ఉపయోగాలు

12:40 - October 12, 2017

 

హైదరాబాద్ : ప్రతీ ఏడాది చలికాలంలో వచ్చే సీతాఫలాల కోసం నగరవాసులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ అమృతఫలానికున్న ప్రత్యేకతలు అనేకం. వీటి మధురమైన రుచి, కమ్మదనం మరే పండులోనూ దొరకదు కాబట్టి.. సీజనల్ ఫ్రూట్స్‌లో ది బెస్ట్‌ ఫ్రూట్ కస్టడ్‌ ఆపిల్. సీతాఫలం పండ్లల్లో రారాజు. దీనికున్న ఔషధ గుణాలు మరే పండుకు ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇందులో ఉండే పొటాషియం కండర బలహీనతను పోగొడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. సీతాఫలాలలోని విటమిన్‌ ఎ చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఈ పళ్లు తినడం వల్ల కళ్లకూ ఎంతో మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. అజీర్ణ సమస్య తొలగించడంతో పాటు, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దీంతో ఉన్న ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు.

అన్ని బజార్లలో సీతాఫలాల అమ్మకాలు
ప్రస్తుతం సీతాఫలాలు హైదరాబాద్‌లో విరివిగా కనిపిస్తున్నాయి. ప్రకృతి వర ప్రసాదిత సీతాఫలాలు ఊళ్లు, పల్లెలు దాటి పట్నానికి చేరుకున్నాయి. రాజధాని నగరంలోని అన్ని బజార్లలో సీతాఫలాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సీతాఫలాలు త్వరగా వచ్చాయి. సాధారణమైన పళ్లు డజన్‌ 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఇక ఫస్ట్‌ క్లాస్ పండ్లు డజన్‌కు 100 నుంచి 350 చొప్పున అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ సారి వర్షాలు భారీగా కురవడంతో గతేడాది కంటే.. ఫలాలు కాస్త తక్కువ సంఖ్యలో నగరానికి చేరుకుంటున్నాయి. వర్షాలు పడుతుండటంతో పండ్లల్లో నాణ్యత తక్కువగా ఉంది. దీంతో కొనుగోలుదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. గతేడాదితో పోలిస్తే ఈ సారి అమ్మకాలు తక్కువగానే ఉన్నాయని అమ్మకందారులు అంటున్నారు.

దీపావళికి ముందే నగరానికి
పల్లెవాసులు, గిరిజనులు సీతాఫలాలను దీపావళికి ముందే నగరానికి తరలించి అమ్ముతుంటారు. కొందరికి ఇది జీవనోసాధిగా కూడా మారింది. ముఖ్యంగా కరీంనగర్‌, మెదక్‌, శామీర్‌పేట్‌, గజ్వేల్, శంషాబాద్‌, కర్తాల్‌, సిద్ధిపేట జిల్లాలకు చెందిన..100 గ్రామాల నుంచి నగరానికి సీతాఫలాలు దిగుమతవుతుంటాయి. నగరంలోని పికెట్, ఎంజీబీఎస్, కొత్తపేట్‌, కూకట్‌పల్లి, బాలానగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రధాన మార్కెట్లలో ఏడు దశాబ్దాలకు పైగా నగరవాసులు ఈ పండ్లను కొంటున్నారు. ప్రకృతిలో పుట్టి ఏ రసాయనం ఉపయోగించకుండా పండే ఫ్రూట్‌ సీతాఫలం ఒక్కటే మరి.

 

12:29 - January 17, 2017

ఉత్సాహం..ఉత్తేజం రావడానికి చాలా మంది కాఫీలు..టీలు తాగుతుంటారు. నిత్యం మనం తాగే ఇలాంటివి కన్నా బ్లాక్ టీ తాగడం ఎంతో మేలు అని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందులో అనారోగ్యాలను నయం చేసుకోవచ్చంట. పాలు..చక్కెర లేకుండా తయారు చేసుకోవడమే బ్లాక్ టీ. మరి దీనిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దామా..

