ఓటు హక్కు

08:47 - December 8, 2018

హైదరాబాద్ : వేటు వేశావా ? ఎక్కడ ఓటు వేద్దామని ఓటర్ కార్డు పట్టుకుని వెళితే...నీ ఓటు లేదు...చెప్పాడు..ఏం చేయాలే...వచ్చేశా...అనే మాటలు తెలంగాణ రాష్ట్రంలో వినిపించాయి. ఎందుకంటే వారి ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు వేయాలని ఎంతో దూరం ప్రయాణించి...క్యూ లైన్‌లో నిలబడి...తీరా పోలింగ్ బూత్‌కి వెళ్లే సరికి ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ కార్డు ఉండి కూడా ఓటు హక్కు వినియోగించుకోని వారు ఎంతో మంది ఉన్నారు. తన ఓటు గల్లంతు కావడంతపై ప్రముఖ బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 
డిసెంబర్ 7న పోలింగ్...
డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఓట్లు గల్లంతు కావడంతో పలు పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది ఓటర్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. తమ ఓటును కావాలనే ఓటర్ల జాబితా నుండి తప్పించారని వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 
ప్రముఖుల ఓట్ల గల్లంతు...
ఓటర్ జాబితా సవరణలో ఈసీ ఘోర వైఫల్యం చూసిందని పలువురు పేర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ గల్లంతు ఫలితాలను శాసించనున్నాయా అనే చర్చ జరుగుతోంది. ఏకంగా ప్రముఖుల ఓట్ల గల్లంతు కలకలం రేపుతోంది.న మంత్రి ఈటెల రాజేందర్ తండ్రి...మరో ఇద్దరు కుటుంబ సభ్యుల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సతీమని రమా రాజమౌళితో పాటు అనేక మంది ఓట్లు లేకపోయారు. ఓట్ల గల్లంతుపై శేరలింగంపల్లి...హైదర్‌గూడ...నాగోల్..నల్లకుంటలతో పాటు పలు ప్రాంతాల్లో ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
రజత్ కుమార్ స్పందన...
ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ స్పందించారు. పోలింగ్‌ సందర్భంగా అనేక మంది ఓట్లు గల్లంతయ్యాయని...వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల వరకు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని...ఓట్లు గల్లంతు గల కారణాలను విశ్లేషిస్తున్నామని రజత్ కుమార్ పేర్కొన్నారు. 

 

14:54 - December 7, 2018

నల్గొండ : నాకు చూపు సరిగ్గా కనబడదు..టీఆర్ఎస్‌కి ఓటు వేయాలని ఆ దివ్యాంగుడు కోరితే...ఆ అధికారి ఏకంగా ‘చేయి’ గుర్తుకు ఓటు వేశాడు....తీవ్ర ఆగ్రహానికి గురైన అక్కడి వారు అతనిపై చేయి చేసుకుని చితకబాదారు. ఈ దృశ్యాలన్నీ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే...
టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కోరితే...
వెల్గటూరు పోలింగ్ బూత్‌లో ఓ దివ్యాంగుడు ఓటు వేసేందుకు వచ్చాడు. కనిచూపు కనిపించదని..తనకు ఓటు వేసేందుకు సహకరించాలని అక్కడున్న పార్టీల ఏజెంట్లను కోరాడు. నిబంధనల దృష్ట్యా ఏజెంట్లు ముందుకు రాకపోవడంతో...అక్కడున్న ఎన్నికల సిబ్బందిలో ఒకరు ఓటు వేసేందుకు ముందుకు వచ్చారు. ‘కారు’ గుర్తుకు ఓటేయాలని ఆ దివ్యాంగుడు చెప్పడంతో ఆ అధికారి ఓటు వేసి వచ్చాడు.
వీవీ ప్యాట్‌‌లో చేయి గుర్తు పేపర్...
అనుమానం వచ్చిన ఓ పోలింగ్ ఏజెంట్ వీవీ ప్యాట్‌ను గమనించాడు. అందులో కాంగ్రెస్ గుర్తుకు వేసినట్లు పేపర్ ఉండడం..విషయం బయటకు పొక్కింది. ఆగ్రహానికి గురైన వారు ఆ అధికారిని చితకబాదారు. అతడిని నిలదీయడంతో మూడు ఓట్లు మాత్రమే వేశానని అధికారి ఒప్పుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి దాడిలో గాయపడిన అధికారిని ఆసుపత్రికి తరలించారు. పోలింగ్‌ని అధికారులు నిలిపివేశారు. ఎన్నికల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. 

12:37 - December 7, 2018

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ, వ్యాపార ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మైహోమ్ గ్రూప్ ఛైర్మన్ రామేశ్వర్‌రావు, కుటుంబసభ్యులు ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో క్యూలైన్‌లో వెళ్లి వారు ఓటు వేశారు.

09:23 - December 7, 2018

హైదరాబాద్ : ప్రతీ డైలాగ్ కు ముందు రాజా అంటు నవ్వులు పండించే ప్రముఖ నటుడు, రచయిత అయిన సోనాని కృష్ణ మురళి ఈ ఉదయం హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్లారెడ్డి గూడ పీజేఆర్‌ కమ్యూనిటీ హాల్‌ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయన వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ చేసిన ఏర్పాట్లపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోసాని మాట్లాడుతు..ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. ఈవీఎంలు ఉన్నచోట వెలుతురు సరిగ్గా లేదని, అధికారులు లైట్లను అమర్చలేదని ఏ గుర్తు ఎక్కడ ఉందో సరిగ్గా కనిపించడం లేదని, దీనివల్ల వృద్ధులు, కంటి సమస్యలు ఉన్నవాళ్లు అధికంగా ఇబ్బంది పడుతున్నారని పోసాని కృష్ణమురళి ఎన్నికల ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తంచేశారు. 
   

07:38 - December 7, 2018

కరీంనగర్ : జిల్లాలో ఎంపీ వినోద్ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడారు....1952లో ఎన్నికలు జరిగాయని..అప్పుడు జనాభా మాత్రం 43 కోట్లు..ప్రస్తుతం 130 కోట్ల జనాభా ఉందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశం..భారతదేశమని..ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా..ఓటు శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారని...ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఎంపీ వినోద్ పిలుపునిచ్చారు.

21:54 - December 6, 2018

హైదరాబాద్: టాలీవుడ్‌ హీరోలంతా ఎలక్షన్‌ పోలింగ్‌ సెంటర్ల బాట పట్టనున్నారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సినిమాలే కాదు రాజకీయ అవగాహన కూడా ఉందని చాటి చెప్పేందుకు తెలుగు సినీ ప్రముఖులు సిద్ధమవుతున్నారు.
జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో మెగాస్టార్, భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో సూపర్‌స్టార్:
తెలుగు సినిమా తారాగణం.. ఓటు వేసేందుకు క్యూ కట్టనుంది. సినిమాలే కాదు సమాజం పట్ల బాధ్యత కూడా ఉందని నిరూపించనుంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పలువురు ప్రముఖ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టాలీవుడ్‌ అగ్రహీరోల్లో చాలా మంది హైదరాబాద్‌లో సెటిలయ్యారు. వీరంతా శుక్రవారం(డిసెంబర్ 7) జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటును వేసేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో.. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ జూబ్లిహిల్స్‌లో ఓటును వేయనున్నారు. టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున, స్టైలిష్‌ అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ జూబ్లీహిల్స్‌లోని వేరువేరు పోలింగ్ బూత్‌లలో ఓటు వేయనున్నారు. వీరితో పాటు చాలా మంది టాలీవుడ్‌ సినీ స్టార్స్‌ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇలా సినీ ప్రముఖులంతా సమజా పౌరులుగా తమ బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. వారికి కేటాయించిన పోలింగ్‌ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకొని.. అభిమానులకు ఓటు విలువ తెలియచేయనున్నారు.

 

15:26 - November 28, 2018

జహీరాబాద్ : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కి తెలివిలేదు..దద్దమ్మ అంటూ తెలంగాణ రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దెప్పిపొడిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ జహీరాబాద్‌‌లో భారీ బహిరంగసభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్‌..హస్తం నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల విషయంలో చర్చించాలంటే అసెంబ్లీ నుండి కాంగ్రెస్ సభ్యులు పారిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సాగునీళ్ల ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కాంగ్రెస్ మాత్రం పారిపోయిందన్నారు. నిండు సభలో ప్రిపేర్ అయి రాలేదని..ఉత్తమ్ అన్నారని..మరి ఎందుకు వచ్చావు ? పేర్కొనడం జరిగిందన్నారు. ఇదంతా ప్రజల కళ్లదెట జరిగిన చరిత్ర అన్నారు.
ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి మించిన వేదిక లేదు...
> అసెంబ్లీని కాంగ్రెస్ నేతలు ఉపయోగించుకోలేపోయారు...                     
సెక్రటేరియట్‌లో పైరవీలను అరికట్టాం...                                           
కాంగ్రెస్ నేతలకు అభివృద్ధి చేసే తెలివిలేదు..                                    
ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయి...            
కాంగ్రెస్ నేతలవి పసలేని ఆరోపణలు...                                          

