కమల్ హాసన్

08:45 - June 3, 2017

ప్రముఖ సినీ నటుడు 'కమల్ హాసన్' ‘పన్ను విధించడంపై' స్పందించారు. చిత్ర సీమపై 28 శాతం వస్తు సేవల పన్ను విధించిన సంగతి తెలిసిందే. 28 శాతం పన్ను ఉంటే తాను నటన నుండి తప్పుకోవాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై చెన్నైలో దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. సభ్యుడు..నటుడు కమల్ మాట్లాడారు. ప్రాంతీయ చిత్రాలు..చిన్న సినిమాలు దేశీయ సినిమాలకు బలమని, అధిక పన్నుల ద్వారా చిత్ర పరిశ్రమ నష్టపోవాల్సి వస్తుందన్నారు. దేశంలో నిర్మిస్తున్న చిత్రాల్లో కేవలం పది శాతమే విజయవంతమవుతాయని తెలిపారు. నల్ల ధనం నిరోధానికి పెద్ద నోట్లను రద్దు చేశారని, సినిమా రంగంపై జీఎస్టీలో 28 శాతం పన్ను విధిస్తే ఈ పరిశ్రమ రెండు రెట్లు వెనక్కి వెళ్తుందని కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. 28 శాతం పన్నును 12-15 శాతానికి తగ్గించాలని సూచించారు. మరి కమల్ డిమాండ్స్ పై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

14:48 - May 26, 2017

చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తోటి సహా నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా రజనీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఇటీవలే అభిమానులతో వరుసగా నాలుగు రోజుల పాటు భేటీలు జరిపారు. అభిమానులతో కలిసి రజనీ ఫొటోలు కూడా దిగార. దేవుడు ఆదేశిస్తే చూద్దామంటూ రజనీ పేర్కొన్నారు. తాజాగా తోటి నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకి కెమెరాల ముందు కనపడాలన్న ఆసక్తి ఎక్కువని ఓ టివి ఛానల్ ఇచ్చిని ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడులో దుమారం రేగుతోంది.

 

15:31 - April 21, 2017

ఇటీవల పలువురు హీరోలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు కోర్టు సమన్లు జారీ చేయడంపై చర్చానీయాంశమైంది. మహాభారతం..ద్రౌపదిపై కమల్ పలు వ్యాఖ్యలు చేశారని, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ హిందూ మక్కల్ కట్చి పార్టీ కోర్టుకెక్కింది. దీనితో వల్లియార్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. మరి కమల్ కోర్టుకు హాజరౌతారా ? లేదా ? అనేది చూడాలి.

09:53 - April 8, 2017

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని కమల్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఈప్రమాదంలో ఎలాంటి ప్రాణాపయం లేదని ట్వీట్ చేశారు. తనను రక్షించిన సిబ్బందికి కృతజ్ఞలు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఆల్వార్ పేటలో ఆయన నివాసమున్న సంగతి తెలిసిందే. ప్రమాదానికి ఫ్రిజ్ లో షార్ట్ సర్కూట్ కారణమని తెలుస్తోందని, దీనివల్ల మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. తాను ఆ సమయంలో మూడో అంతస్తు నుండి దిగొస్తున్నట్లు, తన లంగ్స్ లోకి చాలా పొగ వెళ్లినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కొన్ని పుస్తకాలు కూడా దగ్ధమైనట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

12:25 - March 6, 2017

చెన్నై : ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రానున్నారా ? రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోమవారం కమల్ అభిమాన సంఘాలతో అత్యవసరం భేటీ అయ్యారు. దీనితో ఒక్కసారిగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జయ మరణం తరువాత తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలపై ట్విట్టర్ వేదికపై కమల్ పలు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో తామే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొంటున్నారు. దీనితో ఆయన రాజకీయాల్లో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

జయ మరణం అనంతరం..
జయ మరణం అనంతరం రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడం..డీఎంకే బలంగా తయారు కావడం వంటివి చోటు చేసుకున్నాయి. జాతీయ పార్టీలు నామమాత్రం కావడంతో సినీ రంగం నుండి రావాలని పలువురిపై వత్తిడి పెరుగుతోంది. అంతేగాకుండా సినీ రంగానికి చెందిన వారు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ దీనిపై రజనీ మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. తాజాగా కమల్ పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో చూడాలి.