 • దంత సమస్యలు ఉండే వారు నిత్యం ఒక కప్పు బ్లాక్ టీ తీసుకోవాలి. దీనితో దంత సమస్యల నుండి దూరం కావచ్చు.
 • ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్లరు రాకుండా అడ్డుకుంటాయి.
 • పొగ తాగే వారికి పార్కిన్సన్ వ్యాధి వస్తుంది తెలిసిందే కదా. బ్లాక్ టీ తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయంట.
 • మధుమేహం ఉన్న వారు బ్లాక్ టీ తాగితే గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
 • దగ్గు..జలుము..అస్తమా వంటి శ్వాస కోశ వ్యాధుల నుండి బ్లాక్ టీ గట్టెక్కిస్తుంది.
 • జీర్ణక్రియకు ఎంతగానో దోహదం చేస్తాయి. పలు రకాల విష పదార్థాలను జీర్ణాశయం నుండి తరిమేస్తాయి.
 • బ్లాక్ టీ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఒత్తిడి..ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి. 
17:24 - July 22, 2016

తమలపాకు..తాంబూళం..పూజలకు మాత్రమే ఉపయోగించరు. ఇది ఔషధంగా కూడా పనిచేస్తుంది. నిత్య జీవితంలో తమలపాకును ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం..
తమలపాకు రసాన్ని 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి. ప్రతి రోజూ కొన్ని తమల పాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.
ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది. తమలపాకు జ్యూస్ ను తీసుకుంటే బలహీనత దూరమవుతుంది. తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.
తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకోవడమే కాకుండా కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది.
జలుబు చేసి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్న సమయంలో తమలపాకును వేడి చేసి కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతి మీద వేసి కడితే ఫలితం ఉంటుంది.
తమలపాకులను ముద్దగా చేసి తలకు పట్టించాలి. ఓ గంట సేపు అనంతరం తలస్నానం చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది.

12:49 - July 17, 2016

చద్దన్నం. అంటే అందరికీ తెలిసిందే. కదా. రాత్రి పూట మిగిలిన అన్నాన్ని పొద్దున్నే తినేదే చద్దన్నం. అప్పట్లో ఈ చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు. కానీ ఇప్పుడు రాత్రి వేళలో మిగిలిన ఆహారాన్ని పడేస్తున్నారు. కొంతమంది ఎవరికైనా పెడుతుండడం చేస్తుంటారు. అయితే ఈ చద్దన్నం తీసుకోవడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. అవేంటో తెలుసుకోండి....

 • మలబద్దకం, నీరసంగా ఉన్నవారు చద్దన్నం తీసుకోవడం వల్ల ఆ సమస్యలు పోతాయి.
 • చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 • చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుని తింటే వేడి త్వరగా పోతుంది.
 • శరీరం తేలికగా మారి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది.
 • పేగుల్లో పెరుగుతున్న అల్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
 • బ్లడ్ ప్రెషర్ అదుపుతో హైపర్ టెన్షన్ గణనీయంగా తగ్గిస్తుంది.
 • అధిక వేడితో కడుపులో కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి.
 • పలు చర్మ వ్యాధులు చద్దన్నం కాపాడుతుంది.
 • పీచు అధికంగా ఉడి మలబద్ధకం, నీరసం తగ్గుతాయి.
 • దేహాన్ని త్వరగా అలసిపోనివ్వదు, తాజాగా ఉంచుతుంది.
 • అలర్జీ కారకాలను, చర్మ మలినాలను తొలగిస్తుంది. 
09:43 - June 2, 2016

