ఒడిశా

13:33 - April 16, 2018

జలం ప్రాణాధారం, జలం జీవాధానం, జలమే జీవం, జలమే ప్రాణం. జలం లేకుంటే ప్రాణికోటి సమస్తం అంతం!! ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ నీటితోనే పని. అది లేకుంటే అన్ని పనులు బంద్! అసలు మానవ మనుగడే బంద్!! మనిషి బతకాలన్నా, పంట పండాలన్నా, జీవకోటి మనుగడ సాగించాలన్నా నీరే ఆధారం! అది లేకుంటే ? అసలు ఆ మాట తలచుకునేందుకే ధైర్యం చాలదు కదూ? నీటి కోసం గ్రామాలకు గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కొట్టుకుంటున్నాయంటే కారణం మనుగడ, బ్రతికేందుకు ఆధారం? జీవాధానం. నీటి యుద్ధాలతో దేశాలకు దేశాలకు కొట్టుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. సాధారణంగా నీటికొరత అనేది చాలా ప్రాంతాలలో వుంది. అదీ వేసవి వచ్చిందంటే ఇక చెప్పేదేముంది. స్నేహితులుగా వుండే ఇరుగు పొరుగు వారు కూడా శతృవుల్లా మారిపోతారు. కారణం నీరు.

ప్రాణి మనుగడకు నీరు..
భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనె జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, ద్రవ రూపం వాయు రూపంలో అటే మేఘాలు, ఆవిరి రూపాలలో అన్నమాట. మరి నీరు ప్రాణి మనుగడను సాసిస్తోంది. 

నీటికోసం మైళ్ల దూరం కాలినడక..
నీటికోసం మైళ్లకొద్దీ దూరాలు వెళ్లి తెచ్చుకునే దుస్థితి నేటి కంప్యూటర్ యుగంలో కూడా వుంది అంటే పరిస్థితులు ఎంతటి దారుణంగా వున్నాయో ఊహించుకోవచ్చు..హలో అంటే పొలో మంటు ఇంటి ముంగిట్లో వచ్చి పడిపోయే పదార్ధాలు, వస్తువులు. కానీ వేసవి వచ్చిందంటే మాత్రం లీటరు నీరు రూ.100లు పెట్టి కొనుకునే పరిస్థితులు. బీటలు వారిని నేలమ్మ తల్లి. గంగమ్మ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పంటే వేసిన రైతన్న వరుణుడి కోసం ఎదురు చూస్తున్నట్లు..దాహార్తితో కటకటలాడిపోతున్న నేలమ్మను అభిషేకించేందుకు వానమ్మ కానరాని దుర్భర పరిస్థితులు.

వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు..
నడి వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మంచి నీటి కోసం అలమటించే పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ తాజా గణాంకాల ప్రకారం... 404 జిల్లాల్లో గతేడాది అక్టోబర్ తర్వాత వర్షాల్లేకపోవడంతో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో 140 జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. మరో 109 జిల్లాల్లో ఓ మోస్తరు కరువు ఉంది.

156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు..
156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు ఉంది. నిజానికి ఏటా చాలా జిల్లాల్లో ఈ పరిస్థితులు వేసవిలో కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ ఏడాది శీతా కాలంలో అసలు వర్షాలే లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశవ్యాప్తంగా 63 శాతం వర్షాభావం ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రిజర్వాయర్లలో తక్కువ నీటి లభ్యత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్ ఉన్నాయి.

17:11 - September 25, 2017

హైదరాబాద్: నగరంలో ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్య నగ్న ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. విజయనరం చెందిని చిలకపాటి సునిల్ కు ఓ యువతితో 2007లో పెళ్లైంది. సునిల్ పెళ్లైన నాటినుంచి భార్యను వేధించసాగాడు. దీంతో అతని భార్య పీఎస్ లో వేధింపుల కేసు పెట్టింది. తనపై పెట్టిన కేసులు విత్ డ్రా చేసుకోవాలని బాధితురాలి సోదురుడికి ఈ వీడియోలు, ఫోటోలు ఫేక్ ఐడీతో మెయిల్స్ పెట్టాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సైబరాబాద్ క్రైమ్ బ్రాంచి పోలీసులు ఒడిశా లో సునిల్ అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

