ఐఐటీ

15:53 - April 16, 2018

మానవ మేథస్సు ఎంత పదును పెడితే అంత చరిత్ర వెల్లడవుతుంది అనటానికి ఓ ఉదాహరణ ఇప్పుడు కనిపిస్తోంది. మనిషి సృష్టించిన చరిత్రను తృటిలో తుడిచిపెట్టివేసే శక్తి ప్రకృతికి మాత్రమే వుంది. ప్రకృతి చేసిన కరాళ నృత్యానికి ఎంతటి ఘనత కలిగిన చరిత్ర అయినా కూలిపోవాల్సిందే. భూస్థాపితం కావాల్సిందే. కానీ చరిత్రను తవ్వి వాస్తవాలను విశదీకరించే మేధస్సు మాత్రం మనిషికి వుంది. అలా ప్రకృతి చేసిన కరాళ నృత్యానికి భూస్థాపితం అయిపోయిన 'ఘన(త)చరిత్ర'ను మనిషి తన తెలివితేటలతో వెలికితీశాడు. ప్రకృతిని మనిషి శాసించలేకపోయినా..అది చేసే విలయానికి ప్రాణ, ఆస్తి నష్టాలను ఎక్కువ కాకుండా నియంత్రించుకోగలుగుతున్నాడు. కానీ అది అన్ని సమయాలలోను, అన్ని ప్రాంతాలలోను, అన్ని కాలాలలోను సాధ్యం కాకపోవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే అంటున్నారు ఖరగ్ పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు.

భారతదేశ చరిత్రను, పురావస్తు శాస్త్రగతిని మార్చివేసిన ఘటన..
ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా 4,350 సంవత్సరాల క్రితం భాసిల్లిన సింధునాగరికత అంతరించిపోవడానికి గల కారణం ఇప్పటి వరకూ రహస్యంగా వుండిపోయింది. క్రీ.శ 1921లో జరిగిన ఒక సంఘటన భారతదేశ చరిత్రనే కాకుండా పురావస్తు శాస్త్ర గతిని కూడా మార్చివేసింది. రాయ్ బహద్దూర్ దయారాం సహాని 1921లో ప్రసిద్ధి చెందిన 'హరప్పా నగరాన్ని' సింధు నదికి ఉపనది అయిన 'రావి' నది ఒడ్డున వుందని కనుక్కున్నాడు. 1922లో ఆర్ .డి.బెనర్జి సింధునది కుడిపక్కన ఒడ్డున ఉన్న మెహంజోదారోను కనుక్కున్నాడు.

సింధు నాగరికతకు వివిధ రకాల పేర్ల ప్రతిపాదన..
సింధు నాగరికతకు పురావస్తు శాస్త్రజ్నులు వివిధ రకాల పేర్ల ప్రతిపాదించారు. క్రీ.పూర్వం సుమేరియా నాగరికతతో హరప్పా నాగరికతకు వున్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా దీన్ని మొదట ఇండో సుమేరియా నాగరికతగా పిలిచేవారు. ఇది సింధు నది లోయలో అభివృద్ధి చెందటం వల్ల దీన్ని సింధు నాగరికత అని కూడా అన్నారు. సర్ జాన్ మార్షల్ దీన్ని హరాప్పా నాగరికతగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఏ ప్రదేశంలోనైనా ఒక నాగరికతను మొదట కనుక్కుంటారో ఆ నాగరికతను ఆ పేరు పెట్టటం పురావస్తు శాస్త్ర పంప్రదాయం. అలాగే సింధు లోను ప్రాంతంలో అంటే హక్ర ఘగ్గర్ నదీ ప్రాంతంలో కనుక్కోవటం వల్ల దీన్ని సింధు నాగరికతగా నామకరణం చేయబడింది.

