ఓటు

08:44 - December 9, 2018

హైదరాబాద్ : డిసెంబర్ 11...అందరిలోనూ ఉత్కంఠ...ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ? ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా ? మళ్లీ గులాబీ గుభాలిస్తుందా లేక మహాకూటమి అధికారం చేపడుతుందా ? అనే ప్రశ్నలకు డిసెంబర్ 11న సమాధానం రానుంది. దీనితో అటు పార్టీలో..ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న జరిగిన పోలింగ్‌ దేశ దృష్టిని ఆకర్శించింది. డిసెంబర్ 11న జరిగే 
కౌంటింగ్ కేంద్రాల వివరాలు...

 • మేడ్చల్ : 5 నియోజకవర్గాలు. కీసర హోలీమేరీ ఇంజినీరింగ్ కాలేజీ.
 • రంగారెడ్డి జిల్లా : 8 నియోజకవర్గాలు. 4 నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, షాద్ నగర్ : పాలమాకులలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్. 
 • రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, కల్వకుర్తి : పాలమాకులలోని ట్రైబల్ వెల్ఫైర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ.
 • జగిత్యాల : 3 నియోజకవర్గాలు. జగిత్యాల వీఆర్కే ఎడ్యుకేషన్ సొసైటీ.
 • సిరిసిల్ల : 2 నియోజకవర్గాలు. తంగళ్లపల్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్. 
 • పెద్దపల్లి : 3 నియోజకవర్గాలు. మంథని జేఎన్టీయూహెచ్‌. 
 • కరీంనగర్ : 4 నియోజకవర్గాలు. జిల్లా హెడ్ క్వార్టర్‌ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కాలేజీ.
 • కొమురం భీం ఆసిఫాబాద్ : 2 నియోజకవర్గాలు. ఆసిఫాబాద్‌ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ.
 • మంచిర్యాల : 3 నియోజకవర్గాలు. ఏఎంసీ గోదాం. 
 • ఆదిలాబాద్ : 2 నియోజకవర్గాలు. ఆదిలాబాద్‌ టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌.
 • వికారాబాద్ : 4 నియోజకవర్గాలు. వికారాబాద్‌లోని అగ్రికల్చర్ మార్కెట్‌. 
 • సంగారెడ్డి : 5 అసెంబ్లీ నియోజకవర్గాలు. గీతం యూనివర్సిటీ.
 • మెదక్ : 2 నియోజకవర్గాలు. వైపీఆర్ కాలేజ్‌.
 • సిద్దిపేట : 4 నియోజకవర్గాలు. సిద్దిపేట ఇందూరు ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ టెక్నాలజీ.
 • కామారెడ్డి : 3 నియోజకవర్గాలు. ఏఎంసీ గోదాం.
 • నిర్మల్ : 3 నియోజకవర్గాలు. నిర్మల్‌ పాలిటెక్నిక్ కాలేజీ. 
 • నిజామాబాద్ : 6 నియోజకవర్గాలు. నిజామాబాద్‌ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ. 
 • నల్గొండ : 6 నియోజకవర్గాలు. దుప్పలాపల్లి టీఎస్ హౌసింగ్ వేర్ హౌస్ కార్పొరేషన్‌. 
 • సూర్యాపేట : 4 నియోజకవర్గాలు. సూర్యాపేటలోని ఏఎంసీ గోదాం.
 • యాదాద్రి భువనగిరి : 2 నియోజకవర్గాలు. భువనగిరి అరోరా ఇంజినీరింగ్ కాలేజీ.
 • జనగామ : 3 నియోజకవర్గాలు. పెంబర్తి వీబీఐటీ.
 • మహబూబాబాద్ : 2 నియోజకవర్గాలు. ఫాతిమా హైస్కూల్. 
 • మహబూబ్ నగర్ : 5 నియోజకవర్గాలు. నారాయణపేట, మహబూబ్‌నగర్, జడ్చర్ల నియోజకవర్గాల కౌంటింగ్ ధర్మపూర్‌ జేపీ ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియం. దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల కౌంటింగ్‌ జేపీ కాలేజీలోని అబ్దుల్ కలాం బిల్డింగ్‌. 
 • నాగర్ కర్నూల్ : 3 నియోజకవర్గాలు : నెల్లకొండలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డు.
 • వనపర్తి : న్యూ అగ్రికల్చర్ మార్కెట్ బిల్డింగ్‌. 
 • జోగులాంబ గద్వాల : 2 నియోజకవర్గాలు. కౌంటింగ్‌ గద్వాల ఎస్‌కేటీఆర్ కాలేజీ ఓల్డ్ బిల్డింగ్‌.
 • వరంగల్ రూరల్ : 2 నియోజకవర్గాలు : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ఏఎంసీ యార్డు. 
 • వరంగల్ అర్బన్ : 3 నియోజకవర్గాలు. ఏనుమాముల మార్కెట్ ఎంఎల్‌ఎస్ గోదాం. 
 • భూపాలపల్లి : 2 నియోజకవర్గాలు : అంబేద్కర్ స్టేడియం.
 • భద్రాద్రి కొత్తగూడెం : 5 నియోజకవర్గాలు. కౌంటింగ్ పాల్వంచలోని అనుబోసు ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహిస్తారు.
 • ఖమ్మం : 5 నియోజకవర్గాలు. ఖమ్మం విజయ ఇంజినీరింగ్ కాలేజీ.
 • హైదరాబాద్ నియోజకవర్గంలో 15 కౌంటింగ్ కేంద్రాలు.
14:08 - December 7, 2018

హైదరాబాద్ : ఓటు వేసేందుకు వచ్చిన సందర్భంగా దర్శక దిగ్గజం రాఘవేంద్రరావుకు పరాభవం ఎదురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నేరుగా బూత్ లోకి వెళ్తున్న ఆయనను ఓటర్లు అడ్డుకున్నారని, నేరుగా బూత్ లోకి ఎలా వెళ్తారంటూ ప్రశ్నించారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆ వార్తల్లో వాస్తవం లేదని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ఫిలింనగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వచ్చిన రాఘవేంద్రరావు ఓటు వేయకుండానే తిరిగి వెళ్లిపోయారనే వార్తలపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. పూర్తిగా తెలుసుకోకుండా మీడియా వార్తలను ఎలా ప్రసారం చేస్తుందంటు ప్రశ్నించారు. ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూ పెద్దదిగా ఉంది. నాకు వేరే అర్జెంట్ పని ఉండటంతో వెళ్లిపోయాను తప్ప క్యూలో నిలబడలేక కాదని తెలిపారు. క్యూలో నిలుచున్న తనను ఎవరూ అభ్యంతరపెట్టలేదనీ..బాధ్యత కలిగిన వ్యక్తిని. ఇతరుల మీద అలిగి వెళ్లిపోయేంత కుసంస్కరం నాకు లేదన్నారు దర్శకేంద్రుడు. ఛానల్స్ వార్త వేసేముందు.. దయచేసి మమ్మల్ని కూడా సంప్రదించి వేయమని సూచించారు రాఘవేంద్రరావు.
 

13:51 - December 7, 2018

హైదరాబాద్ : జూబ్లిహిల్స్ లోని ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భార్య సమ్రతతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి నమ్రతతో కలసి పోలింగ్ కేంద్రానికి మహేష్ ను చూడగానే అభిమానులంతో చుట్టుముట్టారు. సెల్ఫీ అడిగిన అభిమానులను అలరించారు. కాగా కొంతసేపే క్యూ లో నిలబడ్డారు. అభిమానుల సందడి పెరిగిపోవటంతో మీడియా ఆయన చుట్టూ చేరడంతో ఎన్నికల అధికారులు మహేశ్ బాబును నమ్రతను లోపలకు తీసుకువెళ్లి ఓటు వేయించారు. దీంతో మీడియాను అదుపు చేయటం భద్రతా సిబ్బంది ఇబ్బంది పడాల్సివచ్చింది.
 

 

12:59 - December 7, 2018

హైద‌రాబాద్: టెన్నిస్ స్టార్..తెలంగాణ ఆడబిడ్డ, పాకిస్థాన్ కోడలు అయిన సానియా మీర్జా త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇటీవ‌ల పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన సానియా మీర్జా హై ద‌రాబాద్‌లోని ఫిల్మ్ న‌గ‌ర్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. కాగా రాష్ట్ర‌వ్యాప్తంగా టాప్ సెల‌బ్రిటీలు సాధారణ వ్యక్తుల్లా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవటం విశేషం. కాగా ప్రజలు కూడా గత కంటే ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా 23.4 శాతం ఓటింగ్ న‌మోదు అయిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 
 

12:29 - December 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. పోలింగ్ లో భాగంగా మెగాస్టార్ కుటుంబ సభ్యలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా మోగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కుమార్తె శ్రీజలతో కలిసి ఇప్పటికే ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ సతీ సమేతంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
 

 

10:07 - December 7, 2018

హైదరాబాద్ : పోలింగ్ సమయంలో కొంతమంది ఓట్లు గల్లంతు కావటం సర్వసాధారణం. డిసెంబర్ 7న తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న క్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరు ఓటర్ల జాబితాలో గల్లంతైంది. ఉదయం బంజారాహిల్స్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన గుత్తా జ్వాల జాబితాలో పేరు లేదని ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో ఆమె అసంతృప్తితో  వెనుదిరగారు. గత ఎన్నికల్లో తాను ఇక్కడే ఓటు వేశానని, ఇప్పుడు ఎందుకు లేదనీ..ఎందుకు తన పేరును ఓటర్ల లిస్ట్ నుండి తొలగించారో తెలియదని ఆమె వాపోయారు. 
 

07:38 - December 7, 2018

కరీంనగర్ : జిల్లాలో ఎంపీ వినోద్ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడారు....1952లో ఎన్నికలు జరిగాయని..అప్పుడు జనాభా మాత్రం 43 కోట్లు..ప్రస్తుతం 130 కోట్ల జనాభా ఉందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశం..భారతదేశమని..ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా..ఓటు శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారని...ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఎంపీ వినోద్ పిలుపునిచ్చారు.

21:26 - December 6, 2018

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది. పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని.. పోలింగ్ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని, 100శాతం పారదర్శకంగా పోలింగ్ జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఈ రాత్రిలోగా ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని చెప్పారు. వంద శాతం ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేశామని చెప్పారు.
ఓటరు గుర్తింపు కార్డు లేనివారి కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఓటరు ఐడీ కార్డు లేనివారు..  ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. ఓటు వేసేందుకు వచ్చేటప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సెల్ఫీలు తీసుకోవడం నిషేధమని, లోపలకు సెల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పష్టంచేశారు. ధూమపానంపై నిషేధం ఉందన్నారు. మద్యం తాగి ఓటింగ్‌కు రావడం కరెక్ట్ కాదన్నారు. చట్టపరంగానూ నిషేధం ఉందని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపి ఓటు వేయచ్చుని చెప్పారు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులు, జాబ్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డులు, ఫొటో గుర్తింపు కార్డులు, పెన్షన్ డాక్యుమెంట్లు చూపి ఓటు వేయొచ్చుని తెలిపారు. ఈసారి కొత్తగా 20లక్షలమంది ఓటర్లుగా చేరారని రజత్‌కుమార్ చెప్పారు. ఈ నెల 26 నుంచి మళ్లీ ఓటర్ల జాబితా సవరిస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఓట్ల సవరణ కార్యక్రమం మొదలవుతుందన్నారు.
సా.5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని, ఎంత సమయం అయినా ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని రజత్‌కుమార్ స్పష్టం చేశారు. నగదు, మద్యం పంపిణీపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నకిలీ ఓటర్లను తొలగించామన్నారు. ఎన్నికల సందర్బంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 135 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు రజత్‌కుమార్ చెప్పారు. గత ఎన్నికల్లో దొరికిన దానికంటే రెట్టింపు నగదును ఈసారి స్వాధీనం చేసుకున్నామన్నారు. డబ్బు పంపిణీ కింద 250 కేసులు నమోదైనట్టు చెప్పారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లు తగినంత సఖ్యంలో ఉన్నాయన్నారు. ఈవీఎంలు ఫెయిల్ అయ్యాయంటూ ప్రచారం ఉందని.. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తామని రజత్‌కుమార్ వెల్లడించారు.
గుర్తింపు కార్డులు ఇవే..
పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డ్, ఫొటోతో ఉన్న పెన్షన్‌ ధ్రువీకరణ పత్రం, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్‌ స్లిప్, ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఎన్‌పీఆర్‌కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్‌.

08:26 - December 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ నెలకొంది. డిసెంబర్ 7వ తేదీన జరిగే పోలింగ్‌కు ఎన్నికల అధికారులు సర్వంసిద్ధం చేశారు. పోలింగ్‌ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 32815 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు ఆంక్షలు..నిబంధనలు విధించింది. ఓటర్లు ప్రశాంతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించు కొనేందుకు వీలు కల్పించాలని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మరి పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి నిబంధనలు ఉంటాయో తెలుసా ? అయితే ఇది చదవండి...

 • డిసెంబర్ 5వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం వరకు 144 సెక్షన్ అమలు. 
 • పోలింగ్‌ బూత్‌లోకి సెల్‌ఫోన్లను అనుతించరు. 
 • పోలింగ్‌ కేంద్రంలో ఓటేస్తూ సెల్పీ దిగితే ఆ ఓటును రద్దు.
 • పోలింగ్ కేంద్రానికి 200మీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేయాలి. రాజకీయ పార్టీల వారికి ఒక టేబుల్..రెండు కూర్చీలు మాత్రమే అనుమతి. 
 • పోలింగ్ బూత్‌లలో కూర్చునే పార్టీల ప్రతినిధులకు అధికార గుర్తింపు కార్డులు ఉండాలి. వీటిపై పార్టీల గుర్తులు...పేర్లు ఉండవద్దు. 
 • అభ్యర్థులు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండకూడదు. 
 • పోలింగ్‌ కేంద్రాలన్నింటినీ ధూమపాన నిషేధ ప్రాంతాలు. 
 • మద్యం తాగి పోలింగ్‌ కేంద్రం వద్దకు వస్తే అరెస్టు చేస్తారు. 
 • ఈసారీ అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లతోపాటు బ్రీత్‌ ఎనలైజర్లను అందుబాటులో ఉంచుతారు. 
 • వారికే ఓటు వేస్తాను..వేశాను..అని బూత్‌లో చెబితే వారిని ఓటు వేయనీయరు. 
 • ఓటును ఇతరులకు చూపిస్తే రూల్‌ 49ఎం (ఓటు రహస్యం) ప్రకారం అతడిని బయటకు పంపేస్తారు. 
 • పోలింగ్‌ సిబ్బంది సహాయకులుగా ఓటు వేయడానికి వీలులేదు.
11:04 - December 3, 2018

హైదరాబాద్: ఇప్పటి యూత్‌కు సెల్ఫీల పిచ్చి బాగా ఉంది. మూడ్ వస్తే చాలు సెల్ఫీలు దిగేస్తున్నారు. ప్లేస్ ఏదైనా, సందర్భం మరేదైనా అస్సలు పట్టించుకోవడం లేదు. సెల్ఫీలు దిగడం ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పెట్టడం.. వాటికొచ్చే లైకులు, కామెంట్లు చూసుకుని మురిసిపోవడం. ఈ క్రమంలో సెల్ఫీలకు బాగా అడిక్ట్ అయిపోయారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
ఏం చేసినా అనేవాళ్లు లేరు కదా అని డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రంలో ఓటేస్తూ సెల్పీ దిగితే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు ఎన్నికల సంఘం హెచ్చరించింది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీ దిగితే.. ఆ ఓటును రద్దు చేస్తారు.
పక్కన పడేస్తారు:
ఇలా పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగడం 49ఎం(ఓటు రహస్యం) అనే నియమాన్ని ఉల్లంఘించడమే అని ఎన్నికల అధికారులు తెలిపారు. ఆ ఓటును 17–ఏలో నమోదు చేస్తారు. అంటే లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. సో.. సెల్ఫీ పిచ్చోళ్లు పోలింగ్ కేంద్రాల దగ్గర కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది.. ఆ తర్వాత చింతించినా లాభం ఉండదు.
ప్రతి ఓటరు.. తప్పకుండా తెలుసుకోవాల్సిన నిబంధనలు:
* నిబంధనల ప్రకారం పోలింగ్‌ సమయంలో ఓటు వేయడానికి వచ్చిన వారు ఓటు వేస్తూ సెల్ఫీలు దిగడం నిషిద్ధం.
* ఓటును ఇతరులకు చూపిస్తే రూల్‌ 49ఎం (ఓటు రహస్యం) బహిర్గతం నియమం మేరకు అతడిని బయటకు పంపేస్తారు.
* ఫలానా వారికి ఓటు వేస్తాను, వేశాను అని బూత్‌లో చెప్పడం కూడా నేరమే. వారిని ఓటు వేయనీయరు.
* దివ్యాంగులు ఓటు వేయడానికి సహాయకుడిగా ఒకరిని అనుమతిస్తారు.
* అదే వ్యక్తిని మరో వైకల్యం గల ఓటరు వెంట సహాయకుడిగా అనుమతించరు.
* పోలింగ్‌ సిబ్బంది సహాయకులుగా ఓటు వేయడానికి వీలులేదు.
* ఓటు వేయడం ఆలస్యం అయినా, వెళ్లిన ఓటరు యూనిట్‌పై కాగితాలు, టేప్‌లు అతికిస్తున్నట్లు డౌట్ వచ్చినా పోలింగ్‌ ఏజెంట్లు ప్రిసైడింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఓటింగ్‌ గది వరకు వెళ్లొచ్చు.
* అధికారి మాత్రమే అక్కడ ఏమీ జరగలేదని ఏజెంట్ల సమక్షంలో నిర్దారిస్తారు.
* ఓటువేయడం తెలియదని నిస్సహాయతను వ్యక్తం చేసిన ఓటరుకు పోలింగ్‌ అధికారి నమూనా ద్వారా ఏజెంట్ల సమక్షంలో ఓటు వేసే విధానంపై డమ్మీ గుర్తులపై వివరిస్తారు.

Pages

Don't Miss

Subscribe to RSS - ఓటు