ఐరన్

12:18 - September 11, 2017

ఆంధ్ర మాత గా పిలువబడే గోంగూర. తెలంగాణ లో కుంటి కూర అని కూడా పిలుస్తున్నారు. ఇది రెండు రకాలుగా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఎర్ర లేదా కొండ గోంగూర, తెల్ల గోంగూర. అందరూ ఎంతగానో ఇష్టపడే గోంగూర, రుచిలోనేగాక ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైనది. గోంగూరలో ఉండే పీచు పదార్ధం మన గుండెకు ఎంతో మేలుచేస్తుంది.

గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉంది. పొటాషియమ్‌, కాల్షియమ్‌, ఫోస్పర్స్, సోడియం, ఐరన్ సమృద్థిగా ఉన్నాయి. దీనిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రైట్స్ అధికంగా ఉండి క్రొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఆకులో పొటాషియం ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వలన రక్త ప్రసరణ సక్రమంగా ఉండటమే కాకుండా మన శరీరంలోని రక్తపోటును కూడా అదుపులో ఉంచడానికి ఇది సహకరిస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ గోంగూరలో అనేక దీర్ఘకాలిక రోగాలను నయం చేసే సత్తా ఉంది.

రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, షుగర్ లెవెల్స్ ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు గోంగూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు.

ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను నివారించడానికి గోంగూర సహాయపడుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది.

గోంగూర ఆకుల పేస్ట్ తలకు పట్టించి ఉదయం స్నానం చేస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి బట్టతల రాకుండా కాపాడుతుంది.

16:04 - March 14, 2016

ఉలవలు నవధాన్యాలలో ఒకటి. ఉలవలు ఎక్కువగా తీసుకున్నవారి ఆరోగ్యం గుర్రంలా దౌడు తీస్తుందనే నానుండి ఉంది.  ఉలవలకు ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాధాన్యతే ఉంది. జ్వరం, జలుబు, గ్యాస్ట్రిక్, పెప్టిక్ అల్సర్లు, కాలేయ, మూత్రపిండ సమస్యలను తగ్గిస్తుందని ఆయుర్వేద నిలుపు తెలిపారు. ప్రత్యేకంగా మహిళల్లో వచ్చే నెలసరి సమస్యకు, అధిక చెమటకు చక్కటి పరిష్కారం వీటితో సాధ్యం అని పేర్కొన్నారు. వందగ్రాముల పిజ్జాతింటే అందులో పన్నెండు గ్రాముల కొవ్వు ఉంటుంది. అదే వంద గ్రాముల ఉలవల్ని తింటే కొవ్వులు అస్సలు ఉండవు. వంద గ్రాముల ఉలవ గుగ్గిళ్లలో 321 కేలరీల శక్తితో పాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్పొహైడ్రేడ్లు, 287 మిల్లీ గ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్పరస్ లతో పీటు పీచు పదార్థమూ లభిస్తుంది.

ఉలవలు ఐరన్, క్యాల్షియంలకు ,ప్రోటీన్లకు అందిస్తుంది. క్యాల్షియం, ఐరన్ ఇతర రసాయాన పదార్థాలతో కలిసి ఉండడం వల్ల, శరీరం వీటిని తేలిగ్గా స్వీకరించలేదు. ఉలవల్ని మొలకెత్తించడం ఒక సులువైన పధ్ధతి. ఈ ప్రక్రియ ఐరన్, క్యాల్షియంల లభ్యతని పెంచడం వల్ల ఉలవల పోషక విలువ బాగా పెరుగుతుంది. అంతేకాక, మొలకెత్తిన ఉలవలు చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఉలవలు శరీరంలోని ఉష్ణాన్నిపెంచుతాయి. దీనివల్ల వర్షపు, మబ్బు వాతావరణంలో దగ్గు, జలుబులని తేలిగ్గా గట్టెక్కవచ్చు. అయితే, ఎండ తీవ్రత ఉన్నప్పుడు, ఉలవలు శరీరాన్ని వేడెక్కిస్తోంటే, మొలకెత్తిన పెసరపప్పుని తినడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించవచ్చు.

ఆహారంలో ఉలవలు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ఒక కప్పు ఉలవలకు నాలుగు కప్పులు నీళ్లు కలిపి కుక్కర్ లో ఉడికించి ఉలవకట్టు తయారు చేసుకోవాలి. దానిలో చిటికెడు ఉప్పు కలిపి దానిని రోజు ఉదయంపూట ఖాళీకడుపుతో తీసుకోవాలి. ఇలా డెయిలీ చేస్తే సన్నబడతారు. అలాగే ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపు పొడి కలిపి పైపూత మందుగా రాస్తే సెగ్గడ్డలు తగ్గిపోతాయి. ఉలవలు ఆకలిని పెంచుతాయి. అలాగే కఫాన్ని తగ్గిస్తాయి. మూత్రాశయంలో రాళ్లను కరిగించడంలో కూడా ఉలవలు సహకరిస్తాయి. తరచూ వచ్చే ఎక్కిళ్లను కూడా ఉలవలు తగ్గిస్తాయి. బహిష్టు సమస్యలతో సతమతమయ్యే మహిళలకు ఉలవలు ఆహారంగా తీసుకోవడం ఎంతో మంచిది. ఉలవలు కడుపు ఉబ్బరాన్నితగ్గిస్తాయి. వేడి శరీరం ఉన్నవారు మరీ ఎక్కువగా కాకుండా మితంగా ఉలవలు తీసుకోవడం మంచిది. దానికి తోడుగా గ్లాసుడు మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది.

13:49 - December 5, 2015

నిద్రలేచింది మొదలు... ఉరుకులు పరుగుల జీవితం మహిళలది. త్వరగా అలసిపోవడం, నీరసంగా అనిపించడం ప్రతి మహిళలను నేడు వేధిస్తున్న సమస్య. దీనికి కావాల్సిందల్లా ఐరన్‌. శరీరానికి తగిన ఐరన్‌ను ఆహారం ద్వారా అందించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్‌ శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు ఐరన్‌ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.

  • ఐరన్‌ లోపం వల్ల లావు తగ్గడం, తరచూ తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి.
  • ఐరన్‌ లభించే పదార్థాలు : ఉడికించిన గుడ్డు, చేపలు, బీన్స్‌, ఆకుకూరలు, పచ్చని కూరలు, డ్రైఫ్రూట్స్‌, సోయా, మాంసం, రాగులు.
  • ఐరన్‌ పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. శరీరానికి ఆక్సిజన్‌ అందించే ఎర్ర రక్తకణాల సంఖ్య పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లను దరిచేరనివ్వదు.
  • బిడ్డ నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపే ఐరన్‌ను గర్భిణులు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది.
  • నెలసరి సమస్యలు ఎదుర్కొనేవారు, బాలింతలు తప్పక ఐరన్‌ తీసుకోవాలి. 

Don't Miss

Subscribe to RSS - ఐరన్