పలు నాగరికతలకు తీసిపోయిన నాగరికత సింధు, హరప్పా.
కాగా వేద సాహిత్యం ప్రకారం క్రీ.పూర్వం భారతదేశ చరిత్ర వున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. అయితే మొహంజోదారో, హరస్పా, చాన్హుదారో, ఇతర సింధు లోయ ప్రాంతాల్లో జరిపిని తవ్వకాల ఆధారంగా క్రీ.పూర్వం శతాబ్ధాల క్రితం సమాధి అయిపోయిన చరిత్ర వెలుగులోకి వచ్చింది. సేమేరియా, అక్కడ్,బాబిలోనియా, ఈజిస్టు, అస్సీరియా వంటి గొప్ప ప్రాచీన నాగరికతలకు ఏమాత్రం తీసిపోని నాగరికత హరప్పా ప్రాంతంలో ఉన్నట్లుగా పరిశోధకులు నిర్ధారించారు.

గుర్తించిన ఖరగ్ పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు..
ఐఐటీ ఖరగ్‌ పూర్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. సుదీర్ఘంగా వేధించిన కరవు కారణంగా సింధు నాగరికత అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. 4,350 సంవత్సరాల క్రితం రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో కరవు ప్రారంభమైందని. కొన్నేళ్ల తరువాత అది తీవ్రరూపం దాల్చి సుమారు 900 సంవత్సరాలు కొనసాగిందని ఐఐటీ ఖరగ్ పూర్ భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్‌ కుమార్‌ గుప్తా తెలిపారు.

ఆధారాలు ఉన్నాయి : శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ కుమార్‌ గుప్తా..
దీంతో అక్కడి ప్రజలు గంగా, యమునా లోయగుండా ప్రయాణిస్తూ, ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు బెంగాల్, దక్షిణ వింధ్యాచల్, దక్షిణ గుజరాత్ లలోని మైదాన ప్రాంతాలకు చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్ల 5 వేల ఏళ్ల క్రితం వాయువ్య హియాలయాల్లో వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీని వల్ల నదులు ఎండిపోయే పరిస్థితి వచ్చి. అది తీవ్రమైన కరవుకు దారితీసిందని అన్నారు. దీంతో సిరిసంపదలతో విలసిల్లిన సింధునాగరికత ప్రాభవం కోల్పోయిందని తెలిపారు. దీనికి ఆధారంగా లడఖ్‌ లోని మోరిరి సరస్సుకు సంబంధించిన 5 వేల సంవత్సరాల రుతుపవన, శీతోష్ణస్థితి మార్పుల పట్టికను జతచేశారు.

సింధు నాగరికత, హరప్పా నాగరికత, ఖరగ్ పూర్, ఐఐటీ, శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ కుమార్‌ గుప్తా,

10:42 - May 20, 2017
14:42 - April 26, 2017

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఐఐటీలో చదివిన వారికి వంద శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. ఉన్నత విద్యలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించామని, ఇంకా విప్లవాత్మక మార్పులు వస్తాయనడంలో అతిశయోక్తి లేదన్నారు. మేధావుల ఆలోచనలకు విశ్వవిద్యాయాలు వేదికలుగా నిలుస్తున్నాయని మేధావులు, విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలని ప్రణబ్‌ ముఖర్జీ పిలుపునిచ్చారు. పారిశ్రామిక అంశాలకు దోహదపడేలా యూనివర్శిటీల్లో పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

10:54 - April 22, 2017
09:33 - April 19, 2017

న్యూఢిల్లీ : శరీరాన్ని పూర్తిగా కవర్‌చేసేలా దుస్తులు వేసుక రావాలని విద్యార్థినిలకు జారీ చేసిన నోటీసుపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ ఐఐటీ హాస్టల్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఓ మహిళా హాస్టల్ ఈ నోటీసును ఇటీవలే జారీ చేసింది. ఈనెల 20న హౌస్ డే కార్యక్రమం జరగనుంది. ఢిల్లీ ఐఐటీలో ఏడాదికొకసారి హౌస్‌ డే నిర్వహిస్తారు. దీనికి విద్యార్థినులు గంట పాటు అతిథులను హాస్టల్‌కు ఆహ్వానించవచ్చు. దీనిపై హిమాద్రి హాస్టల్‌ వార్డెన్‌ సంతకంతో నోటీసు పెట్టారు. కార్యక్రమానికి మహిళలంతా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండేలా దుస్తులు వేసుకుని రావాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు విమర్శలు రావడంతో నోటీసుపై వెనక్కి తగ్గారు.

