ఏపీ సర్కార్

10:40 - February 26, 2018

విశాఖ : నగరంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటితో ముగియనుంది. మూడు రోజులపాటు సమ్మిట్ సాగింది. ఇప్పటికే పలు కంపెనీలతో ఏపీ సర్కార్ ఎంవోయూలు కుదుర్చుకుంది. ఐటీ శాఖ మంత్రి విదేశీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇవాళ 60 కి పైగా ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. మూడు రోజుల్లో 400 ఎంవోయూలు జరగాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ముగింపు సమావేశానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:03 - January 28, 2018

హైదరాబాద్ : ఏపీలో కోడిపందేలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుకాలేదు. ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. పందేలు నియంత్రించడంలో అధికారులు విఫలం అయ్యారు. అధికారపార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ పందేలు నిర్వహించారు. దీంతో ఏపీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది. రేపు హైకోర్టు కోడి పందేలపై విచారణ చేపట్టనుంది. దీంతో ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది.
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కోడి పందేలు
కోడి పందేలపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా వాటిని పట్టించుకున్న నాథుడే లేడు. సంక్రాంతి పండుగకు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఏపీలో కోడిపందేలు జోరుగా సాగాయి. బరుల్లో కోట్లాది రూపాయల బెట్టింగ్‌లు జరిగాయి. గుండాట, పేకాటతోపాటు ఇతర ఆటలు కొనసాగాయి. మద్యం ఏరులైపారింది. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా కోడి పందేలు యథేచ్చగా జరిగాయి. వీటిని కట్టడి చేయాల్సిన పోలీసులు.. కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. బరుల్లో కోడిపందేలు జరుగుతున్నా అడ్డుకున్న దాఖలాలు లేవు. ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగాయి. కోళ్ల కాళ్లకు కత్తులుకట్టి నిర్వాహకులు పందేలు నిర్వహించారు. ఈ పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. పందేలకు దూరంగా ఉండాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలను తెలుగు తమ్ముళ్లు పట్టించుకోలేదు. అధికారపార్టీకి చెందిన నేతలే స్వయంగా పందేలు నిర్వహించారు. 
కోడిపందేలపై హైకోర్టు అసహనం
సంక్రాంతి సమయంలో ఏపీలో యథేచ్చగా కోడిపందేలు జరగడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాము సూచించిన  సూచనలు, ఆదేశాలను అధికారులు అవహేళన చేశారని కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా విచ్చలవిడిగా కోడిపందేలు జరిగాయని... అధికారులు ఎక్కడా అడ్డుకున్న దాఖలాలు కూడా లేవని మండిపడింది.  కోడిపందేలకు ప్రజాప్రతినిధులే హాజరయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది.  కోడిపందేల విషయంలో సరైన చర్యలు చేపట్టలేమని కోర్టుకు వివరిస్తే బాగుండేదంటూ ఏపీ సీఎస్‌, డీజీపీలను ఉద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.  తమ ఆదేశాలను అమలుచేయకపోగా.. నివేదికలు ఇవ్వకపోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. తమ ఆదేశాల మేరకు నివేదికలు సమర్పించనందుకు సీఎస్‌, డీజీపీలను స్వయంగా కోర్టుముందు హాజరుకావాలని ఆదేశించింది. జనవరి 29కి విచారణను వాయిదా వేస్తూ ఈనెల 22న ఆదేశాలిచ్చింది.
ఈనెల 29న తదుపరి విచారణ
29న డీజీపీల అంతరాష్ట్ర సమావేశం ఉండడంతో తనకు కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని డీజీపీ అభ్యర్థించారు. దీంతో డీజీపీ అభ్యర్థనను కోర్టు మన్నించి మినహాయింపు ఇచ్చింది. సీఎస్‌ మాత్రం 29న తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో 29న ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.

 

09:20 - October 16, 2017

గుంటూరు : కార్పొరేట్ విద్యాసంస్థలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఏసీ సర్కార్ సీరియస్ గా స్పందించింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో కాసేపట్లో చంద్రబాబు సమావేశం కాననున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్లాసుల నిర్వహణను, ర్యాంకుల కోసం పిల్లలపై ఒత్తిడి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

 

 

 

16:34 - September 30, 2017
19:33 - September 6, 2017

హైదరాబాద్ : వ్యవసాయ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్న జీవో 64ను ఏపీ సర్కార్ రద్దుచేసింది. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జీవో 64 రద్దు కోసం ఉద్యమించిన వ్యవసాయ విద్యార్థులు.. ఇటీవల పవన్‌ను ఆశ్రయించారు. 

14:58 - August 26, 2017

అమరావతి: ఉపరాష్ట్రపతి పదవి ఔన్నత్యాన్ని పెంచే విధంగా.. నిజాయితీగా బాధ్యతలను నిర్వర్తిస్తాననని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అమరావతిలో ఆయనకు ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా చట్ట ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్ట సభల పాత్ర చాలా ప్రధానమైనదని.. చట్ట సభలు ఘర్షణలకు వేదిక కాకూడదని ఆయన అన్నారు. చట్ట సభల్లో అర్థవంతమైన చర్చలు జరిగేలా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని వెంకయ్యనాయుడు అన్నారు.