వేన్నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే.. ఎప్పటిలా చల్లటినీళ్లు కాకుండా.. అప్పుడప్పుడూ వేణ్నీళ్లు తాగి చూడండి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఉదయం పూట వేణ్నీళ్లు తాగడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. కొవ్వు నిల్వల్ని కూడా ఇవి కరిగించేస్తాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు తప్పనిసరిగా వేణ్నీళ్లు తాగడానికి ప్రాధాన్యమివ్వాలి.
పరగడుపున తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఆకలి కూడా అంతగా వేయదు. ఆకలి బాగా వేస్తున్నవారు వేణ్నీళ్లలో నిమ్మ, అల్లం రసం చేర్చి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తేనె చేర్చినా మంచిదే.
తరచూ జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లతో ఇబ్బంది పడేవారు వేణ్నీళ్లకి ప్రాధాన్యమివ్వాలి. వాటితో పుక్కిలించాలి. నాలుగు తులసి ఆకులను చేర్చుకుని తాగడం కూడా అలవాటు చేసుకుంటే గొంతులో ఇన్‌ఫెక్షన్లు బాధించవు.
నెలసరి సమయంలో కడుపు నొప్పితో బాధపడేవారు వేణ్నీళ్లు తాగడం వల్ల పొట్ట కండరాలు ఉత్తేజితమవుతాయి. నొప్పి కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
ఇలా చేయడం వల్ల జుట్టు ఎదుగుదల కూడా బాగుంటుంది. వేణ్నీళ్లు తాగడం వల్ల నరాలు ఉత్తేజితమవుతాయి. జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి. రాలిపోవడం, తెగిపోవడం తగ్గుతుంది.
అరుగుదల సరిగా లేనివారు ప్రతిరోజూ పరగడుపున వేణ్నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటివి బాధించవు. జీర్ణాశయంలో వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. 

16:00 - May 28, 2016

సాధారణంగా ప్యూమిస్‌ స్టోన్‌ ను పాదాల స్క్రబ్బింగ్‌కు మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ చర్మపు మృత కణాలను తొలగించటంతోపాటు అవాంఛిత రోమాల్ని కూడా ప్యూమిస్‌ స్టోన్‌ తొలగించగలదు. దీంతో ఉన్న ఇతర సౌందర్య ఉపయోగాలేమిటో తెలుసుకుందామా!
స్కిన్‌ టోన్‌ కోసం: స్కిన్‌ టోన్‌ పెరగాలంటే ప్రతి రోజూ ప్యూమిస్‌ స్టోన్‌తో శరీరానికి సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి చర్మం మెరుస్తూ ఉంటుంది. ఇందుకోసం స్నానం చేసేటప్పుడు సబ్బు రుద్దుకున్న తర్వాత ప్యూమిస్‌ స్టోన్‌తో శరీరమంతా వృత్తాకారంలో మసాజ్‌ చేయాలి.
పొడి చర్మానికి మేలు: పొడి చర్మం ఉన్నవాళ్లు సబ్బు నీళ్లలో నానబెట్టిన ప్యూమిస్‌ స్టోన్‌తో ఒళ్లు రుద్దుకంటూ ఉండాలి. ముందుగా ఆయిల్‌ మసాజ్‌ చేసుకుని ఆ తర్వాత ప్యూమిస్‌ స్టోన్‌తో రుద్దుకుంటూ ఉంటే మృతకణాలు తొలగి పొడిచర్మం తేమగా తయారవుతుంది.
అవాంఛిత రోమాలు తొలగాలంటే: ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించటం కోసం కూడా ప్యూమిస్‌ స్టోన్‌ను ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఫేస్‌ ప్యాక్‌ వేసుకున్న తర్వాత దాన్ని తొలగించటం కోసం ప్యూమిస్‌ స్టోన్‌ వాడాలి. అయితే ఆరిపోయిన ఫేస్‌ప్యాక్‌ను కొద్ది నీళ్లతో తడిపి మెత్తబడిన తర్వాతే ప్యూమిస్‌ స్టోన్‌తో రుద్దాలి. 

