ఏఐసీసీ

22:10 - January 6, 2018

ఢిల్లీ : అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇతర కమిటీలను కొనసాగిస్తూ ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొనసాగుతారని వెల్లడించింది. ఏఐసీసీ ప్రకటనతో ఆశావహుల్లో నిరుత్సాహం నెలకొంది. రాహుల్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని సీనియర్లు భావించారు. అంతే కాదు కేంద్రంలో అధికారంలో లేనందున రాష్ట్రాల్లోనూ మార్పులు చేర్పులు ఉంటాయని భావించారు. అయితే ఈ విషయంపై రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చేశారు. అన్నిరాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కమిటీలు కొనసాగించాలని రాహుల్ నిర్ణయించారు. 

 

13:22 - December 16, 2017

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో అత్యంత శక్తివంతమైన మహిళగా సోనియాగాంధీ పనిచేశారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. 19 ఏళ్ల పాటు పార్టీ సమర్ధవంతంగా పనిచేసేందుకు సోనియా కృషి చేశారని అన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ అధికారంలో సోనియా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని మన్మోహన్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో దేశ అభివృద్ధి రేటు 7.8 శాతంకు పెంచగలిగామని మన్మోహన్ అన్నారు. 

13:21 - December 16, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో బిజెపిని టార్గెట్‌ చేశారు. దేశంలో బిజెపి మత విద్వేషాలు రెచ్చగొడుతోందని ధ్వజమెత్తారు. దేశంలో బిజెపి మతం పేరిట మంటలు రేపుతోందని విమర్శించారు. అయితే ఆ మంటలను కాంగ్రెస్‌ చల్లార్చుకంటూ వస్తోందని రాహుల్‌ అన్నారు. వాళ్లు మంటలు రేపితే ఆర్పాలని...కోపం ప్రదర్శిస్తే...మనం ప్రేమను పంచాలని కాంగ్రెస్‌ శ్రేణులకు రాహుల్‌ సూచించారు. దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని...ఇందుకోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

12:28 - December 16, 2017
12:22 - December 16, 2017

ఢిల్లీ : దేశం కోసం కాంగ్రెస్ అంకితమని..కార్యకర్తలే పార్టీకి బలమని..కార్యకర్తలను రక్షించుకుంటామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన రాహుల్ పేర్కొన్నారు. ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 13 సంవత్సరాల క్రితం తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లు, ఈ దేశం మీద నమ్మకంతోనే తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లు తెలిపారు. ఈ తరుణంలో ఎన్నో నేర్చుకున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే రాజనీతి అని, ప్రస్తుతం రాజకీయాల స్వరూపం మారిపోయిందని...రాజకీయాలు అనేవి ప్రజలకు అస్త్రాలాంటివన్నారు.

మోడీ దేశాన్ని వెనక్కి తీసుకెళుతున్నారు...
భారత దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ అని, కానీ ఇప్పటి ప్రధాని దేశాన్ని వెనక్కి తీసుకెళుతున్నారని విమర్శించారు. ప్రజల ఆలోచనలు..అలవాట్ల మీద దాడి జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది దేశ ప్రజల మధ్య ఒక వారధి లాంటిదన్నారు. ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించే శక్తులు చెలరేగుతున్నాయని, బీజేపీ కారణంగా దేశమంతా హింస చెలరేగుతోందన్నారు. మంట అంటుకున్నప్పుడు చల్లార్సిందేనని...అదే బీజేపీకి చెబుతున్నామన్నారు. దేశంలో ఇలాంటిదే బీజేపీ చేస్తోందని..వీటిని ఆర్పేది ఒక్క కాంగ్రెస్...కార్యకర్తలేనన్నారు. వారు మంట పెడుతారు..తాము ఆర్పుతామని..వాళ్లు కోప్పడం చేస్తారని..తాము సముదాయించడం జరుగుతుందన్నారు.

కార్యకర్తలకు పిలుపు...
దేశంలో మత సామరస్యం వెల్లివెరిసే విధంగా...శాంతి సౌభ్రాత్వాలతో వెల్లివెరిసే విధంగా యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త నినాదం దేశం వింటుందన్నారు. కార్యకర్తలను రక్షించుకోవడం తన బాధ్యత అని, తాను నేర్చుకోవడానికి..నేర్పించడానికి కృషి చేస్తానన్నారు. అబద్ధాలు..తప్పుడు ప్రచారాలతో తమపై దాడులు చేస్తున్నారని, కాంగ్రెస్ అతి వృద్ధ పార్టీనే కాదని...అత్యంత యువ పార్టీ కూడా అని తెలిపారు. 

