కథువా

19:44 - May 4, 2018

దేశవ్యాప్తంగా మహిళలపై, యువతులపై, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆడపుట్టుకకు భద్రత అనేది లేకుండా పోతున్న దుస్ధితి, దుర్మార్గపు పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. చట్టాలు వున్నా నేరాల సంఖ్య మాత్రం తగ్గకపోగా పెరుగుతునే వుంది. ఉన్నావో, కథువా, దాచేపల్లి వంటి ఘటనలు ఆడపుట్టుకకు భద్రత వుందా? అనే భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్చను చేపట్టింది 10టీవీ..ఈ చర్చలో అడ్వకేట్ చంద్రగిరి రాధాకుమారి, తరుణి తరంగాలు జన్ రల్ సెక్రరటీ జోత్స్న, టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత పాల్గొన్నారు. 

21:02 - May 3, 2018

గుంటూరు : జిల్లాలోని దాచేపల్లిలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బాధితురాలి బంధువులు, ప్రజా సంఘాల ఆందోళన, రాస్తారోకో, రైల్‌రోకోలతో పల్నాడు ప్రాంతం అట్టుడికింది. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్యను పట్టుకునేందుకు గుంటూరు జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నిందితుణ్ని కఠినంగా శిక్షిస్తామన్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు సుబ్బయ్య అత్యారానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని బాలికపై దుర్మార్గానికి ఒడిగట్టాడు. తాత వయస్సున్న రిక్షా కార్మికుడు సుబ్బయ్య బిస్కెట్లు, చాకెట్లు ఇస్తానని చెప్పి బాలికను తన ఇంట్లోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు తెలియడంతో.. దాచేపల్లితోపాటు పల్నాడు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దాచేపల్లి పోలీసులు, బాలికను చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన బాధితురాలి బంధువులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు కలిసి దాచేపల్లిలో ఆందోళనకు దిగారు. నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులు చేపట్టిన దాచేపల్లిబంద్‌ హింసాత్మకంగా మారింది. అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో కొన్ని కిలో మీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆందోళకారులు టైర్లను రోడ్డులపై వేసి తగులబెట్టారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. నిందితుడి ఇంటిని స్థానికులు ధ్వంసం చేశారు. నడికుడి రైల్వే జంక్షన్‌లో రైల్‌ రోకో నిర్వహించారు. శబరి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి ఆందోళన చేశారు. గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు దాచేపల్లి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సహా పలువురు పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్య సహాయం అందిచాలని ఆదేశించారు. బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకొంటామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును హామీ ఇచ్చారు. మరోవైపు నిందితుణ్ని వెంటనే అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వామపక్ష మహిళా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. నిందితుణ్ని ఉరితీయాలని బాధితురాలి బంధువులు డిమాండ్‌ చేశారు.

దాచేపల్లి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. నిందితుడు సుబ్బయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అరాచకాలు, అకృత్యాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. పరారీలో ఉన్న నిందితుణ్ని పట్టిచ్చినవారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. దాచేపల్లి ఘటనను ఖండించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. దీనిని నిరసిస్తూ మహిళా సంఘాలు చేసే ఆందోళనకు పార్టీ మద్దుతు ప్రకటించారు.

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సబ్బయ్యను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఏపీ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల అదుకొంటామని భరోసా ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దాచేపల్లి ఘటనపై ట్విటర్‌ ద్వారా స్పందించారు. దాచేపల్లి ఘటన మనసును కలిసి వేసిందన్నారు. కథువా నుంచి కన్యాకుమారి వరకు జరుగుతున్న ఇలాంటి ఘటనలను విన్నప్పుడల్లా తీవ్ర వేదనకు గురువుతున్నట్టు పేర్కొన్నారు. అత్యాచారాలకు పాల్పడేవారు భయపడే పరిస్థితి రావాలంటే.. నిందితులను బహిరంగంగా శిక్షించే విధానం రావాలన్న వపన్‌ కల్యాణ్‌.. దాచేపల్లి బాధితురాలితోపాటు ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