12:31 - April 15, 2017
20:39 - July 13, 2016

రూ.3వేల కోట్లు రూపాయలు..ఇవి ప్రాజెక్టో లేక రిజర్వాయర్ నిర్మాణ బడ్జెటో కాదు. తెలుగు రాష్ర్టాల్లో ఉప్పెనై ఉరకలేస్తున్న ఐఐటి కోచింగ్‌ బిజినెస్‌ రేంజ్ బిజినెస్ . స్కూలు దశ నుంచే.. ఐఐటి ఓరియంటేషన్ పేరుతో మొదలవుతున్న కోచింగ్ ల వెంట తమ పిల్లల్ని పట్టుకుని పరుగు తీస్తున్న తల్లిదండ్రులు ఖర్చు చేస్తున్న మొత్తం. రెండు రాష్ట్రాలలో రూ. 3వేల కోట్ల ఐఐజీ బిజినెస్ జరగటం ఆశ్చర్యపోవాల్సిన అంశం. తెలుగు రాష్ట్రాల్లో ఇంతింతై పెరిగిపోతున్న ఐఐటి క్రేజ్ కు అద్దం పెడుతున్న హాట్ హాట్ కోచింగ్ బిజినెస్ పై టెన్ టీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో చుక్కా రామయ్య (ప్రముఖ విద్యావేత్త ) మధుసూధన్ రెడ్డి (తెలంగాణ జూనియర్ లెక్చరర్స్ ఫోరం ప్రధాన కార్యదర్శి) కృష్ణయ్య (ఐఐటీ అకాడమీ డైరెక్టర్ ) చర్చలో పాల్గొన్నారు. చర్చలో పాల్గొన్న వక్తలు ఐఐటీ స్టడీ బిజినెస్ పై ఎటువంటి అభిప్రాయాలను వెల్లడించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి మరిన్ని వివరాలను తెలుసుకోండి....

16:36 - July 13, 2016

హైదరాబాద్ : ఒకటి కాదు రెండు కాదు 3 వేల కోట్లు. ఇది ఏ ప్రాజెక్టో లేక రిజర్వాయర్ బడ్జెటో కాదు. తెలుగు రాష్ర్టాల్లో ఉప్పెనై ఉరకలేస్తున్న ఐఐటి కోచింగ్‌ బిజినెస్‌ రేంజ్. స్కూలు దశ నుంచే.. ఐఐటి ఓరియంటేషన్ పేరుతో మొదలవుతున్న కోచింగ్ ల వెంట తమ పిల్లల్ని పట్టుకుని పరుగు తీస్తున్న తల్లిదండ్రులు ఖర్చు చేస్తున్న మొత్తం. తెలుగు రాష్ట్రాల్లో ఇంతింతై పెరిగిపోతున్న ఐఐటి క్రేజ్ కు అద్దం పెడుతున్న హాట్ హాట్ కోచింగ్ బిజినెస్ పై టెన్ టీవీ స్పెషల్ రిపోర్ట్.

రూ.3 వేల కోట్లు దాటిన బిజినెస్‌ ..
100 శాతం ఉత్తీర్ణతా బోర్డుల కాలం పోయింది. టెన్ బై టెన్ మార్కుల క్రేజ్ దాటిపోయింది. ఇప్పుడంతా ఐఐటీ ఫౌండేషన్ ఫీవర్. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే ఫీవర్. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలలో జోరుగా సాగుతున్న స్టడీ బిజినెస్. ఆరో తరగతి నుంచే ఆరంభమై ఐఐటీ సీటు సాధించేంత వరకు ఫౌండేషన్, ఓరియంటేషన్, సీటు గ్యారంటీ పేర్లతో సాగుతున్న ఈ బిజినెస్ సైజ్ ఇప్పుడు 3,000 కోట్లు దాటిపోయిందని అంచనా. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదో ఇండస్ట్రీ. ది మోస్ట్ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ.