12:15 - December 16, 2017

ఢిల్లీ : సమస్యలు ఎన్ని ఎదురైనా..వెనుకడుగు వేసేది లేదని..దేశం కోసం..దేశ ప్రజల కోసం పనిచేయాలని కార్యకర్తలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోనియా ప్రసంగించారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న రాహుల్ కు తన ఆశీస్సులు అందచేస్తున్నట్లు తెలిపారు. చివరిసారిగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రసంగించడం జరుగుతోందని, రాహుల్ నాయకత్వంలో అందరూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అధ్యక్షురాలిగా ఎన్నుకున్న సమయంలో ఇక్కడ తాను నిలబడిన సమయంలో తాను ఎంతో భయపడడం జరిగిందని, ఇంత పెద్ద బాధ్యతను ఏ విధంగా నిర్వహించగలను అనే ప్రశ్న ఉదయించడం జరిగిందన్నారు.

ఎన్నో త్యాగాలు....
రాజీవ్ గాంధీతో వివాహం అనంతరం తనకు రాజకీయాలకు పరిచయమైనట్లైందన్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీ కుటుంబం ఎంతో కోల్పోయిందని, దేశం గురించే ఎక్కువగా ఆలోచించే వారని, తనను ఒక కూతురిగా చూసుకున్నారని పేర్కొన్నారు. ఈ కుటుంబం నుండి తాను ఎంతో నేర్చుకున్నట్లు, ఇందిర హత్య అనంతరం తాను ఎంతో బాధ పడడం జరిగిందని..సొంత అమ్మను తీసుకెళ్లారని భావించడం జరిగిందన్నారు.

రాజీవ్ హత్య కలిచివేసింది...
అనంతరం తనకు తాను మార్చుకున్నట్లు, ఈ నేపథ్యంలో తన కుమారుడు..కుమార్తెలను రాజకీయాల నుండి దూరంగా పెట్టాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ తాను ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రాజీవ్ గాంధీ హత్య తనను తీవ్రంగా కలిచివేసిందని..పార్టీ గురించి..కార్యకర్తల గురించి ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందిరా..రాజీవ్ బలిదానం వ్యర్థం కావద్దనే ఉద్దేశ్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. అందరూ తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.

అందుకే పరాజయాలు..
దేశ ప్రజల బాగు కోసం ఇతర పార్టీలతో కలిసి పనిచేయడం జరిగిందన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ బాగా పనిచేశారని కితాబిచ్చారు. దేశంలోని ఎంతో మంది పేదలకు కాంగ్రెస్ మేలు చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీపై పలు విధాలుగా దాడి చేయడంతో పలు ఎన్నికల్లో పార్టీ పరాజయం చెందిందన్నారు. పార్టీ పరాజయం పాలైనా కార్యకర్తలు..మనో ధైర్యం కోల్పోలేదన్నారు. ఎన్ని జరిగినా వెనకడుగు వేసేది లేదని ఖరాఖండిగా చెప్పారు. దేశ ప్రజల కోసం పనిచేయాలని...ఎన్ని పరిస్థితులైనా ఎదురొడ్డి నిలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాహుల్ గురించి గొప్పగా చెప్పడం తల్లిగా సరికాదని, చిన్నప్పటి నుండి చూసిన పరిణామాలతో హింసపై వ్యతిరేకం పెంచుకున్నాడన్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో ధైర్యం పెంచుకున్నాడని తెలిపారు. తనకు సహకరించిన వారందరికీ...తనతో వెంట నడిచిన వారికి అభినందనలు..కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు సోనియా వెల్లడించారు. 

12:05 - December 16, 2017
08:36 - December 16, 2017
07:34 - December 16, 2017

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ శనివారం బాధ్యతలు స్వీకరించనుండడంతో ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ముస్తాబైంది. రాహుల్‌ పట్టాభిషేక మహోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రపంచ తెలుగు మహాసభలు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన ప్రత్యేక చర్చా వేదికలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), కైలాష్ (టి.కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

13:12 - December 15, 2017

న్యూఢిల్లీ : జాతీయ కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పులు వస్తున్నాయా ? యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తారా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షురాలిగా 19 ఏళ్లుగా ఉన్న సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని బయటకు వస్తున్న సోనియా మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల నుండి తప్పుకోనున్నట్లు వెల్లడించారు. దీనితో శనివారం ఏఐసీసీ అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం పార్టీలో మార్పులు తీసుకరావాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నట్లు టాక్. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుండి సోనియా ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈమె అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు వరుసగా రెండుసార్లు యూపీకు అధికార పీఠం దక్కింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఏఐసీసీ