ఉపన్యాసం

13:04 - April 21, 2017

మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలోని రైతు రాజు కావాలని టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ పేర్కొన్నారు. 16వ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు కొంపల్లిలో ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా ఆయన సుదీర్ఘంగా ప్రారంభోపన్యాసం చేశారు. 2001 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ పార్టీ కేవలం కొంత మందితో ప్రారంభమై నేడు 75 లక్షల సభ్యత్వాలకు వెళ్లడం గర్వంగా ఉందన్నారు.

హేళన..అవమానాలు..
టీఆర్ఎస్ పార్టీని ఎంతో మంది అవమానించారని, అవహేళన చేశారని పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ముందుకెళ్లి స్వరాష్ట్రం సాధించుకున్నట్లు తెలిపారు. జూన్ 2, 2014 తెలంగాణ అవిర్భావం అప్పుడు వ్యవసాయం బాగాలేదని, కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నట్లు, ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మీ పథకం ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ వస్తే కరెంటు రాదని గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారని, కానీ నేడు విద్యుత్ లో దూసుకుపోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించే విధంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి నల్లా నీరు అందించే విధంగా మిషన్ భగీరథ పథకం చేపడుతున్నట్లు, సమైక్య రాష్ట్రంలో నిరాధారణకు గురైన చెరువుల పునరుద్దరణ కోసం మిషన్ కాకాతీయ పథకం తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల పండుగలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు.

పలు పథకాలు..
గడిచిన 60 ఏళ్ల కాలంలో టీడీపీ, కాంగ్రెస్ పాలనలో కులవృత్తులు దెబ్బతిన్నాయని అన్నారు. నాయి బ్రాహ్మణులకు లక్ష సబ్సీడీతో సెలున్ లను నిర్మిస్తామని, ముదిరాజుల కోసం చేప పిల్లలను ఉచితంగా అందించామని..గీత కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కల్లు దుకాణాలను తెరిపించామన్నారు. గీత కార్మికులు ప్రమాదంలో చనిపోతే నష్టపరిహారం రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. దేశంలో ధనవంతులు అయ్యే విధంగా గొళ్ల కుర్మలకు ఉచితంగా గొర్రె పిల్లలు అదిస్తామని అన్నారు. త్వరలో టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన చేస్తానని తెలిపారు.

రెండు పంటలకు రూ. 4వేలు..
టీఆర్ఎస్ రైతుల కోసం ఓ బృహత్తర కార్యక్రమం చేపట్టిందని, రైతులకు ప్రతి ఏడాది రెండు పంటలకు రూ.4వేలు బ్యాంకులో వేస్తామన్నారు. మొదటి విడత మేలో...రెండో విడత సెప్టెంబర్ జమ చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో రైతు సంఘం ఏర్పాటు చేస్తామని, అలాగే మండల, రాష్ట్ర స్థాయిలో రైతు సంఘం ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర రైతు సంఘానికి రూ.500కోట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే 2112మంది వ్యవసాయ అధికారులను నియామించామని, త్వరలో 500 పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు.

నరేగాకు వ్యవసాయం అనుసంధానం చేయాలి..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరుతామని వెల్లడించారు. వ్యవసాయం చేసే సీజన్‌లో రైతులకు కూలీలు దొరకడం కష్టంగా ఉందని ఈ క్రమంలోనే నరేగా (ఉపాధి హామీ పథకం)ను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తీర్మానం చేస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ ప్రతిపాదనకు ప్లీనరీ ఆమోదించింది. ఈనెల 23వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో తీర్మానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అందచేయడం జరుగుతుందన్నారు.

11:36 - January 11, 2017

వాషింగ్టన్ : అమెరికా ఆర్థిక వ్యవస్థలో వలస ఉద్యోగులు, కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారని అధ్యక్షుడు ఒబామా చెప్పారు. యూఎస్ అధ్యక్షుడుగా ఎనిమిదేళ్లపాటు పని చేసిన  ఒబామా పదవీకాలం ఈనెల 20తో పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఒబామా షికాగో నుంచి  దేశ ప్రజను ఉద్దేశించిన ప్రసంగించారు. వీడ్కోలు ఉపన్యాసంలో ఒబామా తన పదవీ కాలంలో చేసిన అభివృద్ధి గురించి ప్రధానంగా వివరించారు. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించి, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దిన విషయనాన్ని ప్రస్తావించారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వీసా విధానాన్ని పునఃసమీస్తున్న తరుణంలో వలస ఉద్యోగులు, కార్మికులు సేవలను విస్మరించరాదని గుర్తు చేశారు. 
ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంలో అణచివేశా -ఒబామా 
అమెరికాలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశానని అధ్యక్షుడు ఒబామా చెప్పారు. ఈ సమస్యతో దేశం ఎదుర్కొన్న కష్టనష్టాలను తన వీడ్కోలు ప్రసంగంలో ప్రస్తావించారు. ఇదే సమయంలో అమెరికాలో ఉంటున్న ముస్లిం పట్ల ఏ రోజు కూడా వివక్షత చూపలేదని వివరించారు. 

 

16:55 - October 1, 2015

హైదరాబాద్ : రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి శాసనమండలిలో చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రలోని ప్రతి రైతుకు సర్కార్‌ అండగా ఉంటుందని భరోస ఇచ్చారు. ఎవరికైనా ఆర్థికపరమైన సమస్యలుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావాలని పోచారం కోరారు.

15:50 - September 29, 2015

హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు టీడీపీ యువనేత లోకేశ్ నాయుడు.. జిల్లాకువచ్చిన లోకేశ్‌కు పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.. అక్కడినుంచి నల్లజర్లలోని టీడీపీ కార్యకర్తల శిక్షణాశిబిరానికి హాజరయ్యారు యువనేత..

07:57 - July 8, 2015

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ స్పీచ్ పై దర్శకుడు రాంగోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ గర్జించే సింహం అని..సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనకి ఆర్థం లేదన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే గర్జించే సింహం మేకలా మాట్లాడుతోంది..సారీ పిల్లిలా మాట్లాడుతోంది అని పవన్ ప్రసంగాన్ని ఉద్దేశించి అన్నారు. సింహంలాంటి పవన్ కి నా విన్నపం ఒకటే పిల్లిలా ఉండకండి, అభిమానులు మీ నుంచి పులి గర్జనలు కోరుకుంటున్నారని తెలిపారు. మేకకి, మోక్కకి తేడా తెలియని సింహం సింహం కాదు అని వర్మ అన్నారు. ఇంకా ఏమన్నారంటే...సింహం అర్థం చేసుకోవాల్సింది సింహం సింహంలా ఉండాలి..తన గర్జనలో అంతరార్ధం కుక్కలకు వివరించకూడదు..సింహం జూ లో ఉందనే భ్రమలో ఉన్నాయి కుక్కలు..కానీ కుక్కలు తెలుసుకోవాల్సింది సింహం తలచుకుంటే ఎప్పుడైనా అటాక్ చేయగలదని..సింహం గర్జనలో అర్ధం వెతకడం కుక్కల మోరుగుల్లో లాజిక్ వెతకడం లాంటిది..పవన్ ఎప్పుడూ బెస్ట్ గానే ఉండాలని ఆశిస్తున్నాను అని వర్మ ట్విట్ చేశారు.

Don't Miss

Subscribe to RSS - ఉపన్యాసం