21:45 - September 19, 2017

కటక్ : ఒడిశాలో జరిగిన సీషోర్‌ చిట్‌ఫండ్‌ కుంభకోణానికి సంబంధించి అధికార బీజూ జనదళ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రవత్ రంజన్ బిస్వాల్‌ను సిబిఐ అరెస్ట్‌ చేసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత బిస్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీషోర్‌ గ్రూప్‌ చీఫ్‌ ప్రశాంత్‌ దాస్‌తో కలిసి భూకొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై బిస్వాస్‌ను నాలుగుసార్లు పోలీసులు విచారణ జరిపారు. అంతకుముందు జయపూర్‌ బేనాపూర్‌ భూకుంభకోణంలో ఎమ్మెల్యే భార్య లక్ష్మి బిలాస్నీ బిస్వాల్‌ను కూడా సిబిఐ విచారణ జరిపింది. బిస్వాల్ కటక్-చౌదార్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

16:07 - September 10, 2017

ఒడిశా: రాజధాని భువనేశ్వర్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. శిథిలాలకింద మరికొంతమంది ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

12:15 - September 4, 2017

ఒడిశా : ఏనుగుతో సెల్ఫీ దిగాలన్న సరదా ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. ఓ ఆడ ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మండియాకుడ్‌ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయని తెలుసుకున్న కటక్‌ వాసి అశోక్‌ భారతి అక్కడకు చేరుకున్నాడు. గ్రామస్థుల సహకారంతో అటవీశాఖ అధికారులు ఏనుగును తరుముతుండా అశోక్‌ భారతి ఫోటోలు తీశాడు. ఆ తర్వాత ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండా ఆగ్రహించిన ఏనుగు.. అశోక్‌ను అశోక్‌ భారతిని వెంటాడి కాళ్లతో, తొండంతో నలిపేసింది. ఏనుగుబారి నుంచి తప్పించుకునే పారిపోయేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఏనుగు తొక్కేడంతో తీవ్రంగా గాయపడ్డ అశోక్‌ భారతిని అస్పత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. 

16:09 - July 16, 2017

విజయనగరం : నాగావళి నది పరవళ్లు తొక్కుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో నాగావళి ఉధృతం పెరిగిపోయింది. కళ్యాణ్ సింగ్ పూర్ లో నీట మునగగా మరో 30 గ్రామాలు జలదిగ్భందనంలో చిక్కుకపోయాయి. నాగావళి ఉధృతితో ఆంధ్రా..ఒడిషా రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొమరాడ మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

విజయనగరం జిల్లాపై..
నాగావళి ఉధృతి విజయనగరం జిల్లాపై ప్రభావం పడింది. పార్వతీపురం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొమరాడ (మం) కోనేరు వద్ద జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు తీవ్రంగా స్తంభించిపోయాయి. గత నాలుగైదు గంటలుగా ఎక్కడి వాహనాలు నిలిచిపోయాయి. కొమరాడ మండలంలోని పలు గ్రామాలు నీట మునిగిపోయాయి. ఎగువ ప్రాంతాలకు వీరిని తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాయగడ జిల్లా కళ్యాణ సింగుపూర్ నీట మునగగా తెరుబలి వద్ద రైల్వే బ్రిడ్జి కొట్టుకపోయింది.

వాహనదారుల ఇక్కట్లు..
జాతీయ రహదారి..ఇతర ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగావళి ఉధృతితో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లోతట్టు ప్రాంతాల వాసులు పేర్కొంటున్నారు. వాహనాలు నిలిచిపోవడంతో తాము వంట వండుకోవడానికి సరుకులు కూడా లేవని, కనీసం తాగడానికి మంచినీరు కూడా లేదని వాహన డ్రైవర్లు..సిబ్బంది పేర్కొంటున్నారు.