స్పెషల్‌ స్కూల్స్‌, కోచింగ్‌ సెంటర్లకు క్యూ కడుతున్న విద్యార్థులు..
ఈ బిజినెస్‌ సైలెంటుగానే మొదలైనా ప్రతి ఏటా జరుగుతున్న బిజినెస్‌ లెక్కలను చూస్తే ఐఐటి సీటు సాధించిన దానికన్నా ఎక్కువగా ఆశ్చర్య పోవాల్సిందే. ఏటా తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి కోచింగ్ పేరుతో మూడు వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఐఐటి ఆశలతో స్పెషల్ స్కూల్స్ కు కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతుండడంతో ఈ బిజినెస్ గ్రాఫ్ పైపైకి దూసుకుపోతోంది.

కార్పొరేట్‌ కళాశాలల నుంచే 80 శాతం విద్యార్థులు ...
ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల్లో లక్షన్నర మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ రాస్తున్నారు. వీరిలో దాదాపు 80 శాతం మంది కార్పొరేట్‌ కళాశాలల నుంచే వస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐఐటి అర్హత సాధిస్తున్నవారిలో 15 వేల నుంచి 20 వేల మంది విద్యార్థులు తెలుగువారే ఉంటున్నారు.

6వ తరగతి నుంచే అకాడమిక్‌ స్టాండర్డ్స్‌ ఉండాలంటూ ప్రచారం ..
ఇక ప్రతియేటా జేఈఈ మెయిన్స్‌ రాసేవారి సంఖ్య కూడా పెరుగుతుండడం కార్పొరేట్‌ కళశాలలకు వరంగా మారింది. ఇప్పటివరకు కార్పొరేట్‌ కాలేజీల్లోనే కొనసాగుతున్న ఈ బిజినెస్‌ పాఠశాలలకు కూడా పాకింది. ఐఐటీల్లో సీటు పొందాలంటే 6వ తరగతి నుంచే మంచి అకాడమిక్‌ స్టాండర్డ్‌ ఉండాలని ప్రచారం చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సు పేరిట భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఐఐటీ ఫౌండేషన్‌ కోర్సు తప్పనిసరి చేస్తూ.. తెలిసీ.. తెలియని వారి నుంచి కూడా లక్షలు గుంజుతున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఏటా లక్షల్లో ఫీజులు కడుతున్నారు.
కొత్తగా పుట్టుకొస్తున్న ఐఐటీ కాన్సెప్ట్‌ స్కూల్స్‌ ..
ఐఐటి సీటు రావాలంటే... ఇంటర్ లో మొదలు పెడితో సరిపోదు.. మొక్కగా ఉన్నప్పుడే విద్యార్థిని వంచాలి. ఆరో తరగతి నుంచే రుద్దాలి. అప్పుడేఐఐటి సీటు కల నెరవేరుతుందని.. మా స్కూల్లో చిన్నప్పటి నుంచే ఐఐటికి ఫౌండేషన్ వేసేస్తామని ప్రైవేటు.. కార్పొరేట్ స్కూల్స్ చెబుతున్న మాటలకు పిల్లల మీద గంపెడాశలు పెట్టుకునే పేరెంట్స్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఫలితంగా.. ఐఐటి శిక్షణ పేరుతో వేల కోట్ల వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. ఐఐటి కోచింగ్ లో లక్షల పీజుల సంగతి అలా ఉంచితే, విద్యార్థులను ఏళ్ళకేళ్ళు రాపిడి పొట్టి ఒత్తిడికి గురి చేయడం మరో కణం. నాలుగు గోడల మధ్య విద్యార్థులను నిర్బంధంగా చదివిస్తూ.. ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలూ బలంగా వినిపిస్తున్నాయి. పేరెంట్స్ లో పెరుగుతున్న ఐఐటి క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఐఐటి స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి.