21:24 - April 24, 2018

ఢిల్లీ : సోషల్‌ మీడియాను కూడా హిందుత్వవాదం ప్రభావితం చేస్తోందా? అంటే ఔననే చెప్పాలి. కథువా ఘటనపై సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినందుకు బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. స్వరభాస్కర్‌ హిందువులను అవమానిస్తున్నారంటూ కొందరు వ్యతిరేక ప్రచారం చేశారు. దీనికి భయపడ్డ ఈ కామర్స్‌ కంపెనీ అమేజాన్‌-- బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న స్వరభాస్కర్‌ను తప్పించింది. ఇంతకీ సోషల్‌ మీడియాలో ఆమె చేసిన పోస్ట్‌ ఏంటి?

సోషల్‌ మీడియాలో పోస్టర్‌ ఫోటో షేర్‌ చేసిన బాలీవుడ్‌ నటి స్వరభాస్కర్
జమ్ముకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యోదంతం భారత దేశాన్ని కుదిపేసింది. కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించారు. ఇందులో భాగంగా బాలీవుడ్ తారలు పోస్టర్‌ ఫోటో షేర్‌ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రముఖ బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ కూడా కథువా ఘటనపై సోషల్‌నెట్‌వర్క్‌లో స్పందించారు. 'నేనో హిందుస్థానీని... దేవీ ఆలయంలో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు సిగ్గు పడుతున్నానంటూ' పోస్టర్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేశారు.

స్వరభాస్కర్‌ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత
స్వరభాస్కర్‌ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పోస్ట్‌లో దేవి స్థానం అని రాయడాన్ని సెంటిమెంట్‌గా భావించిన నెటిజన్లు తప్పుపట్టారు. అంతటితో ఊరుకోలేదు...ఆమె నటించిన 'వీరే దీ వెడ్డింగ్‌' సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం మొదలెట్టారు.

ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ 'అజ్‌నబీ షహర్‌ కి గుగ్‌లీ'కి స్వర ప్రచారం

స్వరభాస్కర్‌పై వ్యతిరేక ప్రచారం ఈ కామర్స్‌ సంస్థ అమేజాన్‌పై కూడా ప్రభావం పడింది. స్వరభాస్కర్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ 'అజ్‌నబీ షహర్‌ కి గుగ్‌లీ'కి ప్రచారం చేస్తున్నారు. తాజాగా స్వరభాస్కర్ ఓ మ్యూజిక్ సిస్టం కొనాలని ఉందంటూ చేసిన ట్వీట్‌కు అమెజాన్ రిప్లయ్ ఇస్తూ రీట్వీట్ చేసింది. దీనిపై కొందరు అమేజాన్‌ను టార్గెట్‌ చేశారు. హిందువులను అవమానిస్తూ మాట్లాడిన స్వర భాస్కర్‌ను ప్రమోట్ చేసినంతకాలం అమెజాన్‌ను వాడమంటూ హెచ్చరించారు. ఏళ్ల తరబడి యాప్ వాడుతున్నవారు కూడా బై చెప్పేస్తూ డిలిట్ మెసేజిలు పంపుతున్నారు. దీంతో అమెజాన్ వెంటనే స్వరభాస్కర్ రిప్లయ్‌ ట్వీట్‌ను డిలిట్ చేసేసింది. నెటిజన్లు మాత్రం బాయ్ కాట్ అమెజాన్ పేరిట క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. దీంతో అమేజాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా స్వరభాస్కర్‌ను తప్పించింది.