12:52 - April 9, 2016

మనకు కీరా దోసతో బోలెడన్ని లాభాలు ఉన్నాయి అని ఖచ్చితంగా తెలిసిందనుకోండి... కీరాను మన ఆహారంలో భాగం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించం?! తప్పక ప్రయత్నిస్తాం. అనేక వ్యాధులను దూరంగా ఉంచడంలోను, శరీర సౌందర్యాన్ని పెంచడంలోనూ, చివరికి బరువు తగ్గించడంలోనూ దోహదపడే కీరాను ఎవరైనా కొనకుండా ఉంటారా? అస్సలు ఉండరు కదా! అందుకే కీరాలో ఉన్న సుగుణాలేంటో వివరంగా తెలుసుకుని మీరు కచ్చితంగా మీ ఆహారంలో భాగం చేసుకోండి.
ఆరోగ్యపరంగా.... గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడే సుగుణాలు కీరాదోసలో ఉన్నాయి. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.  వీటిలోని పొటాషియం కండరాలకు మంచి చేయడమే కాదు, రక్తపోటును నియంత్రించడంలోనూ సాయపడుతుంది.  ఇందులోని మెగ్నీషియం రక్తప్రసరణ సజావుగా జరిగేలా చేస్తుంది.  కీరా కేన్సర్‌ వంటివాటిని రాకుండా నివారిస్తుందని వైద్య పరిశోధనల్లో తేలింది. చర్మం కాలినా, కమిలినా కీరారసాన్ని రాస్తే ఉపశమనం కలుగుతుంది. ఇందుకు కారణం కీరాలోని ఆస్కార్బిక్‌ యాసిడ్‌, సిలికాలే!
చిట్కా...
ఇంట్లో చీమలు ఉన్నాయా? అయితే, కీరాతొక్కలను గదిమూలల్లో ఉంచండి. చీమలు కనిపించవు.

11:37 - March 22, 2016

ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అలం ఒకటి. భారతీయులు దాదాపు 5000 సంవత్సరాల నుంచి అల్లాని వంటల్లోనే కాదు.. అనేక ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అల్లం దుంప లేదా వేరులాంటిది. ఇందులో విటమిన్స్ మరియు మాంగనీస్ మరియు కాపర్ వంటి విలువైన పోషకాలున్నాయి. దీంతో అద్భుతమైన వైద్యం చేవచ్చని నాటు వైద్యులు చెపుతారు. ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. అల్లం మంచి ఔషధంగా పని చేస్తుంది. అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పని చేస్తుంది . రక్త శుద్దికి తోడ్పడుతుంది . రక్తం రక్త నాళాల లో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది. అల్లం కొన్ని వారాలపాటు వాడితే .. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి . అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదక బ్యాక్టీరియాస్ సంహరించి, దంటాలను ఆరొగ్యము గా ఉండేలా చేస్తుంది.

షుగర్ నియంత్రణకు అల్లం...

షుగర్ జబ్బు నియంత్రణ చేయగలిగిన శక్తివంతమైన ఔషధం అల్లం అని సిడ్నీవిశ్వవిద్యాలయం పరిశోధనల్లో వెల్లడయ్యింది. అల్లము నుంది తీసిన రసాన్ని , అల్లం ముద్దగా నూరి అందించిన వారిలో రక్తములోని చెక్కెరలు కండరాలకు చేరే ప్రక్రియ వేగవంతం అవడము గమనించారు . ఇటుంటి ప్రక్రియ శరీరములో సహజము గా జరగాలంటే ఇన్సులిన్‌ అనే హార్మోను అవసరము . ఇన్సులిన్‌ లేకున్నా అల్లం రసము రక్తము లో చెక్కెరలను కండరాలకు చేర్చడం గమనించిన పరిశోదకులు అల్లం ఎలా పనిచేస్తుందో వివరించే పనిలో పడ్డారు .

అజీర్తికి....

అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పని చేస్తుంది. దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పని చేస్తుందనడంలో సందేహం లేదు. ఉబ్బసపు వ్యాధితో బాధపడే వారు అల్లం రసంలో తేనెను కలుపుకుని సేవిస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఆకలి బాగా వేస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా అల్లం ఉపయోగపడుతుంది.

12:33 - March 4, 2016

మంత్రాలకు చింతకాలయు రాలవు అనే సామెత మనం చాలా తరచుగా ఉపయోగిస్తుంటాము.. నిజమే. కానీ చింతకాయలు మాత్రం ఎండాకాలం వచ్చిందంటే మంత్రాలు లేకుండానే రాలిపోతుంటాయి. ప్రకృతి వనరుల్లో మనకి నిత్యం ఉపయోగపడే వృక్ష సంతతిలో చింతచెట్టు ఒకటి. దీనిని వాడని భారతీయుడంటూ ఎవరూ ఉండరు. తెల్లారి వంట పూర్తికావాలంటే చింతపండు లేకపోతే చింతతో అల్లాడిపోతాం. ఇటువంటి చింత గురించిన వివరాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే, ఈ చెట్టు ఆకులు, పువ్వులు, పండ్లు, కాండం అన్ని ప్రయోజన కరమైనవిగానే చెప్పుకోవాలి. ఇది ఆఫ్రికా దేశానికి చెందిన వృక్షం. దీనిని సంస్కృతంలో తింత్రిణీ అని, తెలుగులో చింత అని, కన్నడంలో హుళి అని, తమిళంలో పుళి అని, మరాఠీలో చించి అని, హిందీలో ఇంమ్లి అని అంటారు. చింతచెట్టు ఇంచుమించు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇవి వేసవికాలంలో కూడా దట్టంగా ఉండి చల్లని నీడనిస్తాయి. చింతాకులలో 10-40 చిన్న పత్రకాలుంటాయి. చింతపండు గుజురు మధ్యలో గట్టి చింతపిక్కలు ఉంటాయి.

ఉపయోగాలు

దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడి లో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది. చింతకాయలు లేతగా ఉన్నప్పుడు వాటి రసంతో చారు చేస్తారు.లేత చింతకాయలతో చట్నీ చేస్తారు. వాటి గుజ్జును పప్పులో కలుపుతారు, అయితే, లేత చింతకాయలను అధికంగా వాడకూడదు.

చింతకాయపచ్చడి...

ఎందుకంటే వీటిని ఎక్కువగా తింటే జలుబు చేస్తుంది. చింతకాయలు ముదిరి గింజ ఏర్పడినప్పుడు వాటితో నిలవ పచ్చడిని తయారుచేస్తారు. ఇవి ప్రత్యేకంగా సీజన్‌లో మాత్రమే లభిస్తాయి.

చింతకాయలతో, మిరపపళ్ళను కలిపి నిలవ పచ్చడిని తయారుచేస్తారు కొంతమంది. ముదిరిన చింత కాయకు వేడిచేసే గుణముంది. అది త్వరగా జీర్ణంకాదు. అతిగా తింటే కడుపులో మంట ఏర్పడుతుంది. పండితే సులువుగా జీర్ణమవుతుంది. చింతగుల్లనుంచి వచ్చిన చింతపండును వాడని వారుండరు. చింతపండును ఎండలో కొంత సమయం ఉంచి ఆ తర్వాత వాడటం ఆరోగ్యకరం. ఇందులో ఉండే పుల్లలు, గింజలు తీసి భద్రపరిస్తే పురుగు పట్టదు. చింతపండు తేలికగా అరుగుతుంది. ఆహార పదార్థాలకు రుచిని కలిగిస్తుంది. అమిత దాహాన్ని అరికడుతుంది. కొత్త చింతపండు కంటే పాత చింతపండును వాడటమే ఆరోగ్యకరం. లేత చింత ఆకులను చింతచిగురు అంటారు. దీన్ని ఆకుకూరగా వాడుతారు. చింతచిగురును నీడలో ఎండబెట్టి చింత చిగురు పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అన్నింటిలో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించి, రక్తం పట్టేలా చేస్తుంది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు.

చింతాకుతో: లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్నిరకాల పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్స్ లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.

చింతకాయతో: పులిహోర, పచ్చడి తయారుచేస్తారు. చింతచెట్టులోని ప్రతి భాగామూ ఉపయోగపడుతుంది. చింతచెట్టు వుంటే చింతే ఉండదంటారు పెద్దలు. ప్రతిరోజు వండే ఆహారపదార్థాల్లో చింతపండుకు ప్రత్యేకస్థానం ఉంది. చింతచిగురు, లేత చింతకాయలు, ముదురు చింతకాయలు, పండిన చింతగుల్లలు, చింతపువ్వు, చింతగింజలు ఎంతో ఉపయోగపడతాయి.

చింతపండు: పులుసు పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు. ఆసియాలో చింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు.

