ఒత్తిడి

06:27 - February 15, 2018

హైదరాబాద్ : తెలంగాణా ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచే మార్గాలపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన గులాబి పార్టీ....ఇప్పుడు రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న వాదనను తెరపైకి తెస్తోంది. ఇప్పటికే కేంద్రంపై ఏపీ విరుచుకు పడుతుండడగా.. అదేబాటలో తెలంగాణా కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాధారణ ఎన్నికలకు ఏడాది ఉండగానే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌లో రేగిన రాజకీయ దుమారం తెలంగాణకు కూడా పాకుతోంది. ప్రత్యేక హోదా అంశం ఏపీలో హీట్ పుట్టిస్తుండగా.. నిధుల కేటాయింపు, విభజన చట్టంలోని హామీలు తెలంగాణాలోనూ ఇప్పుడు హాట్‌హాట్‌గా తెరపైకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు అంశాల వారిగా సంపూర్ణ మద్దతు తెలిపిన గులాబి పార్టీ ఇప్పుడు కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా ఎలాంటి నిధులు కేటాయించలేదన్న వాదనను తెరపైకి తెచ్చిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు కేంద్ర వైఖరినే ఎండగట్టేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే తెలంగాణా రాష్ట్రంలో పలు సమస్యలకు కారణమనే అభిప్రాయాన్ని మంత్రులు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిధులు అందకపోవడంతో కంది రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు మంత్రి హరీష్‌రావు. ఇందుకనుగుణంగానే మరో మంత్రి NREGS నిధుల విడుదలలో కేంద్రం తీవ్రంగా జాప్యం చేస్తోందని, ఈ కారణంగానే ఉపాధి హామీ కూలీలకూ జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి క్రిష్ణారావు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చిలో మొదలు కానున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించే పనిలో అధికార పార్టీ నేతలు పడ్డట్లు తెలుస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం హామీలు అమలు చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో విరుచుకు పడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

16:42 - December 22, 2017
21:11 - October 16, 2017

వరుసగా ఒకరి తర్వాత మరొకరు.. కన్నవారికి కన్నీళ్లు మిగులుస్తున్నారు.. బంగారు భవిష్యత్తును కాదనుకుని వెళ్లిపోతున్నారు.. ఏ ఒత్తిడి ఆ చిన్నారులను చిదిమేస్తోంది? ఏ భారం వారిని ఆత్మహత్య దిశగా నెడుతోంది? మార్కుల వేటలో,  ర్యాంకుల గోలలో కార్పొరేట్ విద్యా సంస్కృతి చిన్నారుల చావులకు కారణమౌతోందా? ప్రభుత్వాన్నా, తల్లిదండ్రుల్నా, కార్పొరేట్ విద్యావ్యవస్థనా ఎవర్ని బాధ్యుల్ని చేయాలి? ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ...
చిన్నారుల ఉసురు తీస్తున్న చదువుల నిలయాలు  
చదువంటే ఉత్సాహం.. చదువంటే ఉత్తేజం..చదువంటే భవిష్యత్తు కోసం ఈ రోజు చేసే తపస్సు...కానీ, ఈ చదువుల నిలయాలు చిన్నారుల ఉసురు తీస్తున్నాయి. అనేక కారణాలతో విద్యార్థులు నలిగిపోతున్నారు..  ప్రాణాలు తీసుకుంటున్నారు..  ఇల్లు వదిలిపోతున్నారు.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:03 - October 16, 2017

కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు పెట్టే ఒత్తిడి, వేధింపుల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యలు అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ మేనేజర్ జీవీఆర్, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బాబురెడ్డి, మానసిక నిపుణులు పీఎస్ రావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:50 - October 12, 2017

కార్పొరేట్ కాలేజీల ఒత్తిడితోనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణ, డిగ్రీ, పీజీ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షులు రమణారెడ్డి, క్లినికల్ సైకాలజిస్టు శైలజ, ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి పాల్గొని, మాట్లాడారు. కార్పొరేట్ కళాశాలపై ప్రభుత్వం నియంత్రణ ఉండాలన్నారు. సామాజిక చైతన్య రావాలని తెలిపారు. విద్యా వ్యవస్థ మారాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:42 - August 18, 2017
21:33 - August 14, 2017

హైదరాబాద్ : టీఆర్ఎస్ వ్యతిరేకంగా విపక్షాలు విమర్శల దాడిని పెంచుతున్నాయి. నేరెళ్ల ఘటనలో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు మాటల దాడి మరింత పెంచాయి. ప్రభుత్వ తీరు ఎండగడతూ గులాబీ పార్టీకి చుక్కలు చూపిస్తాన్నాయి. గత మూడేళ్లుగా ప్రభుత్వ వైఫల్యాలపై విపక్షాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఎంసెట్ లీకేజీ, మియాపూర్ భూకుంభకోణం ప్రతిపక్షాల పోరాటం అధికార పార్టీని పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయింది. కానీ కరీంగనర్ జిల్లా నేరెళ్ల ఘటన విపక్షాలను ఒకేతాటిపై నిలిపింది. ముఖ్యంగా వామపక్షాలు, టీడీపీ, కాంగ్రెస్ దూకుడుతో గులాబీ పార్టీ ఉక్కిరిబికిరౌతుంది. ప్రతిపక్ష పార్టీలన్ని నేరెళ్ల ఘటనలో బాదితులకు అండగా నిలవడంతో అధికార పార్టీ దిగిరాక తప్పలేదు. బాదితులకు అండగా ఉంటమంటూ ఓదార్పు మొదలు పెట్టింది గులాబీ దళం. అయిన ప్రతిపక్ష పార్టీలు మరో అడుగు ముందకెసి ప్రభుత్వ వైఖరి మరింత ఎండట్టేందుకు సిద్ధమౌతుండడం కేసీఆర్ టీం రుచించడం లేదు.మరోవైపు టీఆర్ఎస్ మిత్రపక్షంగా వ్యవరిస్తున్న ఎంఐఎం సైలెంట్ గా ఉన్న నిన్నమొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీతో అవగాహనలో ఉన్నట్లు కనిపించిన బీజేపీ క్రమంగా వ్యతిరేక గళం వినిపిస్తోంది.

దిద్దుబాటు చర్యలు...
ప్రతిపక్ష పార్టీలకు కళ్లేం వేసేందుకు టీఆర్ఎస్ నేతలు సమయాత్తం అవుతున్నారు. నేరెళ్ల వ్యవహరం రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తుండడంతో క్షేత్రస్థాయిలో కూడా దిద్దుబాటు చర్యలపై అధికార పార్టీ దృష్టిసారిస్తుంది. విక్షాలను ఎదుర్కొనే వ్యూహాలు తోచక పార్టీ దాదాపు డిఫెన్స్ లో పడుతుందని గులాబీ నేతలే చెప్పుకుంటున్నారు.

13:07 - July 21, 2017

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలకు, కలెక్టర్లను నియమించింది. వీరిలో పలువురు కొత్త వారు కాగా, మరికొందరు సీనియర్లు ఉన్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా పరిపాలనలో అనేక సమస్యలు వస్తున్నాయి. ప్రోటోకాల్‌ వివాదం మొదలుకొని పలు అభివృద్ది , రాజకీయ పరమైన అంశాలు, తదితర సమస్యలు కలెక్టర్లకు, ప్రజాప్రతినిధులకు మధ్య దూరం పెంచుతున్నాయి. అంతే కాక కొన్ని సందర్భాల్లో బహిరంగంగా విమర్శలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.మొన్న జరిగిన హరితహారం కార్యక్రమం ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల మధ్య దూరాన్ని పెంచింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రీతిమీనాపై ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ అనుచిత ప్రవర్తన అనేక వివాదాలను తెరపైకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఐఏఎస్‌లు, ప్రజాప్రతినిధులు పరస్పరం మండిపడుతున్నారు. ఇక ఇటీవల జరిగిన కలెక్టర్లు, లీడర్ల మధ్య గొడవలు తీవ్ర దుమారం రేపాయి.

