కత్తి

12:20 - November 12, 2018

తమిళనాడు : మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదని ఓ వ్యక్తి యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన ఆ యువతి తమ్ముడిపై కూడా దాడి చేశాడు. తీవ్రగాయాల పాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు... తిరునెల్వేలి కళ్లకాడుకి చెందిన ప్రియ (20) కళాశాల చదువు పూర్తి చేసింది. పోటీ పరీక్షల కోసం తిరునెల్వేలిలో శిక్షణ పొందుతోంది. ఆమె తండ్రి మృతి చెందడంతో తల్లి మాలతి, తమ్ముడుతో కలిసి ఉంటోంది. అదే ప్రాంతానికి  చెందిన ఇసక్కిముత్తు (21) కూలీ పని చేస్తున్నాడు.

ప్రేమిస్తున్నానంటూ ఇసక్కిముత్తు.. ప్రియను వేధించేవాడు. ఈ విషయంలోనే జనవరిలో ప్రియపై దాడి చేయగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. అనంతరం చెన్నైలో పని చేశాడు. ఈ నేపథ్యంలో దసరా సెలవుల్లో తిరునెల్వేలికి వచ్చాడు. తనను ప్రేమించమని ప్రియను మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. శనివారం తెల్లవారుజామున ప్రియ తల్లి మాలతి పాల కోసం బయటకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఇసక్కిముత్తు.. ఇంట్లోకి చొరబడి కత్తితో నిద్రపోతున్న ప్రియపై దాడి చేశాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో కాపాడేందుకు తమ్ముడు ప్రయత్నించాడు. అతడిపైనా కూడా అతను దాడి చేశాడు. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో అతను పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దర్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఇసక్కిముత్తు కోసం గాలిస్తున్నారు.

 

15:45 - November 10, 2018

కియోన్‌జార్ (ఒడిషా): తన శీలాన్నే శంకించాడన్న కోపంతో ఓ వివాహిత మహిళ తన ప్రియుడి ఫురుషాంగాన్ని తెగ నరికేసింది. ఈ సంఘటన ఒడిషాలోని కియోంజర్ జిల్లాలోని బదౌగాన్ గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది.
ఈ పంఘటనకు సంబంధించి బాధితుని బంధువుల ఫిర్యాదు మేరకు కమలా పాత్ర (24) అనే మహిళను పోలీసులు అరెస్టుచేశారు. ఝారాబేడా గ్రామానికి చెందిన రాజేంద్ర నాయక్ (25) అనే వ్యక్తి చెన్నైలో ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. శలవులకోసం ఇంటికి వచ్చిన నాయక్ వివాహిత ఇంటికి వెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకొంది. తన శీలాన్ని శంకించడంతో అతను నిద్రపోతుండగా పదునైన కత్తితో అతని మర్మాంగాన్ని కోసేసింది. రాజేంద్ర నాయక్‌ను కటక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాయక్ కోలుకుంటున్నాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 
 

17:47 - November 5, 2018

గుంటూరు: "జనతా గ్యారేజ్" ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ సినిమా, దీనికి ట్యాగ్ లైన్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును అని ఉంటుంది. వాస్తవానికి ఇది మెకానిక్ షెడ్ అయినా "సామాన్యులు ఇక్కడికెళ్లి  ఏ సమస్య చెప్పుకున్నా పరిష్కారం అవుతుందని" సినిమాలో చూపించారు. ఇదే తరహాలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో ప్రదీప్ అనే వ్యక్తి జనతాగ్యారేజ్ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి మీకేమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పండి నేను సెటిల్ చేస్తానని 2 నంబర్లు ఇచ్చి గ్రూప్స్ లో మెసేజ్ పంపించాడు. దాంతో అతని గ్రూప్ లో కొందరు చేరారు. ఈరోజు ఉదయం గ్రూప్ లో వచ్చిన మెసేజ్ ఆధారంగా ఉండవల్లిలోని ఒక ఇంటివద్ద సెటిల్ మెంట్ చేయడానికి తన మిత్రులతో కలిసి కత్తి పుచ్చుకువచ్చి అరుస్తూ హాడావిడి చేశాడు. అతని చేతిలో కత్తి చూసి స్ధానికులు హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి చేరుకున్న తాడేపల్లి పోలీసులు ప్రదీప్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సీఎం ఇంటికి కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపింది. ఇతడిపై ఏమైనా నేరచరిత్ర ఉందా,లేదా అనేది పోలీసు విచారణలోతేలాల్సి ఉంది.

14:12 - October 25, 2018

విశాఖపట్టణం : పట్టణ విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర పేరిట వివిధ జిల్లాల్లో విసృతంగా పర్యటిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఆయన ప్రస్తుతం పర్యటిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన హాజరు కావాల్సి ఉంటోంది. దీనితో ఆయన పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ వేసి కోర్టుకు హాజరవుతున్నారు. 
అందులో భాగంగా ఆయన గురువారం మధ్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. లాంజ్‌లో కూర్చోగా ఫ్యూజన్ ఫుడ్స్‌ క్యాంటీన్‌లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వెయిటర్‌ కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీనితో జగన్ భుజానికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. 


దాడి ఘటనను వైసీపీ తీవ్రంగా ఖండించింది. నిఘా వైఫల్యమేనని ఆరోపిస్తున్నట్లు సమాచారం. కానీ ఎంతో మంది ప్రముఖులు రాకపోకలు సాగించే విశాఖ ఎయిర్ పోర్టులోకి కత్తితో ఓ యువకుడు ఎలా ప్రవేశించాడన్నది తెలియరావడం లేదు. నిఘా లోపించడంతో కత్తితో ప్రవేశించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి. 

08:12 - August 3, 2018

విశాఖపట్టణం : నిత్యం రద్దీగా ఉండే ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద రౌడీషీటర్ దారుణ హత్య కావడం కలకలం రేపింది. వన్ టౌన్ ఏరియాలో నివాసం ఉండే ఖాసీం అనే రౌడీషీటర్ నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి బైక్ పై వెళుతున్న ఖాసీంను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టారు. అనంతరం కత్తులతో విచక్షణారహితంగా నరికేశారు. దీనితో ఖాసీం అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆ ప్రాంతంలో ఉన్న ఇతర రౌడీషీటర్లతో విబేధాలున్నట్లు, ఈ నేపథ్యంలో హత్య జరిగిందని తెలుస్తోంది. పాత రౌడీషీటర్లపై నిఘా పెట్టడం జరిగిందని, హత్యకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. 

10:17 - June 18, 2018
15:11 - June 13, 2018

మంచిర్యాల : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని అనుభవజ్నులు చెప్పిన మాటకు నిదర్శనంగా కనిపిస్తోంది వెన్నల మండలంలో చోటుచేసుకుంది. తోడబుట్టిన అన్న కృష్ణారెడ్డిపై తమ్ముడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తహశీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా వుండటంతో ఆసుపత్రికి తరలించారు.

10:54 - March 7, 2018

నల్గొండ : సూర్యాపేటలోని చింతపాలెం మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు లకావత్ రామారావు ఆయన సతీమణి ఎంపీటీసీ సుభద్రపై నిందితుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమెకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడి వెనుక డబ్బుల వ్యవహారమే కారణమని తెలుస్తోంది. డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్లు, ఇవ్వకపోవడంతో నిందితుడు దాడికి పాల్పడినట్లు సమాచారం. రూ. 1.60 వేలు తీసుకున్నారని, కొంత డబ్బు వాపస్ ఇచ్చారని నిందితుడు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇతర పథకాల పేరిట పేదల దగ్గరి నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా... దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

10:25 - February 20, 2018

హైదరాబాద్ : నగరంలో గ్యాంగ్ వార్ జరిగింది. కేవలంలో రూ.1200 కోసంల కత్తులతో దాడి చేసుకున్నారు. హబీబ్ నగర్ పీఎస్ పరిధిలోని మల్లేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైజాన్ అనే వ్యక్తిని రూ.1200 నింధితులు అడిగారు. తన వద్ద డబ్బులేదని ఫైజాన్ చెప్పడంతో అతని పై దుండుగులు కత్తులతో దాడి చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:37 - January 19, 2018

హైదరాబాద్ : కత్తి మహేశ్‌పై దాడిని ఖండిస్తూ ఓయూలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు పవన్‌కల్యాణ్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. పవన్‌కల్యాణ్‌ అభిమానులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. కత్తి మహేశ్‌కు పవన్‌కల్యాణ్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. భవిష్యత్‌లో మరోసారి కత్తి మహేశ్‌పై దాడి జరిగితే.. పవన్‌కల్యాణ్‌ సినిమాలను అడ్డుకుంటామని విద్యార్థులు హెచ్చరించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - కత్తి