కత్రినా కైఫ్

17:41 - November 8, 2018

అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించగా, ధూమ్ 3 ఫేమ్, విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో, యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన చిత్రం, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్.
భారీ అంచనాల మధ్య, హిందీతో పాటు, తెలుగులోనూ ఈరోజు రిలీజైన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్  సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ : 


దాదాపు రెండు దశాబ్దాల క్రితం వ్యాపారం నిమిత్తం ఇండియాకు వచ్చిన బ్రిటీష్ వాళ్ళు, ఇక్కడి సంస్థానాలనీ, రాజ్యాలనీ తమ ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుంటుంటారు.
ఆ నేపథ్యంలో, రోనక్‌పూర్ అనబడే స్వతంత్ర్య రాజ్యంపై కన్నేసిన బ్రిటీష్ పాలకుడు జాన్ క్లైవ్, రోనక్‌పూర్ రాజుని, అతని కొడుకుని అంతమొందించి, రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. అప్పుడు యువరాణి జఫీరా, రాజ్య సంరక్షకుడు ఖుదా బక్ష్ సాయంతో రాజ్యం నుండి తప్పించుకుంటుంది. మరోపక్క థగ్స్‌గా పిలవబడే ఒక ముఠా, దారి దోపిడీలతో బ్రిటీష్ వారిపై విరుచుకు పడుతుంటుంది. తన అవసరాల కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, తన తెలివితో ఎంతటివారినైనా బురిడీ కొట్టించే ఫిరంగి మల్లయ్యను, థగ్స్  నాయకుడైన ఖుదా బక్ష్‌ను పట్టుకోవడానికి నియమిస్తాడు జాన్ క్లైవ్. మరి ఫిరంగి మల్లయ్య, ఖుదా బక్ష్‌ని బ్రిటీష్ వారికి అప్పజెప్పాడా, లేదా అనేదే ఈ థగ్స్ కథ.

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 


అమితాబ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను చాలా వరకూ డూప్ సాయంతో లాగించేసారు. నటన పరంగా ఓకే అనిపిస్తారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ నవ్వించే ప్రయత్నం చేసాడు కానీ, తెలుగులో ఆయనకి వాయిస్ సూట్ కాలేదు. తెరపై అమీర్‌ని చూస్తున్నంత సేపు..  పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్‌లో జాక్ స్పారో పాత్రే గుర్తొస్తుంది. కత్రినా సురైయ్యాగా తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఫాతిమా సనా షేక్ పాత్ర అలరిస్తుంది.
అజయ్ - అతుల్ కంపోజ్ చేసిన పాటలు తెలుగులో పెద్దగా ఆకట్టుకోవు కానీ, జాన్ స్టివార్ట్ బ్యాగ్రౌండా స్కోర్ సినిమాకి ప్లస్ అయింది.  మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.
మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే సామెత ఈ సినిమాకి చక్కగా సూటవుతుంది. 1839లో వచ్చిన కన్‌ఫెషన్స్ ఆఫ్ ది థగ్ నవల ఆధారంగా, రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మక యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తుంది, పైగా, అమితాబ్, అమీర్ కాంబో  అనగానే ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ఆ అంచనాలకు ఆమడ దూరంలో నిలిచిపోయింది. దర్శకుడు సెట్స్ మీదా, కాస్ట్యూమ్స్ మీదా, యాక్షన్ ఘట్టాల పైనా పెట్టిన శ్రద్థ, కొంచెమైనా స్ర్కీన్‌ప్లే పై కూడా పెట్టుంటే థగ్స్ ఇంకోలా ఉండేది. 


థగ్స్.. పైన పటారం, లోన లొటారం. 

తారాగణం :  అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్

        కెమెరా    :            మనుష్ నందన్ 

       సంగీతం   :         అజయ్ - అతుల్ 

నేపథ్య సంగీతం  :         జాన్ స్టివార్ట్ 

         నిర్మాత   :         ఆదిత్య చోప్రా

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం :     విజయ్ కృష్ణ ఆచార్య

రేటింగ్  : 2/5

 

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

12:35 - November 1, 2018

ముంబై : బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ డ్యాన్స్ అంటేనే అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతుంటారు. ఆమె చేసే డ్యాన్స్ మతులను పొగొడుతుంది. పలు సినిమాల్లో కత్రినా చేసిన డ్యాన్స్ లు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయి.Image result for suraiya katrina kaif dance వయస్సు మీద పడుతున్నా ఆమెలో ఏ మాత్రం జోష్ తగ్గలేదని ఇటీవలే విడుదలైన టీజర్ చూస్తే అర్థమౌతుంది. 
అమితాబ్ బచ్చన్ - అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ చిత్రంలో కత్రినా కైఫ్ నటిస్తోంది. ఇందులో సురైయా అనే నర్తకి పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా మొదటి పాటను ఇటీవలే విడుదల చేశారు. ఒక్కొక్కటిగా వీడియో సాంగ్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు.
విడుదల చేసిన 'సురయ్యా' సాంగ్ లో కత్రినా చేసిన డ్యాన్స్ అదరహో అనిపిస్తోంది. ఈ పాటకు ఇప్పటికే 9.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పచ్చ, ఎరుపు రంగు కాంబినేషన్‌లో ఉన్న లెహెంగా ధరించిన కత్రినా గెటప్ అదిరిపోయిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సాంగ్ తో మరోసారి కత్రీనా అందరినీ మెస్మరైజ్ చేసింది. కత్రినా డ్యాన్స్‌ చేస్తుంటే చుట్టూ నిలబడిన బ్రిటిషర్స్ వావ్‌ అంటూ కళ్లప్పగించి చూస్తుండిపోయారంట. విజయ్‌ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

15:47 - September 27, 2018

హైదరాబాద్ : బాలీవుడ్‌లో మోస్ట్ హ్యపెనింగ్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అమిర్‌ఖాన్, కత్రీనా కైఫ్‌లు నటిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచరస్‌గా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎవరు చేయని ప్రయోగాన్ని విజయ్ కృష్ణ ఆచార్య చేస్తున్నారు.  యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను రూపొందిస్తున్నది. 1839నాటి ఫిలిప్ మిడోస్ టేలర్ అనే రచయిత రాసిన 1839నాటి ఓ నవల ఆధారంగా ఈ సినిమా వస్తోంది. సినిమా బడ్జెట్ రూ.210కోట్లుగా అంచనా. ఇక ట్రైలర్ విడుదలకి సినిమా యూనిట్ అంతా హాజరవగా రెస్పాన్స్ అద్భుతం అంటున్నారు. ఇందులో అమితాబ్ బందిపోటు దొంగగా నటిస్తున్నారు. ట్రైలర్ విజువల్ వండర్ గా రూపొందింది. స్వాతంత్య్రానికి పూర్వం బందిపోట్లకు, బ్రిటిష్ సైనికులకు మధ్య జరిగే పోరాటమే ఈ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్. ఆ వయసులో కూడా అమితాబ్ ఎంతో చక్కగా నటించారు.  

06:43 - November 8, 2017

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న టైగర్‌ జిందా హై మూవీ ట్రైలర్‌ విడుదలైంది. 2015లో వచ్చిన "ఏక్‌ థా టైగర్‌" సినిమాకి ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతోంది. అలీ అబ్బాస్‌ జఫర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇరాన్‌లో భారత్‌కు చెందిన 25 మంది నర్సులను కిడ్నాప్‌ చేసిన సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. వారిని విడిపించేందుకు సల్మాన్‌ ఖాన్‌ వెళ్లడాన్ని ఈ ట్రైలర్‌లో చూపించారు. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 22న విడుదల చేయనున్నారు.ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలను అబుదాబి, ఆస్ట్రియాలో తెరకెక్కించారు.

10:51 - July 24, 2017

బాలీవుడ్ అలనాటి నటుడు 'రిషీ కపూర్' దర్శకుడు అనురాగ్ బసుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రణ్ బీర్ కపూర్' హీరోగా నటించిన 'జగ్గా జాసూస్'ను 'అనురాగ్ బసు' తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర విజయంపై సోషల్ మాధ్యమాల్లో భిన్న కథనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా విషయంపై 'రిషీ కపూర్' తాజాగా స్పందించారు.

‘అనురాగ్' కు అసలు బాధ్యత లేదని..విడుదలకంటే ఒక్క రోజు ముందు కూడా సినిమాలో పలు మార్పులు చేశారని..ఇలా ఏ దర్శకుడైనా చేస్తాడా అంటూ 'రిషీ కపూర్' మండిపడడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. సినిమాలో ప్రముఖ నటుడు 'గోవిందా'తో ఓ సన్నివేశం ఉందని..కానీ ఆ తరువాత ఆ సన్నివేశాన్ని కట్ చేశారని పేర్కొన్నారు. అలాంటప్పుడు అతనిని సినిమాలో తీసుకోవడం ఎందుకని ఘాటుగా ప్రశ్నించారు.