19:33 - July 21, 2017

గుంటూరు : ఏపీలో బెల్ట్‌షాపుల బెండు తీస్తామని ప్రభుత్వం హూంకరిస్తోంది. ఇన్నాళ్లూ.. వీటిపై మహిళలు ఉద్యమించినా పట్టించుకోని ప్రభుత్వం.. ఉన్నపళంగా బెల్ట్‌షాపులపై ఎందుకు కన్నెర్ర చేస్తోంది..? సీఎం ఆకస్మిక నిర్ణయం వెనుక కారణమేంటి..? రాజకీయ సమీకరణాలే ప్రభుత్వ నిర్ణయానికి కారణమా..? వాచ్‌ దిస్‌ స్టోరీ
బెల్ట్‌ షాపుల తొలగింపు... చర్చనీయాంశం 
ఏపీలో బెల్ట్‌ షాపుల తొలగింపు అంశం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ కోణం దాగుందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులను తొలగించాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, అధికారులు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన పనులు మొదలు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిజానికి 2014 ఎన్నికలకు ముందే బెల్టు షాపులను తొలగిస్తామని టీడిపి ప్రజలకు హామీ ఇచ్చింది. అధికారం చేపట్టాక మూడేళ్లకు ఇప్పుడు బెల్టు షాపులను రద్దు చేస్తామనడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 
బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతామని జగన్‌ హామీ
జులై 8,9 తేదీల్లో ఏపీ రాజధాని గుంటూరులో వైసీపి నిర్వహించిన ప్లీనరీ విజయవంతం కావడం, మహిళా లోకానికి వైసీపీ అధినేత వరాల జల్లు కురిపించడం టీడీపిని కుదిపేసినట్లయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వైసీపి అధికారంలోకి వస్తే మూడు దశల్లో మద్యాన్ని నిషేధించి ప్రజలకు ప్రయోజనకరంగా మారుస్తానని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే మద్యం దుకాణాల సంఖ్య తగ్గించి, బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతామని హామీల వర్షం కురిపించారు. వీటి కారణంగా, మహిళలు వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న భావన కలిగిన చంద్రబాబు.. హడావుడిగా బెల్ట్‌షాపుల తొలగింపు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. 
మద్యం మహమ్మారిని తొలగించాలని మహిళల ఆందోళన
రాష్ట్రంలో... కొన్ని రోజులుగా మద్యం మహమ్మారిని తొలగించాలని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంలో వైసీపి ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ టిడీపికి చురకలంటించారు. దీంతో, మూడేళ్లపాటు బెల్టు దుకాణాలపై మౌనం వహించిన చంద్రబాబు జులై 18వ తేదీన జరిగిన కేబినేట్‌ సమావేశంలో బెల్టు షాపులను తొలగిస్తామని ప్రకటించారు. చంద్రబాబు హడావుడి నిర్ణయంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. మూడేళ్లుగా నిద్రపోయిన ప్రభుత్వం ఇప్పుడే మేల్కోవడాన్ని వారు ఆక్షేపిస్తున్నారు. ఈ నిర్ణయమైనా మొక్కుబడిగాకాకుండా, కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు
రాష్ట్రంలో 4వేల 380 మద్యం దుకాణాలు ఉండగా, బెల్టు షాపులు 40వేలకు పైగా ఉన్నాయి. చంద్రబాబు బెల్టు షాపుల రద్దు నిర్ణయాన్ని తీసుకోవడంతోనే  అధికారులు రంగంలోకి దిగారు. జులై 19న ఎక్సైజ్‌ శాఖ, పోలీసులు బృందాలుగా విడిపోయి అక్రమ మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదుచేశారు.  మరోవైపు బెల్టు షాపులపైనా దాడులు కొనసాగించాలన్న ఎక్సైజ్‌ కమిషనర్‌ లక్ష్మీ నరసింహం ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. ఏపీలో 133 బెల్టు షాపులపై కేసు నమోదు చేసి 138 మందిని అరెస్టు చేసింది. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం సబబే అయినప్పటికీ, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే నడుచుకోవాలని మహిళలు కోరుకుంటున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను కాగితాలకే పరిమితం చేయకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

10:17 - July 8, 2017
19:50 - July 4, 2017

హైదరాబాద్ : చంద్రబాబు ప్రభుత్వం తీరుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. సీఎం దిగజారుడు నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సర్కారు ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి తాగుబోతు ప్రభుత్వంలా మారిందని మండిపడ్డారు. లిక్కర్‌ సిండికేట్‌ ఓనర్లంతా కలిసి కేబినెట్‌ సమావేశం పెట్టుకున్నట్టుగా ఉందన్న రోజా.. సుప్రీంకోర్టు తీర్పును చంద్రబాబు ధిక్కరిస్తున్నారన్నారు. లిక్కర్‌ దుకాణాల కోసం జాతీయ రహదారులను రాష్ట్ర రోడ్లుగా డీనోటిఫై చేయడం దారుణమన్న ఆమె... నీరు..మీరు కార్యక్రమంలా బీరు...బారు కార్యక్రమం చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సర్కారు ప్రవేశపెట్టిన మద్యం పాలసీని వెనక్కు తీసుకోకపోతే లిక్కర్‌ షాపులను ధ్వంసం చేస్తామని రోజా హెచ్చరించారు. 

 

19:28 - June 21, 2017

హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వంలో కొద్దిరోజులుగా కలకలం రేపిన ఐవైఆర్‌ కృష్ణారావు వ్యవహారానికి ఏపీ ప్రభుత్వం చెక్‌ పెట్టింది. బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఐవైఆర్‌ను తొలగించడంతోపాటు.. టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్యను కొత్త చైర్మన్‌గా నియమించింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వ పదవులకు రాజకీయరంగు పులుముతున్నారని విమర్శిస్తున్నాయి. ఇదే అంశంపై హెడ్ లైన్ షోలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలకపల్లి రవి, టిడిపి నేత విజయ్ కుమార్, ఎపీ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు పాల్గొన్నారు. పూర్తి వివరా లకోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Pages

Don't Miss

Subscribe to RSS - ఏపీ సర్కార్