09:59 - December 11, 2015

ఏపండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్ గా మారిన ఎండు ఖర్చూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. ఈ పండులో ఔషధ గుణాలు కూడా ఎక్కువ. వీటిని రోజూ తింటే రోగ నిరోధకశక్తి ని పెంచే గుణం మెండుగా వుంటుందని వైద్య నిపులు చెప్తున్నారు.

ముస్లిం దేశాలనుంచి దిగుమతి....
ఖర్జూరాలు విస్తారంగా పండే సౌదీ అరేబియా, ఇరాన్‌, ఇరాక్‌, యుఏఈ, ఒమన్‌, ట్యునీసియా, జోర్డాన్‌ల నుంచి ప్రతి ఏటా రంజాన్‌ మాసంలో ఈ పళ్లు మన దేశానికి దిగుమతి అవుతూ ఉంటాయి. రంజాన్‌ మాసం వచ్చిందంటే చాలు, పరి పుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాస దీక్ష పూర్తవుతుంది. అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, మహ మ్మద్‌ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహారంగా పవిత్ర గ్రంథం, ఖోరాన్‌ పేర్కొంటోంది. ఆయన ఇం టికి కలపనిచ్చింది కూడా ఖర్జూర చెట్టేననీ చెబు తారు. ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వీటిని నేరుగా తినటంతోపాటు కుకీస్‌, పచ్చళ్లు, హల్వా, చాక్లెట్లు, సిరప్‌, పాయసం తయారీల్లో కూడా ఉపయోగిస్తారు.
వివిధ దశలలో పేర్లు.......
ఖర్జూరాలు 4 దశల్లో పండుతాయి. అరబిక్‌ భాషలో ఆ దశలకు వేర్వేరు పేర్లు న్నాయి. పండని పళ్లను కిమ్రి అని, పెద్దవిగా పెరిగి కరకరలాడే ఖర్జూరాలను ఖలాల్‌ అని, పక్వానికొచ్చి మెత్తబడినవాటిని రుతాబ్‌ అని, ఎండు ఖర్జూరాలను తరమ్‌ అని పిలుస్తారు. ఈ అరబిక్‌ పేర్లే ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నాయి. ఖర్జూరం విత్తనానికి 2 వేల ఏళ్ల తర్వాత కూడా మొలకెత్తే సామర్థ్యం ఉంటుంది.

ఖర్జూరం - ఉపయోగాలు...

ఖర్జూర పండ్లు విటమిన్ ఎ, బిలను కలిగి ఉంటాయి ఈ రెండూ ఇందులో ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచుటలో ఎంతగానో ఉపయోగపడతాయి.
ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి.

ఖర్జూరపండు శరీరంలో అధికంగా గల వాతమున్ని పోగొడుతుంది.

ఉదయాన్నే మలబద్దకముతో బాధపడే వారు, రాత్రి పాలల్లో4నుండి5ఎండు ఖర్జూర పండ్లు వేసి మరగబెట్టి, రాత్రి నిద్రించే ముందు తాగుతూ ఉంతే మలబద్దకము తగ్గుతుంది.

నీరసము, నిస్సత్తువతో బాధపడుతున్నవారు, కొన్ని నెలల పాటూ రోజుకు15నుండి 20 ఖర్జూర పండ్లు భోజనము తర్వాత తీసుకుంటూ ఉంటే నీరసము, నిస్సత్తువ పూర్తిగా పోయి మంచి బలానిస్తుంది.

రకహీనతతో బాధపడుతున్నవారు, రక్తం బాగా పోయి ఉన్నవారు, నీరసముగా ఉండేవారు, ఖర్జూర పండ్లు, పాలు, మీగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్నే అల్పాహారం గా తీసుకుంటూ ఉంటే రక్తం వృద్ధి చెందును, పోగొట్టుకున్న శక్తి తిరిగి పొందవచ్చు..
ఎండా కాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి రక్షించబడుతారు.
మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూరపండు పెడితే మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.
గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు.

డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది.

మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూరపండు తరచుగా తినాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - ఉపయోగాలు