ఎయిర్ లైన్స్

11:23 - December 5, 2018

వాయిదాలు లేవు.. వన్ టైం సెటిల్ మెంట్ కూడా లేదు.. మొత్తం అప్పు కట్టేస్తా.. తీసుకోండి అంటూ బ్యాంకులతోపాటు భారత ప్రభుత్వానికి బంపరాఫర్ ఇచ్చారు విజయ్ మాల్యా. అనేక బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించటానికి సిద్ధంగా ఉన్నాననే విషయంగా గతంలోనే చెప్పాను.. అయినా నా మాట ఎందుకు వినిపించుకోవటం లేదు.. దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ట్విట్ ద్వారా ప్రశ్నించారు మాల్యా. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గట్టి పారిపోయాడు అంటూ తెగ గోల చేస్తున్నారని.. ఇదంతా అబద్దం అని స్పష్టం చేశారాయన. 

 

నన్ను విలన్‌గా చిత్రీకరించేందుకు మీడియా ప్రయత్నిస్తోందని ట్వీట్స్ చేశారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అకస్మాత్తుగా నష్టాల్లో కూరుకపోయిందని.. అప్పులు పెరిగాయని చెప్పుకొచ్చారు. బ్యాంకులకు 100 శాతం ఇస్తానని చెప్పాను.. దయచేసి తీసుకోండి అంటూ వేడుకున్నారు. ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై స్టే విధించాలన్న మాల్యా విజ్ఞప్తిని ముంబై ప్రత్యేక కోర్టు కొటివేసిన సంగతి తెలిసిందే. భారత్ దాఖలు చేసిన నేరస్తుల అప్పగింత కేసుపై యూకే కోర్టు త్వరలో తీర్పు వెలువరించనున్న సమయంలో మాల్యా స్పందించడం విశేషం.

Politicians and Media are constantly talking loudly about my being a defaulter who has run away with PSU Bank money. All this is false. Why don’t I get fair treatment and the same loud noise about my comprehensive settlement offer before the Karnataka High Court. Sad.

— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018

Airlines struggling financially partly becoz of high ATF prices. Kingfisher was a fab airline that faced the highest ever crude prices of $ 140/barrel. Losses mounted and that’s where Banks money went.I have offered to repay 100 % of the Principal amount to them. Please take it.

— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018

For three decades running India’s largest alcoholic beverage group, we contributed thousands of crores to the State exchequers. Kingfisher Airlines also contributed handsomely to the States. Sad loss of the finest Airline but still I offer to pay Banks so no loss. Please take it.

— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018

I see the quick media narrative about my extradition decision. That is separate and will take its own legal course. The most important point is public money and I am offering to pay 100% back. I humbly request the Banks and Government to take it. If payback refused, WHY ?

— Vijay Mallya (@TheVijayMallya) December 5, 2018
14:38 - June 28, 2018

ముంబై : నిర్మితమౌతున్న బిల్డింగ్ ల మధ్య ఒక చార్టర్ విమానం కుప్పకూలిపోయిన ఘటన కలకలం రేపింది. భారీ పేలుడు శబ్ధం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన ఘట్ కోపర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కుప్పకూలిన ఫ్లైట్ ప్రైవేటు ఎయిర్ లైన్స్ కు చెందినదిగా తెలుస్తోంది. ఫ్లైట్ కుప్పకూలిపోవడంతో విమానంలో ఉన్న నలుగురు, పాదాచారుడు మృతి చెందారు. కానీ విమానంలో ఎవరున్నారో తెలియడం లేదు. 

11:40 - November 8, 2017

ఢిల్లీ : ఇండిగో ఎయిర్స్ లైన్స్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇటీవలే ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి పి.వి. సింధు పట్ల సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. తాజాగా మరో ప్రయాణీకుడిని ఇండిగో సిబ్బంది ఒకరు ప్రయాణీకుడిని చావబాదాడు. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

చెన్నైకి చెందిన రాజీవ్ కతియాల్ అనే వ్యక్తి ఢిల్లీ విమానాశ్రయం వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. బస్సు ఆలస్యంగా రవడంతో రాజీవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో బస్సు ఎక్కడకుండా రాజీవ్ ను సిబ్బంది అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిబ్బంది ఒకరు రాజీవ్ ను కిందపడేసి చావబాదాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్లు రికార్డు చేశాడు. దీనిపై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించిందని తెలుస్తోంది. ప్రయాణీకుడికి క్షమాపణలు చెప్పినట్లు..దాడికి పాల్పడిన సిబ్బందిని విధుల నుండి తొలగించినట్లు సమాచారం. 