14:33 - February 14, 2017

అవును..ఓ సినిమా రూపొందుతోంది. ఇందుకు రెండేళ్ల సమయం పడుతుందటం. అలాగే 11 దేశాల్లో సినిమా చిత్రీకరణ చేస్తారంట. ఇందులో ప్రముఖ నటుడు 'కమల్ హాసన్' కూతురు 'శృతి హాసన్' ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..కోలీవుడ్ లో పి.సుందర్ ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'సంఘమిత్ర' అనే టైటిల్ కూడా నిర్ణయించారు. తొలుత ఈ చిత్రంలో విజయ్..మహేష్ బాబులను అని అనుకున్నారు. కానీ వారు ఇంట్రెస్ట్ గా లేకపోయేసరికి 'జయం' రవి, ‘ఆర్య'లను ఎంపిక చేశారు. రెండేళ్లలో 11 దేశాల్లో చిత్రీకరణ జరిగే ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక శృతి హాసన్ 'కాటమరాయుడు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.

10:08 - January 20, 2017

చెన్నై : వరుస ఆందోళనలు, నిరసనలతో తమిళనాడు అట్టుడికిపోతోంది .. జల్లికట్టుపై నిషేధం తొలగించాలంటూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ పిలుపుకు భారీ స్పందన వస్తోంది.. బంద్‌తోపాటు... వివిధరకాల నిరసనలద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై స్థానికులు ఒత్తిడి పెంచుతున్నారు.. బంద్‌లోభాగంగా విద్య, వ్యాపారసంస్థల్ని స్వచ్చందంగా మూసివేశారు.. యువతీ యువకులు, స్థానికులు వేలాదిమంది జల్లికట్టుకు మద్దతుగా రోడ్డెక్కారు.. మెరీనా బీచ్‌ ఆందోళనకారులతో నిండిపోయింది.. తమిళ సినీ పరిశ్రమకూడా జల్లికట్టు ఆందోళనలకు మద్దతు ప్రకటించింది.. జల్లికట్టువద్దంటూ వ్యాఖ్యలుచేసిన సినీనటి త్రిషకూడా తన రూట్‌ మార్చేశారు.. సంప్రదాయాల్ని కొనసాగించాలంటూ నిరసనల్లో పాల్గొన్నారు.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్ రెహమాన్‌ ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు.. జల్లికట్టుకు మద్దతుగా ఈ దీక్ష మొదలుపెట్టారు.. అటు జల్లికట్టు కొనసాగించాలంటూ డీఎంకే నేతలు, కార్యకర్తలు చేపట్టిన రైల్‌ రోకో కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.. స్టాలిన్‌ నేతృత్వంలో ఎగ్మోర్‌ రైల్వేస్టేషన్‌లో బారికేడ్లను తొలగించి రైళ్లను అడ్డుకునేందుకు నేతలు ప్రయత్నించారు... స్టాలిన్‌తోపాటు పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.. మరోవైపు అన్నా డీఎంకె కూడా జల్లికట్టుకోసం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.. జల్లికట్టు నిర్వహణకు ఆర్డినెన్స్‌ తెచ్చేవిధంగా ప్రయత్నిస్తున్నామని సీఎం పన్నీర్‌ సెల్వం ప్రకటించారు.. రెండురోజుల్లో ఆర్డినెన్స్‌ వచ్చేలా చూస్తున్నామని తెలిపారు.. రేపు రాష్ట్రపతినికలిసి ఆర్డినెన్స్‌కోసం విజ్ఞప్తి చేస్తామని స్పష్టం చేశారు.. ప్రజలు ఆందోళన విరమించాలని కోరారు.. కాంగ్రెస్‌ నేతలుకూడా జల్లికట్టుకు మద్దతుగా నిరసనలు చేపట్టారు

