ఎన్డీయే

15:13 - April 18, 2018

హైదరాబాద్ : ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలు ప్రతిఘటించేందుకు ఐక్యపోరాటాలు అవసరమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపు ఇచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల్లో సీతారాం ఏచూరి.. దేశంలో పెరిగిపోతున్న అత్యాచారాలు ఆందోళన వ్యక్తం చేశారు. 

20:45 - April 7, 2018

ఆల్ టైమ్ రికార్డు స్థాయికి పెట్రోల్..డీజిల్ ధరలు చేరుకుంటున్నాయి. విపరీతమైన పన్నులు బాదుతూ క్రూడాయిల్ ధరలను పాలకులు సాకుగా చూపుతున్నారు. పెట్రో ధరల ప్రభావంతో నిత్యావసర ధరలు..రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలు బెంబేలెత్తుతున్నారు. ఈ అంశంపై టెన్ టివి బిగ్ డిబేట్ నిర్వహించింది. ఈ చర్చలో పాల్గొని శశికుమార్ (ఆర్థిక నిపుణులు), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), మందా జగన్నాథం (టీఆర్ఎస్), శ్రీధర్ రెడ్డి (బీజేపీ), రాజీవ్ (తెలంగాణ పెట్రోల్ సంఘం నేత) అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

07:06 - March 18, 2018

ఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గడ్డుకాలమే అంటున్నారు విశ్లేషకులు. జరుగుతున్న పరిణామాలు.. వెల్లడవుతున్న ఫలితాలు పరిశీలిస్తే.. ఇది వాస్తవ రూపం దాల్చే పరిస్థితే కనిపిస్తోంది. విపక్షాలు ఐక్యంగా రంగంలోకి దిగితే బీజేపీ విడిగా.. వంద స్థానాలకు మించి దక్కించుకునే అవకాశం లేదని విశ్లేషకుల అంచనా. బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా ఇదే రకమైన అంచనా వేసింది.

 • కమలం గుబాళింపులు తగ్గినట్లేనా..?
 • మోదీ-అమిత్‌షా నేతృత్వంలో 21రాష్ట్రాల్లో బీజేపీ పాలన..!
 • 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు..!
 • బీజేపీలో 2019 ఎన్నికల కలవరం
 • ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ దూరం
 • యూపీ, బీహార్‌ ఉప ఎన్నికల్లో వాడిన కమలం
 • గోరఖ్‌పూర్‌ ఫలితంతో కొత్త అంచనాలకు ఊతం
 • గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి
 • సీఎం ఆదిత్యనాథ్‌ అడ్డాలోనే కమలనాథులకు పరాభవం
 • 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బంపర్‌ మెజారిటీ
 • ఏడాదిలోపే చతికిలపడ్డ కమలదళం..!
 • ఎస్పీ, బిఎస్పీ కలయికతో కమలదళానికి షాక్‌
 • వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి..?
 • 2014, 2017 ఎన్నికల్లో ఓట్ల శాతంపై విశ్లేషణ
 • 2017లో యూపీలో 403 స్థానాలకు ఎన్నికలు
 • 325 స్థానాల్లో బీజేపీ జయకేతనం
 • 47చోట్ల ఎస్పీ, 19 చోట్ల బీఎస్పీ, ఏడింట కాంగ్రెస్‌ గెలుపు
 • విడివిడిగా తలపడ్డ ఎస్పీ, బీఎస్పీ
 • గోరఖ్‌పూర్‌ తరహాలో సాగి వుంటే 50చోట్ల బీజేపీకి గడ్డుస్థితి..!
 • ఎస్పీ, బీఎస్పీ ఓట్లు కలిపితే 57చోట్ల ఈ కూటమికే విజయం..!
 • బీజేపీ 23 స్థానాలకే పరిమితం అయ్యే పరిస్థితి
 • ఎస్పీ, బీఎస్పీల ఓట్లు కలిపితే 1.45 లక్షల ఓట్ల లీడ్‌
 • 23 స్థానాల్లో మాత్రమే బీజేపీకి 58వేల లీడ్‌
 • వారణాసి, ఘజియాబాద్‌, గౌతంబుద్ధనగర్‌లో బీజేపీకి లక్ష మెజారిటీ
 • 2014 ఎన్నికల్లోనూ ఇదే తరహా పరిస్థితి
 • 2014లో 80కి గాను 73 ఎంపీ స్థానాలు గెలిచిన బీజేపీ
 • ఎస్పీ, బీఎస్పీల ఓట్లు కలిపితే 41 స్థానాల్లో లీడ్‌
 • బీజేపీ 37 స్థానాలకే పరిమితమయ్యే పరిస్థితి
 • ఎన్డీయేతో కలహాల కాపురం చేస్తోన్న శివసేన
 • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 110 సీట్లు తగ్గుతాయన్న శివసేన
 • మోదీ పీఎం అయ్యాక 10చోట్ల ఉప ఎన్నికలు
 • తొమ్మిది స్థానాల్లో బీజేపీ పరాజయం
 • మసకబారుతోన్న మోదీ ప్రాభవం..!
 • 2019లో లౌకిక పక్షాల కూటమికి అనుకూలం..!
06:29 - March 17, 2018

ఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 100-110 సీట్లకు పడిపోతుందని ఎన్డీయే మిత్రపక్షం శివసేన జోస్యం చెప్పింది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ ఉప ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుందని అంచనా వేసింది. ఈశాన్య రాష్ర్టాల అసెంబ్లీ ఫలితాల్లో సత్తాచాటిన బిజెపికి గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్‌లో వెలువడిన లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేశాయని పేర్కొంది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థుల గెలుపుతో కమలం క్యాంపులో కలవరం మొదలైందని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో వివరించింది. 2014లో ప్రజాదరణతో బీజేపీ భారీ విజయం సాధించిందని, ప్రస్తుతం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అందులో పేర్కొంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బిజెపి 9 లోక్‌సభ స్థానాలను కోల్పోయి 282 నుంచి 272 స్థానాలకు మెజారిటీకి పడిపోయింది.

 

09:23 - March 16, 2018
09:14 - March 16, 2018

విజయవాడ : నాలుగేళ్ల బంధం విడిపోనుంది...టిడిపి - బిజెపి అనుబంధం తెగిపోనుంది..బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని తాజాగా టిడిపి నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. విభజన హామీలు..ప్రత్యేక హోదాపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై టిడిపి గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. కేంద్రంతో పోరాడి హక్కులు సాధించుకుంటామని చెబుతున్న టిడిపి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో రాజీనామా చేసిన టిడిపి ఎన్డీయేలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే జనసేన అధినేత పవన్ ఏపీ ప్రభుత్వం..సీఎం చంద్రబాబు..నారా లోకేష్ లపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతుండడంతో అధికారపక్షంపై విమర్శలు అధికమయ్యాయి. చివరకు వైసీపీకి మద్దతివ్వాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. కానీ తామే సొంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు..ఎంపీలు..ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఎన్డీయేలో నుండి బయటకు రావాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సాయంత్రం జరిగే టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు అధికారికంగా నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. టిడిపి తీసుకొనే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. 

21:53 - March 8, 2018

విజయవాడ : ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలతో కలిసిపోరాడే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. కేంద్రం చేసిన మోసంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రుల రాజీనామాతో సరిపెట్టకుండా, ఎన్డీయే నుంచి కూడా బయటకు రావావాలని మధు డిమాండ్‌ చేశారు. 

18:54 - February 28, 2018

పాట్నా : బిహార్‌ మాజీ సిఎం, దళిత నేత జీతన్‌రాం మాంఝీ ఎన్డీయేకు గుడ్‌బై చెప్పి మహాకూటమిలో చేరారు. ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్‌ ఆయనను స్వాగతించారు. మాంఝీ గత కొంతకాలంగా ఎన్డీయే తీరుపై అసంతృప్తితో ఉన్నారు. మార్చి 23న ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో బిజెపి కూటమి నుంచి వైదొలగాలని మాంఝీ నిర్ణయం తీసుకున్నారు.

 

 

20:51 - January 28, 2018

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా సాగే ఈ సమావేశాలు... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. ట్రిపుల్ తలాక్, FRDA, ఓబీసీ బిల్లులతో పాటు... సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల మధ్య వివాదం కూడా ఈసారి సమావేశాల్లో చర్చకు రానున్నాయి. సమావేశాల్లో సహకరించాలని కోరుతూ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా.. సాయంత్రం స్పీకర్ అధ్యక్షతన అన్ని పార్టీలతో మరో భేటీ జరిగింది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి జరిగే సమావేశాలు హాట్‌హాట్‌గా సాగనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో సహకరించాలని కోరుతూ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్‌ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీకి అన్ని పార్టీల ప్లోర్ లీడర్లు హాజరయ్యారు. హోంమంత్రి రాజ్‌నాథ్, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, విజయ్ గోయల్‌తో పాటు కాంగ్రెస్ తరపున గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింథియా, సీపీఎం నుంచి కరుణాకరన్, సీపీఐ నుంచి డి. రాజా, ఎస్పీ నుంచి ములాయం సింగ్ యాదవ్, టీడీపీ నుంచి తోట నర్సింహాం, సీఎం రమేశ్, వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి కే కేశవరావు, జితేందర్‌రెడ్డి, ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన సభ్యులు... తమ డిమాండ్లను ప్రస్తావించారు. విభజన హామీలు అమలు చేయాలని ఇరు రాష్ట్రాల ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ట్రిపుల్ తలాఖ్ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని.. సమావేశం అనంతరం... కేంద్రమంత్రి అనంతకుమార్ తెలిపారు.ఈ బిల్లును రాజ్యసభ ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జీఎస్టీలాగే ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఏకాభిప్రాయం సాధిస్తామన్నారు. బడ్జెట్ సమావేశాలపై విపక్షాల సలహాలను స్వీకరించామన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం... సాయంత్రం లోక్‌సభా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. బడ్జెట్‌ సమావేశాలకు సహకరించాలని.. కీలక బిల్లులకు చర్చించి సహకరించాలని సభా మర్యాదలను కాపాడాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు.

సోమవారం సమావేశాల మొదటి రోజు ... ఉభయ సభలను ఉద్ధ్యేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో తన తొలి ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. దేశానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాలను వివరిస్తారు. అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అనంతరం... సభ వాయిదా పడుతుంది. మధ్యాహ్నం ఒకటిన్నరకు BAC సమావేశం జరుగుతుంది. ఈ భేటీలోనే చర్చకు రాగానే అంశాలు, బిల్లులు, తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ భేటీ అనంతరం.. ప్రధాని అధ్యక్షతన మూడున్నర గంటలకు NDA సమావేశం జరుగుతుంది. సభలో ప్రభుత్వానికి మిత్రపక్షాలు సహకరించాలని మోదీ.. విజ్ఞప్తి చేయనున్నారు. తరువాత 30, 31 తేదీలు సభకు సెలవు. తిరిగి ఫిబ్రవరి ఒకటిన సభలో అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 9 వరకు తొలి దశ బడ్జెట్‌ సమావేశాల అనంతరం విరామం ఇవ్వనున్నారు.

తిరిగి మార్చి 5 నుండి ఏప్రిల్‌ 6వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను చర్చకు తీసుకురానున్నారు. ఎఫ్‌ఆర్డీఐ బిల్లు, త్రిపుల్‌ తలాక్‌ బిల్లు, ఎన్‌సీబీసీకి రాజ్యాంగ హోదా వంటి కీలక బిల్లులను ఆమోదం చేసుకోడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు దేశంలో నెలకొన్న సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. సరిహద్దుల్లో నెలకొన్న వివాదం, సుప్రీం కోర్ట్‌ న్యాయ మూర్తుల వివాదం, వంటి వాటిని చర్చకు తీసుకురావాలని విపక్షాలు చూస్తున్నాయి.

14:34 - July 19, 2017

ఢిల్లీ : రైతుల అంశంపై రాజ్యసభ దద్దరిల్లింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్‌, జెడియు లేవనెత్తాయి. రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి బదులు తూటాలు పేల్చారని మందసౌర్‌ ఘటనని పరోక్షంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ధ్వజమెత్తారు. 150 మంది రైతులు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్నా... ప్రభుత్వం ఎందుకు మౌనం వీడడం లేదని ఆయన ప్రశ్నించారు. దిగుమతి సుంకం అవినీతికి ఆస్కారమిస్తోందని డిగ్గీ ఆరోపించారు.

దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 20 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జెడియు నేత శరద్‌ యాదవ్‌ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని ఆరోపించారు. పప్పు దినుసులు బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. 267 నిబంధన కింద రైతుల సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించిందని రాజ్యసభ డిప్యూటి చైర్మన్‌ కురియన్‌ చెప్పడంతో అక్కడితో ఆ అంశం సద్దుమణిగింది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఎన్డీయే