ఎంపీలు

20:13 - February 12, 2018

ఆంధ్రప్రదేశ్ ప్రజలారా..? ఈ తెల్గుదేశం పార్టీ ఎంపీలను పొరపాటున గూడ నమ్మేరు సుమా..? చంద్రబాబు రాశిన నాట్కమే ప్రదర్శిస్తున్నరు..అమ్మరే కొడ్క నిన్న పొద్దుందాముల.. తెలంగాణ జేఏసోళ్లకు జర్రంతల గుండాగినంత పనైంది.. ఒకప్పుడు యుద్దాలు ఒక గ్రౌండుల అయ్యేటియి.. సైనికులు గుర్రాలు ఏస్కోని కత్తులు వట్కోని పొడ్సుకుందురు...రైతుకు మద్దతు ధర దొర్కితె.. రైతులే సర్కారుకు ఉల్టా నాల్గువేలు ఇస్తరుగదా..? రెండువేల పదిహేడు వొయ్యింది.. ఇప్పుడు పద్దెన్మిది.. పాండ్రి ఊర్లపొంటి పరిస్థితి జూద్దాం..నల్లగొండ ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి.. ఆయన ప్రజలకు సేవ జేయవల్సింది ఇడ్సిపెట్టి ప్రజలతోని చెప్పులు మోపిచ్చుకుంటున్నడు..పక్వానికి రాని అర్టిపండ్లను దీస్కొచ్చి అవ్వి ఎర్రగ అయ్యెతందుకు ఏమేం పనులు జేస్తున్నరో సూడుండ్రి.. ఇవ్వి మనకు తెల్వయ్ గదా..? ముద్దుగున్నయని డజన్ డజన్ కొని తింటా ఉంటం..గిసొంటి ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి...

15:15 - February 12, 2018

హైదరాబాద్ : ఎప్పుడూ వివాదాల్లో ఉండే ప్రముఖ దర్శకుడు 'రాంగోపాల్ వర్మ' ఈసారి టిడిపి ఎంపీలను టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదా..ఇతర హామీలు అమలుపరచాలని టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. వీరు చేస్తున్న ఆందోళనపై 'వర్మ' వివాదాస్పద ట్వీట్లు చేశారు. టిడిపి ఎంపీలను బ్రోకర్ తో పోల్చారు. వారి వల్ల పరువు పోతోందని ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఇలాంటి ఎంపీలను చూసి ప్రధాన మంత్రి మోడీ జోక్ గా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. టిడిపి ఎంపీలు బ్రోకర్లకు తక్కువగా అంటూ ట్వీట్ చేసిన వర్మ మరో ట్వీట్ కూడా చేశారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన టిడిపి పార్టీ పరువును జాతీయ స్థాయిలో పరువు తీస్తున్నారంటూ వర్మ పేర్కొన్నారు. వర్మ చేసిన ట్వీట్ పై టిడిపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

12:07 - February 12, 2018

గుంటూరు : రామ్ గోపాల్ వర్మ మరో ట్విట్ చేశారు. టీడీపీ ఎంపీల పోరుపై వర్మ సెటైర్లు వేశారు. వర్మ ఎంపీలను జోకర్లుగా పోల్చారు. ఎంపీల వల్ల టీడీప పరువుపోతుందని ఆర్ జీవీ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:22 - February 11, 2018

ఢిల్లీ : అందుబాటులో ఉన్న ఎంపీలతో కాసేపట్లో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పరిణామాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర నిధులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు హరిబాబు విడుదల చేసిన 27 పేజీలపై దృష్టి సారించారు. వాస్తవంగా నిధులు చెప్పి హరిబాబుకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎంపీలతో భేటీ అనంతరం చంద్రబాబుతో కేంద్రమంత్రి సుజనా చౌదరి ఏకాంత భేటీ కానున్నారు. కేంద్ర నిధులు, హామీలపై చంద్రబాబుతో సుజనా చౌదరి చర్చించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:41 - February 9, 2018

ఢిల్లీ : 

పార్లమెంట్‌లో ఐదోరోజు ఏపీ ఎంపీలు ఆందోళనను ఉధృతం చేశారు. సమాశాలకు చివరి రోజు కావడంతో నినాదాలతో హోరెత్తించారు. లోక్‌సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరసన గళం వినిపించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ టీడీపీ, వైసీపీ సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుమట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్‌ పలుమార్లు వారించినా వినకపోవడంతో సభను వాయిదా వేశారు.

 

టీడీపీ, వైసీపీ సభ్యుల ఆందోళన
తిరిగి సభ ప్రారంభమైనా టీడీపీ, వైసీపీ సభ్యులు ఆందోళన విరమించలేదు. స్పీకర్‌ పోడియం ముందు నిరసన తెలిపారు. పెద్దగా నినాదాలు సభా కార్యక్రమాలు అడ్డుకున్నారు. దీంతో స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ సభను మార్చి 5కు వాయిదా వేశారు.అటు రాజ్యసభలోనూ ఏపీ ఎంపీల నిరసన కొనసాగింది. టీడీపీ, కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఏపీకి న్యాయం చేయాలని కోరారు. దీంతో సభ 12 గంటలకు వాయిదా పడింది.

రాజ్యసభ 12గంటలకు తిగిరి ప్రారంభమైనా టీడీపీ, కాంగ్రెస్‌ సభ్యులు వెనక్కితగ్గలేదు. ఏపీకి న్యాయం చేయాల్సిందేనని పట్టుబట్టారు. రాజ్యసభ చైర్మన్‌ పదేపదే వారించినా సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభ మరోసారి వాయిదా పడింది.

మధ్యాహ్నం 2.30కు మళ్లీ రాజ్యసభకాగానే టీడీపీ, కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన చేపట్టారు. టీడీపీ సభ్యులు ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ ఎంపీల తీరును తప్పుపట్టారు. ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో ఒకవైపు భాగస్వామిగా ఉంటూ... మరోవైపు ఆ ప్రభుత్వ నిర్ణయాన్నే తప్పుపట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. ఏపీకి న్యాయం చేయడంపై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ది ఉంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే వారు చేసే ఆందోళనకు నైతికత ఉంటుందని స్పష్టం చేశారు.

రాహుల్‌గాంధీ మద్దతు
కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై 5 రోజులుగా ఏపీ ఎంపీలు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ ఏపీ ప్రజలు చేస్తున్న డిమాండ్లకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటించారు. ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలన్న డిమాండ్లకు ఆయన మద్దతు తెలిపారు. ఏపీకి న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు ఏకమై పోరాడాలని సూచించారు.ఏపీకి న్యాయం చేసేంత వరకు ఎంతవరకైనా వెళ్తామని ఎంపీలు తేల్చి చెబుతున్నారు. ఢిల్లీలోనేకాదు.. ఇక నుంచి గల్లీల్లోనూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఏపీకి న్యాయం చేయకపోతే కాంగ్రెస్‌కు పట్టినగతే బీజేపీకి పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

21:40 - February 9, 2018

ఢిల్లీ : ఏపీ ప్రజల మనోభావాలు కేంద్రానికి ఏమాత్రం పట్టలేదని టీడీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా నిరసనలు చేపట్టినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. మూడోసారి ఏపీపై అరుణ్‌జైట్లీ ప్రకటన చేసినా.. ఎలాంటి నిధుల ప్రస్తావనే లేదన్నారు. దీంతో జైట్లీ ప్రకటనత తమలో అసంతృప్తి నెలకొందన్నారు. చంద్రబాబు ఆదేశాలతో కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. రేపు మరోసారి అరుణ్‌జైట్లీని కలిసి విభజన హామీలపై చర్చిస్తామని స్పష్టం చేశారు.

15:13 - February 9, 2018

ఢిల్లీ : ఏపీ ఎంపీల నిరసనలతో లోక్‌సభ దద్ధరిల్లింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సమావేశంలోను ఎంపీలు ఆందోళన కొనసాగించారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ వాదించినా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. సభ సజావుగా జరగకపోవడంతో స్పీకర్ సభను మార్చి 5 తేదీ వరకూ వాయిదా వేశారు. అటు రాజ్యసభలోను ఏపీ ఎంపీల ఆందోళనలు కొనసాగాయి. వాయిదా అనంతరం ప్రారభమైన సభలోను ఎంపీలు నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను రెండోసారి వాయిదా వేశారు. సభ మళ్లీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభం కానుంది. 

09:48 - February 9, 2018

ఢిల్లీ : పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఎంపీల ఆందోళన కొనసాగనుంది. టీడీపీ ఎంపీలు కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతున్నారు. ఆందోళన కొనసాగించానలని చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో ఎంపీలకు సూచించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. 10 గంటలకు ఏపీ భవన్ అంబేద్కర్ విగ్రహం ధర్నా చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

12:53 - February 8, 2018
12:39 - February 7, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌లో ఇవాళ కూడా ఏపీ ఎంపీల ఆందోళనలు కొనసాగనున్నాయి. విభజన హామీల అమలుపై ఇంకా స్పష్టత వచ్చే వరకు ఆందోళన చేస్తామని ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కాసేపట్లో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో వైసీపీ ఎంపీలు భేటీ కానున్నారు. అలాగే భవిష్యత్‌ వ్యూహంపై సుజనాచౌదరి నివాసంలో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఎంపీలు