కత్తి మహేష్

14:37 - September 5, 2018

స్వామి పరిపూర్ణానంద..నగరంలో అడుగు పెట్టారు. దాదాపు 55 రోజుల పాటు ఆయన నగరం విడిచి బయట ఉన్న సంగతి తెలిసిందే. నగరంలో అడుగు పెట్టిన ఆయనకు అనుచరులు, మద్దతు దారులు స్వాగతం పలికారు. రెండు మాసాల క్రితం ఫిల్మ్ క్రిటిక్ 'కత్తి మహేష్' తో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. 'శ్రీరాముడి' విషయంలో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. 'శ్రీరాముడి' విషయాన్ని ప్రస్తావించిన 'కత్తి మహేష్' పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకేత్తించాయి. దీనిపై 'స్వామి పరిపూర్ణానంద' ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి ఉప్పల్ నుండి యాదాద్రి వరకు యాత్ర చేపడుతానని ప్రకటించారు. వెంటనే పోలీసులు స్పందించారు. 'కత్తి మహేష్' ను నగర బహిష్కరణ వేటు వేశారు. పోలీసుల చర్యపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అనంతరం 'స్వామి'ని కూడా నగర బహిష్కరణ చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణ ఎత్తివేయాలని కోర్టు ఉత్తర్వులు చేసింది. దీనితో ఆయన నగరానికి తిరిగొచ్చారు. వచ్చే ముందు స్వామి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. నగరానికి వచ్చిన అనంతరం ఆయనకు బీజేపీ నేతలు, ఇతరులు స్వాగతం పలికారు. మరి కత్తి మహేష్ ఎప్పుడు నగరానికి వస్తారో వేచి చూడాలి.

13:11 - July 9, 2018

హైదరాబాద్ : శ్రీరాముడిపై సినీ క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మ యాత్ర చేస్తానన్న స్వామి పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్భందం చేయడం..కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేయడం వంటి పరిణామాలు జరిగాయి. కత్తి మహేష్ ను ఏపీ పోలీసులు చిత్తూరు జిల్లాకు తరలించారు.

మరోవైపు పరిపూర్ణానంద స్వామి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను గృహ నిర్భందం చేయడంతో వీహెచ్ పీ..భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని వారించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. 

12:07 - July 9, 2018

హైదరాబాద్ : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడంటూ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ను నగర బహిష్కరణ వేటు వేశారు. సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు కత్తి మహేష్ కు నోటీసు ఇచ్చి ఏపీ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆయన సొంత గ్రామమైన చిత్తూరు జిల్లాకు తరలించారు. కాసేపట్లో కత్తి మహేష్ చిత్తూరుకు చేరుకోనున్నారు.

గత కొన్ని రోజులుగా కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని..వెంటనే కత్తి మహేష్ ను అరెస్టు చేయాలంటూ డిమాండ్ వినిపించాయి. శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే పేరిట కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు వేశారు. పోలీసుల అనుమతి తీసుకుని హైదరాబాద్ కు రావాలని సూచించారు. 

11:14 - July 9, 2018

హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామిని పోలీసులు ఇంటి నుండి బయటకు రానివ్వడం లేదు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి సోమవారం వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు గృహ నిర్భందం చేశారు. హిందూ ధర్మ యాత్రకు అనుమతి లేదని రాచకొండ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుండి యాదాద్రి వరకు ఆయన యాత్ర చేపడితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సినీ క్రిటిక్ మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తాను హిందూ ధర్మ యాత్ర చేపడుతానని ఆదివారం పరిపూర్ణానంద స్వామి వెల్లడించిన సంగతి తెలిసిందే. బోడుప్పల్ నుండి యాదాద్రి వరకు ఈ యాత్ర ఉంటుందని..హిందువులందరూ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

11:12 - July 9, 2018

హైదరాబాద్ : సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు పడింది. ఆయన్ను నగరం నుండి బహిష్కరిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను ఏపీ పోలీసులకు అప్పచెప్పారు. ఇటీవలే శ్రీరాముడి విషయంలో కత్తి మహేష్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. కత్తి మహేష్ పై వెంటనే అరెస్టు చేయాలని..చర్యలు తీసుకోవాలంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఆయన్ను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారించారు. అనంతరం ఆయన్ను వదిలిపెట్టారు. కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మాగ్రహ యాత్ర చేపడుతానని పరిపూర్ణనాంద స్వామి హెచ్చరించారు. 

