కన్నీటి

22:06 - July 15, 2017

దగపడ్డ ఓ చెల్లి వనుకుతుంది...ప్రతి రోజు మారుతున్న డేట్ ను చూసుకొని బయపడింది...రోజలు గడుస్తున్నాయి..కానీ తనకు దారిలేదు..వారాలు దొర్లిపోతున్నాయి..కానీ తనకు తప్పించుకునే మార్గం లేదు. నెలలు గడుస్తున్నాయి విధి అడుకుంటుంది..చావు దగ్గరై చూసింది.. మరణం దగ్గర నుంచి చూసింది. ఆమె 90 రోజులు నరకం అనుభవించింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

13:23 - December 20, 2015

హైదరాబాద్ : నట జీవితాన్ని గెలిచిన రంగనాథ్‌.. ఒంటరితనాన్ని ఓడించలేకపోయారు. జీవితంలో ఎదుర్కొన్న అనేక మలుపులతో.. చివరికి ఒంటరిగా మిగిలిన రంగనాథ్‌.. తనకు తానే ముగింపు పలికారు. తోడు లేక అల్లాడిపోయిన ఆ ప్రాణం అవసరం లేదనుకున్నారు. తన జీవితానికి క్లైమాక్స్‌ రాకముందే.. తానే సృష్టించుకుని.. తన కథకు క్లైమాక్స్‌ను తానే రచించుకున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రంగనాథ్‌ మృతదేహానికి కాసేపట్లో గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. ఆ తర్వాత ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలించారు. సినీ ప్రముఖులంతా రంగనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. నివాళులు అర్పించారు. సాయంత్రం బన్సీలాల్‌పేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

షాక్ కు గురయ్యా - చిరంజీవి..
రంగనాథ్‌తో తనకు 35ఏళ్లకుపైగా అనుబంధం ఉందని నటుడు, కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులు చిరంజీవి అన్నారు. ఫిల్మ్‌చాంబర్లో ఉన్న రంగనాధ్ పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చిరంజీవి...వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. రిటైర్‌మెంట్‌ లైఫ్‌ని ఎంతో ఉల్లాసంగా గడుపుతున్నానని చెప్పిన రంగనాథ్‌ ఇవాళ ఇలా అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం తనను షాక్‌కు గురి చేసిందన్నారు.

తీరని లోటు - మంత్రి తలసాని..
రంగనాథ్‌లాంటి సీనియర్ నటుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం సినిపరిశ్రమకు తీరని లోటని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వారం రోజుల క్రితమే తనదగ్గరకు వచ్చి...ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషికి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కట్టించాలని తనను అడిగారని మంత్రి గుర్తు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా వరుస సంఘటనలు జరగడం పరిశ్రమ వర్గాలను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు.

తీవ్రంగా కలిచి వేస్తోంది - పరుచూరి..
రంగనాథ్‌లాంటి గొప్ప జ్ఞాని ఇలా ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని ఎండ్‌ చేసుకోవడం చిత్రపరిశ్రమను తీవ్రంగా కలిచివేస్తోందని సినీ రచయిత పరచూరి వెంకటేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1973లో సినీరంగంలోకి తనతో పాటు రంగనాథ్‌ ఇంకా అనేకమంది వచ్చామని సీనియర్ నటుడు మురళీమోహన్‌ అన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు రంగనాథ్‌తో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించామని ..కానీ ఇవాళ అందరిని వదిలిపెట్టి ఆయన వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

మంచి మనస్సున్న వ్యక్తి - రాజేంద్రప్రసాద్...
రంగనాథ్‌లాంటి ఒక మంచి మనుసున్న వ్యక్తిని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయిందని మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. తనకు, తన కుటుంబానికి రంగనాథ్‌తో ఉన్న సాన్నిహిత్యం మాటల్లో చెప్పలేనిదన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకొని సినీ ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మా తరపున రంగనాధ్‌గారికి , వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నామని తెలిపారు. మా తరపున రంగనాధ్ అంత్యక్రియల్ని నిర్వహిస్తామని రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.

స్నేహబంధం - గిరిబాబు..చలపతిరావు..
సీనియర్ నటుడు రంగనాథ్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని తోటి నటులైన గిరిబాబు, చలపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు. నటుడిగా కంటే తమ మధ్య స్నేహబంధమే ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మాతో చెప్పుకునేవాడని..కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని కలలో కూడా ఊహించలేదన్నారు. ఏది ఏమైనా రంగనాథ్‌ చనిపోవడం చిత్రపరిశ్రమకు తీరని లోటని..ఆ లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. 

Don't Miss

Subscribe to RSS - కన్నీటి