16:46 - June 18, 2017

విజయవాడ : ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి.. అమరావతి ఎయిర్‌లైన్స్‌ని ఏర్పాటు చేయాలని.. ఏపీ సర్కార్ భావిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ నగరాలన్నీ సొంత ఎయిర్‌ లైన్స్‌ కలిగి ఉన్నాయి. అమరావతిలో కూడా సొంత ఎయిర్‌ లైన్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను.. సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ అధికారులతో సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ-ఇండోర్‌-తిరుపతి-విజయవాడ-ముంబై, విజయవాడ-తిరుపతి-ఇండోర్‌-ఢిల్లీ మధ్య జులై నెలాఖరు నుంచి.. జూమ్‌ ఎయిర్‌ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా సర్వీసులు పెంచి.. ప్రజలందరికీ విమానయానం అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కోరారు. విజయవాడ నుంచి దుబాయ్‌, హాంకాంగ్, కౌలాలంపూర్‌లకు నేరుగా విమాన సర్వీసులు నడపాలని సీఎం సూచించారు. ప్రపంచ ప్రసిద్ధ నగరాలన్నీ సొంత ఎయిర్‌ లైన్స్ కలిగి ఉన్నాయనీ, అమరావతిలో కూడా సొంత ఎయిర్‌ లైన్స్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దేశం మొత్తం మీద 18 శాతం ఎయిర్‌ ట్రాఫిక్ వృద్ధి రేటు నమోదవగా.. ఆంధ్రప్రదేశ్‌లో 35 శాతం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి అనుగుణంగా విమానాశ్రయాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని కోరారు. విజయవాడ విమానాశ్రయంలో రన్‌ వే, రెండో టెర్మినల్‌ భవనాల పనులు త్వరిత గతిన పూర్తి చేసి.. కార్గో విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు.

21న శంకుస్థాపన..
ఓర్వకల్లు విమానాశ్రయానికి ఈ నెల 21న శంకుస్థాపన చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 10 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. భోగాపురం గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం భూ సమస్యలను పరిష్కరించి సంవత్సర కాలంలో పూర్తి చేయాలన్నారు. అన్ని పట్టణాలు, మండల కేంద్రాలలో హెలిపాడ్‌లు నిర్మించాలని చెప్పారు. ప్రతీ యేటా విశాఖ, తిరుపతిలో ఎయిర్‌ షోలు ఏర్పాటు చేయాలని కోరారు. మచిలీపట్టణం, భావనపాడు గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుల నిర్మాణం వేగంగా జరగాలని.. ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్డు మార్గాలు, జల మార్గాలు, వాయు మార్గాలు, ఓడ రేవుల అనుసంధానంతో ఏపీని లాజిస్టిక్‌ హబ్‌గా మార్చే అంశంపై.. టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. లక్షా 30 వేల కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్‌ పనులు రాష్ట్రంలో జరుగుతున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. రోడ్డు, రైలు, ఫిషరీస్‌, ఇండస్ట్రీస్‌ శాఖల సమన్వయంతో ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని బాబు చెప్పారు. గ్యాస్ పైపులైన్లను ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రికి లేఖ రాయాలని.. అధికారులకు సీఎం చెప్పారు. తిరుపతిలో సైన్స్‌ సిటీ, విజయవాడలో సిటీ స్క్వేర్ నిర్మాణాలను వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతపురములో ఎనర్జీ యూనివర్శిటీని 400 కోట్లతో.. కాకినాడలో లాజిస్టిక్‌ యూనివర్శిటీని 350 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక యూనివర్శిటీలతో మాట్లాడుకొని తాత్కాలిక క్యాంపస్‌లతో ఈ విద్యా సంవత్సరం నుంచి కార్యకలాపాలను ప్రారంభించాలని ఆదేశించారు.

10:00 - February 26, 2017

రైళ్లు..బస్సులు..ఇతరత్రా వాహనాల్లో నిలబడి ప్రయాణించే వాళ్లని చూస్తుంటాం. కానీ విమానంలో నిలబడి ప్రయాణం చేయడం ఏంటీ ? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా ? కానీ ఇది నిజంగానే జరిగింది. మన భారతదేశంలో మాత్రం జరగలేదు. దాయాది దేశంగా పేర్కొందిన పాకిస్తాన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ఏడుగురు విమానంలో నిలబెట్టి మరీ తీసుకెళ్లారు. ఇది ఒక రికార్డు అని పేర్కొంటుంటే దీనిపై విచారణ జరగుతోందంట. పాకిస్థాన్ కు చెందిన పాకిస్తానీ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సౌదీ అరేబియాకు వెళుతోంది. ఈ విమానంలో సీట్లు లేవని ఏడుగురు ప్రయాణీకులను ఒక పక్కన నిలబెట్టి వాళ్లను తీసుకెళ్లారు. ఈ విషయం పాక్ కు చెందిన ఓ పత్రికలో వార్తలు వచ్చాయి. కరాచీ నుంచి మదీనా వెళ్లే విమానంలో ఈ ఘటన జరిగిందని టాక్. దీనిపై స్పందించి అధికార ప్రతినిధి డానియల్‌ గిలానీ విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. మొత్తం సీట్లన్నీ నిండిపోయిన తర్వాత కూడా విమానంలోకి ఏడుగురిని ఎక్కించి తీసుకెళ్లిన మాట వాస్తవమేనన్నారు. చేతితో రాసిన బోర్డింగ్‌ పాస్‌లు ఇచ్చి వాళ్లను విమానం ఎక్కించారని, ఇలా తీసుకెళ్తే చాలా ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. పూర్తి విచారణ జరిపిన అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలా తీసుకెళ్తే చాలా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

12:40 - December 30, 2016

అవును ఇది చదివితే సిగ్గు పడాల్సిందే..స్వచ్చ భారత్ అంటూ విపరీతంగా కేంద్రం ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ విమానసంస్థలు చేస్తున్న పనికి 'సిగ్గు' పడాల్సిందేనంట. పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి...రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ సత్వంత్ సింగ్ దహియా నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసు వేయడంతో ఈ విషయం ఆలస్యంగా బహిర్గతమైంది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం...ఇక్కడ నివాసం ఉండే వారికి వింత సమస్య ఎదురౌతోందంట. ఆకాశం నుండి మల మూత్రాలు ఇళ్ల మీద పడుతున్నాయంట. ఎక్కడి నుండి పడుతున్నాయో అర్థం కావడం లేదంట. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. విమానాశ్రయంలో దిగే విమానాల్లో ఉండే టాయిలెట్ లను ఆకాశంలోనే ఖాళీ చేస్తున్నాయని, దీనితో ఈ సమస్య ఎదురౌతుందని గ్రహించారంట. స్వచ్ఛ భారత్ అంటూ గొప్పలు చెప్పుకుంటుండగా విమాన సంస్థలు ఈ విధంగా చేయడం అక్కడి వారికి చిరాకు కలిగించింది. ఈ వికారపు చేష్ట గురించి స్థానికంగా నివాసం ఉండే రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ సత్వంత్ సింగ్ దహియా సాక్ష్యాధారాలతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ను సంప్రదించారు. దీనికి ఆ ట్రిబ్యునల్ స్పందించింది. విమానయాన సంస్థలు ఈ విధంగా చేయడం దారుణమని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. విమానం ల్యాండ్ అనంతరం తనిఖీలు చేయాలని, దారిలోనే ఖాళీ చేసిన విమానాల మీద రూ. 50వేలు ఫైన్ వేయాలని తీర్పునిచ్చారు. అదండి సంగతి...

 

06:51 - March 18, 2016

ముంబై : బ్యాంకులకు 9వేల కోట్లకు ఎగనామం పెట్టిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా ఇంటిని ఎస్‌బిఐ వేలం పెట్టింది. అయితే ఈ డిఫాల్టర్‌ ఇల్లు కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. మరోవైపు మాల్యా తీసుకున్న ప్రతి పైసాను బ్యాంకులు తిరిగి వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ఈడీ ముందు విచారణకు హాజరయ్యేందుకు మాల్యా ఏప్రిల్‌ వరకు గడువు కోరాడు. బ్యాంకులకు 9 వేల కోట్లకు కుచ్చుటోపి పెట్టిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా ఆస్తులకు వేలంపాట మొదలైంది. ముంబై అంధేరిలో 17 వేల స్క్వేర్‌ ఫీట్లు కల కింగ్‌ ఫిషర్‌ హౌజ్‌కు ఎస్‌బిఐ ఆన్‌లైన్ వేలం నిర్వహించింది. వేలం ప్రారంభ ధర 150కోట్లుగా నిర్ధారించిన ఎస్‌బీఐ- వేలంలో పాల్గొనేవాళ్లు 5 లక్షలు చెల్లించి 15 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఎస్‌బిఐ నిర్వహించిన ఈ వేలానికి ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. సమయం ముగియడంతో వేలం ప్రక్రియ పూర్తయినట్లు ఎస్‌బిఐ ప్రకటించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దివాళాతీసి మూతపడటంతో గత ఏడాది కింగ్‌ఫిషర్ భవనాన్ని ఎస్‌బీఐ స్వాధీనం చేసుకుంది.

 గడువు కావాలన్న మాల్యా..
మనీ లాండరింగ్‌ కేసు విచారణకు హాజరయ్యేందుకు తనకు ఏప్రిల్‌ వరకు గడువు కావాలని విజయ్‌మాల్యా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను కోరాడు. ఈ కేసులో మార్చి 18న హాజరవ్వాలని మాల్యాకు ఈడీ ఇదివరకే సమన్లు జారీ చేసింది. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మాల్యా.. తనకు మరింత గడువు కావాలంటూ ఈడీని అభ్యర్థించాడు. మాల్యా అభ్యర్థనపై ఈడీ ఎలా స్పందింస్తున్నది వేచి చూడాలి. ఐడిబిఐ బ్యాంకుకు 9 వందల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన కేసులో మనీలాండరింగ్‌ యాక్టు కింద మాల్యాపై సీబీఐ గతేడాది ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసును ఈడీ విచారణ జరుపుతోంది. విజయ్‌ మాల్యా తీసుకున్న ప్రతి పైసాను బ్యాంకులు తిరిగి వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ మాల్యాపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అయితే మాల్యా దేశంవిడిచి పారిపోయాడా అన్న ప్రశ్నపై స్పందించేందుకు మాత్రం జైట్లీ నిరాకరించారు. మాల్యా వివాదంపై ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు.

17 బ్యాంకులు..
కింగ్ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ 17 బ్యాంకుల నుంచి దాదాపు 9వేల కోట్ల వరకు బకాయి పడింది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకుగాను కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌తోపాటు విజయ్‌మాల్యా, ఆయనకు చెందిన యునైటెడ్ బ్రివరీస్‌ లిమిటెడ్‌ పూచికత్తు దారులుగా ఉన్నాయి. మాల్యా తీసుకున్న రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు కృషి చేస్తున్నాయి. ఈక్విటి షేర్లు అమ్మడం ద్వారా 16 వందల కోట్ల రూపాయలను బ్యాంకులు రికవరీ చేశాయి. ఈ నేపథ్యంలో కింగ్‌ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా మార్చి 2న దేశం విడిచి వెళ్లిపోయారు. తాను డిఫాల్టర్‌ను కాదని, స్వదేశానికి తిరిగి రావడానికి కొంత సమయం పడుతుందని మాల్యా గతవారం ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులను వేలం వేసే ప్రక్రియను బ్యాంకులు ప్రారంభించాయి. 

10:43 - November 14, 2015

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎవరో తెలియదంట. కానీ ఈ క్రికెట్ గాడ్ తెలియని వారుండరని ఈ ఘటనతో తెలుస్తోంది. క్రికెట్‌ ఆడే దేశాల్లో అయితే ఆయనను దేవుడిగా భావిస్తారు. అనితర సాధ్యమైన ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న అటువంటి ఆయనకు అమెరికాలోని ఎయిర్‌ పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. సచిన్‌ అమెరికాలోని బ్రిటిష్‌ ఎయిర్‌ వేస్‌కు చెందిన విమానంలో ప్రయాణిస్తుండగా ఆయన లగేజీని తప్పుడు అడ్రస్‌కు పంపించారు. దీనిపై సచిన్‌ బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ను సంప్రదించగా వారు 'మీ పూర్తి చెప్పండి' అంటూ సచిన్‌ను ప్రశ్నించారు. దీనిపై సచిన్‌ ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'చాలా కోపం, విసుగ్గా ఉంది. విమానంలో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ వెయిట్‌ లిస్టులో ఉన్న తన కుటుంబ సభ్యులకు సీట్లు కేటాయించ లేదు. లగేజీ విషయంలో కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించింది' అని ట్వీట్‌ చేశారు. సచిన్ ట్వీట్లు వైరల్ కావడంతో బ్రిటీష్ ఎయిర్ లైన్స్ వెంటనే స్పందించింది. సచిన్ కుటుంబానికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. దీనిపై సచిన్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. కొందరు వ్యంగ్యంగా స్పందించగా మరికొందరు బ్రిటిష్‌ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 'సచిన్‌ పూర్తి పేరు జీసస్‌ సచిన్‌ భగవాన్‌ టెండూల్కర్‌ అమృత్‌సర్‌, అడ్రస్‌ కాశీ, రోమ్‌, మక్కా' అని ఒకరు ట్వీట్‌ చేయగా మరొకరు 'బ్రిటిష్‌ వాళ్లు మొదట భారత్‌ కోహి నూర్‌ను ఎత్తుకెళ్లారు. ఇప్పుడు సచిన్‌ లగేజీని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. ఇంకెంతకాలం సహించాలి' అని ప్రశ్నించారు.