15:07 - January 9, 2017

బిర్యానికి...జల్లికట్టుకు లింక్ ఏంటీ ? అది ప్రముఖ సినీ నటుడు 'కమల్ హసన్' పెట్టారా ? అని అనుకుంటున్నారా.. తమిళనాడు రాష్ట్రంలో 'జల్లికట్టు' ఆటను నిషేధించిన సంగతి తెలిసిందే. 2004లో సంవత్సరంలో ఈ నిషేధాన్ని విధించారు. తమిళుల వీరత్వాన్ని, సంప్రదాయాన్ని చాటే సాహసక్రీడగా 'జల్లికట్టు' ప్రఖ్యాతి గాంచింది. 'సంక్రాంతి' పర్వదినం సందర్భంగా ఈ క్రీడ సాగనుంది. అయితే, ఎద్దులను హింసించి, రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ పలువురి వాదననను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో జల్లికట్టుకు 2014లో తమిళనాట బ్రేక్ పడింది. ఈ విషయంపై తాజాగా 'కమల్' ఘాటుగానే స్పందించారు. 'బిర్యాని'పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. చెన్నైలో జరుగుతున్న ఓ మీడియా సంస్థ సౌత్ కన్‌క్లేవ్ కు ఆయన హాజరై ఈ వ్యాఖ్యలు చేశారు.. తమిళనాడులో నిషేదించిన జల్లికట్టు ఆటపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కృతిలో ఎద్దులను దేవుళ్లుగా పూజిస్తామని...వేరే దేశంలో ఎద్దుల పోరాటాన్ని చూసి మనదేశంలో 'జల్లికట్టు'ను రద్దు చేయడం ఏంటనీ ప్రశ్నించినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. జల్లికట్టుపై నిషేధం విధించాలనుకుంటే 'బిర్యానీ'పై కూడా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. 'జల్లికట్టు' తమ సంస్కృతిలో భాగం అని, స్పెయిన్ లో ఎద్దులను గాయపరుస్తారని దాన్ని చూసి ఇక్కడ కూడా అలాగే చేస్తారని అనుకోవద్దని పేర్కొన్న్నారు. 'కమల్' డిమాండ్ లపై ఎలాంటి స్పందన వెలువడుతుందో చూడాలి.

15:19 - November 1, 2016

చెన్నై : ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ తో గౌతమి తన బంధాన్ని తెంచుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా గత 13 ఏళ్లుగా కలిసి ఉన్నారు. తామిద్దరం విడిపోతున్నట్లు గౌతమి ట్విట్టర్ లో ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అంతేగాకుండా మీడియాకు ఓ లేఖను గౌతమి విడుదల చేశారు. ఇది బాధకరమైన నిర్ణయమని, దాదాపు 13 ఏళ్లు ఇద్దరం కలిసి జీవించామన్నారు. ఒకరితో బంధాన్ని తెంచుకోవడం అంత సులువు కాదని..కానీ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. చాలా రోజులుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇందులో ఎవరి ప్రోద్బలం లేదని..అన్ని ఆలోచించాకే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 29 ఏళ్లు సినీ పరిశ్రమలో ఉన్నట్లు పరిశ్రమలో రాకముందు తాను కమల్ అభిమాని అని తెలిపారు. అతనితో ఎన్నో మధురానుభూతులు చూడడం జరిగిందని అంతేగాకుండా కాస్టూమ్స్ డిజైనర్ గా పనిచేయడం జరిగిందన్నారు. ఆయనతో కలసి సినిమాల్లో పనిచేసినందుకు గర్వంగా భావిస్తున్నట్లు, తన జీవితంలో కష్టసుఖాల్లో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు గౌతమి వెల్లడించారు.
కమల్ తన భార్య సారికకు దూరం కావడం..గౌతమి తన భర్తకు దూరమయ్యాక..వీరిద్దరూ దగ్గరయ్యారు. కమల్ తో కలిసి చాలా సినిమాల్లో నటించారు కూడా. కమల్ ఇటీవలే నటించిన 'పాపనాశనం' సినిమాలో గౌతమి ఆయనకు భార్యగా నటించారు. గౌతమి క్యాన్సర్ బారిన పడిన సమయంలో కమల్ అండగా నిలబడ్డారు. వీరిద్దరి విడాకులకు కారణాలేంటో తెలియడం లేదు. 

