ఐదుగురు

07:40 - July 1, 2018

ఈటానగర్ : అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడి ఐటిబిపికి చెందిన ఐదుగురు జవాన్లు మృతి చెందారు. భారీ వర్షాలు కారణంగా అకాజన్‌ మార్గంలో పెద్ద బండరాయి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. భారత్‌ టిబెట్‌ సరిహద్దుకు ఐటిబిపి జవాన్లు బసర్‌ నుంచి లోయర్‌ సివాంగ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐటిబిపి మినీ బస్సులో 20 మంది సిబ్బంది  ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ 8 మంది జవాన్లను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో గత ఐదు రోజుల్లో ఇది రెండో ఘటన. కొండ చరియలు విరిగి పడ్డ ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

 

19:36 - April 29, 2018

కడప : జిల్లాలోని పుల్లంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిది. వ్యాను, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు అనంతపురం జిల్లా గుత్తి వాసులుగా గుర్తించారు.  మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 

17:38 - April 16, 2018

కర్నూలు : జిల్లాలో విషాదం ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని దిన్నదేవరపడులో గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. అప్పులబాధతో ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి.. బోయ మధు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్యా ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం వీరిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. 

 

08:56 - March 12, 2018

చెన్నై : తమిళనాడులోని తేని జిల్లా కురంగణి అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ఐదుగురు విద్యార్థులను బలి తీసుకుంది. మున్నార్‌ ప్రాంతంలోని సూర్యనెల్లి నుంచి పర్వతారోహణకు వెళ్లిన 39 మంది విద్యార్థుల్లో  ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. 15 మందిని హెలికాప్టర్ల సహాయంతో  అటవీ, రక్షణ శాఖల అధికారులు రక్షించారు.  వీరందర్నీ బోడినైకనూర్‌ ఆస్పత్రికి తరలించారు.  ఇంకా ఆచూకీ తెలియని మరికొందరు విద్యార్థుల కోసం గాలింపు విస్తృతం చేశారు. కొరంగణి ప్రాంతంలో పర్వతారోహణ శిక్షణకు వెళ్లిన విద్యార్థులు కొండెక్కే సమయంలో అకస్మాత్తుగా కార్చిచ్చు రేగడంతో ఈ ఘటన జరిగింది. అధికారులు సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. 

 

 

11:36 - January 23, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలో రహదారులు రక్తమోడాయి. రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు చనిపోగా... మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.  నల్లజర్ల మండలంలోని అనంతపల్లి దగ్గర కారు .. ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. ఇక ఆకివీడు మండలం అజ్జమూరు దగ్గర ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు చనిపోయారు. వీరిని షకీల్‌, నాగార్జునగా గుర్తించారు.

10:22 - January 23, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొన్న ఘటనలో చిన్నారితో సహా తల్లి, సురేశ్ మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతులు దేవి (32), నిశ్చయ (2), సురేశ్ గా గుర్తించారు. ఆకివీడు మండలం అజ్జమూరు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యుకులు మృతి చెందారు. బైక్ పై వెళ్తున్న ఇద్దరిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మృతి చెందారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

14:50 - January 8, 2018

కర్నాటక : బెంగళూరులో కుంబారా సంఘా భవనంలోని కైలాశ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బార్‌లో నిద్రిస్తున్న ఐదుగురు సిబ్బంది సజీవ దహనమయ్యారు. ఆదివారం రాత్రి 2.30 గంటల సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు పక్కనున్న భవనాల్లోకి వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై బార్ యజమాని దయాశంకర్‌ను  పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల్లో స్వామి 23, ప్రసాద్ 20, మహేశ్ 35 అనే ముగ్గురు వ్యక్తులు కర్నాటకలోని తుముకూర్ ప్రాంతంవారు కాగా..మంజునాథ్ 45, హాసన్ అండ్ కీర్తి 24 మాండ్యకు చెందినవారిగా గుర్తించారు. 

 

09:01 - January 1, 2018

కడప : జిల్లాలో కొత్త సంవత్సరంలో విషాదం నెలకొంది. పెండ్లిమర్రిలోని ఇందిరానగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చలిమంట దగ్గర కూర్చున్నవారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తోసహా ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్ కు తరలించారు. మృతులు లక్ష్మీనరసింహ్మా, కార్తీక్, గిరి, భాస్కర్ లుగా గుర్తించారు.  పులివెందుల నుంచి వస్తుండగా ఈ ఘటన ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు నడపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

 

12:16 - December 28, 2017

గుంటూరు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫిరంగిపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నలుగురు విద్యార్థులతోపాటు ఆటో డ్రైవర్‌ మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. స్కూల్‌ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. మరణ వార్త విన్న...  విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:36 - December 28, 2017

Pages

Don't Miss

Subscribe to RSS - ఐదుగురు