విద్యార్థుల్లో కొరవడుతున్న సృజనాత్మకత ..
వ్యాపారమే ప్రధాన లక్ష్యంగా సాగే స్కూళ్ళు.. కోచింగ్‌ సెంటర్లు బట్టీ విధానాన్నే కొనసాగిస్తున్నారు తప్పిస్తే... విద్యార్థులను సృజనాత్మకంగా ఆలోచించేలా చేసే విధానాలను పాటించడం లేదు. ఈ ధోరణి విద్యార్థులను సృజనాత్మకంగా ఆలోచించకుండా చేస్తోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
పిల్లల చదువుల కోసం అప్పులు చేస్తున్న 40 శాతం మంది తల్లిదండ్రులు..
ఐఐటిలో సీటు వస్తే పెద్ద కంపెనీల్లో జాబ్ గ్యారంటీ అనే నమ్మకంతో తల్లితండ్రులు తమ పిల్లలను ఎన్ని కష్టాలైనా భరించి ఐఐటిలో చేర్పించాలని తపన పడుతున్నారు. ఈ ప్రత్యేక శిక్షణ కోసం మధ్యతరగతి తల్లితండ్రుల్లో 40 శాతం మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇంత ఖర్చు పెట్టినా సీటు రాకపోతే ఎలా అన్న టెన్షన్ ఎలాగూ తప్పదు. ఏమైనా, ఈ ధోరణి ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్, కోచింగ్ సెంటర్లకు కాసుల పంట పండిస్తోంది.

ఈ క్రేజ్ ఇలాగే కొనసాగితే ఐఐటి కోచింగ్ బిజినెస్ దందాగా మారే అవకాశం...
ఈ క్రేజ్ ఇలాగే కొనసాగితే ఐఐటి కోచింగ్ బిజినెస్ దందా ఇంకా జోరందుకుంటుంది. ఫీజుల నియంత్రణ వ్యవస్థల వైఫల్యం, విద్యా వ్యాపారాన్ని రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో విద్యా వ్యాపారం హద్దులు లేకుండా సాగిపోతోంది. మరో మార్గం లేని తల్లితండ్రులు ఈ వ్యాపారంలో సమిధలవుతున్నారు.

 

11:29 - July 10, 2016

ఎయిర్ ఇండియా విమానాలు ఆలస్యంగా తిరుగుతున్నాయి. రూ. 28వేల కోట్ల నష్టంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. సిబ్బంది కొరతే కాకుండా గొంతెమ్మ కోరికలు కూడా కారణమవుతున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రయాణించాల్సిన విమానం బయలుదేరలేదు. కారణం పైలట్ ట్రాఫిక్ లో చిక్కుకున్నట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. ఇక సినిమాలకు సైతం విమానాలు పబ్లిసిటీ చేస్తున్నాయి. కబాలి సినిమా కోసం ఓ విమాన సంస్థ పబ్లిసిటీ చేస్తోంది. ఆవు మూత్రంలో బంగారం..ఐఐటీ కోచింగ్ కోసం కోట్లు..ఐఐటీ కోసం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. మరోవైపు సినిమాల కోసం విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే యూ ట్యూబ్ లో వైరల్ కోసం పిచ్చ పిచ్చ చేష్టలు చేస్తున్నారంట. ఆసక్తికరంగా ఉండే ఈ అంశాల కోసం వీడియోను క్లిక్ చేయండి.

20:11 - April 10, 2016

ఆదిలాబాద్ : బాసర ట్రిపుల్‌ఐటీలో కలుషిత ఆహారం తిని 50మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ట్రిపుల్‌ ఐటీలోని ఎస్ఎస్ మెస్‌లో భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ వైద్యశాలలకు తరలించారు. ప్రస్తుతం వీరు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. మరోవైపు ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - ఐఐటీ