10:45 - August 12, 2016

సౌత్ సినిమాలో కమల్ హాసన్ అంటే ఓ ట్రెండ్ మార్క్. ఆయన చేసిన ప్రయోగాలు, ఆయన వేసిన గెటప్ లు ఎవరూ వేయలేరు. కాని ఇప్పుడు కోలీవుడ్ నుండి ఇంకో హీరో బయలుదేరాడు. కమల్ ను మించిన గెటప్ లతో కనువిందు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇంతకి కమల్ రేంజ్ లో ప్రయోగాలే చేసేది ఎవరు...? విక్రమ్... ఇప్పుడు సౌత్ ఫిల్మ్స్ లో సెంట్రల్ ఎట్రాక్షన్. డిఫెరెంట్ స్టోరీస్ ఎంచుకుని... వెరైటీ గెటప్స్ తో తన ఇమేజ్ ను పెంచుకున్నాడు విక్రమ్. చిన్న హీరోగా స్టార్ట్ అయ్యి స్టార్ హీరోగా మారి సినీ జనాలను మెస్మరైజ్ చేస్తున్నాడు విక్రమ్. మూవీ కెరీర్ లో ప్రయోగాలు చాలానే ఉన్నాయి. శివ పుత్రుడిగా విక్రమ్ నటన ఎవరూ మర్చిపోలేరు. హీరోగా గ్లామర్ పాత్రకు భిన్నంగా ఉండే క్యారక్టర్ ను ఎంచుకున్నాడు విక్రమ్. శివపుత్రుడులో స్మశానంలో ఉండే కాటి కాపరి క్యారక్టర్ ను అద్భుతంగా పండించాడు విక్రమ్. హీరోగా విక్రమ్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా శివపుత్రుడు.

అపరిచితుడు..ఐ..
అపరిచితుడు... ఈ సినిమా గురించి చెప్పేది ఏముంటుంది. అదరికి తెలుసు. విక్రమ్ నట పరాక్రమం చూపించిన మూవీ అది. లెజండ్ డైరక్టర్ శంకర్ తెలివితోపాటు విక్రమ్ నటన తోడైంది. ఆ సినిమా ఎంతలా ఆడియన్స్ ను ఆకట్టుకుందో అందరికి తెలుసు. మూడు క్యారెక్టర్లను ఒకరిలో చూపించడం ఎంత కష్టం. ఆ క్యారక్టర్ కోసం విక్రమ్ చేసి హార్డ్ వర్క్ అభినందనీయం. ఆ తరువాత మళ్ళీ విక్రమ్, శంకర్ కాంభినేషన్ లో వచ్చిన 'ఐ' మూవీ కూడా అంతే. గ్లామర్ గా ఉండే హీరో.. కురూపిగా మారుతాడు అంటే.... ఏ హీరో సాహసం చేయడు. కాని విక్రమ్ ఐ మూవీ చేసి ఎటువంటి క్యారక్టర్ అయిన నేను చేయగలను అని నిరూపించాడు. ఈ మధ్యలో మల్లన్న, నాన్న, ఇలా చేసినవన్నీ ఎక్స్పర్మెంట్స్ మూవీసే. ఇండియాలో కమల్ హాసన్ తర్వాత పాత్రల విషయంలో అద్భుతమైన ఎక్స్పర్మెంట్స్ చేసే ఆర్టిస్ట్ విక్రమ్. హీరోగా తొలి బ్రేక్ ఇచ్చిన 'సేతు' దగ్గర్నుంచి గత ఏడాది వచ్చిన 'ఐ' వరకు విక్రమ్ మామూలు క్యారెక్టర్లు చేయలేదు.

హిజ్రాగా..
ఇప్పుడు తన కొత్త సినిమా 'ఇరుముగన్' లోనూ విక్రమ్ ఓ సెన్సేషనల్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో 'ఇంకొక్కడు' గా రాబోతుంది. ఇందులో హీరోగానే కాదు విలన్‌గానూ విక్రమే నటిస్తుండటం విశేషం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విక్రమ్ విలన్ గా చేసేది కూడా హిజ్రా పాత్ర కావడం విశేషం. 'ఇరు ముగన్' ట్రైలర్ తో ఆడియన్స్ లో హోప్స్ పెంచేశాడు విక్రమ్. ఇందులో హీరో-విలన్ పాత్రల్లో విక్రమ్ నటనే సినిమాకు హైలైట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా విలన్ పాత్రను దర్శకుడు ఆనంద్ శంకర్ ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లున్నాడు. ఇలాంటి డిఫెరెంట్ క్యారక్టర్ తో మన ముందుకు రాబోతున్న విక్రమ్ ఇంతకు ముందులాగానే ఆదరిస్తారా మరి ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - కమల్ హాసన్