కరీంనగర్‌ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం
కరీంనగర్‌ జిల్లాలో కలెక్టర్‌ సర్పరాజ్‌కి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మధ్య ప్రోటోకాల్ వివాదం, పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్‌ అలుగు వర్శిణికి, స్థానిక నేతలకు మధ్య సమన్వయ లోపం, మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హోలి కేరికి, నాయకుల మధ్య భేదాభిప్రాయాలు అలాగే జనగాం జిల్లా కలెక్టర్‌ దేవసేనకు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరికి మధ్య పాలన అంశాలపై దూరం కొనసాగుతోంది. యాదగిరి రెడ్డి స్వయంగా సీ.ఎస్‌.ఎస్‌.పీ. సింగ్‌ను కలిసి కలెక్టర్‌ను మార్చాలని కోరగా మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కూడా ప్రీతిమీనాను మార్చాలని కోరినట్లు తెలుస్తుంది.నిజామాబాద్‌ కలెక్టర్‌ యోగితా రాణాకు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మధ్య కూడా పలు అంశాల్లో ఏకాభిప్రాయం లేదు. అయితే యోగితారాణా అక్కడ పాతుకుపోయారనే చర్చ జరుగుతోంది. ఇలా చాలా మంది ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ విభేదాలు ప్రజా సంక్షేమంపై ప్రభావం చూపుతున్నాయి. పలు సందర్భాల్లో ఈ వివాదాలను మంత్రులు మ్యానేజ్‌ చేస్తూ వస్తున్నారు. అధికారుల తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తరచూ వివాదాలు
తరచూ వివాదాలు చోటు చేసుకోవడంతో అభివృద్ధి పనులను సమన్వయంతో చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఏకంగా సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. కలెక్టర్ల తీరుతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇటు కలెక్టర్లు కూడా ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు సిఎస్‌ఎస్‌పి సింగ్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు.నిత్యం వివాదాలతో ఆందోళన చెందే కంటే బదిలీ చేయడమే సరైందన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కలెక్టర్ల బదిలీలను చేపట్టి తద్వారా వివాదాలను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 

19:18 - April 29, 2017

హైదరాబాద్ : మిర్చికి మద్దతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం...కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ నేతలకు భవిష్యత్ లేకనే కుట్రలు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ధ్వజమెత్తారు. ఖమ్మం మార్కెట్‌యార్డులో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మార్కెట్‌యార్డుపై రైతులు దాడి చేయలేదని.. కొంతమంది రాజకీయ నాయకుల అనుచరులు దాడి చేశారని తెలిపారు. రైతులకు నష్టం చేసే ప్రయత్నాలు చేయొద్దని విపక్షాలను కోరుతున్నామని తెలిపారు. 

20:53 - April 15, 2017

గోవా : కేంద్ర రక్షణ శాఖ మంత్రి పదవిలో ఒత్తిడి కారణంగానే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారీకర్‌ పేర్కొన్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా హాజరైన ఓ కార్యక్రమంలో పారికర్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు పిటిఐ కథనం. ఢిల్లీలో ఉన్నపుడు కశ్మీర్‌ సహా పలు కీలక అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉండడం వల్ల తనపై ఒత్తిడి ఉండేదని పారీకర్‌ పేర్కొన్నారు.  గోవాకు సిఎంగా అవకాశం రావడంతో వెంటనే అంగీకరించడానికి అదొక కారణమని పారీకర్‌ చెప్పారు. ఒత్తిడి కారణంగా రక్షణశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారన్న పిటిఐ కథనాన్ని బీజేపీ మీడియా సెల్‌ ఓ ప్రకటనలో ఖండించింది. రక్షణ మంత్రిగా పారీకర్‌ విజయవంతంగా బాధ్యతలు నిర్వహించారని కితాబిచ్చింది.

Pages

Don't Miss

Subscribe to RSS - ఒత్తిడి