సెలింగ్..
సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన 'యాంటీ రోమియో స్క్వాడ్' ఇప్పటివరకూ 15 లక్షల మందికి కౌన్సెలింగ్ నిర్వహించిందని, 4 వేల మందిని అరెస్ట్ చేసిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మహిళలకు భద్రతనివ్వాలనే ఉద్ధేశ్యంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించామని తెలిపారు. అమ్మాయిలను ఇబ్బందులు పెట్టిన 4 వేల మందికిపైగా యువకులను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సైతం యాంటీ రోమియో స్క్వాడ్ లు పనిచేస్తున్నాయని లక్నో ఏడీజీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
ఈవ్ టీజర్లు పని పట్టే యాంటీ రోమియో స్క్వాడ్..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ టీమ్ తమ సేవలను వినియోగిస్తారన్నారు. రహస్యంగా కెమెరాలు ధరించి ఈ టీమ్ మఫ్టీలో ఉండి ఈవ్ టీజర్లు, బహిరంగ ప్రదేశాల్లో సమస్యలు సృష్టించే వారి ఫోటోలు తీసి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ టీమ్ లలో మహిళా పోలీసులు కూడా ఉన్నారని..స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, పార్కులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వీరు మహిళల భద్రతను రహస్యంగా పర్యవేక్షిస్తుంటారని సీఎం ఆదిత్యానాథ్ చెప్పారు. ఈ నేపథ్యంలో 'యాంటీ రోమియో స్క్వాడ్' ఇప్పటివరకూ 15 లక్షల మందికి కౌన్సెలింగ్ నిర్వహించిందని సీఎం తెలిపారు. 

16:51 - July 9, 2018

ఉత్తరప్రదేశ్‌ : గ్యాంగ్‌స్టర్‌ మున్నా బజరంగీని బాగ్‌పత్ జైలులో కాల్చి చంపారు. 2005లో బిజెపి ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ను హత్య చేసిన కేసులో నిందితుడైన మున్నా బజరంగి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మున్నా బజరంగీపై హత్య, దోపిడి, తదితర 40 కేసులున్నాయి. మున్నాను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసే ఆలోచనలో ఉన్నారని, ఆయనకు భద్రత కల్పించాలని మున్నా భార్య వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసినన నేపథ్యంలో ఈ హత్య జరగడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన సిఎం యోగి ఆదిత్యనాథ్- జైలర్‌, డిప్యూటి జైలర్‌ను సస్పెండ్‌ చేసి న్యాయ విచారణకు ఆదేశించారు. ప్రేమ్‌ ప్రకాశ్‌ అలియాస్‌ మున్నా బజరంగిని 2009లో ముంబైలో అరెస్ట్‌ చేశారు. బజరంగి 2012 యూపీ ఎన్నికల్లో అప్నాదల్ పార్టీ టికెట్‌పై పోటీ చేశారు. 

08:16 - June 28, 2018

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ తండ్రి తన నలుగురు కూతుళ్లకు రక్షణ కల్పించమని కోరుతూ ప్రధాని మోది, సిఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశాడు. మీరట్‌ జిల్లా మవానాలో నలుగురు కూతుళ్లతో కలిసి ఆయన ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఆ ఏరియాలో ఉండే ఆకతాయిలు అమ్మాయిలను నిత్యం వేధిస్తున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక నలుగురు అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లడం మానేశారు. అమ్మాయిలు మదర్సాలకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉంటున్నప్పకీ ఇరుగు పొరుగున ఉండే ఆ ఆకతాయిల ఆగడాలు మాత్రం ఆగలేదు. ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేస్తుండడంతో ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆకతాయిలు  యాసిడ్‌తో దాడి చేస్తామని ఆ కుటుంబాన్ని హెచ్చరించారు. పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదికి విజ్ఞప్తి చేశారు. బాధితుల ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

15:22 - June 18, 2018

హైదరాబాద్‌ : వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను SR నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల బంగారం, ఓ స్కార్పియో వాహనం సీజ్‌ చేశారు. 

14:50 - June 18, 2018

హైదరాబాద్‌ : వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను SR నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల బంగారం, ఓ స్కార్పియో వాహనం సీజ్‌ చేశారు. 

18:34 - June 13, 2018

ఉత్తరప్రదేశ్ : ప్రభుత్వ భవనంలో నుంచి మార్బుల్స్‌ లాంటి విలువైన వస్తువులు తీసుకెళ్లారని నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఉత్తరప్రదేశ్‌ మాజీ సిఎం, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. భవనం లోపల తానేమి విధ్వంసానికి పాల్పడలేదని, ఎలాంటి నష్టం కలిగించలేదని చెప్పుకొచ్చారు. భవనంలో సొంత ఖర్చుతో తాను స్వయంగా తెప్పించిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లినట్లు అఖిలేష్‌ చెప్పారు. వీటిని తిరిగి ఇవ్వడానికి సిద్ధమేనన్నారు. యోగి ప్రభుత్వానిది చాలా చిన్న మనసని ధ్వజమెత్తారు. ఉపఎన్నికల్లో ఓటమితో కృంగిపోయిన బిజెపి ఇలాంటి పనులు చేస్తోందని అఖిలేష్‌ మండిపడ్డారు. ఎస్పీ-బిఎస్పీ కూటమితో బిజెపికి భయం పట్టుకుందన్నారు. యూపీ గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని...ఆయన లోపల ఆర్‌ఎస్‌ఎస్‌ ఆత్మ ఉందని విమర్శించారు.

16:57 - May 29, 2018

ఉత్తరప్రదేశ్ : ఈవీఎంల ద్వారా ఓటు వేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్ అన్నారు. కైరానాలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు భారీ స్థాయిలో మొరాయించినట్లు ఆరోపించారు. దీంతో చాలామంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేదని, వీటిపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆయన తెలిపారు. ఈవీఎంలను తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నానని... రానున్న ఎన్నికల్లో అంతటా బ్యాలెట్ పేపర్లను వాడాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. బ్యాలెట్ ద్వారా ఓటు వేయడం వల్ల ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. ఈవీఎంలు మొరాయించిన ప్రాంతాల్లో మళ్లీ ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయనున్నట్లు అఖిలేశ్ యాదవ్ తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఉత్తరప్రదేశ్