ఉమెన్ చాంది

13:32 - July 31, 2018

పశ్చిమగోదావరి : ఏపీసీసీ ఇంచార్జ్‌ ఉమెన్‌ చాంది పర్యటిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు బూత్‌ లెవల్‌ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలతో తప్ప ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకునేది లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వీడిన నేతలు తిరిగి పార్టీలోకే చేరుతున్నారంటున్నారు ఏపీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ ఉమెన్ చాందీ. 

21:39 - July 9, 2018

విజయవాడ : ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమన్‌ చాందీ తెలిపారు. అక్టోబర్‌ 2 నుంచి ప్రతి ఇంటికి వెళ్లి... కాంగ్రెస్‌ పార్టీ విధివిధానాలను తెలియజేస్తామన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి రోజైనా అక్టోబర్‌ 31 నుంచి.. నవంబర్‌ 19 వరకు ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్‌ నాటికి.. బూత్‌ స్థాయి నుంచి నియోజకర్గం స్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు ఉమెన్‌ చాందీ. 

16:37 - June 13, 2018

విజయవాడ : ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ఏపీ ప్రజలను నమ్మించి మోసం చేశారాని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఉమెన్‌ చాందీ విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని మోదీ అమలు చేయకపోవడాన్ని చాందీ తప్పుపట్టారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా హోదా సాధించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని మండిపడ్డారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. 

Don't Miss

Subscribe to RSS - ఉమెన్ చాంది