సినిమాను అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయలేదని..రెండేళ్ల క్రితమే చిత్రం విడుదల కావాల్సి ఉందన్నారు. ఈ సినిమాకు తన అబ్బాయి 'రణ్ వీర్ కపూర్' సిని నిర్మాతగా వ్యవహించాడని..దర్శకుడు బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తే ఎవరూ అతనితో పనిచేయాలని అనుకోరని స్పష్టం చేశారు.

‘రిషీ కపూర్' చేసిన కామెంట్స్ పై 'అనురాగ్ బసు' ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

15:21 - July 23, 2017

బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటీమణుల్లో 'కత్రీనా కైఫ్' ఒకరు. అగ్ర హీరోల సరసన ఆడి..పాడిన ఈ నటి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం 'జగ్గా జాసూస్' మంచి మార్కులనే కొట్టేసింది. షూటింగ్..ప్రమోషన్ కోసం 'కత్రినా' యమ కష్టపడింది. బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' తో కలిసి 'టైగర్ జిందా హై' సినిమాల్లో నటిస్తోంది. ‘ఏక్ థా టైగర్' సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది.

ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం 'కత్రినా' మొరాకోలో జరుగుతోంది. షూటింగ్ లో పాల్గొనేందుకు 'కత్రినా' కూడా మొరాకోకు వెళ్లింది. హాలీడేస్ కు దూరంగా ఉన్న 'కత్రినా' మొరాకోలో ఎంజాయ్ చేస్తోంది. అందమైన ప్రదేశాలను చూస్తూ 'కత్రినా' తెగ సంతోష పడుతుందంట. తాజాగా ఓ సర్ఫింగ్ వీడియో ను సోషల్ మాధ్యమాల్లో 'కత్రినా' విడుదల చేసింది. ఎగిసిపడే అలలపై 'కత్రినా' చేసిన సర్ఫింగ్ అభిమానులను ఆకట్టుకొంటోంది. సర్ఫింగ్ ఎక్స్ పర్ట్ సమక్షంలోనే ఈ రిస్క్ చేసిందట.

14:11 - July 3, 2017

బాలీవుడ్ నటి ‘కత్రినా కైఫ్’..’మల్లీశ్వరీ’ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయస్తురాలు. బాలీవుడ్ లోని పలు హిట్ చిత్రాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకుంది. వరుస ఆఫర్లతో టాప్ పోజిషన్లలో నిలిచిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘అమీర్ ఖాన్’ తో ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’..’ సల్మాన్ ఖాన్’ తో ’టైగర్ జిందా హై' చిత్రాల్లో నటిస్తోంది. ‘జగ్గా జాసూస్' చిత్ర ప్రమోషన్ లో భాగంగా తోటి నటుడు 'రణ్ బీర్ కపూర్'తో అబుదాబీలో జరిగిన సైమా వేడుకల్లో 'కత్రీనా' పాల్గొంది. ఈ సందర్భంగా మీడియా పలు ప్రశ్నలు వేసింది. దక్షిణాదిలో నటించాల్సి వస్తే ఏ హీరోలతో నటిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు 'తెలుగులో ప్రభాస్ తో..తమిళంలో 'విక్రమ్' తో నటిస్తా' అని ఠక్కున చెప్పేసింది. 'బాహుబలి' మూవీ చూశానని..ప్రభాస్ ఎంతో చక్కగా నటించారని కితాబిచ్చింది. 'చియాన్' విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని ఆయన అద్భుతమైన నటుడని 'కత్రినా కైఫ్' అభిప్రాయపడింది. మరి 'కత్రినా' మాటలు దర్శకుల చెవిలో పడ్డాయో లేదో...

13:38 - March 9, 2017

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' నటిస్తున్న 'టైగర్ జిందా హై' న్యూ లుక్ విడుదలైంది. 'ఆన్ ఇండియన్ ఏజెంట్..ఏ పాకిస్తాన్ స్పై..అగెనెస్ట్ ఏ కామన్ ఎనిమి' సబ్ టైటిల్ పెట్టారు. ఇటీవలే వచ్చిన 'సుల్తాన్' తో 'సల్మాన్' మరో ఘన విజయం అందుకున్నాడు. ఈ చిత్రం దర్శకుడు 'అలీ అబ్బాస్ జాఫర్' సల్మాన్, కత్రినా లతో చేస్తున్నాడు. ఈ సినిమా గతంలో 'సల్మాన్', 'కత్రినా' జంటగా నటించిన సూపర్ హిట్టు మూవీ 'ఏక్తా టైగర్' కి సీక్వెల్ కావడం విశేషం. ఈ చిత్రాన్ని 'యష్ రాజ్ ఫిల్మ్స్' బ్యానర్ పై 'ఆదిత్య చోప్రా' నిర్మిస్తున్నాడు. 1962 ఇండో చైనా యుద్ధ నేపథ్యంగా కథ సాగుతుందని, ఆసమయంలో ఓ చైనా అమ్మాయితో ప్రేమలో పడిన వ్యక్తిగా సల్మాన్‌ పాత్ర ఉంటుందని టాక్. మరి ఈ జంట ప్రేక్షకులను ఎలా అలరిస్తారో వేచి చూడాలి.

12:52 - November 28, 2016

బాలీవుడ్ ఆల్ టైం టాప్ హీరోయిన్లలో 'క‌త్రినా కైఫ్' ఒకరు. ఆమె కనిపిస్తే చాలు ఆ సినిమా హిట్టే అన్న అభిప్రాయం ఉండేది. కానీ కొన్ని రోజులుగా ఈ అమ్ముడు కనిపించడం లేదు. ఆమె నటించిన మూడు సినిమాలు 'ఫాంటమ్'...'ఫితూర్'..'బార్ బార్ దేఖో' బాక్సాపీస్ వద్ద పరాజయం చెందాయి. మాజీ బాయ్ ఫ్రెండ్ 'రణబీర్ కపూర్' తో కలిసి 'జగ్గా జాసూస్' అనే సినిమాలో నటిస్తోంది. ఏప్రిల్ 7 తేదీన ఈ చిత్రం విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. విడుదలకు చాలా సమయం ఉండడంతో ఈ ముద్దుగుమ్మ ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటోందంట. తాజాగా ఓ ఫొటో సోషల్ మాధ్యామాల్లో వైరల్ అవుతోంది. మాల్దీవులకు వెళ్లిన 'కత్రీనా' ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ వాళ్ల కోసం ఫొటో షూట్ లో పాల్గొంది. తన ఒడిలో 'కత్రినా' కూర్చొన్న ఫొటోను సెలబ్రిటీ డిజైనర్ మల్హోత్ర ఇన్ స్ట్రాగామ్ లో షేర్ చేశాడు. దానికి పోజర్స్ ఇన్ మాల్దీవ్స్ క్యాప్షన్ కూడా పెట్టాడు. అదండి సంగతి...

15:05 - September 15, 2016

'ఏక్తా టైగర్' జోడి 'సల్మాన్ ఖాన్', 'కత్రినా కైఫ్' 'టైగర్' కోసం మరోసారి జోడికట్టబోతున్నారు. ఇటీవలే కండలవీరుడి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఈ కాంబినేషన్ లో న్యూ మూవీ చేస్తున్నాడు. మాజీ ప్రేమికులు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆ కొత్త సినిమా సంగతులేంటీ ?
బిలియన్ స్టార్ 'సల్మాన్ ఖాన్' వరుస సక్సెస్ లతో పుల్ స్వీంగ్ లో ఉన్నాడు. 'భజ్ రంగ్ భాయ్ జాన్' తో గత ఎడాది బ్లాక్ బస్టర్ కొట్టిన 'సల్లూ'భాయ్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' తో ఓ మాదిరి హిట్టు కొట్టాడు. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికి 300కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

ఏక్తా టైగర్ కు సీక్వెల్...
ఇక ఇటీవల వచ్చిన 'సుల్తాన్' తో 'సల్మాన్' మరో ఘన విజయం అందుకున్నాడు. ఈ చిత్రం దర్శకుడు 'అలీ అబ్బాస్ జాఫర్' సల్మాన్, కత్రినా లతో కొత్త మూవీకి ప్లాన్ చేశాడు. 'సల్మాన్ ఖాన్ - కత్రినాకైఫ్' కాంబినేషన్ లో 'టైగర్ జిందా హై' సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా గతంలో 'సల్మాన్', 'కత్రినా' జంటగా నటించిన సూపర్ హిట్టు మూవీ 'ఏక్తా టైగర్' కి సీక్వెల్ కావడం విశేషం. ఈ చిత్రాన్ని 'యష్ రాజ్ ఫిల్మ్స్' బ్యానర్ పై 'ఆదిత్య చోప్రా' నిర్మిస్తున్నాడు. మరి ఈ జంట ప్రేక్షకులను ఎలా అలరిస్తారో వేచి చూడాలి. 

Pages

Don't Miss

Subscribe to RSS - కత్రినా కైఫ్