స్వరభాస్కర్‌కు వ్యతిరేక ప్రచారమంటు విమర్శలు..
కొందరు మాత్రం స్వరభాస్కర్ చేసినదానిలో తప్పేం లేదన్నారు. స్వర భాస్కర్‌కు అమేజాన్‌ మద్దతుగా నిలిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కొంతమంది కస్టమర్లు దూరమైనంత మాత్రాన కంపెనీకి నష్టం జరగదన్నారు. ఓ పథకం ప్రకారమే హిందుత్వవాదులు స్వరభాస్కర్‌కు వ్యతిరేక ప్రచారం మొదలెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

19:19 - April 24, 2018

విశాఖపట్నం : కథువాలో జరిగిన దారుణాన్ని ఖండిస్తూ విశాఖలో ప్రగతి శీల మహిళ సంఘం అధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఫోక్సో చట్టాన్ని హడావుడిగా ఆర్డినెన్స్‌ల ద్వారా మార్పు చెయ్యడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని ఆరోపించారు. మహిళలకు రక్షణగా ఉన్న చట్టాలను సమగ్రంగా అమలు చేస్తే అర్డినెన్సులు తీసుకు రావల్సిన అవసరం లేదన్నారు. జస్టిస్ వర్మ కమిషన్ రికమెండెషన్స్‌ను ప్రభుత్వం ఎందుకు అమలు చెయ్యడం లేదని మహిళా నేతలు ప్రశ్నించారు.

17:33 - April 19, 2018

హైదరాబాద్ : బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు మరింత పెరిగిపోయాయని సీపీఎం సీనియర్ మహిళా నేత సుభాషిణి ఆలీ పేర్కొన్నారు. సీపీఎం 22వ అఖిల భారత మహాసభల్లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా టెన్ టివి ముచ్చటించింది. కథువా, ఉన్నావ్ ఘటనల్లో బీజేపీ హస్తం ఉండడం శోచనీయమని, మహాసభల్లో ప్రత్యేక తీర్మానం తీసుకొస్తామన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:46 - April 19, 2018

తమ కుటుంబం తమ సౌలభ్యం అనుకునేవారు ఎంతోమంది. తమతోపాటు సమాజం కూడా బాగుండాలనుకునేవారు కొంతమంది. కానీ సమాజంలో కోసం, మాతృదేశానికి సేవల చేయాలని, కష్టాలలో వున్న వారికి అండగా నిలబడాలని అనుకునేవారు మాత్రం అతి కొద్దిమందే వుంటారు. ఈ క్రమంలో వారి ప్రాణానికి కూడా ప్రమాదం ఏర్పడవచ్చు. అయినా లెక్కచేయక..బెదిరింపులకు బెదరక..నమ్మిన ఆశయం కోసం నిలబడే ధీరలు అతి కొద్ది మంది మాత్రమే వుంటారు. అటువంటి ధీర దీపికా సింగ్ రజావత్.

సమాజాన్ని కదిలించిన అసిఫా ఘటన..
కొన్ని ఘటనలో సమాజాన్ని కదిలిస్తాయి. మరికొన్ని సంఘటనలో సమాజానికి చైతన్యాన్ని కలిగిస్తాయి. అటువంటి ఘటన నిర్భయ ఘటన..ప్రస్తుం ఇప్పుడు చిన్నారి అసిఫా ఘటన కూడా ఇంచుమించు అటువంటిదే. ముక్కుపచ్చలారని అసిఫాను అత్యంత పాశవికంగా చంపివేసిన ఘటనతో యావత్ భారతం మరోసారి ఉలిక్కిపడింది. దేశం మొత్తం అసిఫా బానో కోసం విలపిస్తోంది. ఆ పసికందు లేతదేహంపై కామ పిశాచాలు, కక్షల దెయ్యాలు.. దేవుడి గుడి సాక్షిగా చేసిన గాయాలు మనసున్న ప్రతి మనిషినీ కదిలిస్తున్నాయి. ఎనిమిదేళ్ల అసిఫాపై హిందువుల గుడిలో వారం పాటు సాగిన సామూహిక అత్యాచారం, మాటల్లో చెప్పలేని విధంగా జరిగిన ఘటనకు మాటలు చాలవు. డ్రగ్స్ ఇచ్చి వారంరోజులపాటు జరిగిన ఆ హింసాకాండకు చిన్నారి ఛిద్రమైపోయింది. ఆ తల్లి గుండె పగిలిపోయాయి. తండ్రి ఆవేదనకు అంతులేకుండా పోయింది. దీనికంతటికీ కారణం మనోన్మాదం అంటే అంతకంటే సిగ్గుపడే విషయం మరొకటి వుంటుందా? ముస్లింలపై కక్ష సాధించేందుకు ఓ చిన్నారిని ఛిద్రం చేసిన పశుసంస్కృతికి నిదర్శనంగా కనిపిస్తోంది. కానీ బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులకు అండగా నిలబడింది ఓ మానవ మాతృమూర్తి..