13:50 - October 15, 2015

హైదరాబాద్ : చైనా ఎయిర్‌ లైన్స్‌లో అద్భుతం చోటుచేసుకుంది. భూమికి సుమారు 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలోనే ఓ మహిళ శిశువును ప్రసవించింది. అత్యవసర పరిస్థితి తలెత్తినా విమానం ల్యాండయ్యేలోగానే తోటి ప్రయాణికులు, సిబ్బంది సహాయంతో శిశువుకు జన్మనిచ్చింది మహిళ. ఈ ఘటనను చిత్రించి యూట్యూబ్‌లో పెట్టడంతో సంచలనమై కూర్చుంది.

ఎగురుతున్న విమానంలోనే...

ఆసుపత్రిలో సుఖంగా ప్రసవించాల్సిన ఓ గర్భిణి..ఆకాశంలో ఎగురుతున్న విమానంలో అందులోనూ 30 వేల అడుగుల ఎత్తులో ప్రసవించాల్సిన వచ్చింది. ఈ ఘటన చైనా ఎయిర్‌లైన్స్ లో చోటు చేసుకుంది. బాలి నుంచి లాస్‌ ఏంజెల్స్‌ వెళుతున్న విమానంలో తైవాన్‌ చెందిన గర్భిణి ప్రయాణిస్తుండగా ప్రసవవేదన మొదలైంది. దీంతో విమానంలోని ఎయిర్‌ హోస్టెస్‌లు అప్రమత్తమయ్యారు. పైలెట్‌కు సమాచారం తెలియజేయగా ఎమర్జన్సీ ల్యాండింగ్‌ కోసం అమెరికాలోని అలాస్కా విమానశ్రయాన్ని అభ్యర్థించారు.

ల్యాండవడానికి మరో 30 నిమిషాల ముందే...

దీంతో ఎమర్జన్సీ ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. కానీ ల్యాండవడానికి మరో 30 నిమిషాలు మిగిలి ఉండగానే మహిళ పరిస్థితి కాన్పుకు సిద్ధమైపోయింది. అదృష్టవశాత్తు విమానంలోనే ఒక డాక్టర్‌ కూడా ప్రయాణిస్తుండడంతో ఆమె సహాయంతో ఎయిర్‌ హోస్టెస్‌లు, తోటి ప్రయాణికులు కలిసి కాన్పు చేశారు. కాసేపటికే విమానంలో శిశువు కేర్‌మని శబ్దం వినిపించగానే అందరూ హర్షం వ్యక్తం చేశారు.

బిడ్డ పౌరసత్వంపైనే సందిగ్ధత.....

విమానం అలాస్కాలో ల్యాండవ్వగానే తల్లి బిడ్డను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పుడు బిడ్డ పౌరసత్వంపైనే సందిగ్ధత నెలకొంది. ఆకాశంలోని ట్రాన్సిట్‌ జోన్‌లో జన్మనివ్వడం ఒక కారణంగా చెబుతున్నారు. చైనాకు చెందిన అధికార విమానంలో జన్మించడంతో చైనా పౌరసత్వం ఇవ్వాలా, లేక శిశువు తొలిసారి నేలపై అడుగుపెట్టిన అమెరికా పౌరసత్వం ఇవ్వాల్సి ఉంటుందా అని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే శిశువుకు బర్త్‌ సర్టిఫికేట్‌ జారిచేసేది అలాస్కా ఆసుపత్రి కాబట్టి అమెరికా పౌరసత్వం లభించే అవకాశం ఉందని తేలింది. శిశువుకు 18 ఏళ్లు వచ్చే వరకూ చైనా ఎయిర్‌ లైన్స్‌లో ఉచితంగా తిరిగే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సదరు ఎయిర్ లైన్స్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.   

Don't Miss

Subscribe to RSS - ఎయిర్ లైన్స్