ఐదుగురు మృతి

08:31 - October 10, 2018

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. దాదాపు 35మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. రాయ్‌బరేలి జిల్లా హర్‌చంద్‌పూర్ రైల్వే‌స్టేషన్‌కు 50మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐదు బోగీలు, ఇంజిన్ పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఎన్ఢీఆర్ఎఫ్ బృందాలను సహాయక చర్యల కోసం ఘటనాస్థలికి పంపింది. ఈ ప్రమాదంపై స్పందించిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర రైల్వేమంత్రి పియూష్‌ గోయల్‌ సహాయక చర్యలను చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. వారణాసి, లక్నోల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదస్థలానికి తరలివెళ్లాయి. రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విన్‌ లోహానీ సహాయ, రక్షక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఫరక్కా ఎక్స్‌ప్రెస్ లక్నో నుంచి అలహాబాద్‌కు వెళుతోంది.

16:13 - June 13, 2018

విజయనగరం : ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాశీ యాత్రకు వెళ్లి వస్తున్న భక్తులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు మృతి చెందారు. భోగాపురం మండలం పాలపల్లి వద్ద ట్రావెల్స్ బస్ ను ఎదురుగా వస్తున్న ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో కాశీకి వెళ్లి తిరిగు ప్రయాణమైన భక్తులు మరికొద్ది సేపట్లో విశాఖ చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలవగా పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాదం సయమంలో బస్ లో చిక్కుకున్న 20మంది ప్రయాణీకులను రక్షించేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. మృతులు విశాఖ వాసులుగా తెలుస్తోంది. 

10:26 - May 20, 2018

చిత్తూరు : నిద్రమత్తులో వాహనం నడిపితే జరిగే ప్రమాదాలు, అనర్ధాలు మరోసారి నిదర్శనం రేణిగుంట మండలం మామండూరు వద్ద కనిపించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకుందామని బయలుదేరిన తిరుమల భక్తుల జీవితాలు తెల్లవారిపోయాయి. మద్యం మత్తు, నిద్రమత్తు ఎందరి జీవితాలలోను, కుటుంబాలలోను విషాదాలను నింపుతోంది. ఈ నేపథ్యంలో నిద్రమత్తులో బొలెరో ఓ మినీలారీ ఢీకొంది. ఈ ఘటన ఐదురు ప్రాణాలను బలయ్యాయి. రేణిగుంట మండలం మామండూరులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో పాటు ఓ చిన్నారి కూడా ప్రాణాలను కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా వుంది. గాయపడినివారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దార్యాప్తు చేపట్టారు. కాగా మృతులు కర్నూలు జిల్లా నంద్యాల వాసులుగా పోలీసులు గుర్తించారు. 

18:53 - March 18, 2018

జమ్ము కాశ్మీర్ : సరిహద్దుల్లో పాకిస్తాన్‌ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ జమ్మూ సరిహద్దుల్లో కాల్పులతో తెగబడింది. పౌరులే లక్ష్యంగా గ్రామాలపై బుల్లెట్లు, మోర్టార్‌షెల్స్‌ వర్షం కురిపించింది. ఈ దాడిలో ఐదుగురు పౌరులు మరణించారు. ఫూంచ్‌ సెక్టార్‌ బాల్‌కోట్‌ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయి. చనిపోయినవారంతా ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు పేర్కొన్నారు. పాక్ కాల్పులకు ఇండియన్ ఆర్మీ కూడా ధీటుగా జవాబిచ్చింది. 

19:51 - March 17, 2018

నల్లగొండ : అభం శుభం తెలియని చిన్నారులు ఆడుకునేందుకు వెళ్లి నీట మునిగి మృతి చెందిన తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి చిన్నారులు మృతి చెందిన ఘటనతో గుడి తండాలో తీవ్ర విషాదం నెలకొంది. ఒంటిపూట స్కూల్స్ కు వెళ్లి వచ్చిన అనంతరం పెద్దవారంతా కూలిపనులకు వెళ్లిన నేపథ్యంలో ఇంటి వద్ద ఎవరూ లేకపోవటంతో చిన్నారులంతా చెరువుకు ఈత కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొండపల్లేపల్లి మండలం పెండ్లిపాకల గుండి తండాలో ముగ్గురు అన్నదమ్ములకు చెందిన ఐదుగురు చిన్నారులు చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందటంతో ఆప్రాంతంలో విషాదం నెలకొంది.

09:37 - November 20, 2015

చిత్తూరు : బైరెడ్డిపల్లి మండలం మిట్టకురపపల్లి దగ్గర ఆర్టీసీబస్సు- కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు బస్సు కింద ఇరుక్కోవడంతో నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళ లు, డ్రైవర్, ఓ బాలిక అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు వేణు, కమలమ్మ, లక్ష్మమ్మ, రమణమ్మ, రేణుక లు మిట్టకురవపల్లి వాసులుగా పోలీసులు తెలిపారు. బాధితులంతా బైరెడ్డి పల్లిలోని ఓ వివాహానికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

12:33 - August 24, 2015

హైదరాబాద్ : అనంతపురంలో జరిగిన నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటనలో ఐదుగురు మృతిచెందడం బాధాకరమని రాష్ట్ర మంత్రి పరిటాల సునీత అన్నారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతిచెందిన ఐదుగురిలో దేవదుర్గ్‌ ఎమ్మెల్యే వెంకటేశం ఉండడం మరింత దిగ్బాంత్రి కలిగించిందని మంత్రి అన్నారు. ఈఘటనలో లారీ డ్రైవర్‌ పరారయ్యాడని..క్లీనర్‌ మృతిచెందాడని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఐదుగురి మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Don't Miss

Subscribe to RSS - ఐదుగురు మృతి