యావత్‌దేశాన్ని కదిలించింది ఘటన కథువా ఘటన..
యావత్‌దేశాన్ని కదిలించింది కథువా ఘటన. నిర్భయ ఘటనను మరోసారి గుర్తు చేసింది. అసీఫా ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ల కుటుంబంతోపాటు పోరాడుతోంది మహిళా న్యాయవాది దీపికా సింగ్‌ రజావత్‌. ఈ కేసును వదిలేయమని జమ్మూ కశ్మీర్‌ బార్‌ అసోసియేషన్‌ నుంచి బెదిరింపులూ, అవమానాలు ఎదురైనా ఆమె ఏ మాత్రం జంకకుండా నిందితులకి శిక్ష పడే వరకూ పోరాటం చేయాలనే నిర్ణయించుకుంది. ఓ సాధారణ న్యాయవాది అయిన దీపిక ఈ సంచలన కేసును తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా...జమ్మూ కశ్మీర్‌కి చెందిన దీపిక న్యాయవాది మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా. సైన్యంలో పనిచేసిన భర్త ప్రస్తుతం బెహ్రెయిన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెను బెహ్రెయిన్‌ వచ్చేయమని అడిగినా మాతృదేశానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఐదేళ్ల కూతురితో కలిసి జమ్మూకశ్మీర్‌లోనే వుండిపోయింది దీపిక.

స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన దీపికా..అసిఫా తల్లిదండ్రులకు అండగా నిలిచిన దీపిక..
దీపిక మహిళలూ, చిన్నారులకు పలు రకాలుగా సాయపడటానికి ఓ స్వచ్ఛంద సంస్థనూ ప్రారంభించింది. దీంతో ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, నైతికంగా పలు రకాలుగా సాయమందిస్తుంటుంది. దీపికకు అసీఫా గురించి తెలియగానే ఆ పాప తండ్రిని సంప్రదించింది. ఆ కేసును తానే వాదిస్తానని చెప్పింది.

దీపికాపై దాడులు చేసిన బార్ అసోషియేషన్..
ఎప్పటికప్పుడు పోలీసుల చర్యలూ.. క్రైంబ్రాంచీ వారి నేర పరిశోధన గురించి తెలుసుకుంటూనే ఉండేది. అయితే ‘ఒకానొక దశలో పాప శవం మీద ఉన్న దుస్తుల్ని కొందరు తెలియకుండా తీసి ఉతికి పెట్టారు. ఆ సమయంలో నేరస్తులు దొరకరేమోనని చాలా ఆందోళన పడింది. కానీ కాస్త ఆలస్యమైనా... నిజం నిలకడ మీద తెలిసింది’ అంటుంది దీపిక. ఈ కేసు విషయంలో దీపిక మీద బార్‌ అసోషియేషన్‌లోని న్యాయవాదులు దాడులు చేయడమే కాదు.. కేసు ఉపసంహరించుకోకపోతే ప్రాణం తీస్తామని బెదిరించారు. అయినా ఆమె పట్టించుకోలేదు. పోలీసుల రక్షణ కోరింది. వారి సహకారంతోనే ప్రస్తుతం ముందడుగు వేస్తోంది.

