ఏచూరి

15:38 - November 2, 2017

హైదరాబాద్ : సామాజిక దౌర్జన్యం.. ఆర్థిక దోపిడీపై ప్రజా ఉద్యమాలను బలపరుస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక, సామాజిక రంగాలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీ అనాలోచిత నిర్ణయాలైన జీఎస్టీ, పెద్ద నోట్ల రద్ధుతో ఎంతోమంది ఉపాధి కోల్పోయారని ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు.  

20:46 - October 8, 2017

ఢిల్లీ : కేరళలో హింసకు బీజేపీ, ఆరెస్సెస్సే కారణమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ కొనసాగిస్తున్న రాజకీయ హింస వెనుక అసలు ఎజెండాను ఎండగట్టేందుకు సోమవారం దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల మద్దతుతో తాము బీజేపీతో ప్రజాస్వామ్య యుతంగా పోరాడుతామన్నారు. బెంగాల్‌ తరహాలోనే కేరళలో కూడా మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్ని స్తున్నదని ఆయన విమర్శించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తన మతోన్మాద రాజకీయాలను విస్తరించేందుకు ఈవారంలో కేరళలో యాత్ర చేపట్టారని, అయితే బీజేపీ కుయుక్తులను ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ని ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని ఏచూరి విమర్శించారు.

 

11:00 - October 2, 2017

బీజేపీ పాలనపై వ్యతిరేకత పెరిగిపోతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. టెన్ టివితో ఆయన ముచ్చటించారు. కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అంతేగాక మతతత్వ శక్తులు పెరిగిపోతున్నాయి. దీనిపై సీపీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ? కాంగ్రెస్ పార్టీతో కలిసేది లేదనడం..బీజేపీని ఎలా ఎదుర్కొంటారు ? బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై స్పందన...మోడీ గత ఎన్నికల్లో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు రావడం..పేదల సంక్షేమం..పథకాలు..ఉచిత కరెంటు పలు హామీలు గుప్పిస్తున్నారు. పేదలకు కోసం అండగా ఉండే సీపీఎం వ్యూహం ఎలా ఉంటుంది ? సీపీఎం బలంగా ఉన్న కేరళ..పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సీపీఎం ఎలా ఎదుర్కొంటుంది ? యూనివర్సిటీ ఎన్నికల్లో వామపక్ష గ్రూపులకు చెందిన సంఘాలు విజయం సాధించాయి. దీనిపై బీజేపీపై యువత వ్యతిరేకందా ఉందని భావించవచ్చా ? ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొంటున్నారు..మూడున్నరేళ్ల బాబు పాలనపై స్పందన ? తదితర విషయాలపై ఏచూరి విశ్లేషించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

12:27 - September 6, 2017

ఢిల్లీ : కన్నడ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యను సీపీఎం నేతలు ఖండించారు. లంకేశ్‌ను హత్య చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కరత్‌ డిమాండ్‌ చేశారు. ఈ హత్య వెనుక హిందూత్వ శక్తుల హస్తం ఉందన్నారు. ఇలాంటి శక్తులను కఠినంగా అణచివేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

17:54 - August 21, 2017

ఢిల్లీ : తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ధర్నా చౌక్ పరిరక్షణ పేరిట ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష నేతలు భారీ ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో పాల్గొన్న ఏచూరి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారెవరూ కేసీఆర్ పాలనను సహించబోరని తెలిపారు. ధర్నా చౌక్ పునరుద్దరణ జరిగి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

12:04 - August 11, 2017

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి పదవిలో నియమితులైన వెంకయ్య నాయుడికి అభినందనలు తెలియచేస్తున్నట్లు ఈ సందర్భంగా గురజాడ మాటలు గుర్తు పెట్టుకోవాలని సీతారాం ఏచూరి సూచించారు. ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకయ్య నాయుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ గా ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఏచూరి ప్రసంగించారు. ఇక్కడ గురజాడ అప్పారావు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. 'దేశ మంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్' అని చెప్పారని, దీనికి అనుగుణంగా పనిచేస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. వెంకయ్య నాయుడు ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చొన్నారని, రాజ్యసభ పని విధానం అందరికంటే ఎక్కువ వెంకయ్యకు తెలుసన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:03 - August 10, 2017

ఢిల్లీ : తమిళనాడులోని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తాను.. కష్టపడి చదువుకుని ఉన్నత స్థానానికి ఎదిగానని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. బ్రాహ్మణకుటుంబానికి చెందిన తాను.. సూఫీ, రాజ్‌పుత్‌ దంపతులకు పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని.. తన కుమారుడు ఓ ఇండియన్‌ అని రాజ్యసభలో ఏచూరి చెప్పారు. ఫేర్‌వెల్‌ సమావేశంలో పాల్గొన్న ఏచూరి సభలో తనకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

15:47 - August 10, 2017

ఢిల్లీ : సీతారాం ఏచూరి రాజ్యసభలో మాట్లాడుతూ తన జీవిత అనుభవాలను వివరించారు. తను బ్రహ్మణున్ని కాదు, హిందువును కాదు, ముస్లింను కాదు, క్రిస్టియన్ కాదు భారతీయున్ని అని తెలిపాడంతో సభలో అందరు ఆయనను అభినందించారు. 

21:32 - July 26, 2017

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల వైఫల్యంపై సిపిఎం ఆందోళనకు సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 వరకు 6 అంశాలపై దేశవ్యాప్తంగా పోరాటం చేపట్టనున్నట్లు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. రైతుల రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, జిఎస్‌టి అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య, ప్రయివేటీకరణ, మహిళలకు రిజర్వేషన్లపై ఆందోళన చేపట్టాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో నిర్ణయించిందని ఏచూరి చెప్పారు. 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని, పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర ఉండేలా చూస్తామని ప్రధాని మోది ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రైతులు తమ పంటలను నేరుగా ప్రభుత్వానికి అమ్మేలా చట్టాన్ని తీసుకురావాలని ఏచూరి డిమాండ్‌ చేశారు.

13:34 - July 18, 2017

ఢిల్లీ : రైతులు, దళితులు, మైనార్టీల సమస్యలు పరిష్కరించడంలో మోదీ సర్కార్ విఫలమైందని సీతారాం ఏచూరి ఆరోపించారు. దేశంలో దళితులపై వివక్ష, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడుల అంశంపై సభలో చర్చకు అనుతించకపోవడం దారుణమని అన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఏచూరి