ఎన్టీఆర్

11:10 - January 31, 2018

అజ్ఞాతవాసి సినిమా డిజస్టర్ నుంచి తెరుకున్న తెరుకున్న మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు తన తర్వాతి సినిమా పై దృష్టి పెట్టాడు. త్రివిక్రమ్ నెక్ట్స్ చిత్రం ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. జై లవ కుశ తో ఊపు మీద ఉన్న ఎన్టీఆర్ ఆ ఊపు కొసాగించాలని చూస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనేది తెలడం లేదు. మొదట్లో అనుపమ పరమేశ్వరన్, అను ఇమ్మన్యుయల్ పేర్లు బయటకు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో పూజ హెగ్డే ను తిసుకున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని యుద్దపూడి సులచన రాణి నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారని వినబడుతుంది.

21:07 - January 18, 2018

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 22వ వర్ధంతి సందర్భంగా... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో నివాళులు అర్పించగా... ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలు ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. తెలుగు చరిత్ర ఉన్నంత వెరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఆయన అన్నారు. పేదవారి కోసం ఎన్టీఆర్‌ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.. ఎన్టీఆర్‌ను స్మరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర నివాళులు
మరోవైపు నారా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర నివాళులర్పించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు బ్రహ్మణి కూడా ఎన్టీఆర్‌ ఘాట్‌ చేరుకుని సమాధిపై పుష్ప గుచ్చం ఉంచి నివాళి అర్పించారు. అంతకుముందు నందమూరి కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. హరిక్రిష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎన్టీఆర్ యుగ పురుషుడని.. ఆయన కడుపున పుట్టడం తాను చేసుకున్న పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని ఎన్టీఆర్‌ ఓ రాజకీయ దురంధరుడు అని ఎన్టీఆర్‌ మరో కుమారుడు బాలకృష్ణ కీర్తించారు. ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించిన బాలకృష్ణ తెలుగు వారి గుండె చప్పుడు, ఆరాధ్య దైవమని అన్నారు. ఎన్టీఆర్‌ సాధించింది విక్టరీ కాదు హిస్టరీ అని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు.ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన లక్ష్మీపార్వతి... ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని చంద్రబాబు అభ్యర్ధనలు కూడా పంపలేదని విమర్శించారు. 

10:10 - January 18, 2018

హైదరాబాద్ : టి.టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై కలకలం రేపుతున్నాయి. మోత్కుపల్లి పార్టీ మారుతారని, అందుకే కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ కు వస్తే బాగుండేదన్నారు. తెలంగాణలో టిడిపి పార్టీ ఇబ్బందుల్లో ఉందని, టి.టిడిపిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భుజాన వేసుకుని పార్టీని నడపాలని అనుకున్నట్లు కానీ ఎవరూ సహకరించడం లేదన్నారు. అందుకోసం టి.టిడిపిని టీఆర్ఎస్ లో విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై టి.టిడిపి అధిష్టానం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయనపై చర్యలు తీసుకుంటారా ? అనేది తెలియరావడం లేదు.

2014 సాధారణ ఎన్నికల అనంతరం భారీగా వలసలు పెరిగాయి. పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సరిగ్గా పార్టీని పట్టించుకోవడం లేదని పలు సందర్భాల్లో మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. టి.టిడిపి నుండి బయటకు వెళ్లాలనే మోత్కుపల్లి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ లోని కొంతమంది వ్యక్తులతో మోత్కుపల్లి చర్చలు జరుపుతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. 

09:26 - January 18, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంపై ఇప్పటికీ తాను పోరాటం చేస్తూనే ఉన్నానని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న ఆమె ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ...ద్రోహం చేసిన వారిని ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తున్నట్లు, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అవినీతిలో కూరుకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన చరిత్రను వక్రీకరించి, మహానేరాన్ని తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఎన్టీఆర్ గుండెపోటుకు కారకులైన వ్యక్తులు అవినీతిలో కూరుకపోయారని పేర్కొన్నారు.

 

08:26 - January 18, 2018

హైదరాబాద్ : ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఘాట్ కు చేరుకుని పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, హరికృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, భువనేశ్వరీలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక యుగపరుషుడని, ఆయన కడుపున పుట్టడం తమ పునర్జన్మ సుకృతమన్నారు. ఆయన గురించి చెప్పాలంటే తరాలు..యుగాలు చాలవని, తెలుగు జాతి ఉన్నంత కాలం ప్రతింటా ఆ మహానుభావుడు జీవించి ఉంటాడన్నారు. ఎన్టీఆర్ అంటే నేషనల్ టైగర్ ఆఫ్ రిఫార్మ్స్ అని తెలిపారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ఉందని, దీని కోసం ప్రతొక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

తెలుగు జాతి చప్పుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. తెలుగు జాతి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడన్నారు. యావత్ భారతదేశం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు వారికి సేవ చేయాలన్న సంకల్పంతో టిడిపిని స్థాపించారని, ఎన్టీఆర్ కు భారతరత్న కోసం పోరాడుతామన్నారు. 

11:25 - December 12, 2017

బాహుబలితో దేశ సినీ చరిత్రలో రికార్డు క్రియేట్ చేసిన దర్శధీరుడు రాజమౌళి ఇప్పుడు ఓ మల్టీస్టారర్ చిత్రం తీయబోతున్నారు. అందులో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా చేయనున్నా సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్లు ఎవరు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా చేయబోతున్నట్లు సమాచారం. ఇమ్మాన్యుయేల్ అజ్ఞాతవాసిలో పవన్ సరసన నటించారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో నటిస్తున్నారు. అంతే కాదు బోయపాటి దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న చిత్రంలో కూడా అనును హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోయిన్ దొరికింది మరి చరణ్ ఎవరు తెలియాల్సి ఉంది.

10:50 - December 5, 2017

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి యూరప్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మధ్య జై లవకుశ సినిమా విజయం, బిగ్ బాస్ షో తో బిజీగా గడిపిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ లేదు కాబట్టి ఆయన భార్య, కుమారుడితో కలిసి విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. ఆయన తిరిగి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అంతే కాదు రాజమౌళి మల్లీస్టారర్ మూవీలో కూడా ఎన్టీఆర్ చేయనున్నారు. అయితే ఇది వరకే ఆయన యూరప్ వెళ్లాల్సి ఉంది కానీ ఆయన కుమారుడు అభయ్ వీసా సమస్య వల్ల కాస్త ఆలస్యమైనట్టు తెలుస్తోంది. 

10:52 - November 20, 2017

సినిమా : దేశంలో సినీ చరిత్రలో రికార్డు సృష్టించిన దర్శకుడు రాజమౌళి. ఆయన తీసిన బాహుబలి దేశావ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. అయితే బాహుబలి తర్వాత ఆయన ఇంత వరకు ఏ సినిమాను మొదలు పెట్టలేదు. కాని ఆయన లేటెస్టుగా ట్వీట్టర్ లో మెగా స్టార్ చిరు తనయుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలసి దిగిన ఫోటో పోస్టు చేశారు. దీంతో చరణ్, ఎన్టీఆర్ తో జక్కన్న మల్టీస్టారర్ తీయబోతున్నాడా అనే వార్తాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా చరణ్ రంగస్థలం చేస్తున్నారు.

15:29 - November 14, 2017

హైదరాబాద్ : తన అనుమతి లేకుండా సినిమా తీస్తున్నారంటూ లక్ష్మీస్‌ వీరగ్రంథం నిర్మాతపై లక్ష్మి పార్వతి మండిపడ్డారు. తన పేరు పక్కన తనకు సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టి సినిమా తీయడం, ఎన్టీఆర్‌ను అవమానించడమేనని లక్ష్మిపార్వతి అన్నారు. సినిమా నిర్మాతపై న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద షూటింగ్ చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధిపై పాలు పోసి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతితో టెన్ టివి ముచ్చటించింది. నిర్మాతపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:14 - November 10, 2017

విజయవాడ : ఏపీ శాసనసభ ప్రతిపక్షం లేకుండానే కొనసాగుతోంది. శుక్రవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంపై టిడిపి సభ్యులు మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రాజీవ గృహ కల్ప పథకం పెట్టి..పూర్తి చేయలేదని టిడిపి ఎమ్మెల్యే ఆంజనేయులు పేర్కొన్నారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరిట పేదలకు గృహాలు నిర్మించి ఇవ్వడం గర్వకారంగా ఉందన్నారు. పట్టణ హౌసింగ్ లో ఎక్కువ లబ్ది చేకూరడం సంతోషదాయకమన్నారు. చిన్న చిన్న పట్టణాలు..లోటు బడ్జెట్ తో ఇబ్బందులు పడుతున్నాయని..అంబుడ్స్ లో వీటికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. గ్రామాల్లో శ్మశానాలను అభివృద్ధి చేస్తున్నారని..కానీ మున్సిపాల్టీలో శ్మశానాలను ఆధునీకరించాలని..ఇందుకు బడ్జెట్ కేటాయించాలన్నారు.

ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం గొప్పదని..హౌసింగ్ గ్రాంట్ కింద 2.50 లక్షలు నేరుగా లబ్దిదారుడుకు చేరడం గతంలో ఎప్పుడూ లేదని విశాఖపట్టణం పశ్చిమ ఎమ్మెల్యే జీవీ ఆర్ నాయుడు పేర్కొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో తాము వెళితే ప్రజలు చక్కటి స్వాగతం పలికారని పేర్కొన్నారు. నగరాల్లో గృహాల సంఖ్య పెంచితే బాగుంటుందని..గతంలో నిర్మాణాల బాగు చేసుకొనే విషయాన్ని ఆలోచించాలన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఎన్టీఆర్