ఎమ్మెల్యే

12:58 - August 1, 2018

చిత్తూరు : అధికారులకు అవగాహన లేక దేవుడి ప్రతిష్టను దిగజారుస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ...రమణ దీక్షితులను సీఎం చంద్రబాబు అవమానించడం పాపమని, శ్రీవారి ఆభరణాల వివరాలను ఆన్ లైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో ఆసుపత్రికి వెళ్లడానికి సౌకర్యం వెళ్లకపోవడంతో గర్భిణీ తన బిడ్డను కోల్పోయిందని..ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇది జరిగిందన్నారు. గిరిజనులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

12:25 - August 1, 2018

శ్రీకాకుళం : టిడిపి నేతలు దీక్షలు చేపడుతున్నారు. ఇటీవలే టిడిపి నేత కన్నబాబు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ ఇన్ ఛార్జీ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ఆయన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మౌన దీక్ష చేపట్టడం చర్చానీయాంశమైంది. అధికారుల తీరును నిరసిస్తూ ఆయన దీక్ష చేపడుతున్నారు.

ఆఫ్ షోర్ జలాశయం పనుల పూర్తిలో జాప్యంపై పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర శివాజీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జులై 31వ తేదీ నాటికి పూర్తి కావాల్సిన జలాశయం పూర్తి కాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ 50 శాతం కూడా పనులు పూర్తి కాకపోవడంపై అధికారుల తీరును నిరసిస్తూ ఆయన మౌన దీక్ష చేపట్టారు. టిడిపి పార్టీ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టారు. ఆయనకు టిడిపి నేతలు సంఘీభావం ప్రకటించారు. 

09:49 - July 31, 2018

అమరావతి : కడప జిల్లా టీడీపీలో కలకలం రేగుతోంది. తాను పార్టీని వీడనున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని, ఆ వదంతులు నమ్మొద్దని కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్ఫష్టం చేశారు. అన్నారు. కొందరు కావాలనే తనపై ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ వదంతుల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నుంచి మల్లికార్జునరెడ్డికి ఫోన్ కాల్ వెళ్లింది. దీంతో, మల్లికార్జునరెడ్డి, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఇతర నేతలు ఈ రోజు చంద్రబాబును కలిశారు. అనంతరం మల్లికార్జునరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలోనే కొనసాగుతానని..తనకు పదవులు ముఖ్యం కాదనీ పార్టీయే ముఖ్యమని తెలిపారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పానని అన్నారు. టీడీపీ నుంచి తాను వెళ్లిపోవడం లేదని, కొందరు కావాలని చెప్పే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్నచిన్న సమస్యలు ఉన్నంత మాత్రాన పార్టీని వీడాల్సిన అవసరం లేదని మల్లికార్జున రెడ్డి స్పష్టంచేశారు.  

06:58 - July 28, 2018

చిత్తూరు : నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా తన సొంత నిధులతో వైఎస్‌ఆర్‌ చాంఫియన్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు క్రీడల్లో ప్రతిభ ఉన్నప్పటికీ.. సరైన అవకాశాలు లేక మరుగున పడిపోతున్నారని ఆమె అన్నారు. టోర్నమెంట్‌లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. టోర్నమెంట్‌లో భాగంగా వైసీపీ నేతలు క్రికెట్‌ ఆడి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. 

12:18 - July 17, 2018

మంచిర్యాల : బెల్లంపల్లి అవిశ్వాస రాజకీయాలపై ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. మున్సిపల్ చైర్ పర్సన్ సునీతరాణిపై 29మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. క్యాంపు రాజకీయాలకు స్వస్తి పలకాలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రయత్నం చేశారు. 2వ వార్డ్ కౌన్సిలర్ సుధారాణి భర్త వేణును ఎమ్మెల్యే ఫోన్ లో బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. వేణుకు ఈ నెల 23లోపు మణుగూరు జీఎంలో రిపోర్ట్ చేయాలని ఎమ్మెల్యే చిన్నయ్య ఆదేశాలు జారీ చేశారు. లేదంటే 24న కౌరిగూడ ఓపెన్ కాస్ట్ లో వేణు పేరు తొలగిస్తామని సింగరేణి యాజమాన్యం హెచ్చరించింది. దీంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

19:40 - July 10, 2018

అమరావతి : వైసీపీ, బీజేపీ, జనసేన రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయని టీడీపీ ఆరోపించింది. ఈ పార్టీల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ తప్పుపట్టారు. ప్రజల సొమ్ము దోచుకోవడం జగన్‌కే అలవాటని విమర్శించారు. చంద్రబాబు అనుమతిస్తే గుంటూరులో కన్నాపై పోటీ చేస్తానన్నారు. జగన్‌పై తన కూతుర్ని పోటీకి పెడతానని చెప్పారు. పవన్‌కు ఒక్క సీటు కూడా రాదన్న జలీన్‌ ఖాన్‌.. జగన్‌కు డబుల్‌ డిజిట్‌ దాటుతుందో లేదో అన్న అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు చంద్రబాబును కోరుకుంటున్నారని జలీల్‌ ఖాన్‌ చెప్పారు. 

21:37 - July 9, 2018

కరీంనగర్ : రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా రామగుండంలో జరుగుతున్న రాజకీయా పరిణామాలతో మనస్తాపం చెందిన సోమారపు... రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే... మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంలో మంత్రి కేటీఆర్‌ మందలించడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.

రాజకీయల నుంచి తప్పుకున్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ
రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మనస్తాపానికి గురై సోమారపు... రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేగానే కాకుండా... ఆర్టీసీ చైర్మన్‌ పదవి నుంచి కూడా తప్పుకోనున్నట్లు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ అధిష్టానం కార్పొరేటర్లు అవిశ్వాసం
కొన్ని రోజుల క్రితం రామగుండం మేయర్‌ లక్ష్మీనారాయణపై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు కలెక్టర్‌కు ఇచ్చారు. అయితే.. టీఆర్‌ఎస్‌ అధిష్టానం కార్పొరేటర్లు అవిశ్వాసం ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని సోమారపుకు బాధ్యతలు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సోమారపు కార్పొరేటర్లతో చర్చించి.. అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే కొంతమంది కార్పొరేటర్లు ఇందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన సోమారపు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన మాటలు కార్పొరేటర్లు పట్టించుకోనప్పుడు.. వారి ప్రతినిధిగా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు.

సోమారపుపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌
అయితే... సోమారపు నిర్ణయం వెనక పార్టీ అంతర్గత కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం విసయంలో పార్టీ అధిష్టానం సోమారపుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు.. మంత్రి కేటీఆర్‌ సోమారపుపై మండిపడినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీ అధిష్టానం, కేటీఆర్‌ సీరియస్‌ నేపథ్యంలోనే సోమారపు కార్పొరేటర్ల చర్చలు జరిపినట్లు... అవి ఫలించకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే... సోమారపు నిర్ణయం పట్ల పార్టీలో చర్చ కొనసాగుతోంది. మరోవైపు కార్పొరేటర్లు కూడా సోమారపుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని... పట్టణాన్ని అభివృద్ధి చేయలేని వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సోమారపు... గోదావరిఖనిలో బొగ్గుగని కార్మికుల వద్ద వెల్లబోసుకున్నారు. ఓవైపు పార్టీ అధిష్టానం ఆదేశాలు.. మరోవైపు అవిశ్వాసం వెనక్కి తీసుకోవడానికి కార్పొరేటర్లు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన సోమారపు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు.

2 రోజుల్లో ఎమ్మెల్యేగా రిలివ్‌ అవతానంటూ వెల్లడి
ఇక సోమారపు.. ఆర్టీసీ చైర్మన్‌ పదవి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. రామగుండలో ఎవరికీ టికెట్‌ ఇచ్చినా గెలుస్తారని.. ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానన్నారు. అయితే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను కానీ... విశ్రాంతి తీసుకుంటానన్నారు సోమారపు. మొత్తానికి మేయర్‌పై కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం.. సోమారపు రాజకీయ జీవితంపై ప్రభావితం చూపించింది. ఓవైపు పార్టీ అధిష్టానం ఆదేశం... మరోవైపు కార్పొరేటర్ల తీరుతో సోమారం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారు. అయితే... ఈ పరిణామాలపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

16:37 - July 9, 2018

హైదరాబాద్‌ : గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోనియాపై కేటీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రగతిభవన్‌ ముట్టడికి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు బయల్దేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత
అంతకుముందు గాంధీభవన్‌ వద్ద జరిగిన సభలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజా వ్యతిరేకపాలనకు నిరసనగా.. భారత్‌ బచావో కార్యక్రమం చేపట్టామని కోమటిరెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో సామాన్యుడి నడ్డి విరిచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. విద్యార్థుల బలిదానాలు చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్‌ కుటుంబం అధికార గర్వంతో రెచ్చిపోతుందని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

16:08 - July 9, 2018

కరీంనగర్ : రామగుండం నగరపాలక సంస్థ అవిశ్వాస రాజకీయాలు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మెడకు చుట్టుకున్నాయి. రామగుండం మేయర్‌, డిప్యూటీ మేయర్‌పై టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకునే విధంగా చేయాలని మంత్రి కేటీఆర్‌ సోమారపు సత్యనారాయణను ఆదేశించారు. అవిశ్వాసం ప్రతిపాదించిన కార్పొరేటర్లతో సోమారపు సత్యనారాయణ చర్చలు జరిపినా వెనక్కి తగ్గలేదు. దీంతో మనస్తాపానికి గురైన సోమారపు సత్యనారాయణ రాజకీయాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఆర్టీసీ చైర్మన్‌ పదవిలో కూడా కొనసాగనని తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీచేయబోనంటున్న సత్యనారాయణ పేర్కొన్నారు. 

07:06 - July 2, 2018

అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి వచ్చే నెలలో భూమిపూజ చేయాలని నందమూరి బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ రిసర్స్‌ ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. మూడుదశల్లో వెయ్యి పడకల సామర్థ్యంతో దీనిని నిర్మిస్తామని ఆస్పత్రి చైర్మన్‌ బాలకృష్ణ చెప్పారు. విజయవాడలో వారంలో రెండు రోజులు పనిచేసే క్యాన్సర్‌ క్లినిక్‌ను బాలకృష్ణ ప్రారంభించారు. గవర్నర్‌పేటలో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌లో క్యాన్సర్‌ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఎమ్మెల్యే