14:29 - July 1, 2018

తూర్పుగోదావరి : నిత్యం వివాద అంశాలతో వార్తల్లో ఉండే సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై పోలీసు కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతున్నాయి. భారతీయుల ఆరాధ్యదైవం శ్రీరాముడిని ఉటంకిస్తూ ఓ టీవీ ఛానెల్ లో కత్తి మహేష్ వ్యాఖ్యలు చేశారంటూ అమలాపురంలో హిందూ ఆజాద్ ఫౌండేషన్ నేతలు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కత్తి మహేష్ తో పాటు ప్రసారం చేసిన టీవీ ఛానెల్ పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

21:24 - April 11, 2018

తల్గుదెంపు కున్న అంబర్ పేట అన్మంతు...పూలే జయంతి కాడ తోటోళ్ల మీద గంతు, దగ్గుపాటి సురేష్ బాబు కొడ్కు బాగోతం...ముద్దుల పోట్వ రిలీజ్ జేశ్న శ్రీ రెడ్డి, మోడీని కాల్చి సంపుతాంటున్న కత్తి మహేష్...అనంతపురం జిల్లాల రాజ్యంగ రక్షణ సభ, దళితుల భూమి మీద మున్సిపాలిటీ గద్ద...మహబూబాబాద్ కాడ దళిత జనం ధర్నా, బోధన్ కాడ బోరుగొట్టేశిన టీఆర్ఎస్ సభ...ఖాళీ కుర్చీలే ఇన్న నేతల ప్రసంగాలు, కుత్కె గోశెతట్టు జేశిన ఐపీఎల్ క్రికెట్... టీవీ ఛానల్ మార్పుకాడ పంచాది... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

11:59 - March 5, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా కల్పించాలంటూ సిని క్రిటిక్ కత్తిమహేష్ డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న పార్టీలతో కలిసి పాల్గొన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కత్తి మహేష్ తో టెన్ టివి మాట్లాడింది. ప్రత్యేక హోదా పెద్ద సంజీవని కాదని..ఆనాడు గతంలో పేర్కొన్నారని..డ్రామాలు ఆడుతున్నారా అని ప్రశ్నించారు. ఎంపీలు రాజీనామా చేయడం లేదని..కనీసం రాజీనామా చేస్తామని అనడం లేదన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:09 - January 19, 2018

హైదరాబాద్ : కత్తి వర్సెస్‌ పవన్‌ అభిమానులు వివాదం మరింత ముదురుతోంది. సినీక్రిటిక్‌ కత్తిమహేశ్‌పై హైదరాబాద్‌ కొండాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని ఓయూ జేఏసీ ఖండించింది. తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. దాడికి నిరసనగా పవన్‌ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పలుపునిచ్చారు. మరోవైపు దాడి ఘటనపై పోలీసులకు కత్తి మహేశ్‌ ఫిర్యాదు చేశారు.

13:32 - January 19, 2018

హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను ఓయూ విద్యార్థులు దగ్ధం చేశారు. సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఓయూ జేఏసీ స్పందించింది. మహేష్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని వెల్లడించింది. శుక్రవారం ఉదయం ఓయూలో పవన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడారు. కత్తి మహేష్ కు క్షమాపణలు చెప్పాలని, మరోసారి దాడి జరిగితే పవన్ సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - కత్తి మహేష్