సాగునీటి విషయంలో గోసపడ్డాం..మోసపోయాం...
గీతారెడ్డి..పీతారెడ్డి..ఇతరులు ఏవో ఏవో మాట్లాడుతున్నారని..ఉద్యమ సమయంలో మంత్రి పదవుల్లో వారంతా సేద తేరారని విమర్శించారు. బంగారు తెలంగాణను మద్రాసులో నెహ్రూ కలిపారని..ఏ ప్రాజెక్టు కట్టినా..ఆంధ్రకు మేలు చేసేదిలా ఉండేదన్నారు. ఎన్నో అక్రమాలు..అవినీతి కాంగ్రెస్ హాయంలో జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే 2005 - 2006లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉండాల్సిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పులు లేవని..నాలుగేళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు కేసీఆర్ వెల్లడించారు.
టీఆర్ఎస్ వచ్చాక కుంభకోణాలు..అవినీతి లేదు...
మిషన్ భగీరథ ఎప్పుడైనా ఊహించామా ? 
ఇసుకపై పదేళ్లలో ఆదాయం రూ. 9.56 కోట్లు...
4ఏళ్లలో రూ. 2,057 కోట్ల ఆదాయం...
మైనార్టీల అభివృద్ధికి నిధులు కేటాయించాం...

10:11 - November 28, 2018

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రచారంలో ‘కారు’ దూసుకెళుతోంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ...ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. రోజుకు ఆరేడు సభల్లో పాల్గొంటున్న ఆయన అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. నవంబర్ 28 - 29 ప్రచార షెడ్యూల్‌ని పార్టీ వెల్లడించింది.
28వ తేదీ...
28వ తేదీ ఉదయం 11 గంటలకు బాన్స్‌వాడ..11:45కి జుక్కల్..12:30కి నారాయణఖేడ్ సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:15కి జహీరాబాద్..2గంటలకు సంగారెడ్డి..2:45కి ఆందోల్..సభల్లో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. 3:30కి నర్సాపూర్, 4:15కి గజ్వేల్‌లో నిర్వహించే ప్రచార సభలకు హాజరు కానున్నారు. గత పాలకులు చేసిన పాలన..టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలన బేరీజూ వేసుకుని ఓటు వేయాలని..ఓటు వేసేముందు జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు. 
29వ తేదీ...
నవంబర్ 29 ఉదయం 11:30 గంటలకు ఆదిలాబాద్..మధ్యాహ్నం 12:15కి కాగజ్ నగర్..మధ్యాహ్నం 1:00కు ఆసిఫాబాద్..1:45కి బెల్లంపల్లి..2:30కి మందమర్రి సభల్లో పాల్గొంటారు. 3:15కి మంచిర్యాల..సాయంత్రం 4 గంటలకు రామగుండంలో పర్యటించనున్నారు. 

09:36 - November 26, 2018
హైదరాబాద్ : గులాబీ బాస్ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పదునైన విమర్శలు..పంచ్ డైలాగ్‌లతో ఓట్లరను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గత పాలకులు చేసిన పాలన...నాలుగేళ్ల పాలన ఎలా ఉందో బేరీజు వేసుకుని ఓటు వేయాలని...ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలను ఆలోచింప చేసే విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి కావాలో, ఆంధ్రా పాలకుల దోపిడీ కావాలో తేల్చుకోమని మరోసారి ఓటర్లను కోరుతున్నారు.
నవంబర్ 26...
నవంబర్ 26వ తేదీ సోమవారం జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టబోతున్నారు. ఉదయం 11గంటలకు కామారెడ్డి..11:45ని నిజామాబాద్ రూరల్...12:30కు బోధన్..1:15కి బాల్కొండ నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తించనున్నారు. సభలకు సంబంధించిన ఏర్పాట్లను అక్కడి అభ్యర్థులు..నేతలు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలలోని ధర్మపురి..కోరుట్ల...జగిత్యాల, చొప్పదండి...నియోజకవర్గాల్లో జరిగే సభలలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. 2:45కి కరీంనగర్‌లో మానుకొండూరు..3:30కి స్టేషన్ ఘన్‌పూర్...4:15కి పరకాల..5 గంటలకు వరంగల్ తూర్పు... వరంగల్ పశ్చిమ..వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. 
నవంబర్ 27వ తేదీ...
ఇక నవంబర్ 27వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు కల్వకుర్తి..11:45కి మహబూబ్‌నగర్..12:30కి వనపర్తి..1:15 కొల్లాపూర్...2 గంటలకు అచ్చంపేట...2:45కి నాగార్జునసాగర్‌లోని హాలియా..3:30 మునుగోడు..4:15కి ఆలేరు...నియోజకవర్గల్లో జరిగే సభలలో పాల్గొంటారు. 
10:10 - December 9, 2017

గుజరాత్ : తమను మళ్లీ గెలిపించాలంటూ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు దేవాలయానికి వెళ్లి పూజలు చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రత్యేక పూజలు చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ శనివారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం 10గంటల వరకు పది శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా.. తొలిదశలో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కు 26వేల ఈవీఎంలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈసీ పర్యవేక్షిస్తోంది. ఓటు వేసేందుకు యువత ముందుకు రావాలని ఈసీ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - ఓటు హక్కు