11:19 - July 6, 2017

మృతదేహంతో కాలినడక...అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి వర్గాలు..డబ్బులు లేక మృతదేహంతో కిలోమీటర్ల మేర నడక..ఇలాంటి పలు ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. కానీ పరిస్థితిలో మార్పు రావడం లేదని ఈ ఘటన చూస్తే అర్థమౌతోంది.
డబ్బులు లేక మృతదేహాన్ని మోసుకుంటూ ఏకంగా 5కి.మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. సీఎం నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని గంజాంలో చోటు చేసుకోవడం గమనార్హం. సోరిస్ బిలి గ్రామానికి చెందిన భానుమతి నాయక్ (70) అనారోగ్యంతో ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కానీ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు బంధువులు ప్రయత్నించారు. కానీ 108 వాహనం లభించలేదు. ప్రైవేటు వాహనంలో తరలిద్దామన్నా వారిలో అంత డబ్బులు లేకపోయాయి. చివరకు మృతదేహాన్ని ఓ దుప్పటిలో పడుకొబెట్టి..కర్రెల సహాయంతో మోసుకుంటూ 5 కి.మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. వారు మోసుకుంటూ వెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనిపై అక్కడి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఒడిశాలోనే కలహండి జిల్లాలో ధనమజ్జి అనే వ్యక్తి భార్య మృతదేహాన్ని పది కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లిన ఘటన సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.

14:18 - June 23, 2017

అనంత విశ్వగ్రహంలో మీ పేరు చూసుకుంటే అంతకంటే థ్రిల్ల్ ఎముంటుంది చెప్పండి.అటువంటి అరుదైన గౌరవం దక్కించుకుంది సాహితి పింగళి...... ఒడిశా చెందిన బాలిక సంచలనం సృష్టించింది. లిటిల్ మిస్ యూనివర్స్ 2017 ఎంపికతో పాటు మూడు టైటిళ్లు గెలుచుకున్న బాలికగా రికార్డ్ స్వంతం చేసుకుంది...... రెండేళ్ల క్రిందటి హర్యానాలో పుట్టిన ప్రచారమిది. బిందు జిల్లా బీబీపూర్ మాజీ సర్పంచ్ సునిల్ జగ్లాన్ దీన్ని ప్రారంభించారు. కూతురును ప్రేమించే ప్రతి తల్లి, ప్రతి దండ్రి ఆమెతో సెల్ఫీ తీసుకోని అప్ లోడ్ చేయాలన్నదే ప్రచారం. పూర్తి సమాచారం కోసం వీడియో చూడండి.

 

16:45 - June 2, 2017

ఒడిశా : స్వదేశీ పరిజ్ఞానంతో అణు సామర్థ్యంతో రూపొందించిన పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఉదయం 9 గంటల 50 నిముషాలకు పృథ్వి-2 మిసైల్‌ను ఒడిశాలోని చాందీపూర్‌ సమీపంలో గల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి మొబైల్‌ లాంఛర్‌ ద్వారా ప్రయోగించారు. డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలు దీన్ని పర్యవేక్షించారు. ఈ ట్రయల్‌ విజయవంతమైందని డిఆర్‌డిఓ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 350 కి.మీ.దూరంలోని లక్ష్యాలను సమర్థంగా చేధించగలదు. 5 వందల కేజీల నుంచి 1000 కేజీల వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లే సామర్థ్యం పృథ్వి-2కు ఉంది. గతేడాది నవంబర్‌లోనూ ఇదే బేస్‌ నుంచి పృథ్వీ-2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. 9 మీటర్ల పొడవుండే ఈ మిసైల్‌ 2003లో భారత ఆర్మీ అమ్ముల పొదిలోకి చేరింది.

16:46 - April 12, 2017

భువనేశ్వర్ : ఒడిశా కోరాపుట్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. బందుగాంబ్లాక్ కొంబరికుట్టి వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. స్థానికుడికి గాయాలయ్యాయి. ఘటనా స్థలం వద్ద మూడు ఏకే 47లు, కిట్ బ్యాగ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు సభ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడికి పాల్పడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Pages

Don't Miss

Subscribe to RSS - ఒడిశా