నిస్సహాయులకు అండగా నిలిస్తున్న న్యాయవాది దీపిక..
అయితే ఆమె మాత్రం అసీఫా తల్లిదండ్రులకోసం ఎంతో బాధపడుతోంది. కూతురి మరణం జీర్ణించుకోలేక.. రాజకీయ నాయకుల బెదిరింపులు తట్టుకోలేక అనుక్షణం బిక్కుబిక్కుమంటున్న ఆ నిస్సహాయులకు తీర్పుతోనైనా సాంత్వన అందించాలని పట్టుదలగా ఉంది దీపిక. గంటకు ఇంత అనే పేపెంట్ కోసం దేశంపై దాడి చేసిన ఉగ్రవాదుల తరపున కూడా వాదించే న్యాయవాదులున్నారు. అసలు వారిని న్యాయవాదులు అనుకోవాలా. న్యాయాన్ని అమ్ముకునే వాదులు అనటం సరైన పదమే నయం. ఇదే భారతంలో దీపికవంటి అసలైన న్యాయవాదులు అంటే న్యాయం కోసం నిలబడి న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు వుండటం మంచి పరిణామం. దీపిక వంటి న్యాయవాదులకు ప్రతీ ఒక్కరూ మద్దతు పలకాల్సిన అవుసరం వుంది. అప్పుడే సామాన్యులకు న్యాయం జరిగే అవకాశం వుంటుంది. అందుకే దీపికా ధీరకాకమ మేరేమిటి? అసిఫా జీవితాన్ని మొగ్గలోనే చిదిమేసిన పశువులకు కఠిన శిక్ష పడాలనీ..దీపిక చేస్తున్న న్యాయం పోరాటం ఫలించాలని ఆశిద్దాం..

10:24 - April 19, 2018

కశ్మీర్‌ కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన పట్ల పాలకులు అనుసరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాల తీరును, మతోన్మాదుల వైఖరి నిరసిస్తూ మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు... మహిళలపై అత్యాచార ఘటనలు పలు రాష్ట్రాల్లో ఈమధ్యకాలంలో పదేపదే జరగడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఇదే అంశంపై ఏపీ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం, హత్య దుర్మార్గమని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

18:49 - April 18, 2018

జమ్మూ కాశ్మీర్ : కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచారంపై భారతీయులందరూ సిగ్గు పడాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. జమ్ముకశ్మీర్‌ కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరవ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా కోవింద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన 70ఏళ్ల తర్వాత కూడా చిన్నారులపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే మన సమాజం ఎటువైపు పోతోందో ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి అఘాయిత్యాలు జరక్కుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్రపతి తెలిపారు. ఆడపిల్లలకు ఒంటరిగా తిరిగే స్వేచ్ఛనిచ్చి, ఇప్పుడు వాళ్లపై పైశాచికం చూపడం అత్యంత దారుణమైన చర్యగా పేర్కొన్నారు. 

16:33 - April 18, 2018

విజయవాడ : జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం..హత్య ఘటనతో యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకోవాలని, వెంటనే నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. బుధవారం ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదిర్శ ఫారూక్ చేపట్టిన 48 గంటల పాటు చేపట్టే దీక్షకు రామకృష్ణ హాజరయి మద్దతు పలికారు. 

15:44 - April 17, 2018

కశ్మీర్‌ కథువాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన పట్ల పాలకులు అనుసరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వాల తీరును, మతోన్మాదుల వైఖరి నిరసిస్తూ మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు... మహిళలపై అత్యాచార ఘటనలు పలు రాష్ట్రాల్లో ఈమధ్యకాలంలో పదేపదే జరగడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. ఇదే అంశంపై మానవి వేదిక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు హైమావతి, పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య పాల్గొని, మాట్లాడారు. కథువా ఘటన చాలా దారుణమైన ఘటన అన్నారు. ఈ ఘటన మానవ సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Pages

Don't Miss

Subscribe to RSS - కథువా